
న్యూఢిల్లీ: కరోనా అడ్వాన్సులను వేగవంతంగా పూర్తిచేస్తున్నట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రకటించింది. దాదాపు 90 శాతం ముందస్తు చెల్లింపులను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరించినట్లు వివరించింది. కరోనా మహమ్మారి ప్రభావాన్ని అధిగమించడం కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీలో భాగంగా ఈపీఎఫ్ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు ప్రభుత్వం వీలుకల్పించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో రూ. 3,601 కోట్ల ఉపసంహరణ జరిగిందని వివరణ ఇచ్చింది.