కేంద్రం కీలక నిర్ణయం, వాళ్లకి ఉచిత రేషన్‌ కట్‌.. అందులో మీరున్నారా? | IT Department to Help Food Ministry Remove Ineligible PMGKAY Beneficiaries | Sakshi
Sakshi News home page

కేంద్రం కీలక నిర్ణయం, వాళ్లకి ఉచిత రేషన్‌ కట్‌.. అందులో మీరున్నారా?

Published Wed, Feb 5 2025 9:40 PM | Last Updated on Wed, Feb 5 2025 9:42 PM

IT Department to Help Food Ministry Remove Ineligible PMGKAY Beneficiaries

ఢిల్లీ : ఉచిత రేషన్‌ బియ్య పంపిణీ ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (పీఎంజేకేఏవై) పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ ట్యాక్స్‌ చెల్లింపు దారులకు రేషన్‌ బియ్యం పంపిణీని నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ విభాగం పన్నులు చెల్లింపు దారుల డేటాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు పంచుకోనుంది. తద్వారా పన్నుచెల్లింపు దారులు ఎవరైనా ఉచిత రేషన్‌ బియ్యం పొందుతుంటే.. వారిని  అనర్హులుగా గుర్తిస్తుంది. అనంతరం, ఉచిత రేషన్‌ను నిలిపి వేయనుంది.

ఆదాయపు పన్ను చెల్లించలేని వారికి పీఎంజేకేఏవై పథకంలో భాగంగా పేద  కుటుంబాలకు కేంద్రం ఉచిత రేషన్‌ అందిస్తుంది. అయితే పీఎంజేఏఏవైలో పన్ను చెల్లింపు దారులకు సైతం రేషన్‌ అందుతుందని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న పన్ను చెల్లింపు దారుల డేటాను పరిశీలించనుంది. ఈ మేరకు సంబంధిత శాఖల్ని సమన్వయం చేస్తోంది. ఉచిత రేషన్‌ పథకంలో అనర్హుల డేటాను వెలికి తీయనుంది. ఆ తర్వాత కేంద్రం చర్యలు తీసుకోనుంది.   

దేశంలో కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల నుంచి నిరు పేదల్ని గట్టెక్కించేలా కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తుంది. ఉచిత రేషన్‌ వ్యవధిని జనవరి 1, 2024 నుండి ఐదు సంవత్సరాల పాటు పొడిగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్‌లో రూ.2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement