Withdrawal
-
సేనల ఉపసంహరణ స్వాగతించదగింది
బ్రిస్బేన్: భారత్, చైనాలు సరిహద్దుల్లో అత్యంత సమీపంలో మోహరించిన బలగాల ఉప సంహరణపై కొంత పురోగతి సాధించడం స్వాగతించదగిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. అనంతర చర్యలకు ఈ పరిణామం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన డెమ్చోక్, డెప్సాంగ్ల నుంచి రెండు దేశాలు ఇటీవల బలగాలను ఉపసంహరణను పూర్తి చేసుకోవడం, అనంతరం భారత్ ఆర్మీ పరిశీలనాత్మక గస్తీ జరుపుతున్న క్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి జైశంకర్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వాస్తవా«దీన రేఖ వెంబడి 2020కు ముందు లేని ప్రాంతాల్లో చైనా బలగాలు ముందుకు చొచ్చుకువచ్చాయి. దీంతో మేం కూడా బలగాలను మోహరించాం. కొన్ని ఇతర కారణాలు కూడా ఇందుకు తోడయ్యాయి. దాదాపు నాలుగేళ్లపాటు బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి. ఏదైనా అనూహ్య సంఘటన జరిగే అవకాశమున్న పరిస్థితి అది. తాజాగా భారత్, చైనాలు కొంత పురోగతి సాధించాయి. సేనలను వెనక్కి తీసుకున్నాయి. ఇది స్వాగతించదగిన పరిణామం. ఇది ఇతర సానుకూల చర్యలకు దారి తీసే అవకాశముంది’అని ఆయన అన్నారు. ఉక్రెయిన్, పశి్చమాసియాల్లో కొనసాగుతున్న సంక్షోభాలు ప్రపంచంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆయన..ఈ సమస్యల పరిష్కారానికి భారత్ తన వంతు కృషి కొనసాగిస్తోందని వెల్లడించారు. -
సర్కారు నిర్ణయంతో పవన్ క్వాష్ ఉపసంహరణ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై కోర్టుల్లో దాఖలైన పరువు నష్టం కేసులన్నింటినీ ఉపసంహరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, గుంటూరు కోర్టులో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని కోరుతూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అప్పట్లో వలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని పవన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునేందుకు వీలుగా ఈ వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతివ్వాలని కోరుతూ శనివారం పవన్ తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. తమ క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతివ్వాలని పవన్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులిచ్చారు.కాగా, గతేడాది ఏలూరులో పవన్ మాట్లాడుతూ ఏపీలో పెద్ద సంఖ్యలో ఆడ పిల్లలు కనిపించకుండా పోతున్నారని, దీని వెనుక వలంటీర్లు ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ పరువు, ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, పవన్‌పై సంబంధిత కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేయాలని గుంటూరు కోర్టు పీపీని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పీపీ గుంటూరు కోర్టులో పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
మద్యానికి బానిసైతే...ఇంత భయంకరమా? వైరల్ వీడియో!
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలుసు, మితిమీరితే ప్రాణాలకే ప్రమాదమనీ తెలిసు. అయినా మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకుపెరుగుతూనే ఉంది. అసలు మద్యం లేదా అల్కహాల్ సేవించడం ఎంత ప్రమాదమో తెలుసా?ఒక్కసారి మద్యానికి బానిపైపోతే మనిషి చివరికి ఎలాంటి దుస్థితికి దిగజారి పోతాడో తెలిపే వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వారాలు, నెలలు, సంవత్సరాల పాటు ఆల్కహాల్‌కు బానిసై, అకస్మాత్తుగా అకస్మాత్తుగా మద్యపానాన్ని ఆపివేసినా లేదా బాగా తగ్గించేసినా మానసిక, శారీరక సమస్యలు రెండూ వస్తాయి. ఈ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా మారవచ్చు. తక్షణ వైద్య సహాయం తీసుకోకపోతే ప్రాణాపాయం కావచ్చు. మద్యం తాగిన తరువాత నరాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. దీంతో అది క్రమేపీ మనతోపాటు పాటు నరాలు కూడా అలవాటు పడతాయన్న మాట. చివరికి అదొక ఎడిక్షన్‌లా మారిపోతోంది. అంటే అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. ఈ స్థాయి మరింత ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం) లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి ఇది ప్రాణాపాయం కావచ్చు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి జరుగుతోంది అదే. మద్యానికి అలవాడు పడిన నరాలు స్థిమితంగా ఉండలేకపోయాయి. దీంతో కాస్త మద్యం పుచ్చుకోగానే కుదుటపడ్డాయి. అంతిమంగా ఇది మరణానికి దారితీస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఆల్కహాల్ విత్ డ్రాయల్ లక్షణాలు: అధిక రక్త పోటు, నిద్రలేమి, శరీర భాగాలు బాగా వణికిపోవడం (హైపర్ రెఫ్లెక్సియా) ఆందోళన, కడుపు నొప్పి, తలనొప్పి, గుండె దడ లాంటివి. ఓకే అండీ, మనం మందు తాగమే అనుకోండి, ముందు నరాలు ఎక్సైట్ అవుతాయన్నమాట, తర్వాత తర్వాత అలవాటు పడతాయన్నమాట, చివరికి అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట ఇలాగే. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. బాగా ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం), ఇంకా ప్రాణాపాయం కావచ్చు. pic.twitter.com/wmqiDsTr6U — Srikanth Miryala (@miryalasrikanth) April 12, 2024 మద్యానికి బానిసైతే ♦ ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ♦ అతిము ఖ్యమైన అవయం కాలేయం దెబ్బతింటుంది. ఇది ముదిరితే కాలేయ కేన్సర్‌కు దారి తీస్తుంది. ♦ఏకాగ్రతను కోల్పోవడం, పాదాలు, చేతుల్లో తిమ్మిరి, జ్ఞాపకశక్తి సమస్యలు భావోద్వేగాలను నియంత్రించ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి ♦ ఎంజైమ్‌లు అండ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. నోట్: మద్యం ఆరోగ్యానికి అనర్థం. ఇందులో రెండో మాటకు తావేలేదు. ఆరోగ్య జీవనం కోసం ఆ వ్యసనాన్ని మెల్లిగా వదిలించుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. అవసరమైన నిపుణుల సలహాలు తీసుకొని మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం. -
ఎన్పీఎస్ ఉపసంహరణకు ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణ
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి చందాదారులు తమ నిధులను ఉపసంహరించుకునే సమయంలో ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణను పింఛను నిధి అభివృద్ధి, నియంత్రణ మండలి (పీఎఫ్ఆర్డీఏ) ప్రవేశపెట్టింది. పెన్నీడ్రాప్ విధానంలో చందాదారు బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, ఎన్పీఎస్లోని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్లోని పేరు ఏక రూపంలో ఉందా అన్నది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) తనిఖీ చేస్తుంది. ఎన్‌పీఎస్‌తోపాటు ఎన్పీఎస్ లైట్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు సంబంధించి అన్ని రకాల ఉపసంహరణలు, వైదొలగడాలు, చందాదారు బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులకు నూతన విధానం అమలు కానుంది. దీన్ని ఎలా చేస్తారంటే.. చందాదారు బ్యాంక్ ఖాతాలోకి చాలా స్వల్ప మొత్తాన్ని (రూపాయి) బదిలీ చేస్తారు. తద్వారా బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరును ధ్రువీకరించుకుంటారు. నిధుల ఉపసంహరణకే కాకుండా, చందాదారులు తమ బ్యాంక్ ఖాతా వివరాల అప్డేట్కు దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. ఈ పెన్నీడ్రాప్ విధానంలో ధ్రువీకరణ విజయవంతం కాకపోతే, నోడల్ ఆఫీస్ సహకారాన్ని సీఆర్ఏ తీసుకుంటుంది. పెన్నీడ్రాప్ విఫలమైందని, సమీప నోడల్ ఆఫీస్ లేదా పీవోపీని సంప్రందించాలంటూ చందాదారులకు ఈ మెయిల్, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. చందాదారు నుంచి సరైన వివరాలు అందేంత వరకు నిధుల బదిలీని నిలిపివేస్తారు. -
భారత్–చైనా ఆర్మీ మధ్య రేపు చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ వేగంగా జరగాలని భారత్ స్పష్టం చేయనుంది. భారత్– చైనా మధ్య 19వ విడత చర్చలు ఈ నెల 14న జరగనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి చివరి దఫా చర్చలు నాలుగు నెలల క్రితం జరిగాయి. రేపు జరిగే చర్చల్లో మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తిగా జరగాలని భారత ప్రతినిధి బృందం పట్టుబడ్టనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు దేశాల మధ్య పలు విడతలుగా జరిగిన చర్చల ఫలితంగా తూర్పులద్దాఖ్‌లోని కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు పక్షాలు బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 18వ విడత చర్చల్లో ప్రధానంగా డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలంటూ భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. తాజా చర్చలు చుషుల్–మోల్డో సరిహద్దు పాయింట్‌లోని భారత భూభాగంలో జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత బృందానికి లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి, చైనా కు సౌత్ జిన్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. -
నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి!
Mutual Funds: ఆధునిక కాలంలో సంపాదించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయాలనీ లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. ఆలా అనుకునే వారికి మ్యుచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం అనే చెప్పాలి. ఈ కథనంలో బెస్ట్ ఫండ్ ఏది? ఎంత పెట్టుబడికి ఎంత వస్తుందనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో పెట్టుబడికి చాలా మార్గాలు ఉన్నాయి, అందులో ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మీరు తప్పకుండా ప్రతి నెలా పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. మ్యుచువల్ ఫండ్ సిస్టమాటిక్ ప్లాన్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను అందుకోవాలనుకుంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రిటర్న్స్.. మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసే డబ్బుని బట్టి మీ రిటర్న్స్ ఉంటాయని తప్పకుండా గుర్తుంచుకోవాలి. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రిటర్న్స్.. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంచుకున్న మ్యుచువల్ ఫండ్ వ్యాల్యూ రూ.10 ఉన్న ఒక లక్ష యూనిట్లను కొనుగోలు చేశారనుకుంటే.. మీ పెట్టుబడి రూ. 10 లక్షలు (1,00,000×10) అవుతుంది. మీరు నెలకు రూ. 10000 రిటర్న్ పొందాలంటే.. మొదటి నెలలో ఎన్ఏవీ రూ. 10 ఉన్నప్పుడు 1000 యూనిట్లను విక్రయించి అనుకున్న పదివేలు తిరిగి పొందుతారు. అంటే అప్పుడు మీ వద్ద 99,000 యూనిట్లు మిగిలి ఉంటాయి. రెండవ నెలలో ఫండ్ ఎన్ఏవీ విలువ రూ.12కు పెరిగితే ఆ నెలలు మీకు పదివేలు ఇవ్వడానికి కేవలం 833 యూనిట్లను (10,000/12) మాత్రమే విక్రయించడం జరుగుతుంది. దీంతో మీ ఖాతాలో 98,167 యూనిట్లు ఉంటాయి. ఈ విధంగా మీరు ప్రతి నెలా లెక్కించుకోవచ్చు. ఫండ్ మంచి పనితీరుని కనపరిస్తే పెట్టుబడి అలాగే ఉంటుంది, డబ్బులు వస్తూనే ఉంటాయి. పనితీరు మందగిస్తే పెట్టుబడి కరిగిపోతూ వస్తుంది. నెలకు రూ. 1 లక్ష.. ఈ విధంగా మీకు నెలకు రూ. 1 లక్ష.. 25 సంవత్సరాలు పాటు రావాలంటే ఒకే సారి రూ. 1,55,50,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన 8 శాతం వార్షిక రిటర్న్స్ వచ్చాయంటే ప్రతి నెలా రూ. 1 లక్ష అందుకోవచ్చు. ఇలా 25 సంవత్సరాల తరువాత కూడా మీ పెట్టుబడి ఖాతాలో అలాగే ఉంటుంది. అంతే కాకుండా పాతికేళ్లు నెలకు 1 లక్ష వస్తూనే ఉంటుంది. Disclaimer: ఇలాంటి మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, తప్పకుండా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి లేదా నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా గమనించగలరు. -
రూ.2వేల నోట్ల మార్పిడి.. బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట!
ఈ నెల 19 నుంచి దేశ వ్యాప్తంగా రూ. 2000 వేల నోట్లు ఎక్ఛేంజ్, డిపాజిట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఆర్బీఐ రూ. 2000 నోట్లను ఉపసంహరణ ప్రకటనతో దేశంలో పలు బ్యాంక్‌లు కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చాయి. బ్యాంకులు సాధారణంగా నెలలో జరిపే ట్రాన్సాక్షన్లు మించి జరిగితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆ ఛార్జీలు రూ.2000 నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై వర్తిస్తాయని తెలిపాయి. ఈ తరుణంలో కొన్ని బ్యాంకులు మాత్రం ఆ అదనపు ఛార్జీల భారాన్ని కస్టమర్లపై మోపడం లేదని ప్రకటించాయి. దీంతో సదరు బ్యాంకుల్లో రూ.2000 వేల నోట్ల డిపాజిట్లు, ఉపసంహరణ చేసే ఖాతాదారులకు భారీ ఊరట లభించినట్లైంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌లలో రూ.2000 నోట్లను మెషిన్లో డిపాజిట్లు చేయొచ్చు. సీనియర్ సిటిజన్లు ఇతర పద్దతుల్లో బ్యాంక్ సర్వీసుల్ని వినియోగించి డిపాజిట్లు చేసుకోవచ్చని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. కేవైసీ నిబంధనలకు లోబడి బ్యాంక్ ఖాతాదారులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవని కస్టమర్లకు మెయిల్స్ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు రూ.2వేల నోట్ల ఉపసంహరణ గడువు సెప్టెంబర్ 30,2023 వరకు ఎలాంటి అందనపు ఛార్జీలు విధించబోమని, సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలలో రూ. 2,000 డినామినేషన్ నోట్ల డిపాజిట్లపై నగదు చెల్లింపు ఛార్జీల్ని తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఐడీ కార్డ్‌లను అడగడం లేదని ఏఎన్ఐ ట్వీట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మెయిల్ ద్వారా తన కస్టమర్లు రూ. 2,000 నోట్లను తమ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాలో సెప్టెంబర్ 30, 2023 వరకు ఏదైనా బ్రాంచ్‌లో జమ చేసుకోవచ్చని తెలియజేసింది. చదవండి👉 రూ 2000 నోటు మార్చుకుంటున్నారా?, సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంక్‌లు! -
ఫ్యూచర్ రిటైల్‌కు బియానీ రాజీనామా ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌కు ఇచ్చిన రాజీనామాను ప్రమోటర్ కిషోర్ బియానీ ఉపసంహరించుకున్నారు. జనవరి 23న ఆయన రాజీనామాను ప్రకటించారు. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్‌పై దివాలా పరిష్కార చర్యలు అమలవుతున్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్ దివాలా పరిష్కార ప్రక్రియను చూస్తున్న నిపుణుడు.. కిశోర్ బియానీ రాజీనామాలోని అంశాల పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో కిశోర్ బియానీ మార్చి 10వ తేదీ లేఖతో తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు ఫ్యూచర్ రిటైల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. రుణ దాతలకు రూ 14,809 కోట్ల నష్టానికి మాజీ డైరెక్టర్లు, ప్రస్తుత డైరెక్టర్లు కారణమయ్యారంటూ ఈ వారం మొదట్లో రిజల్యూషన్ ప్రొఫెషనల్, ఫ్యూచర్ రిటైల్ సంయుక్తంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దరఖాస్తు దాఖలు చేయడం గమనార్హం. వారి నుంచి ఈ మొత్తాన్ని వసూలుకు ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. -
ఖెర్సన్.. గేమ్ చేంజర్?
ఎస్.రాజమహేంద్రారెడ్డి ఖెర్సన్. ఈ ఓడరేవు పట్టణం ఇక తమదేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆర్భాటంగా ప్రకటించి ఎన్నో రోజులు కాలేదు! ఉన్నట్టుండి ‘ఖెర్సన్‌ను వీడుతున్నాం. మా సేనలను అక్కణ్నుంచి వెనక్కు రప్పిస్తున్నాం’ అంటూ రష్యా అధికారులు ప్రకటించడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. రష్యా హఠాత్తుగా ఒక అడుగు వెనక్కు ఎందుకేసింది? నిజంగానే రష్యా సేనలు ఖెర్సన్‌పై పట్టు కోల్పోయాయా? లేదంటే ఈ వెనకడుగు వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమా...? జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుందంటారు. పుతిన్‌కు అది ఇప్పుడిప్పుడే తెలిసొస్తున్నట్టుంది. ఖెర్సన్ సహా ఉక్రెయిన్‌లోని నాలుగు పట్టణాలు తమ అధీనంలోకి వచ్చాయని దాదాపు నెలకింద చిరునవ్వులు చిందిస్తూ పుతిన్ కాస్త ఆర్భాటంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఖెర్సన్ నుంచి సేనల ఉపసంహరణ విషయాన్ని మాత్రం రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు వెల్లడించారు. రష్యా ప్రజలకు రుచించని విషయాల వెల్లడికి వీలైనంత దూరంగా ఉండటం పుతిన్‌కు అలవాటే. అందుకే షరామామూలుగా ఖెర్సన్ నుంచి వెనకడగు ప్రకటనలోనూ ఆయన మొహం చాటేశారు. ఆ బాధ్యతను రక్షణ మంత్రికి, ఇతర సైనిక ఉన్నతాధికారులకు అప్పగించడం ద్వారా వారిని వ్యూహాత్మకంగా టీవీల ముందుకు తీసుకొచ్చారు. తద్వారా ఉక్రెయిన్‌తో యుద్ధంలో జరిగే అన్ని పరిణామాలకూ ఇకపై వాళ్లే బాధ్యులవుతారని పుతిన్ చెప్పినట్టయింది. కాకపోతే ఓటమిని రష్యా బహిరంగంగా అంగీకరించడమే చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఇలాంటి ఎదురుదెబ్బలను రష్యా అధికారికంగా అంగీకరించడం అత్యంత అరుదు. అదీ ప్రత్యక్ష ప్రసారంలో! యుద్ధగతినే మార్చే పరిణామం! ఖెర్సన్ నుంచి రష్యా సేనల ఉపసంహరణను ఉక్రెయిన్ తొలుత నమ్మలేదు. రష్యా వ్యూహాత్మకంగా వల విసిరిందని ఉక్రెయిన్ సైనికాధికారులు భావించారు. ఈ ప్రకటన పాచికేనని, రష్యా సైనికులు పౌరుల వేషంలో ఉక్రెయిన్ జనంతో కలిసిపోయి దొంగ దెబ్బ తీసేందుకు అదను కోసం ఎదురు చూస్తున్నారని అనుమానించారు. ఆ ఆస్కారమూ లేకపోలేదన్నది పరిశీలకుల మాట. ‘‘ఖెర్సన్ నుంచి సేనలను ఉపసంహరించాలని రష్యా చాలా రోజులుగా ఆలోచిస్తోంది. సుశిక్షితులైన సైనికుల స్థానంలో బలవంతంగా ఆర్మీలో చేర్చుకున్న పౌరులను ఖెర్సన్‌లో మోహరించడమే ఇందుకు నిదర్శనం’’ అని వారంటున్నారు. ఉక్రెయిన్ దాడులను ముమ్మరం చేయడంతో ఖెర్సన్‌పై పట్టు బిగించడం తమకు దాదాపు అసాధ్యంగా మారిందని రష్యా సైనికాధికారి ఒకరన్నారు. ఖెర్సన్‌ను వదిలేసి నిప్రో నది పశ్చిమ తీరాన సేనలను మోహరిస్తే తమ స్వాధీనంలోని మిగతా ప్రాంతాలను కాపాడుకోవచ్చని రష్యా భావించినట్టు కన్పిస్తోంది. ఉధృతమైన నిప్రో ప్రవాహమే ఉక్రెయిన్ సేనలను నది దాటకుండా అడ్డుకుంటుందన్నది వారి ఆలోచన. మొత్తంమీద ఖెర్సన్ నుంచి రష్యా నిష్క్రమణ యుద్ధగతిని పూర్తిగా మార్చేయడం ఖాయంగా కన్పిస్తోంది. గెలుపోటముల భవిష్యత్తును శాసించేలా ఉంది. స్థూలంగా ఇది రష్యాకు మింగుడు పడని పరిణామమే. -
నేడు మునుగోడు నామినేషన్ల విత్ డ్రా కు తుది గడువు
-
డెట్ ఫండ్స్‌కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి జూన్ త్రైమాసికంలో రూ.70,213 కోట్లను ఉపసంహరించుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల ఇందుకు దారితీసింది. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్య పరిస్థితులు ఇంకా కఠినతరం అవుతాయి. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు మరికొంత తగ్గొచ్చు’’అని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ తెలిపారు. జూన్ చివరికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు 5 శాతం తగ్గి రూ.12.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. మార్చి క్వార్టర్ చివరికి ఇవి రూ.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021–22 మొదటి త్రైమాసికం నాటికి రూ.14.16 లక్షల కోట్లు. -
Russia-Ukraine war: ఖర్కీవ్ నుంచి రష్యా సేనలు ఔట్!
కీవ్/హెల్సింకీ: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ నుంచి రష్యా బలగాలు వెనక్కు మళ్లుతున్నాయి. ఉక్రెయిన్ ప్రతిఘటనను తట్టుకోలేకే రష్యా వెనుకడుగు వేస్తున్నట్లు ఇంగ్లండ్ పేర్కొంది. ఖర్కీవ్‌లో ఉక్రెయిన్‌దే పై చేయి అని చెప్పింది. తూర్పు ప్రాంతంలో రష్యా ఆధీనంలో ఉన్న ఆరు పట్టణాలను, గ్రామాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్ధ ఫలితం యూరప్, మిత్రదేశాల మద్దతుపై ఆధారపడి ఉంటుందన్నారు. అమెరికా రిపబ్లికన్ నేత మిచ్ మెక్కానెల్ నేతృత్వంలో సెనేట్ సభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. ‘నాటో’కు దరఖాస్తు చేస్తాం: ఫిన్లండ్ నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయాలని నిర్ణయించినట్టు ఫిన్లండ్ అధ్యక్షుడు సౌలీ నీనిస్టో స్పష్టం చేశారు. శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్లో ఈ విషయం చెప్పారు. స్వీడన్ కూడా నాటోలో చేరాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. పుతిన్‌కు ఆగస్టులో పదవీ గండం!: పుతిన్‌ను గద్దె దించడానికి రష్యాలో ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్టు ఉక్రెయిన్ నిఘా విభాగం చీఫ్ మేజర్ జనరల్ కైరిలో బడానోవ్ చెప్పారు. ఆయనపై తిరుగుబాటు జరుగనుందన్నారు. యుద్ధంలో ఈ ఏడాది ఆఖరుకల్లా రష్యా ఓడిపోతుందన్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పుతిన్ తీవ్రమైన అనారోగ్యం పాలైనట్టు రష్యా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆయన పార్కిన్సన్తోనూ బాధపడుతున్నట్లు వార్తలొచ్చాయి. -
పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. 184 మంది భద్రత ఉపసంహరణ
చండీగఢ్: పంజాబ్‌లో భారీ విజయంతో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా 184 మందికి సంబంధించిన భద్రతను ఉపసంహరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారికి ఉన్న ముప్పును అంచనా వేసి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు బీబీ జాగీర్ కౌర్, మదన్ మోహన్ మిట్టల్, సుర్జిత్ కుమార్ రఖ్రా, సుచా సింగ్ చోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, తోట సింగ్, గుల్జార్ సింగ్ రాణికే ఉన్నారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు, మంత్రుల కుటుంబానికి ఉన్న భద్రతను కూడా ఉపసంహరించారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్ కుటుంబీకులు కూడా తమ భద్రతను కోల్పోనున్నారు. భద్రత కోల్పోయినవారిలో మాజీ ఎంపీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న మహి గిల్, మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ కుమారుడు సిధాంత్ కూడా భద్రతను కోల్పోనున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను ఆప్ ప్రభుత్వం తొలగించడం ఇది రెండోసారి కావాడం గమనార్హం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చి 11న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చదవండి: పాకిస్తాన్లో చదివినోళ్లకు ఉద్యోగాలు ఇవ్వం! -
వీఐపీలకు భద్రత రద్దు
చండీగఢ్: పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ (48) శనివారం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. శుక్రవారం మొహాలిలో జరిగిన సమావేశంలో ఆప్ శాసనసభా పక్ష నేతగా మాన్ ఎన్నికవడం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. కేంద్ర హోం శాఖ సూచనల ప్రకారం బాదల్ కుటుంబం, మాజీ సీఎంలు కెప్టెన్ అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి వారు మినహా మిగతా వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి తీసుకోవాలన్నారు. -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయాలపై... సీబీఐ విచారణకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన ఉపసంహరించుకోవాలని దాఖలు చేసిన రికాల్ పిటిషన్‌ను కేంద్రం సోమవారం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవసరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విభేదించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారన్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్‌డ్రాన్’గా రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) వద్ద హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ 64.92% వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5% వాటా ఉంది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ ధర 4% పైగా పెరిగి రూ.334. 05 వద్ద ముగిసింది. హిందుస్తాన్ జింక్‌పై ఎన్జీటీ రూ.25 కోట్ల జరిమానా రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యావరణ సంబంధ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను వేదాంతా గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.25 కోట్ల జరిమానా విధించింది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి హిందుస్తాన్ జింక్ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణ. మూడు వారాల్లో జరిమానా మొత్తాలను జిల్లా మేజిస్ట్రేట్ వద్ద డిపాజిట్ చేయాలని ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఏకే గోయెల్ ఆదేశించారు. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించడంసహా, బాధిత గ్రామాల్లో చెట్లునాటడం తదితర చర్యలు తీసుకుంటామని హిందుస్తాన్ జింక్ ప్రకటించడం గమనార్హం. -
కరోనా కష్టకాలంలో.. ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త..! లక్షవరకు!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త. కరోనా కష్టకాలంలో అకౌంట్ నుంచి లక్షరూపాయలు అడ్వాన్స్‌గా విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థ అవకాశం కల్పించింది. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్లు ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ నుంచి రూ.1లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ఖతాదారులు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా లక్ష వరకు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. అయితే కొన్ని నిబంధనలకు లోబడి పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు షరతులు ►వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రి/సీజీహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేరాలి. ►ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే.., ఆస్పత్రిలో చేరేముందే విత్ డ్రా చేసుకోవచ్చు. ►పీఎఫ్ ఆఫీస్ వర్కింగ్ డే రోజు దరఖాస్తు చేస్తే, ఆ మరుసటి రోజే డబ్బు అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది ►డబ్బును ఉద్యోగి పర్సనల్ అకౌంట్ లేదంటే ఆసుపత్రి బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఇలా డ్రా చేయండి ►పీఎఫ్ అకౌంట్ నుంచి లక్షరూపాయిల విత్ డ్రా ఎలా అంటే? ►ముందుగా అధికారిక వెబ్సైట్ www.epfindia.gov.inను సందర్శించాలి. ►వెబ్ పోర్టల్‌లో 'ఆన్లైన్ సేవలు'పై క్లిక్ చేయండి ►అనంతరం 31, 19, 10C మరియు 10D ఫారమ్‌లను పూర్తి చేయాలి ►ధృవీకరించడానికి మీ బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలను ఎంట్రీ చేయాలి ►తర్వాత 'ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్'పై క్లిక్ చేయండి ►డ్రాప్-డౌన్ మెను నుండి ఫారమ్ 31ని సెలక్ట్ చేసుకోవాలి ►డబ్బును విత్ డ్రా ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలి. ►అనంతరం ఆసుపత్రి బిల్లు కాపీని అప్లోడ్ చేయండి ►మీ ఇంటి అడ్రస్ ను ఎంట్రీ చేసి 'సబ్మిట్' బటన్ పై పై క్లిక్ చేయండి. దీంతో పీఎఫ్ విత్ డ్రా ప్రాసెస్ పూర్తవుతుంది. మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. చదవండి: ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త..! భారీగా పెరగనున్న పెన్షన్..! ఎంతంటే..? -
ఏటీపీ కప్‌కు జొకోవిచ్ దూరం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకంగా జనవరి 1 నుంచి 9 వరకు జరగనున్న టీమ్ ఈవెంట్ ఏటీపీ కప్‌లో పాల్గొనే సెర్బియా జట్టు నుంచి జొకోవిచ్ వైదొలిగాడు. మరోవైపు తన కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ సెర్బియా స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడటం అనుమానంగా మారింది. -
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 2 రోజులు బ్యాంక్ యూనియన్ల సమ్మె!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ డిసెంబర్ 16, 17 తేదీల్లో సమ్మెకు దిగుతామని బ్యాంక్ యూనియన్లు నోటీసులు ఇచ్చాయి. రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం సమాయత్తం అయిన నేపథ్యంలో బ్యాంకులు ఈ రెండు రోజుల సమ్మె బాట పట్టాయి. పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తం అయినప్పటికీ, 2019లో బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీకి మెజారీటీ వాటా విక్రయం ద్వారా ఐడీబీఐని కేంద్రం ఇప్పటికే ప్రైవేటీకరించింది. గడచిన నాలుగు సంవత్సరాల్లో 14 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను కూడా కేంద్రం విజయవంతంగా పూర్తిచేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాలను 26 శాతానికి తగ్గించుకోడానికి వెసులు బాటు కల్పించడానికి ఉద్దేశించి బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి వీలుగా బ్యాంకింగ్ చట్ట (సవరణ) బిల్లును కేంద్రం లిస్ట్ చేసింది. ఆయా చర్యలను నిరసిస్తూ, రెండు రోజుల సమ్మె నిర్వహించాలని బ్యాంకింగ్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)కు యూఎఫ్‌బీయూ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: రైతు విజయమిది. ఏడాదిగా ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికినా... మొక్కవోని సంకల్పంతో, దీక్షతో నిలిచి గెలిచాడు అన్నదాత. రైతుల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే భయమో... తరముకొస్తున్న ఎన్నికల్లో ఓట్ల లెక్కల బేరీజు, ఎదురయ్యే పర్యవసానాలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు తలవంచింది. మూడు వివాదాస్పద సాగు చట్టాల బిల్లుల ఉపసంహరణకు సోమవారం పార్లమెంటులో ఆమోదముద్ర పడింది. ఈనెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి... దేశానికి క్షమాపణ చెప్పిన తర్వాత పరిణామాలు ఒకదానివెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. 24న కేంద్ర మంత్రి మండలి ఈ బిల్లును ఆమోదించడంతో... ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొని శీతాకాల సమావేశాల తొలిరోజు... సోమవారమే పార్లమెంటు ఉభయసభల్లో ఉపసంహరణ బిల్లును గట్టెక్కించింది. చర్చ కావాలనే విపక్షాల ఆందోళన మధ్యనే నిమిషాల వ్యవధిలో లోక్‌సభ, రాజ్యసభలో ‘వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు– 2021‘ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే... నల్ల చట్టాలుగా ఖ్యాతికెక్కిన మూడు సాగు బిల్లులు చరిత్ర గర్భంలో కలిసిపోనున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత, ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం... తదితర అంశాలపై చర్చకు విపక్షాలు ఎంత పట్టుపట్టినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. రైతుల (సాధికారత, రక్షణ)కు ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు–2020, రైతు ఉత్పత్తుల వ్యాపారం– వాణిజ్యం (ప్రొత్సాహం... సులభతరం) చట్టం–2020, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం–2020... పేరిట 13 నెలల కిందట కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద ఆర్డినెన్స్‌లను తెచ్చి... తర్వాత పార్లమెంటులో ఆమోదం పొందడటంతో... రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు ఈ మూడు చట్టాల అమలుపై స్టే విధించినా రైతులు ఆందోళనలు విరమించలేదు. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రైతులు నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. 11 సార్లు కేంద్రంతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. చట్టాల ఉపసంహరణ తర్వాతే ఆందోళన విరమిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర ప్రభుత్వమూ అంతే పట్టుదలకు పోవడంతో ఏడాదికాలంగా ఇది కొనసాగిన విషయం తెలిసిందే. చర్చకు విపక్షాల పట్టు సోమవారం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ లోక్‌సభలో ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చకు పట్టుబట్టారు. రైతులను న్యాయం చేయాలని బ్యానర్లను ప్రదర్శిస్తూ... నినాదాలు చేశారు. విపక్షసభ్యులు ఆందోళనను విరమించి తమ స్థానాల్లోకి వెళితే... సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే బిల్లుపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. సభామోదం కోసం బిల్లును ప్రవేశపెట్టినపుడు చర్చకు ఎందుకు అనుమతించడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిరరంజన్ చౌదరి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సభను తీవ్ర అలక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విపక్ష ఎంపీల నినాదాల నడుమే స్పీకర్ బిల్లును మూజువాణి ఓటింగ్‌కు పెట్టి... ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఎంపీలందరూ సోమవారం సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందాక సభ వాయిదా పడింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ ప్రారంభమైనా... విపక్షాల నిరసనలతో 2 గంటల ప్రాంతంలో లోక్‌సభ మంగళవారానికి వాయిదాపడింది. చర్చ ఎందుకు?: తోమర్ మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్‌తో సహా పలు విపక్షాలు రూల్ –267 కింద సభా కార్యాకలాపాలను పక్కనబెట్టి... రైతు సమస్యలపై చర్చను చేపట్టాలని నోటీసులు ఇచ్చాయి. చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నోటీసులను తిరస్కరించడంతో నిరసనల మధ్య సభ వాయిదాపడింది. అనంతరం లోక్‌సభలో ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందిందని రాజ్యసభకు తెలుపుతూ... నరేంద్ర తోమర్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. అపై రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) మాట్లాడుతూ... ఇటీవలి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, ఐదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడటంతో మోదీ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుంటోందని పేర్కొన్నారు. ఆందోళనల్లో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంతలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మీకిచ్చిన రెండు నిమిషాల సమయం ముగిసిపోయిందని ఖర్గేకు మైక్‌ను కట్ చేశారు. తోమర్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని తమ మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని తోమర్ విమర్శించారు. అందరూ వ్యవసాయ బిల్లుల ఉపసంహరణనే కోరుకుంటున్నపుడు ఇక చర్చ ఎందుకన్నారు. ఆందోళనల నడుమే బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని హరివంశ్ ప్రకటించారు. టీఎంసీ, ఆప్ డుమ్మా సోమవారం ఉదయం రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో జరిగిన విపక్షాల సమావేశానికి 11 పార్టీలు హాజరుకాగా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డుమ్మా కొట్టాయి. రచ్చ కాదు.. చర్చలే కొలమానం కావాలి ఎంత అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరిపిందనేదే పార్లమెంటు పనితీరుకు కొలమానం కావాలి. ఎంత దుందుడుకుగా వ్యవహరించి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలామనేది ఒకరి పనితీరుకు కొల బద్ధ కారాదు. అన్ని అంశాలనూ చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిస్తాం. ప్రస్తుత సెషన్‌తో పాటు పార్లమెంటు ప్రతి సమావేశమూ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించాలని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులు స్ఫూర్తితో దేశాభివృద్ధికి పరిష్కారమార్గాలను అన్వేషించాలని ప్రజలు కోరుకుంటారు. దీర్ఘకాలిక ప్రభావం చూపే, సానుకూల నిర్ణయాలను ప్రస్తుత సమావేశాల్లో తీసుకోవడం జరుగుతుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో సభ పనితీరుయే కొలమానం కావాలి. దానికి ఎవరెంత మేరకు దోహదం చేశారనేది లెక్కలోకి రావాలి తప్పితే.. ఎవరెంత హంగామా చేసి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనేది ముఖ్యం కారాదు. పార్లమెంటు ఉత్పాదకతే ప్రామాణికం కావాలి. ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ఎంత బలంగానైనా గళాలు వినిపించొచ్చు. అయితే సభా మర్యాదను, సభాపతుల స్థానాలకున్న గౌరవాన్ని కాపాడాలి. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా పార్లమెంటు వ్యవహారశైలి ఉండాలి. – సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విలేకరులతో ప్రధాని మోదీ జడిసే... చర్చ పెట్టలేదు పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండా మూడు వ్యవసాయ చట్టాలకు ఉపసంహరించుకునే బిల్లును ఆమోదింపజేసుకోవడం మోదీ సర్కారు తీవ్ర భయభ్రాంతులకు లోనైందనే దానికి నిదర్శనం. తాము తప్పు చేశామని వారికి తెలుసు కాబట్టే చర్చ రాకుండా తప్పించుకున్నారు. ప్రధాని క్షమాపణ ఎందుకు చెప్పారు. రైతులకు అన్యాయం చేయకపోతే ఎందుకు మన్నించమని కోరారు? కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకనాడు ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని కాంగ్రెస్ ముందునుంచే చెబుతోంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ముగ్గురు నలుగురు బడా పెట్టుబడిదారులు... కర్షకుల, శ్రామికుల శక్తి ముందు నిలువలేరు. బిల్లుల ఉపసంహరణ రైతుల విజయం... దేశ విజయం. చర్చ జరగకపోవడం దురదృష్టకరం. ఈ బిల్లులు ప్రధాని వెనుకున్న శక్తుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి మేము దానిపై చర్చ జరగాలని కోరుకున్నాం. కనీస మద్ధతు ధరపై, లఖీమ్‌పూర్ ఖేరీ దమనకాండపై, ఆందోళనల సందర్భంగా 700 మంది పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోవడంపై చర్చించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్చకు అనుమతించలేదు. చర్చకు జడుసుకుంది. వాస్తవాలను దాచేయాలని చూసింది. చర్చలకు వీల్లేకపోతే ఇక పార్లమెంటుకు అర్థమేముంది. చర్చలకు అనుమతించకపోతే పార్లమెంటును మూసేయడమే మంచిది. దేశ భవిష్యత్తుకు హానికరమైన శక్తులు ప్రధాని వెనకుండి నడిపిస్తున్నాయి. వారెవరో గుర్తించాలి. – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ -
రైతు అభీష్టానికి... రాజ్యం తలొగ్గిన వేళ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్లో మొత్తం 19 సెషన్స్ (పనిదినాలు) ఉంటాయి. క్రిప్టోకరెన్సీలపై నిషేధం పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు.పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కీలక బిల్లులివే.. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో నార్కోటిక్స్ డ్రగ్, సైకోటిక్ సబ్‌స్టాన్సెస్ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు రేపే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన కొత్త బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే దిగువ సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో ఈ కొత్త బిల్లును అధికారులు చేర్చారు. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసింది. ‘‘మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం కొందరు రైతులు మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంది’’ అని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 29న లోక్‌సభకు కచ్చితంగా హాజరు కావాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. వివాదాస్పద సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నంత మాత్రాన సరిపోదని, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. ట్రాక్టర్ల ర్యాలీ రద్దు ఈ నెల 29వ తేదీన పార్లమెంట్ వరకూ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని రద్దు చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేత దర్శన్ పాల్ శనివారం ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని, ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 4న రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముంబైలో ఆదివారం సంయుక్త షెట్కారీ కామ్‌గార్ మోర్చా(ఎస్ఎస్కేఎం) ఆధ్వర్యంలో కిసాన్–మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించనున్నారు. 100కు పైగా రైతు, కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. రైతుల త్యాగాలను కించపరుస్తారా?: కాంగ్రెస్ వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిన ‘అభ్యంతరాలు, కారణాలు’ అనే పదాల పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా కొనసాగుతున్న పోరాటంలో మరణించిన 750 మంది రైతుల త్యాగాలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. 750 మంది రైతులు మరణిస్తే, కేవలం కొందరే ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం చెప్పడం ఏమిటని నిలదీశారు. పంట వ్యర్థాల దహనం నేరం కాదు కేసుల ఉపసంహరణపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి: కేంద్రం రైతాంగం డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని నేరంగా పరిగణించరాదంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఆందోళన విరమించాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), పంటల వైవిధ్యంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రధాని మోదీ హామీ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లిండంపైనా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతా రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రైతన్నలు పెద్ద మనసు చేసుకొని, పోరాటం ఆపేసి, ఇళ్లకు తిరిగి వెళ్లాలని తోమర్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాల వల్ల దక్కే ప్రయోజనాల గురించి కొందరు రైతులను ఒప్పించలేకపోయామని, ఈ విషయంలో తమకు అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. -
సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు–2021కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు మోదీ ఈ నెల 19న అకస్మాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చట్టాల ఉపసంహరణకు సంబంధించిన లాంఛనాలను కేబినెట్ పూర్తిచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ చట్టాలను ఉపసంహరించడానికి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు(ఎంఎస్పీ)తోపాటు ఇతర కీలకం అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చర్చించారా? అని ప్రశ్నించగా.. అనురాగ్ ఠాకూర్ సమాధానమివ్వలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమై, డిసెంబర్ 23న ముగుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు, చేతలకు మధ్య కచ్చితంగా పొంతన ఉంటుందని చెప్పడానికి సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును కేబినెట్లో ఆమోదించడమే ఒక చక్కటి నిదర్శనమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 80 కోట్ల మందికి లబ్ధి పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను(పీఎంజీకేఏవై) మరో నాలుగు నెలలపాటు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి 2022 వరకూ పథకాన్ని కొనసాగిస్తారు. పథకం ఐదో దశను అమలు చేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ), అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యతా కుటుం బాల పథకం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ పథకం కింద నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొ ప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసా ్తరు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(డీబీటీ) పరిధి లోకి వచ్చే పేదలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. 80 కోట్ల మందికిపైగా రేషన్ కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. పథకం ఐదో దశలో అదనంగా రూ.53,344.52 కోట్లమేర రాయితీ అవసరమని అంచనా. ఈ దశలో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి మొత్తం 1.63 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద ఇచ్చే రేషన్ సరుకులకు ఇవి అదనం. ‘ఓ–స్మార్ట్’కు రూ.2,177 కోట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన పలు పథకాల సమాహారమైన సముద్ర సేవలు, మోడలింగ్, అనువర్తన, వనరులు, సాంకేతికత (ఓ–స్మార్ట్) కార్యక్రమాన్ని 2021–26లో రూ.2,177 కోట్లతో కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ పథకం కింద ఏడు ఉప పథకాలున్నాయి. సముద్ర సాంకేతికత, సముద్ర మోడలింగ్, అడ్వైజరీ సర్వీసులు (ఓఎంఏఎస్), సముద్ర పరిశీలక నెట్వర్క్ (ఓఓఎస్), సముద్ర నిర్జీవ వనరులు, సముద్ర జీవ వనరులు, సముద్ర పర్యావరణం (ఎంఎల్‌ఆర్‌ఈ), కోస్తా పరిశోధన, నిర్వహణ, పరిశోధక నౌకల నిర్వహణ వంటివి ఉన్నాయి. ఈ ఉప పథకాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ)–చెన్నై, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీఓఐఎస్)–హైదరాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్సీపీవోఆర్)–గోవాతోపాటు పలు జాతీయ సంస్థలు అమలు చేస్తాయి. ఏసీఆర్‌ఓఎస్‌ఎస్ కొనసాగింపు 14వ ఆర్థిక సంఘం నుంచి తదుపరి 2021–2026 ఆర్థిక సంఘం వరకూ అట్మాస్పియర్ క్లైమేట్ రీసెర్చ్–మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్, సర్వీసెస్ (ఏసీఆర్‌ఓఎస్‌ఎస్) కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. దీనికి రూ.2,135 కోట్లు అవసరమని అంచనా వేసింది. విద్యార్థులకు రూ.3,054 కోట్ల స్టైపెండ్ కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్(నాట్స్)లో భాగంగా 2021–22 నుంచి 2025–26 వరకూ శిక్షణ పొందే అప్రెంటీస్లకు స్టైపెండ్ కింద రూ.3,054 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. విద్యుత్ పంపిణీ ప్రైవేట్‌కు.. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ(డీఎన్‌హెచ్), డయ్యూ డామన్(డీడీ)లో విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేయడం, అత్యధిక వేలంపాటదారుకు కొత్తగా ఏర్పాటైన కంపెనీ తాలూకూ ఈక్విటీ షేర్లు విక్రయించడంతోపాటు ఉద్యోగులు బాధ్యతలు నెరవేర్చడం కోసం ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ డీఎన్‌హెచ్, డీడీకి చెందిన 1.45 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడానికి తోడ్పడుతుందని కేబినెట్ ఆశిస్తోంది. -
చారిత్రక విజయం: మరి సంయుక్త కిసాన్ మోర్చా ఏమంది?
సాక్షి, హైదరాబాద్. వివాదాస్పద మూడు సాగు చట్టాలపై బీజేపీ సర్కార్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి. ఇది అన్న దాతల త్యాగాల ఫలితమని, చార్రితక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు గురునానక్ జయంతి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటనపై సంయుక్త కిసాన్ మోర్చా స్వాగతించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు రైతుల పోరాటంలో తీవ్రవాదులు, టెర్రరిస్టులు ప్రవేశించారనీ, దేశ ద్రోహులు, ఖలిస్తానీలు అంటూ రైతు ఆందోళనకారులపై విరుచుకుపడిన వారందరూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. జూన్ 2020లో ఆర్డినెన్స్‌లుగా తీసుకొచ్చిన మూడు రైతు-వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నల్లజాతీయుల చట్టాలను రద్దు చేయడంపై రైతు సంఘాలు సంతోషం వ్యక్తం చేశారు.అయితే పార్లమెంటులో ఈ చట్టాలు రద్దు అయేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు. పార్లమెంటరీ విధానాల ద్వారా ప్రకటన అమల్లోకి వచ్చే వరకు వేచి ఉంటామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. చట్టాల రద్దు నిర్ణయం అమలైతే దేశంలో దాదాపు ఒక సంవత్సరం పాటు సాగిన రైతుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయం అవుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి కారణంగానే లఖింపూర్ ఖేరీ హత్యలతోసహా ఈ పోరాటంలో దాదాపు 700 మంది రైతులు అమరులయ్యారని విమర్శించింది. మూడు నల్ల చట్టాల రద్దు కోసమే మాత్రమే కాకుండా, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులందరికీ లాభదాయక ధరల కోసం చట్టబద్ధమైన హామీ వచ్చేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపింది. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణతోపాటు రైతుల ఈ ముఖ్యమైన డిమాండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉందని వ్యాఖ్యానించింది. -
సరిహద్దుల్లో శాంతి కపోతాలు..!
న్యూఢిల్లీ: దాదాపు 15నెలల ఉద్రిక్తతల అనంతరం తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా వద్ద ఇండియా, చైనాలు తమతమ బలగాల ఉపసంహరణను పూర్తి చేశాయి. దీంతో ఈ ప్రాంతంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారేందుకు, శాంతి నెలకొనేందుకు వీలు కలగనుంది. ఈ ప్రాంతంలో బలగాల ఉపసంహరణ ఆగస్టు 4,5 తేదీల్లో పూర్తయిందని, అంతేకాకుండా ఇరుపక్కలా నిర్మించిన తాత్కాలిక కట్టడాలను, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడం జరిగిందని భారత ఆర్మీ శుక్రవారం ప్రకటించింది. బలగాల ఉపసంహరణ, కట్టడాల నిర్మూలనను ఇరుపక్షాలు పరస్పరం నిర్ధారించుకున్నాయని తెలిపింది. పాంగాంగ్ సరస్సుకు ఇరుపక్కలా బలగాలను, ఆయుధాలను ఇండియా, చైనా ఉపసంహరించుకున్న ఐదునెలల అనంతరం గోగ్రా ఏరియా(పెట్రోలింగ్ పాయింట్ 17ఏ– పీపీ 17ఏ) వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. ఇరు దేశాల మిలటరీ అధికారుల నడుమ జరిగిన 12వ దఫా చర్చల్లో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ఈ ఉపసంహరణ చేసినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు వెంట కొంత ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించుకోవాలని, ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ జరగకూడదని ఇరుదేశాల మిలటరీ నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో మరింత శాంతి నెలకొనేందుకు త్వరలో జరిగే మిలటరీ చర్చల్లో ప్రాధాన్యమివ్వాలని సైతం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏడాది పైగా ఉద్రిక్తతలు గతేడాది మేలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలతో ఉద్రికత్తలు ఆరంభమయ్యాయి. అనంతరం ఇరు పక్షాలు వేలాదిగా బలగాలను ఎల్ఏసీ ప్రాంతాలకు తరలించాయి. అనంతరం ఇండో చైనా విదేశాంగ మంత్రులు, సైనికాధికారుల మధ్య చర్చలతో వివాదం క్రమంగా కరిగిపోతూ వస్తోంది. తాజాగా గోగ్రా ఏరియాలో ప్రస్తుత బలగాలను ఉపసంహరించడంతో పాటు కొత్తగా బలగాలను మోహరించకూడదని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఆర్మీ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం ఇరుదేశాల సైనికులు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారని పేర్కొంది. దీంతో మరో సున్నితమైన ప్రాంతంలో దిగ్విజయంగా శాంతిస్థాపన జరిగిందని, ఇకపై ఇదే ధోరణితో ముందుకెళ్లాలని, ఇతర వివాదాస్పద అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరుదేశాల సైన్యం నిర్ణయించుకుందని తెలిపింది. నిజానికి గతేడాదిలోనే ఈ ప్రాంతాల్లో ఇరుపక్షాలు కొంతమేర బలగాల ఉపసంహరణ చేపట్టినా పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఉపసంహరణ పూర్తిస్థాయిలో జరగలేదు. కానీ తాజా నిర్ణయంతో ఇకపై ఎల్ఏసీ(లైన్ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)ను పూర్తిగా గౌరవించాలని ఇరుపక్షాలు భావిస్తున్నట్లు ప్రకటన తెలిపింది. ఇదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణకు, ఎల్ఏసీ వద్ద శాంతి నెలకొల్పేందుకు ఆర్మీ ధృఢనిశ్చయంతో ఉందని తెలిపింది. గోగ్రా ఏరియాలో శాంతి నెలకొనడంతో ఇకపై హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, డెమ్చాక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరగాల్సి ఉంది. ఇరు దేశాల బంధానికి ఈ ప్రాంతాల్లో వివాద పరిష్కారమే మార్గమని భారత్ చెబుతోంది. -
మెజారిటీ కోల్పోయిన ఓలి ప్రభుత్వం
ఖాట్మాండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి షాక్ తగిలింది. ఆయన ప్రభుత్వానికి మద్దతిస్తున్న సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) పార్టీ తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఓలి ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోయారు. తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు సీపీఎన్ నేత పుష్ఫ కమల్ దహల్ ప్రచండ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటు సెక్రటేరియట్‌కు సీపీఎన్ పార్టీ లేఖను పంపింది. ఓలి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని, అందుకే మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో 275 మంది సభ్యులున్న సభలో ఓలికి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొనేందుకు మరో 15 మంది సభ్యుల అవసరం ఉంటుంది. -
తూర్పు లద్దాఖ్ నుంచి వెనక్కి మళ్లుదాం
న్యూఢిల్లీ: పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి కావడంతో తూర్పు లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్‌పై భారత్, చైనా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాలు సంప్రదింపులు ప్రారంభించాయి. భారత్, చైనా మధ్య పదో దఫా కమాండర్ స్థాయి చర్చలు శనివారం ఎల్ఏసీ వద్ద మోల్డో బోర్డర్ పాయింట్లో జరిగాయి. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సంప్రదింపులు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల సైనిక అధికారులు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్ నుంచి బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. సైనిక బలగాలను వెనక్కి మళ్లించే ప్రక్రియ చాలా వేగంగా జరగాలని భారత్ నొక్కి చెప్పింది. చైనా కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
నీతి ఆయోగ్ సూచనతోనే ఆ నిర్ణయం: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సూచనతోనే దేశవ్యాప్తంగా కంపెనీల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ చేస్తున్నామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కంపెనీల పనితీరుపై ఎప్పటికప్పుడు కేంద్రం అంచనా వేస్తోందని పేర్కొన్నారు. ఏ కంపెనీ ప్రజలకు ఉపయోగపడుతుందో పరిశీలిస్తుందని.. అన్ని కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామన్నది కరెక్ట్ కాదని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటేజేషన్ ద్వారా ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగం ఉందన్నారు. (చదవండి: ఘోర అన్యాయం: కేంద్రానికి ఘాటు లేఖ) మెట్రో, వాటర్, విద్యా రంగానికి చాలా కేటాయింపులు చేశామని.. తాముచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. నిధుల కోసం గత ఐదు నెలలుగా ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడానని తెలిపారు. పోలవరం కోసం ఏపీ ఆర్థిక మంత్రితో మాట్లాడి, అగ్రిమెంట్ మేరకు నిధులు కూడా కేటాయించామని చెప్పారు. కేంద్ర నిర్ణయంతో ఏపీ, తెలంగాణకు అనేక ప్రాజెక్టులు కేటాయించామని తెలిపారు.(చదవండి: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా) ‘‘తెలంగాణలో 9172.90 వేలకోట్లకు పైగా నిధులు కేటాయించాం. ఆ రాష్ట్రానికి 400 కోట్లు ప్రతిఏటా ఆత్మనిర్భర భారత్ కింద వస్తాయి. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంది. భారత్ కరోనాను సమర్థంగా ఎదుర్కొంది. ఆపదలోనే అవకాశాలను వెతుక్కోవాలని ప్రధాని మోదీ అన్నారు. రెండు వ్యాక్సిన్లను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అనేక రంగాలకు ప్రధాని చేయూతనిచ్చారు. పేదలకు ఆహార భద్రత కల్పించాం. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం అందించాం. ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇబ్బందుల్లో ఉన్నా బడ్జెట్లో ఆరోగ్యం కోసం అదనపు కేటాయింపులు చేశాం. రైతులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేందుకు అగ్రిసెస్ వసూలు చేస్తున్నామని’ అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. -
దిగొస్తున్న బంగారం ధర
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా దిగివస్తోంది. కరోనా వ్యాక్సిన్ వార్తలు, ఈక్విటీ మార్కెట్ల ఆకర్షణ నేపథ్యంలో బంగారం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ వార్త రాసే సమయం రాత్రి 10.15 గంటలకు న్యూయార్క్ ఫ్యూచర్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గత శుక్రవారం (20వ తేదీ) ధరతో పోల్చిచూస్తే, 40 డాలర్లు పడిపోయి, 1,834 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,828 డాలర్లను కూడా చూసింది. అమెరికా తయరీ, సేవల రంగాల సూచీలు రెండు అంచనాలకు మించి ‘58’కి పెరగడం దీనికి తక్షణ నేపథ్యం. నైమెక్స్‌లో 52 వారాల గరిష్ట, కనిష్ట స్థాయిలు వరుసగా 2,089 డాలర్లు, 1,459 డాలర్లు. కాగా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్‌లోనూ పసిడి ధర ట్రేడవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో ధర 10 గ్రాములకు రూ.792 నష్టంతో రూ.49,420 వద్ద ట్రేడవుతోంది. అయితే భారత్‌లో ధర కదలిక డాలర్ మారకంలో రూపాయి విలువ కదలికలపైనా ఆధారపడి ఉంటుంది. రూపాయి భారీగా క్షీణిస్తే, అంతర్జాతీయంగా ధర తగ్గిన ప్రభావం దేశంలో కనబడదు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 74.11 వద్ద ముగిసింది. -
చైనాతో ఉద్రిక్తతలకు చెక్!
న్యూఢిల్లీ: భారత్–చైనాల సరిహద్దుల్లో 6 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన త్వరలోనే ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించుకునే క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు ఇప్పటి వరకు 8 దఫాలుగా చర్చలు జరిపారు. వారం క్రితం కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన 8వ విడత చర్చల్లో సరిహద్దుల్లో శాంతి స్థాపన సాధన దిశగా కీలక ముందడుగు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిపై త్వరలోనే జరిగే 9వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని నిర్ణీత కాల వ్యవధిలో మూడు విడతలుగా ఉపసంహరించుకునేందుకు స్థూలంగా ఒక అంగీకారం కుదిరింది. ఇది అమల్లోకి వస్తే వాస్తవ ఆధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏప్రిల్ నాటి పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం మొదటి దశలో ఒప్పందం కుదిరిన మూడు రోజుల్లోనే రోజుకు 30 శాతం చొప్పున బలగాలను రెండు దేశాలు ఉపసంహరించుకోవాలి. -
ఉపసంహరణపై సమీక్షలు అవసరం: ఆర్మీ
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లోని క్లిష్టమైన తూర్పు లద్దాఖ్ ప్రాంతం నుంచి ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉందని భారత్ పేర్కొంది. ‘బలగాల పూర్తి ఉపసంహరణకు రెండు పక్షాలు కట్టుబడి ఉన్నాయి. క్లిష్టమైన ఈ ప్రక్రియ అమలుపై ఎప్పటికప్పుడు పరిశీలన అవసరం. దౌత్య, సైనిక స్థాయిల్లో ఇవి క్రమం తప్పకుండా జరుగుతుండాలి’ అని ఆర్మీ ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు కార్ప్స్ కమాండర్ల నాలుగో దఫా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి దశ ఉపసంహరణ ప్రక్రియ అమలును సమీక్షించడంతోపాటు పూర్తిస్థాయి ఉపసంహరణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు చర్చించారని తెలిపారు. ‘అయితే, జూన్ 15వ తేదీ నాటి గల్వాన్ ఘటన నేపథ్యంలో పరస్పరం విశ్వాసం నెలకొనడానికి సమయం పడుతుంది. బలగాల సత్వర ఉపసంహరణ కూడా కష్టమే. పూర్తి స్థాయి ఉపసంహరణకు సైనిక స్థాయి చర్చలు మరికొన్ని జరగాల్సి ఉంది’ అని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అయిదో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు మరికొన్ని రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఈసారి పాంగాంగో సో ప్రాంతం నుంచి ఉపసంహరణలపైనే ప్రధానంగా దృష్టి ఉంటుందని భావిస్తున్నారు. ఘర్షణాత్మక పరిస్థితులను నివారించేందుకే తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వెంట యుద్ధ పరిస్థితులను నివారించేందుకే రెండు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ‘క్లిష్టమైన ఈ ప్రక్రియకు సంబంధించి ఆధారాలు లేని, అసత్య వార్తలను పట్టించుకోవద్దంది. ఎల్ఏసీ వెంట రెగ్యులర్ పోస్టుల్లో తిరిగి బలగాలను మోహరించాలని కూడా నిర్ణయించాయని తెలిపింది. ఇది పరస్పర ఆమోదంతో తీసుకుంటున్న చర్య అనీ, దీనిని తప్పుగా అర్థం చేసుకోరాదని పేర్కొంది. -
భారత్, చైనా శాంతి మంత్రం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పూర్తిస్థాయిలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్‌లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు మరోసారి శుక్రవారం ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిస్థాపన కోసం సరిహద్దుల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. ఎల్ఏసీ వెంబడి సైనికుల ఉపసంహరణ పురోగతిపై సమీక్షించారు. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్‌తో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితిపై రాజ్‌నాథ్ సమీక్ష తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అనంతర పరిస్థితులపై శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణలో మొదటి దశ పూర్తయినట్లేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ అమ్ముల పొదిలో మరిన్ని ‘అపాచీ’లు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి చేసినట్లు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం అపాచీ యుద్ధ హెలికాప్టర్లలోని చివరి ఐదింటిని ఇటీవల భారత వైమానిక దళానికి అందజేసినట్లు బోయింగ్ సంస్థ వెల్లడించింది. (చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్!) -
వెనక్కు వెళ్లిన చైనా బలగాలు
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి చైనా దళాలు బుధవారం నాటికి పూర్తిగా వైదొలగాయి. శిబిరాలను తొలగించాయి. సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరుదేశాలు బలగాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకుముందు, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సాధ్యమైనంత త్వరగా, దశలవారీగా బలగాల ఉపసంహరణ జరగాలని నిర్ణయించారు. దాంతో సోమవారం నుంచి గల్వాన్ లోయ, హాట్‌స్ప్రింగ్స్, గొగ్రా, పాంగాంగ్ సొలోని ఫింగర్ ఏరియాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 నుంచి ఇప్పటికే చైనా వెనక్కు వెళ్లింది. హాట్ స్ప్రింగ్ వద్ద ఉన్న పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి బుధవారం నాటికి చైనా బలగాలు పూర్తిగా వైదొలగాయని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఉపసంహరణ ఏ మేరకు జరిగిందనే విషయాన్ని భారత దళాలు త్వరలో ప్రత్యక్షంగా పరిశీలించి నిర్ధారించుకుంటాయని తెలిపాయి. మరోవైపు, ఉపసంహరణ ప్రక్రియ అమలును భారత్, చైనా సైన్యాధికారులు సంయుక్తంగా పరిశీలించి, నిర్ధారించే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. గొగ్రా(పెట్రోలింగ్ పాయింట్ 17ఏ) నుంచి చైనా దళాలు గురువారం నాటికి వెనక్కు వెళ్లే అవకాశం ఉందన్నాయి. సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో హాట్ స్ప్రింగ్స్, గొగ్రా ఉన్నాయి. జూన్ 30న ఇరుదేశాల కమాండర్ స్థాయి చర్చల్లో.. ఘర్షణలకు అవకాశమున్న ప్రదేశాల్లో కనీసం 3 కిమీల వరకు బఫర్ జోన్(నిస్సైనిక ప్రాంతం)ను ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరింది. -
క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌కు తగ్గిన ఉపసంహరణల ఒత్తిడి
న్యూఢిల్లీ: క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌కు ఎట్టకేలకు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిడి తగ్గింది. ఏప్రిల్ 27తో పోలిస్తే ఏప్రిల్ 30వ తేదీ నాటికి నికర పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం 81 శాతం తగ్గిపోయినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. యాంఫి వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 24న క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న మొత్తం రూ.2,949 కోట్లుగా ఉంటే, ఏప్రిల్ 27 నాటికి రూ.4,294 కోట్లకు పెరిగిపోయింది. డెట్ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఏప్రిల్ 27న రూ.50,000 కోట్లతో మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించిన విషయం గమనార్హం. దీనివల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏర్పడిందో ఏమో కానీ... ఏప్రిల్ 28న రూ.1,847 కోట్లు, ఏప్రిల్ 29న రూ.1,251 కోట్లు, ఏప్రిల్ 30న రూ.794 కోట్లకు నికర పెట్టుబడుల ఉపసంహరణ తగ్గిపోయింది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి ఒక విభాగం. రిస్క్ అధికంగా ఉండే డెట్ పేపర్లలో అవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే, తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీలు జారీ చేసే డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిల్లో డిఫాల్ట్ రిస్క్ అధికంగా ఉంటుంది. కనుకనే ఆయా కంపెనీలు అధిక రాబడులను ఆఫర్ చేస్తుంటాయి. -
ఈపీఎఫ్ఓ నుంచి 15 రోజుల్లో రూ. 3,601 కోట్ల ఉపసంహరణ
న్యూఢిల్లీ: కరోనా అడ్వాన్సులను వేగవంతంగా పూర్తిచేస్తున్నట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. దాదాపు 90 శాతం ముందస్తు చెల్లింపులను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరించినట్లు వివరించింది. కరోనా మహమ్మారి ప్రభావాన్ని అధిగమించడం కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీలో భాగంగా ఈపీఎఫ్ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు ప్రభుత్వం వీలుకల్పించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో రూ. 3,601 కోట్ల ఉపసంహరణ జరిగిందని వివరణ ఇచ్చింది. -
కరోనా : ఎన్పీఎస్ చందాదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ పెన్షన్ సిస్టం లేదా జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) తన చందాదారులకు ఊరట నిచ్చింది.కరోనా వైరస్ బారిన పడిన తమ చందారులు చికిత్స ఖర్చుల కోసం కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్డీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్-19 మహమ్మారిని అతి ప్రమాదకరమైన రుగ్మతగా గుర్తిస్తున్నామని ప్రకటించింది. ప్రాణాంతకమైన వ్యాధి సోకిన చందాదారులు ఇప్పుడు తమ ఎన్‌పిఎస్ ఖాతాల నుండి నిధులను పాక్షిక ఉపసంహరణకు అనుమతినిస్తున్నట్టు తెలిపింది. తమ పథకాలు సహజంగా సరళమైనవి కాబట్టి, నగుదును యాడ్ చేసుకోవడానికి గడువులు లేనందున, ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షన్ ఖాతాలకు నిధులను జోడించవచ్చని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతీం బంధ్యోపాధ్యాయ్ తెలిపారు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లల చికిత్స కోసం చందాదారులు ఎన్పీఎస్ నుంచి కొంతమొత్తం ఉపసంహరించుకోవచ్చని పీఎఫ్ఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి వైద్య ధృవీకరణ పత్రాన్ని అందించాలని స్పష్టం చేసింది. అలాగే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) చందాదారులకు ఈ నిబంధన వర్తించదని రెగ్యులేటింగ్ బాడీ స్పష్టం చేసింది ఎన్పీఎస్, ఏపీవై పథకాలను పీఎఫ్‌ఆర్‌డీఏనే నిర్వహిస్తోంది. మార్చి 31 నాటికి ఈ రెండు పథకాల్లో 3.46 కోట్ల మంది ఉన్నారు. కాగా భారతదేశంలో 6400 మందికి పైగా ప్రభావితం చేసిన కరోనా వైరస్ కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
ఓ మై గాడ్... వెంకన్న రక్షించాడు
సాక్షి, తిరుపతి: యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో ఇప్పటికే ఆర్బీఐ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే తాజాగా యస్ బ్యాంక్ పరిస్థితిపై ప్రమాద ఘంటికలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ముందస్తుగానే గుర్తించింది. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొన్ని నెలల కిందటే రూ.1300 కోట్ల డిపాజిట్లను ఉపసంహరణ చేశారు. గత టీడీపీ హయాంలో యస్ బ్యాంకు సహా నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు ఉన్న విషయం తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ కాగానే డిపాజిట్ల వ్యవహారంపై దృష్టి సారించారు. నాలుగు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకుని పరిశీలించారు. (యస్‌లో పరిస్థితులు బాలేవు) యస్ బ్యాంకు పరిస్థితులపై ప్రమాదకర ఘంటికలను టీటీడీ ముందుగానే గుర్తించి.. డిపాజిట్లను వెంటనే రిటర్న్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. డిపాజిట్లను ఉపసంహరించుకోవద్దని యస్ బ్యాంక్ టీటీడీపై ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఖాతరు చేయలేదు. అదే విధగంగా ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని సుబ్బారెడ్డి సూచనలు చేశారు. చివరకు యస్ బ్యాంకు నుంచి రూ.1300 కోట్ల డిపాజిట్లను టీటీడీ ఉపసంహరణ చేసుకుంది. -
అకౌంట్లతో పనిలేదు..
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ జూలై 5వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2019–20 వార్షిక బడ్జెట్లో ఒక లొసుగును సవరించారు. తన బడ్జెట్ ప్రతిపాదనకు ఒక కీలక సవరణను గురువారం తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే... ఒక సంవత్సరంలో ‘ఒక అకౌంట్’ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్‌డ్రాయెల్స్ జరిపితే 2 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్) విధించాలని జూలై 5 బడ్జెట్ ప్రతిపాదించింది. అయితే ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్ల నుంచి కోటి పైబడిన విత్‌డ్రాయెల్స్ చేస్తే 2 శాతం టీడీఎస్ ఉండదా’ అనే సంశయం పలు వర్గాల నుంచి వ్యక్తమయ్యింది. బడ్జెట్లో ఈ లొసుగును సవరిస్తూ ఆర్థిక మంత్రి 2019 ఫైనాన్స్ బిల్లుకు ఒక సవరణను తీసుకువచ్చారు. దీని ప్రకారం .. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. భారీ నగదు లావాదేవీల నిరోధం లక్ష్యంగా బడ్జెట్లో ఆర్థిక మంతి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 28 ఇతర సవరణలతోపాటు ఈ ప్రతిపాదనకూ లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మొత్తం పన్ను బకాయిల్లో ఈ టీడీఎస్ కూడా భర్తీ అయ్యే అవకాశాన్నీ తాజా బడ్జెట్ ప్రతిపాదన కల్పిస్తోంది. -
ఎన్నికల బరిలోనే ఉంటాం..
రైతులను బరిలో నుంచి తప్పించేందుకు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో పార్లమెంట్ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఉపసంహరణకు ససేమిరా అంటున్నారు. నేటి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉండగా, ఆ తర్వాత బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య తేలుతుంది. అభ్యర్థుల సంఖ్య 95 మించితే బ్యాలెట్ విధానం ద్వారానే పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. సాక్షి, నిజామాబాద్ : తమ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఉపసంహరణకు ససేమిరా అంటున్నారు. బుధవారం ఒక్కరు కూడా నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. రైతులను బరిలో నుంచి తప్పించేందుకు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నామినేషన్లు వేసిన పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు, కుల సంఘాలు, రైతు సంఘాలు బుధవారం సమావేశమయ్యారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. నేటి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య ఇదే స్థాయిలో ఉన్నపక్షంలో బ్యాలెట్ విధానం ద్వారా పోలింగ్ నిర్వహించడం తప్పనిసరి అవుతుంది. ఈ స్థానానికి ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 203 మంది అభ్యర్థుల నుంచి 245 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 14 మంది అభ్యర్థులను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం రామ్మోహన్ రావు బుధవారం ప్రకటించారు. తిరస్కరణకు గురైన 14 మంది అభ్యర్థుల నామినేషన్లు మినహాయిస్తే 189 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. ఉపసంహరణకు గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య తేలుతుంది. అభ్యర్థుల సంఖ్య 95కు మించితే బ్యాలెట్ విధానం ద్వారానే పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. నేడు స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు.. బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలిన వెంటనే ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన నాలుగు పార్టీలు.. పిరమిడ్, జనసేన, బహుజన్‌ముక్తి, సమాజ్‌వాది ఫార్మర్డ్ బ్లాక్‌ల నుంచి కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఏడుగురు అభ్యర్థులను మినహాయిస్తే., మిగిలిన 182 మంది స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. గురువారం సాయంత్రమే ఈ గుర్తుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు 194 గుర్తులను గుర్తించామని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. దీంతో నిజామాబాద్ స్థానానికి సరిపడా 182 గుర్తులు అందుబాటులో ఉన్నట్లయింది. -
37,700 మద్దతు కోల్పోతే డౌన్‌ట్రెండ్
ప్రపంచ మార్కెట్లను అనుసరిస్తూ భారత్ మార్కెట్‌సైతం కదంతొక్కుతున్న సమయంలోనే... వడ్డీ రేట్ల పెంపుదలను, బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి నిధుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అనూహ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చేసిన పాలసీ ప్రకటన ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. అలాగే అమెరికా వృద్ధి రేటు అంచనాల్ని కూడా ఫెడ్ తగ్గించింది. ఇప్పటికే యూరప్, చైనా, జపాన్ల వృద్ధి రేటు అంచనాల్లో కోతపడగా, అమెరికా కూడా ఈ బాటలోకి రావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ట్రెండ్ కొద్దిరోజులపాటు కొనసాగవచ్చన్న అంచనాల్ని తాజాగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... మార్చి 22తో ముగిసిన వారం చివరిరోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రెండో నిరోధం సమీపస్థాయి అయిన 38,565 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత హఠాత్తుగా అమ్మకాలు వెల్లువెత్తడంతో వారం మొత్తంమీద ఆర్జించిన లాభాల్లో చాలావరకూ కోల్పోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 141 పాయింట్ల స్వల్పలాభంతో 38,165 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ ప్రారంభమైతే సెన్సెక్స్‌కు 37,700 పాయింట్ల సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే డౌన్‌ట్రెండ్ వేగవంతమై 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే తొలుత 38,320 వద్దకు పెరగవచ్చు. అటుపైన 38,730 పాయింట్ల వరకూ పరుగు కొనసాగవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 10,345 గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,572 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్పలాభంతో 11,457 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రతికూల సంకేతాల కారణంగా ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీకి 10,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. వారంరోజుల క్రితం ఇదేస్థాయిని అధిగమించి, నిఫ్టీ మరో 200 పాయింట్లకుపైగా పెరిగినందున, ఈ వారం ఇదేస్థాయి కీలక మద్దతుగా పరిణమించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 11,275 వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225 వద్దకు తగ్గవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే తొలుత 11,505 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపై క్రమేపీ తిరిగి 11,570 స్థాయిని చేరవచ్చు. ఆపై క్రమేపీ 11,630 వరకూ పెరగవచ్చు. -
మా సుంకాలు తక్కువే...!
న్యూఢిల్లీ: భారత్ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగానే భారత్ సుంకాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. ‘అధిక టారిఫ్‌లు విధిస్తున్నామన్న ఆరోపణలను అంగీకరించబోము. దిగుమతి సుంకాలు డబ్ల్యూటీవో నిర్దేశిత శ్రేణిలోనే ఉన్నాయి. కొన్ని వర్ధమాన దేశాలు, సంపన్న ఎకానమీల స్థాయిలోనే ఉన్నాయి‘ అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ మంగళవారమిక్కడ విలేకరులకు చెప్పారు. అదే సమయంలో ఏవో కొన్ని ఉత్పత్తులపై మాత్రమే కొంత అధిక టారిఫ్‌లు ఉండొచ్చని, అయితే అన్ని దేశాల్లోనూ ఇలాంటివి సాధారణమేనని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హార్లే డేవిడ్సన్ బైక్స్ వంటి అమెరికన్ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న భారత్ .. ఒకరకంగా ’టారిఫ్‌ల రాజా’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనూప్ వాధ్వాన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీఎస్పీ ప్రయోజనాలు కొంతే.. వాణిజ్యంలో భారత్‌కి ఇస్తున్న ప్రాధాన్యతాపరమైన ప్రయోజనాలను ఉపసంహరించాలన్న అమెరికా ప్రతిపాదనతో ఎగుమతులపై పెద్దగా ప్రభావమేమీ ఉండబోదని అనూప్ వాధ్వాన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి సాధారణ ప్రాధాన్య వ్యవస్థ (జీఎస్పీ) కింద భారత్ గతేడాది 5.6 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు చేసినప్పటికీ, ప్రాధాన్యతా హోదాపరంగా ఒనగూరిన ప్రయోజనాలు సుమారు 190 మిలియన్ డాలర్లు మాత్రమేనని ఆయన∙చెప్పారు. అమెరికా కోరుతున్న మేరకు విస్తృతమైన వాణిజ్య ప్యాకేజీపై భారత్ కసరత్తు చేస్తున్నప్పటికీ.. ఆ దేశం జీఎస్పీని ఉపసంహరించాలని నిర్ణయించుకుందని అనూప్ చెప్పారు. ఈ ప్యాకేజీలో మెడికల్ డివైజ్‌లు, డెయిరీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైనవన్నీ ఉన్నాయన్నారు. అమెరికా డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న విషయాల్లో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని అనూప్ వాధ్వాన్ స్పష్టం చేశారు. ఆయా రంగాలకు ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి: ఎఫ్ఐఈవో జీఎస్పీ ప్రయోజనాలు ఒక్క శాతం నుంచి ఆరు శాతం శ్రేణిలోనే ఉంటున్నాయని, దీన్ని తొలగించినంత మాత్రాన ఎగుమతులపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడదని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) వ్యాఖ్యానించింది. అయితే, కొంత అధిక ప్రయోజనాలు పొందుతున్న రంగాలకు ఒకవేళ జీఎస్పీ తొలగించిన పక్షంలో ప్రభుత్వం కొంత మేర తోడ్పాటునివ్వాలని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. బిల్డింగ్ మెటీరియల్, టైల్స్, చేతి పనిముట్లు (స్పానర్లు, డ్రిల్లింగ్ పరికరాలు), ఇంజనీరింగ్ ఉత్పత్తులు, టర్బైన్స్, సైకిళ్లు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు జీఎస్పీపరమైన ప్రయోజనాలు ఉంటున్నాయి. మినహాయింపులు ఎత్తివేస్తే.. వాటి ధరలు పెంచాల్సి రావడం వల్ల దేశీ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి నెలకొంటుందని గుప్తా చెప్పారు. తగ్గుతున్న వాణిజ్య లోటు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2016–17లో 64.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2017–18లో 74.5 బి. డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా నుంచి చమురు, గ్యాస్, బొగ్గు తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచిన నేపథ్యంలో భారత్‌తో అగ్రరాజ్యం వాణిజ్య లోటు 2017, 2018లో గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘గతేడాది వాణిజ్య లోటు పరిమాణం దాదాపు 4 బి. డాలర్లు తగ్గింది. భారత్‌లో ఇంధనానికి, పౌర విమానాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇది మరింతగా తగ్గుతుంది. అమెజాన్, ఉబెర్, గూగుల్, ఫేస్బుక్ వంటి అమెరికన్ ఈ–కామర్స్, సర్వీసుల కంపెనీలు భారత మార్కెట్లో భారీగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయి‘ అని పేర్కొంది. ఇక, కొన్ని ఐటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించాలన్న అమెరికా డిమాండ్‌పై స్పందిస్తూ.. ప్రస్తుతం టారిఫ్‌లు ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నాయని, దిగుమతులను నిలిపివేసేంత భారీగా లేవని స్పష్టం చేసింది. జీఎస్పీ వివాదమిదీ.. జీఎస్పీ కింద వాణిజ్యానికి సంబంధించి అమెరికా ప్రాధాన్యమిస్తున్న వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. దీని కింద అమెరికా మార్కెట్లోకి ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు భారత్‌కు వీలు ఉంటోంది. సాధారణంగా 3,700 ఉత్పత్తులకు జీఎస్పీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ.. భారత్ 1,900 ఉత్పత్తులు (రసాయనాలు మొదలైనవి) మాత్రమే ఎగుమతి చేస్తోంది. అయితే, జీఎస్పీ హోదా ఇస్తున్నప్పటికీ.. ప్రతిగా భారత మార్కెట్లో తమకు సముచిత, సమానమైన అవకాశాలు లభించడం లేదంటూ అమెరికా భావిస్తోంది. దేశీయంగా స్టెంట్లు మొదలైన మెడికల్ డివైజ్‌ల రేట్లు భారీగా ఉండటంతో.. ధరలపై పరిమితులు విధించాలన్న భారత నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటివి దీనికి కారణం. డెయిరీ, మెడికల్ డివైజ్‌ల తయారీ సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో .. భారత్‌కి ఇస్తున్న జీఎస్పీ ప్రయోజనాలపై 2018 ఏప్రిల్‌లో అమెరికా పునఃసమీక్ష ప్రారంభించింది. ఆ తర్వాత సమీక్ష పరిధిలోకి ఐటీ ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటన్నింటినీ చేర్చింది. చివరికి భారత్‌కి ఇస్తున్న జీఎస్పీని ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది. భారత్‌తో పాటు టర్కీకి కూడా దీన్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకుంది. అమెరికన్ కాంగ్రెస్, భారత ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లో అమల్లోకి రావొచ్చని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం యూఎస్టీఆర్వో) వెల్లడించింది. -
ఐఎన్ఎఫ్ నుంచి వైదొలగిన అమెరికా
వాషింగ్టన్: రష్యాతో కుదుర్చుకున్న ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఐఎన్ఎఫ్ (ఇంటర్మీడియట్–రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్) ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి రష్యా క్షిపణులను తయారు చేసినందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. వైదొలిగే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమై ఆర్నెల్లు కొనసాగుతుందనీ, ఆలోపు రష్యా తాను తయారు చేసిన ఆయుధాలను నాశనం చేసి చర్చలకు రావాలని కోరారు. ‘30 ఏళ్లకుపైగా ఈ ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉంది. కానీ రష్యా ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పుడు మేం కూడా ఈ ఒప్పందం నుంచి బయటకొస్తాం’అని పాంపియో తెలిపారు. ఈ ఆరు నెలల్లోపు రష్యా తన ఆయుధాలను నాశనం చేసి ఒప్పందానికి కట్టుబడుతుందని తాము భావిస్తున్నామన్నారు. -
సిరియాలో ఐఎస్‌ను ఓడించాం: ట్రంప్
వాషింగ్టన్: సిరియా నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. సిరియాలో ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించామని అమెరికా ప్రకటించింది. ‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ట్వీట్ చేశారు. సిరియా నుంచి అమెరికా దళాలు వెనుతిరిగాయని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు. ఉగ్రవాదం వల్ల, లేదా వేరే ఏ ఇతర కారణం వల్ల కానీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలకు ప్రమాదం వాటిల్లే సందర్భాల్లో యూఎస్, దాని మిత్రదేశాల దళాలు తమ సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. ‘సిరియాలో విజయం సాధించాం. కానీ ఐఎస్‌పై పోరాటం ఇంకా ముగియలేదు’ అని యూఎస్ రక్షణ శాఖ ప్రతినిధి డానా డబ్ల్యూ వైట్ పేర్కొన్నారు. సిరియా నుంచి దళాల ఉపసంహరణను.. లక్ష్యం చేరకముందే తీసుకున్న అర్ధాంతర నిర్ణయంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ అభివర్ణించింది. -
సిరియాపై ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సిరియానుంచి సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్నట్టు అనూహ్యంగా ప్రకటించడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. సిరియాలోని అమెరికా సైనిక దళాలను పూర్తిగా విరమించుకుంటున్నామని వెల్లడించారు. ఐసిస్‌ను పూర్తిగా ఓడించామని ట్రంప్ పేర్కొన్నారు. సైనిక దళాలను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ట్రంప్ ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. సిరియాలో ఐసిస్ ఓడించాం. తన హయాంలో ఇన్నాళ్లు అక్కడ ఉండటానికి ఇదే ఏకైక కారణమని ట్వీట్ చేశారు. మరోవైపు ట్రంప్ ఆదేశాల మేరకు మిలిటర్ దళాలను సిరియానుంచి అతి త్వరగా వెనక్కి మళ్లేందుకు కృషి చేస్తున్నాయని అధికారికవర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశాన్ని పెంటగాన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఇటీవల (డిసెంబరు 6) అక్కడ(సిరియా) ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ ప్రకటించడం గమనార్హం. We have defeated ISIS in Syria, my only reason for being there during the Trump Presidency. — Donald J. Trump (@realDonaldTrump) December 19, 2018 -
స్తంభించిన రూ.20వేల కోట్ల లావాదేవీలు
న్యూఢిల్లీ : స్వల్ప వేతనాల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేడు రెండో రోజుకి చేరుకుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, వివిధ ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు ఈ దీక్ష చేపడుతున్నారు. ఈ రెండు రోజుల బ్యాంకింగ్ సమ్మెతో రూ. 20వేల కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు స్తంభించినట్టు తెలిసింది. తొలి రోజు వంద శాతం సమ్మె విజయవంతమైందని బ్యాంకింగ్ ఉద్యోగులు పేర్కొన్నారు. రెండో రోజు కూడా బ్యాంకు శాఖల్లో అన్ని బ్యాంకింగ్ సర్వీసులను రద్దు చేశామని యూఎఫ్‌బీయూ కన్వీనర్(మహారాష్ట్ర) దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు. తొలిరోజు ఏటీఎం సర్వీసులు కొన్ని గంటల పాటు మూత పడి, అనంతరం ప్రారంభమయ్యాయి. బ్యాంకు లాభాలు పడిపోవడానికి కారణం ఉద్యోగులు కాదని తుల్జపుర్కర్ అన్నారు. ప్రొవిజన్స్ ఎక్కువగా పెరగడంతో బ్యాంకులు ఎక్కువ నష్టాలు చవి చూస్తున్నాయన్నారు. 2012 నాటి వేతన సవరణలో 15% మేర పెంచి.. తాజాగా రెండు శాతమే ఇస్తామనడం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులను అవమానించడమేనని వారు అంటున్నారు. ఇటు నెలాఖరు, అటు వేతనాల సమయం కూడా కావడంతో ఈ సమ్మె విత్‌డ్రాయల్ లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పలు చోట్ల ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. -
ఆ ఖాతాలపై భారీగా చార్జీల బాదుడు
సాక్షి, ముంబై: నో ఫ్రిల్స్ (జీరో బ్యాలెన్స్) బ్యాంకు ఖాతాలనుంచి కూడా కొన్ని బ్యాంకులు భారీగా చార్జిలను బాదేస్తున్నాయని తాజా నివేదిక తేల్చింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) ఖాతాలనుంచి నిబంధనలకు విరుద్ధంగా చార్జీలను వసూలు చేస్తున్నాయని ఐఐటీ బోంబే ప్రొఫెసర్ ఆశిష్‌దాస్ నివేదించారు. నెలలో నాలుగు విత్ డ్రాలు మించితే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా సదరు ఖాతాదారులపై పెనాల్టీని భారీగా విధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం రూపకల్పనలో ఉన్న లోపాల కారణంగా బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి మరీ కస్టమర్లపై అధిక చార్జీలను విధిస్తున్నాయంటూ ఓ నివేదికను రూపొందించి ఆశిష్‌దాస్ విడుదల చేశారు. కస్టమర్ ఐదో డెబిట్ లావాదేవీ నిర్వహించిన వెంటనే బ్యాంకులు స్వచ్ఛందంగా ఆయా ఖాతాల్ని అధిక బ్యాలన్స్ నిర్వహణ, చార్జీలు ఉండే సాధారణ ఖాతాలుగా మార్చేస్తున్నాయని ఆశిష్‌దాస్ తన నివేదికలో పేర్కొన్నారు. ఇలా స్వచ్చందంగా ఖాతాల్ని మార్చడానికి ఆర్బీఐ చెక్ పెట్టాలని ఆయన కోరారు. ప్రస్తుతం నాలుగు ఉపసంహరణల తరువాత, వినియోగదారుడు ఆన్లైన్ కొనుగోళ్లను చేయలేక పోతున్నారన్నారు. భీమ్ యాప్‌ద్వారా లేదా రూపే డెబిట్ కార్డు ద్వారా డబ్బు బదిలీ లేదా రోజువారీ కొనుగోళ్లకు ఉపయోగించుకోలేకపోతున్నారని తెలిపారు. తక్కువ నగదు ఉన్న ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బీఎస్‌బీడీఏ ఖాతాలో నెలవారీ కనీస లావాదేవీలపై నియంత్రణలు తొలగించాలని కూడా సూచించారు. నాలుగో ఉపసంహరణ తర్వాత బీఎస్‌బీడీఏ కస్టమర్లు ఐదో ఆన్లైన్ లావాదేవీకి అవకాశం లేని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఇది డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహ కార్యక్రమానికి ప్రతికూలమని కూడా ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సేవలను అందరికీ దగ్గర చేయాలని తీసుకొచ్చిన పథకం బీఎస్‌బీడీఏ ఖాతా. వాస్తవానికి బీఎస్‌బీడీఏ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఖాతాదారులకు ఉపసంహరణలకు పరిమితి ఉంది కానీ, డిపాజిట్లపై పరిమితి లేదు. కానీ, ఈ ఖాతా నిర్వహణ విషయంలో కొన్ని పరిమితులను ఆయుధంగా మార్చుకున్న బ్యాంకులు ఖాతాదారులకు చెప్పకుండానే రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా నెలలో నాలుగు సార్లకు మించి ఉపసంహరణలు జరిగితే ఐదో ఉపసంహరణ జరిగిన తక్షణమే బ్యాంకులు ఆయా ఖాతాలను పొదుపు ఖాతాలుగా మార్చేసి, చార్జీల బాదుడుకు సిద్ధపడుతున్నాయి. అంటే సాధారణ సేవింగ్ ఖాతాల్లోలాగా హై మినిమం బ్యాలెన్స్, సర్వీస్ చార్జీలను వర్తింపచేస్తుందన్నమాట. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో 2012లో ఆర్బీఐ బీఎస్‌బీడీఏ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 54 కోట్ల బీఎస్‌బీడీఏ ఖాతాలు ఉండగా, వీటిలో సగానికిపైగా ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలే కావడం విశేషం. -
అడ్మిషన్ వద్దనుకుంటే ఫీజు వెనక్కివ్వాలి
న్యూఢిల్లీ: విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకున్నప్పుడు వారు కట్టిన ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉన్నత విద్యా కళాశాలలు తిరిగి వెనక్కు ఇవ్వాల్సిందేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. లేకపోతే కళాశాలల గుర్తింపు, అనుమతులను రద్దు చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లకు సూచనలు చేశామనీ, విద్యార్థులను వేధించే కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని అధికారి వెల్లడించారు. ఈ నిబంధనలు డీమ్డ్ వర్సిటీలుసహా ఏఐసీటీఈ, యూజీసీ నియంత్రణలో ఉండే అన్ని కళాశాలలకు వర్తిస్తాయన్నారు. -
‘ఎంఓపీ’పై సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ) ఖరారులో జరుగుతున్న ఆలస్యంపై ఇద్దరు జడ్జీల బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ఇలాంటి వాటిపై న్యాయ వ్యవస్థ నిర్ణయాలు తీసుకోకూడదని, జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) కేసులోనే రాజ్యంగ ధర్మాసనం ఇందుకు సంబంధించిన చట్టానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఎంఓపీ అంశాన్ని న్యాయ వ్యవస్థ తరఫు నుంచి పరిశీలిస్తామని జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 27న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జీపీఎఫ్ చందాదారులకు చల్లని కబురు
న్యూఢిల్లీ: జీపీఎఫ్ (సాధారణ భవిష్య నిధి) చందారులకు కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు అందించింది. జీపీఎఫ్ నుంచి అడ్వాన్స్ తీసుకోవాలన్నా, పూర్తిగా విత్‌డ్రా చేసుకోవాలన్నా ఎటువంటి పత్రాలనూ సాక్ష్యాలుగా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి జితేంత్ర సింగ్ బుధవారం లోక్‌సభలో చెప్పారు. దరఖాస్తుతోపాటు చందాదారు నుంచి డిక్లరేషన్ ఉంటే చాలన్నారు. 2017 మార్చి 7 నుంచి జీపీఎఫ్ నుంచి విద్య, అనారోగ్యం, ఏవైనా వస్తువులు కొనుక్కోవడం తదితర ఖర్చుల కోసం అడ్వాన్స్ తీసుకోవడం లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకోవడం కోసం పాటించాల్సిన విధానాలను ప్రభుత్వం సరళీకరించిందని మంత్రి చెప్పారు. జీపీఎఫ్ నుంచి అడ్వాన్స్, విత్‌డ్రా పూర్తిగా చేసుకుంటే నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరపాలన్న నిబంధన పెట్టినట్టు వెల్లడించారు. జీపీఎఫ్ వడ్డీ రేటును ఈపీఎఫ్‌తో సమానంగా పెంచే యోచనేదీ లేదని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. -
సంక్షేమ పథకాల ఉపసంహరణ తరువాతే యూబీఐ
అహ్మదాబాద్: ఆర్థిక సర్వే ప్రతిపాదించిన సార్వజనీన ప్రాథమిక ఆదాయ (యూనివర్శల్ బేసిక్ ఇన్‌కం-యూబీఐ) పథకం అమలు ప్రస్తుత సంక్షేమ పథకాల ఉపసంహరణ తరువాతే ఉంటుందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ప్రకటించారు. ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ ప్రాజెక్టుల విరమణ అనంతరం మాత్రమే యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం పథక ప్రతిపాదనను అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు. అహ్మదాబాద్ ఐఐఎం-ఏలో శనివారం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన సుబ్రమణ్యం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వే విశేషాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ యూబీఐ కార్యక్రమం అమలు చాలా ఖర్చుతో కూడుకున్నదనీ, ఇప్పటికే సంక్షేమ పథకాల కార్యక్రమాల ఖర్చును ప్రభుత్వం భరించలేని స్థితిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూబీఐ పథకాన్ని జోడించలేమని చెప్పారు. అలా చేస్తే ప్రభుత్వ ఆర్ధికపరిస్థితి పతనంవైపు వెళ్తుందని సుబ్రమణ్యం తెలిపారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు చేస్తున్న నిధులు ..లబ్దిదారులు చేరడం లేదన్నారు. అయితే భారతదేశంలో పేదల అభ్యున్నతికోసం నిర్దేశించిన యూబీఐ పథకం ఈ సమస్యల్ని అధిగమిస్తూ సరికొత్త పద్ధతుల్లో ప్రారంభిచనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథక ఫలాలు నేరుగా లబ్దిదారులకు చేరేలా చేయడంమే దీని ప్రత్యేకత అని చెప్పారు. గత (స్వతంత్రం వచ్చిన తర్వాత)30-40 సంవత్సరాల్లో చేయలేని పనికి తాము పూనుకున్నామన్నారు. పేదరిక నిర్మూలనలో ఇది భారీ చారిత్రక సవాలు అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు పేదల చేతికి (బ్యాంకు ఖాతాల) డబ్బు అందితే వారు విచ్చలవిడిగా ఖర్చుచేసే అవకాశం ఉందనీ, అదే డబ్బు స్త్రీల కిస్తే దుర్వినియోగయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అభిప్రయాపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు మందగించగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వృద్దిరేటు వేగంగా పుంజుకోవడం గమనించాలన్నారు. అయితే మన దేశంలో ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఆశ్చర్యకరంగా గత 15-20 సంవత్సరాలలో వెనుకబడిన రాష్ట్రాలకుగా పిలుస్తున్న రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం మందగిస్తోంటే.. అభివృద్ది చెందిన రాష్ట్రాలు శరవేంగా ముందుకు వెళుతున్నాయని చెప్పారు. దేశంలో రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానతలను భారీగా పెరుగుదుల ఇది సూచిక అన్నారు కాగా పేదలు తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకు అవసరమయ్యే కనీసస్థాయి నగదును ప్రభుత్వం అందించాలని ముఖ్య ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన ఆర్థిక సర్వే సూచించింది. ప్రస్తుత రాయితీల వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసి, వాటిస్థానంలో యూబీఐ ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. -
