సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇక యూనిట్ (లబ్ధిదారు)కు 5 కిలోల చొప్పున మాత్రమే పంపిణి జరగనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ గడువు 2022 మార్చి వరకు పొడిగించి కోటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర కోటాపై నిర్ణయం జరగలేదు.
ఇప్పటి వరకు పీఎంజీకేవై కింద కేంద్రం యూనిట్‌కు అయిదు కిలోలు మాత్రమే కోటా కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి యూనిట్‌కు 10 కిలోల చొప్పున పంపిణీ చేస్తూ వచ్చింది. తాజాగా కేంద్రం ఉచితం బియ్యం గడువు పొడిగించినా.. రాష్ట్ర ప్రభుత్వ మాత్రం కేంద్రం కోటాకే పరిమితమైంది. ఈ నెలలో ఉచిత బియ్యం కోటాను 5 కిలోలకు పరిమితం చేస్తూ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
(చదవండి: Police Slapped Man Video: ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి)
ఉచిత బియ్యం ఇలా..
► కరోనా కష్టకాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూనిట్‌కు 12 కిలోల చొప్పున, ఆ తర్వాత జూలై నుంచి ఆగస్టు వరకు యూనిట్‌కు 10 కిలోల చొప్పున పంపిణీ చేశారు.
► సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని భావించినా.. కరోనా సంక్షోభం వెంటాడుతుండటంతో నవంబరు వరకు గడువు పొడిగించారు. తాజాగా మరో నాలుగు నెలల వరకు పొడిగించారు.
► హైదరాబాద్ మహానగరంలో ఆహార భత్రద కార్డులు కలిగిన సుమారు 17.21 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో 59.55 లక్షల యూనిట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment