Garib Kalyan Yojana
-
ఉచిత బియ్యం ఉఫ్! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. కరోనా నేపథ్యంలో నిరుపేదలు అకలితో అలమటించవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ యోజన పథకం లక్ష్యం నీరుగారుతోంది. సాక్షాత్తూ లబ్ధిదారుల కుటుంబాలు ఉచితం బియ్యాన్ని కారుచౌకగా చిరు వ్యాపారులకు అమ్ముకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆహార భద్రత (రేషన్) కార్డులోని సభ్యుడి (యూనిట్)కి 10 కిలోల చొప్పున సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబానికి కనీసం 30 కిలోల నుంచి 60 కిలోల బియ్యం వరకు ఉచితంగా పంపిణీ జరుగుతోంది. ఉచిత బియ్యంపై అనాసక్తి ఉన్నప్పటికీ డ్రా చేయకుంటే కార్డు ఇన్ యాక్టివ్‌లో పడిపోయి రద్దవుతుందన్న అపోహతో అవసరం లేని లబ్ధి కుటుంబాలు సైతం బియ్యం డ్రా చేసి చిరు, వీధి వ్యాపారులకు కారుచౌకగా అప్పజేప్పేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో బస్తీల్లో కొనుగోలు కేంద్రాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం పీడీఎస్ బియ్యం నిల్వలు అధికమై డిమాండ్ తగ్గడంతో కిలో రూ.5 నుంచి 8 వరకు ధర మించి పలకడం లేదు. పౌరసరఫరాల, పోలీసు అధికారుల మొక్కుబడిగా తనిఖీలు, దాడులు చేస్తుండటంతో క్వింటాళ్లకొద్దీ అక్రమ నిల్వలు పట్టుబడుతున్నాయి. గత రెండేళ్ల నుంచి.. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఉచిత రేషన్ కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి అయిదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచిత బియ్యం పథకం కాలపరిమితి ముగుస్తున్నా.. కేంద్రం పథకాన్ని పొడిగిస్తూ వస్తోంది. అవసరం ఉన్నవారు సగమే.. హైదరాబాద్ మహా నగరంలోని ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాల్లో పీడీఎస్ బియ్యం వండుకొని తినేవారు సగమే. మిగిలిన సగం కుటుంబాలు కేవలం అల్పాహారం ఇడ్లీ, దోసెలు, పిండి వంటలకు మాత్రమే రేషన్ బియ్యం వినియోగిస్తుంటారు. వాస్తవంగా వారి అవసరాలకు నెలకు నాలుగు కిలోల కంటే మించవు. రేషన్ బియ్యం అవసం లేకున్నా.. క్రమం తప్పకుండా డ్రా చేసి కారు చౌకగా దళారులకు ముట్టజెప్పడం సర్వసాధారణంగా మారింది. ప్రతి నెలా.. కోటా ఇలా గ్రేటర్‌లోని హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 16 లక్షల ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాలు ఉండగా, అందులో 55.63 లక్షల లబ్థిదారులు ఉన్నారు. ప్రతి నెలా ఉచిత బియ్యం కోటా కింద 111 మెట్రిక్ టన్నులు విడుదలవుతున్నాయి. (చదవండి: ఆర్టీసీలో కనిష్టంగా రూ. వెయ్యి పెన్షన్) -
జూన్, జూలైల్లో ఉచిత బియ్యం!
సాక్షి, హైదరాబాద్: జూన్, జూలైల్లో ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వనుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉపాధిలేక ఇంటి పట్టునే ఉంటున్న పేదలకు ఆహార కొరత లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ప్రకటించిన ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. కేంద్రం అందిస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యానికి అదనంగా రాష్ట్ర కోటా కింద మరో 5 కిలోలు కలిపి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్రంపై నెలకు రూ.200 కోట్ల మేర భారం దేశవ్యాప్తంగా కేంద్ర ఆహార చట్టం పరిధిలోకి వచ్చే 80 కోట్ల మంది లబ్ధిదారులకు గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని కేంద్రం ఇదివరకే తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర చట్టం పరిధిలోకి వచ్చేవారు 1.91 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వీరికి అవసరమయ్యే 93 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. రాష్ట్ర చట్టం పరిధిలోకి వచ్చే 90 లక్షల మంది లబ్ధిదారులతో కలుపుకొని మొత్తం 2.80 కోట్ల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. అదనంగా ఇచ్చే బియ్యం కోటాతో ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.400 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జూన్‌కు అవసరమయ్యే బియ్యం కోటాను 25వ తేదీ నాటికి రేషన్ షాపులకు ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, తమను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించడంతోపాటు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, అందరికీ ఇన్సూరెన్స్ చేయించాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జూన్‌లో బియ్యం పంపిణీ నిలిపివేస్తామని చెబుతున్నారు. వీరి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయం మేరకు బియ్యం పంపిణీ ఆధారపడి ఉంది. -
వలస కూలీలకు ఉపాధి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. లాక్డౌన్ వల్ల పనులకు దూరమైన వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’ను మోదీ శనివారం ప్రారంభించారు. రూ. 50వేల కోట్లతో ఆరు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని, అమలు చేయనున్నారు. కరోనాను అరికట్టే విషయంలో గ్రామీణ ప్రజల కృషి నగరాలకు పాఠాలు నేర్పిస్తోందని కొనియాడారు. నగరాలు వేగంగా అభివృద్ధి చెందడం వెనుక వలస కూలీల శ్రమ, నైపుణ్యం దాగి ఉందన్నారు. గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజనతో ఇక గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీల సంక్షేమంపై నిత్యం ఆలోచించామని తెలిపారు. ఇప్పుడు సొంత గ్రామాల్లోనే వారికి పనులు లభిస్తుండడం సంతోషకరమని చెప్పారు. ఇంటర్నెట్ వేగం పెంచేందుకు చర్యలు దేశంలో మొట్టమొదటి సారిగా నగరాల కంటే గ్రామాల్లోనే ఇంటర్నెట్ అధికంగా వినియోగిస్తున్నారని ప్రధానమంత్రి తెలియజేశారు. గ్రామాల్లో ఇంటర్నెట్ వేగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజనతో పల్లెల్లో మౌలిక సదుపాయాలు పెరగడంతోపాటు ఇంటర్నెట్ లాంటి ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. కూలీలకు ఉపాధి కల్పించే పథకానికి మోదీ బిహార్‌లోని కతిహార్ జిల్లాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకారం చుట్టారు. 125 రోజుల పాటు ఉపాధి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన కింద ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కూలీలకు రూ.50 వేల కోట్లతో 125 రోజులపాటు ఉపాధి కల్పిస్తామని కేంద్ర సర్కారు ప్రకటించింది. మొత్తం 25 రకాల పనులను కూలీలకు అప్పగిస్తామని వెల్లడించింది. పేదలకు గృహ నిర్మాణం, చెట్లు నాటడం, ప్రజలకు తాగునీటి వసతి కల్పించడం, పంచాయతీ భవనాల నిర్మాణం, మార్కెట్లు, రోడ్ల నిర్మాణం వంటివి ఇందులో ఉన్నాయి. -
