ఐటీశాఖకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) పథకం షరతుల్లో కొన్నింటిని సడలిస్తూ, దాన్ని ఉపయోగించుకునేందుకు ఓ వైద్యు రాలికిఅనుమతినివ్వాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను హైకోర్టు ఆదే శించింది. పెద్దనోట్ల రద్దు సమయంలో మూడు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన రూ.11.18 కోట్ల సొమ్ములో పన్నులు, సెస్, జరిమానా తదితరాలుపోను మిగిలిన సొమ్మును పీఎంజీకెవైని ఉపయోగించుకునేందుకు ఆవైద్యురాలిని అనుమతించాలంది.
ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పీఎంజీకెవై ఉపయోగించుకునేందుకు అధికారులు విధించిన షరతుల్లో కొన్నింటి ని సవాలు చేస్తూ హైదరాబాద్ వైద్యురాలు ఇందిరాఅజయ్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు స్పందించింది.