వేతనాలిచ్చిన సంస్థలకే రాయితీ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం అమలుపై కార్మిక శాఖ దృష్టి సారించింది. గత నెల 24 నుంచి కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. వచ్చే నెల 3 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వందలోపు కార్మికులున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా ను ప్రభుత్వం భరించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులకు నెలవారీ వేతనం చెల్లించిన సంస్థలే ఈపీఎఫ్ రాయితీలను పొందే వీలుంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఈసీఆర్ జనరేట్ చేయాల్సిందే.. వందలోపు ఉద్యోగులుండి అందులో 90 శాతం మంది వేతనాలు 15 వేల లోపు ఉన్న సంస్థలకే ఈపీఎఫ్ రాయితీ వర్తిస్తుంది. ఇలాంటి కంపెనీలోని ఉద్యోగుల వేతనం ప్రకారం.. కంపెనీ వాటా12%తో పాటు ప్రభుత్వం చెల్లించే వాటా 12% కలుపుకుని మొత్తం 24% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్యోగులకు నెలవారీ వేతనం చెల్లించిన తర్వాత ఈపీఎఫ్ చందాను ఆన్లైన్ పద్ధతిలో చెల్లించిన తర్వాత ఈసీఆర్ (ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్)ను కార్మిక శాఖకు, ఈపీఎఫ్ఓకు సమర్పిస్తుం ది. తాజాగా రాయితీ పొందే సంస్థలు వేతనాల ను చెల్లించి ఆ వివరాలను కార్మిక శాఖకు సమర్పించాలి. అలా ఈసీఆర్లను సమర్పించిన తర్వా త కార్మిక శాఖ అధికారులు వాటిని పరిశీలించి ఉద్యోగుల ఈపీఎఫ్ చందాను వారి యూఏఎన్ నంబర్‌కు బదిలీ చేస్తారు. ఈ క్రమంలో రాయితీ పొందే ప్రతి కంపెనీ ఉద్యోగి పూర్తి వేతనాలను సక్రమంగా చెల్లించాల్సిందే. వేతనంతో కూడిన సెలవులు.. లాక్డౌన్ కాలంలో ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసింది. ఈ సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కానప్పటికీ వేతనాలు చెల్లించాలి. కొన్ని కంపెనీలు పనిచేసిన కాలానికే వేతనాలు ఇస్తున్నట్లు కార్మిక శాఖ దృష్టికి వచ్చింది. వీటిపై కార్మికులు లేదా ఉద్యోగులు కార్మిక శాఖను సంప్రదించి ఫిర్యాదు చేస్తే కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చీఫ్ లేబర్ కమిషనర్ స్పష్టం చేశారు. -
గరీబ్ కల్యాణ్‌తో 5 వేల కోట్లే!
ఈ పథకానికి స్పందన అంతంతే: అధియా న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయనీ, ఈ పథకానికి నామమాత్ర స్పందన మాత్రమే లభించిందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా గురువారం చెప్పారు. నల్లధనం వెల్లడికి అక్రమార్కులకు అవకాశమిస్తూ ప్రభుత్వం గత డిసెంబరు 17న ఈ పథకాన్ని ప్రారంభించింది. లెక్కల్లోకి రాని ఆదాయం తమ వద్ద ఎంత ఉందో అవినీతిపరులు ఈ పథకం కింద ప్రకటించి, ఆ డబ్బును ప్రభుత్వం వద్ద జమ చేయాలి. అందులో 50 శాతాన్ని ప్రభుత్వం పన్ను, సర్‌చార్జీ, జరిమానా కింద వసూలు చేస్తుంది. మరో 25 శాతం ధనాన్ని వడ్డీ ఏమీ లేకుండా ప్రభుత్వం వద్ద కచ్చితంగా నాలుగేళ్లపాటు జమ చేయాలి. ఈ పథకం కింద అక్రమాదాయ వెల్లడికి గడువు మార్చి 31తో ముగిసింది. అక్రమార్కులు ముందుగానే పలు ఇతర ఖాతాల్లో డబ్బు జమ చేసి ఉండటం, పన్ను, సర్‌చార్జి రేట్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని హస్ముఖ్ అధియా చెప్పారు. కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం హస్ముఖ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. పీఎంజీకేవై కింద వచ్చిన మొత్తాన్ని మాత్రమే వేరుగా చూసి తక్కువగా ఉందనుకోకూడదన్నారు. అదే ఏడాది అంతకన్నా ముందే స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని తీసుకొచ్చామనీ, అలాగే ప్రజలు కూడా నల్లధనాన్ని బ్యాంకు ఖాతా ల్లో జమచేసి పన్ను చెల్లించారని జైట్లీ పేర్కొన్నారు. అందువల్లే పీఎంజీకేవై కింద వెల్లడించిన మొత్తం తక్కువగా ఉందన్నారు. -
సహకార బ్యాంకులకు కేంద్రం షాక్!
గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్ల స్వీకరణపై నిషేధం • కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో అవకతవకలపై ఐటీ నివేదిక నేపథ్యం న్యూఢిల్లీ: కొత్త పన్ను క్షమాభిక్ష పథకం– ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై), 2016 కింద సహకార బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించరాదని కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు పథకం నోటిఫికేషన్‌ను సవరించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొన్ని సహకార బ్యాంకుల్లో అకౌంట్ల అవకతవకలను గుర్తించినట్లు ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లకు ఆదాయపు పన్ను శాఖ నివేదిక నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. పాత కరెన్సీల డిపాజిట్లు తీసుకోడానికి తొలుత సహకార బ్యాంకులకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రకటన ఆరు రోజుల తరువాత, ఈ డిపాజిట్లను స్వీకరించడం నుంచి సహకార బ్యాంకులను కేంద్రం మినహాయించింది. అయితే అప్పటికే దాదాపు రూ.16,000 కోట్లు సహకార బ్యాంకుల్లోని పలు అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖలు గుర్తించాయి. ఏమిటీ పథకం... రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తరువాత కేంద్రం పీఎంజీకేవై పథకాన్ని తీసుకువచ్చింది. నల్లకుబేరులకు సంబంధించి తాజాగా, చివరి అవకాశంగా కేంద్రం ఈ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి. దరఖాస్తులో ఇలా పన్ను చెల్లించినట్లు ఆధారం ఉండాలి. అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో 25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్–ఇన్’ విధానంలో డిపాజిట్ చేయాలి. కట్టిన పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వడం జరగదు. అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్ బ్లాక్ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు. డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ పథకం డిక్లరేషన్లు, డిపాజిట్ల నిమిత్తం 2017 మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. బ్యాంకుల్లో తప్ప సహకార బ్యాంకులను ఈ డిపాజిట్ల సేకరణ నుంచి నిషేధించినట్లు తాజాగా కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకూ రూ.300 కోట్ల డిక్లరేషన్లు! ఇదిలావుండగా, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రూ.300 కోట్ల విలువైన డిక్లరేషన్లు వచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే డిక్లరేషన్ల విలువ తెలియనప్పటికీ, మహారాష్ట్రలోని 16 నగరాలకు చెందిన దాదాపు 36 మంది ఆభరణ వర్తకులు దాదాపు రూ.140 కోట్ల విలువైన డిక్లరేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారుల దాడుల అనంతరం కూడా పలువురు ఈ డిక్లరేషన్లు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ కూడా దాదాపు రూ.100 కోట్ల డిక్లరేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ రాష్ట్రానికి చెందిన ఒక వైద్యుడు కూడా రూ.11.50 కోట్లకు సంబంధించి డిక్లరేషన్‌కు ఆదాయపు పన్ను అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఒక చిత్ర దర్శకుడు రూ.40 కోట్ల డిక్లరేషన్‌తో ముందుకు వచ్చినట్లు సమాచారం. -
గరీబ్ కల్యాణ్ ‘నగదు’కే పరిమితం: సీబీడీటీ
న్యూఢిల్లీ: లెక్కల్లో లేని ఆదా య వివరాల వెల్లడికి సంబంధించి ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) నిబంధనలపై కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వివరణనిచ్చింది. దేశీయంగా ఇప్పటిదాకా లెక్కల్లో చూపకుండా పోస్టాఫీసులు/బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదుకే ఇది పరిమితమని స్పష్టం చేసింది. ఆభరణాలు, షేర్లు, స్థిరాస్తులు, విదేశీ ఖాతాలు మొదలైన రూపాల్లోని ఆదాయాలకు ఇది వర్తించదని పేర్కొంది. 2016–17కి ముందు చేసిన బ్యాంక్ డిపాజిట్ల వివరాలనూ ఈ స్కీము కింద వెల్లడించవచ్చని సీబీడీటీ తెలిపింది.