ఏటీఎంలో నకిలీ నోట్లు
-
ఏటీఎంలో నకిలీ నోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఏటీఎంలో నకిలీ రూ.2000 కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి. విత్‌డ్రా చేయగా రూ.2000 నోటు ముందువైపు పైభాగంలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ఉండాల్సిన చోట ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని రాసి ఉన్న నాలుగు నకిలీ నోట్లు వచ్చాయి. ఢిల్లీలోని సంగమ్ విహార్‌లోని ఎస్బీఐ ఏటీఎం నుంచి రోహిత్ కుమార్ అనే వ్యక్తి నగదు డ్రా చేయగా ఈ నోట్లు వచ్చాయి. ఈ నెల ఆరో తేదీన విత్‌డ్రా చేసినపుడు వచ్చిన ఈ నోట్లకు కుడివైపు నిలువుగా అధికారిక వాటర్మార్క్కు బదులు ‘చురన్ లేబుల్’ అని ముద్రించి ఉంది. ఆర్బీఐ స్టాంపు స్థానంలో పీకే అని ఉంది. రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా స్థానంలో భారతీయ మనోరంజన్ బ్యాంక్ అని రాసి ఉంది. దీంతో కంగారు పడిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సదరు ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేయగా అలాంటివే నకిలీ నోట్లు వచ్చాయి. దీంతో సంగం విహార్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎంలో డబ్బులు నింపిన చివరి వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితుడిని గుర్తించేందుకు ఏటీఎంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, తమ బ్యాంకు ఏటీఎంలలో నకిలీ నోట్లు వచ్చే ఆస్కారమే లేదని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. దర్యాప్తు కొనసాగుతోందని బ్యాంకు తెలిపింది. -
వారానికి రూ. 50,000 తీసుకోవొచ్చు
సేవింగ్స్ ఖాతాల విత్ డ్రాయల్ పరిమితి పెంపు ముంబై: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వీక్లీ క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితి సోమవారం నుంచి రూ.50,000కు పెరిగింది. అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఈ పరి మితి కూడా ఉండదు. కాగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితి ఇప్పటివరకూ రూ.24,000గా ఉంది. క్యాష్ విత్డ్రాయల్స్పై ఉన్న పరిమితులను రెండంచెల్లో ఎత్తివేస్తామని ఆర్బీఐ ఇదివరకే ప్రకటించింది. ఇందులో మొదటిది సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 8 నుంచి క్యాష్ విత్డ్రాయెల్స్పై పరిమితులు ఆర్బీఐ విధించింది. -
ఖాతాదారులకు మరో శుభవార్త..!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన నగదు ఇబ్బందులకు త్వరలోనే పూర్తిగా చెక్ పడనుందట. ఏటీఎంల విత్ డ్రాలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెల చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం ఉపసంహరణ పరిమితులను పూర్తిగా తొలగించనుందని బ్యాంకర్లు తెలిపారు. ఫిబ్రవరి మాసాంతానికి లేదా మార్చి మొదటి వారానికి నగదు విత్ డ్రా నిబంధనలను పూర్తిగా సడలించనుందని మహారాష్ట్ర బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ కే గుప్తా మీడియాకు తెలిపారు. ఇది పూర్తిగా ఆర్ బీఐ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నారు. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తరువాత కేంద్ర బ్యాంకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫిబ్రవరి నాటికి 78-88 శాతం నగదు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి చేరుతుందని ఎస్బీఐ పరిశోధన నివేదించింది. దీంతో రాబోయే రెండు నెలల్లో పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరనుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందే పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందని మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ చాలా వేగంగా పరిస్థితిని సమీక్షిస్తోందని.. నగదుకష్టాలు రెండు మూడు వారాల్లో తీరిపోతాయన్నారు. మరోవైపు ఆర్థికశాఖ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాత్రం దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. రద్దయిన నోట్లలో 60 శాతం వెనక్కి వచ్చిందనీ, రూ.9.2 లక్షల కోట్ల నగదు బ్యాంకులకు తిరిగి చేరిందని ప్రకటించినప్పటికీ, నగదు కష్టాల ఉపశమన పరిస్థితులపై ఎలాంటి సమయాన్ని సూచించకపోవడం గమనార్హం. కాగా నవంబరు 8న దేశవ్యాప్తంగా రూ.500,1000 పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. దీంతో నగదు కొరతతో ప్రజలు అష్ట కష్టాలుపడ్డారు. అనేక రోజుల పాటు బ్యాంకుల వద్ద, ఏటీఎం సెంటర్ల వద్ద జనం క్యూకట్టారు. ఈ నగదు కష్టాలను అధిగమించేందుకు ఆర్బీఐ విడతల వారీగా అనేక ఉపశమన చర్యలు చేపట్టింది. ఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్ పెంపును ప్రకటించింది. తాజాగా పొదుపు ఖాతాదారులకు రోజుకు రూ 10,000 లు, కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ను లక్ష. రూపాయలకు ఉపసంహరణ పరిమితిని పెంచింది. మరోవైపు పాత నోట్ల డిపాజిట్లకు గడువు 2016 డిసెంబర్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. -
కొందరి చేతికే ఎలా?
కొత్తనోట్లపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ► రూ.24వేల విత్‌డ్రాయల్‌పై నోటిఫికేషన్ కు కట్టుబడి ఉండాలని సూచన ► డీసీసీబీలపై రెండ్రోజుల్లో నిర్ణయమన్న అటార్నీ జనరల్ న్యూఢిల్లీ: పెద్ద నోట్లరద్దు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో కొత్తనోట్లు పట్టుబడటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు అందుబాటులో నోట్లు లేక ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలు కడుతుంటే.. దేశవ్యాప్తంగా సోదాలు, దాడుల్లో వందల కోట్ల విలువైన కొత్తనోట్లు బయటపడటంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘కొత్త కరెన్సీ కొందరికి మాత్రమే పెద్ద సంఖ్యలో దొరుకుతోంది. ఎలా కొందరు ఇంత పెద్దమొత్తాన్ని సంపాదిస్తున్నారు?’అని కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం సీజేఐ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. ‘కొందరు బ్యాంకు ఉద్యోగులు మోసపూరితంగా డబ్బులను బయటకు తరలించినట్లు తెలియటంతో వారిని అరెస్టు చేశారు. లెక్క తేలని ధనాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి’అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. కాగా, వారానికి రూ. 24వేల విత్‌డ్రాయల్ పరిమితికి కేంద్రం కట్టుబడి ఉండాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘పాతనోట్లను డిపాజిట్ చేస్తున్న వారికి మీరు డబ్బులివ్వాలి. కానీ అది జరగటం లేదు. మీ దగ్గర డబ్బులేదనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. ఎప్పటిలోగా ప్రజలు చేసుకున్న డిపాజిట్లకు సరైన మొత్తాన్ని చెల్లిస్తారో చెప్పండి. మీకూ కొన్ని నిబంధనలుండాలి కదా’అని ధర్మాసనం.. రోహత్గీని ప్రశ్నించింది. నోట్లరద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ పిటిషనర్ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్.. ‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు నోట్లరద్దు తర్వాత మూడు రోజుల పాటు రూ.8వేల కోట్లు సేకరించినా.. తర్వాత ఈ బ్యాంకుల ద్వారా డబ్బులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వలేద’ని వాదించారు. దీనికి రోహత్గీ స్పందిస్తూ.. ‘సహకార బ్యాంకుల ద్వారా కొత్త నోట్ల పంపిణీపై రెండ్రోజుల్లో తాజా నోటిఫికేషన్ ఇస్తాం’అని తెలిపారు. ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి రానందునే సహకార బ్యాంకులకు కొత్తనోట్ల పంపిణీ అవకాశం ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. కొత్త కరెన్సీలో రూ.5లక్షల కోట్ల వరకు చెలామణిలోకి వచ్చిందని.. దీంతోపాటు రూ. 2.5లక్షల కోట్ల కరెన్సీ రూ.100, రూ.50 నోట్ల రూపంలో మార్కెట్లో ఉందని కోర్టుకు విన్నవించారు. నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో వేస్తున్న పిటిషన్లను విచారించవద్దని రోహత్గీ కోరగా.. దీనిపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఆదేశాలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. గడ్డం క్రమశిక్షణకు అడ్డమే! వాయుసేన ఉద్యోగి పిటిషన్ పై సుప్రీం కీలక తీర్పు న్యూఢిల్లీ: వాయుసేనలో పనిచేసే వ్యక్తులు మత సంబంధ కారణాలతో క్రమశిక్షణను ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. వాయుసేన (ఐఏఎఫ్) ఉద్యోగి అన్సారీ పొడవైన గడ్డంతో విధులకు హాజరవుతుండటాన్ని తప్పుపడుతూ ఐఏఎఫ్ 2003లో అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై అన్సారీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిక్కులు తలపాగా ధరిస్తారని, వారిలాగే తనకూ మతపరమైన సమానత్వం కల్పించాలని కోరారు. సాయుధ దళాల నిబంధనలు క్రమశిక్షణను, ఏకరూపతను పాటించేలా చేయడానికి ఉద్దేశించినవంటూ ఐఏఎఫ్ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఆ ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది. -
ఆన్లైన్ కలవరం
ఏటీఎంలో విత్‌డ్రాపై అవగాహనలేని గిరిజనులు నగదు రహిత లావాదేవీలతో మరింత మోసపోయే అవకాశం చింతపల్లి: ఆదివాసీ గిరిజనుల్లో 80 శాతం మేర నిరక్షరాస్యులున్నారు. వీరు ఏటీఎంలనుంచి డబ్బులు తీసుకోవడంపై ఏమాత్రం అవగాహన లేదు. ఎంత సమయం పట్టినా క్యూలో నిలబడి డబ్బులు తీసుకుంటారే తప్ప ఏటీఎంలను వినియోగించరు. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలకు తెరలేపడంతో అమాయక గిరిజనుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. గిరిజనులు పండించిన సరుకులు సంతకు తీసుకు వెళ్లి విక్రయిస్తేనే వ్యాపారులు తూనికల్లో ఘోరంగా మోసం చేస్తున్నారు.కార్డులు పట్టుకుని సరుకులు కొనుక్కోవాలంటే మరింత మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. డబ్బులు పట్టుకుని సరకులకోసం దుకాణాల వద్దకు వెళితే రూ.100 ఖరీదు గల సరుకులు ఇచ్చి అదనంగా ఎంతో కొంత మోసం చేస్తున్నారు. ఇప్పుడు కార్డులు ఇచ్చి సరుకులు కొంటే కార్డు నుంచి సదరు వ్యాపారి ఎంత సొమ్ము అతని ఖాతాలోకి జమ చేసుకుంటున్నాడో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గిరిజనులు మరింత మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. మైదానానికి చెందిన గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మందికి ఏటీఎంల్లో డబ్బులు తీసుకోవడం తెలియదు. చాలా సందర్భాల్లో పక్కనున్న వారిని బతిమాలి నగదు తీసుకుంటారు. కార్డులకు సంబంధించిన పిన్ నంబర్లు పరాయి వాళ్లకు తెలిస్తే ఖాతాల్లో ఖాళీ అవుతున్న ఈ రోజుల్లో నగదు రహిత లావాదేవీల కోసం ఆదివాసీలు ఇతరులను ఆశ్రయించినా ప్రమాదమే. మొత్తం మీద నగదు రహిత లావాదేవీలు అమాయక గిరిజనులకు శాపంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆందోళన కలిగిస్తుంది సంతకు వెళ్లి డబ్బులు ఇచ్చి సరుకులు కొంటేనే మోసం చేస్తున్నారు. అక్షరంముక్క రాని మాలాంటి వాళ్లం కార్డులతో ఎలా కొనుగోలు చేయగలం. నగదు రహిత లావాదేవీలు వల్ల ఇబ్బందులు తప్పవు. - కొర్రా సింగారి, బెన్నవరం, చింతపల్లి మండలం ఏటీఎంలు వాడటం లేదు చదువుకోక పోవడం వల్ల ఏటీఎం కార్డు తీసుకోలేదు.బ్యాంకులో ఎంత సమయం పట్టినా వరుసలో నిలబడి డబ్బులు తీసుకుంటాను. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి కార్డులు ఉపయోగించాలంటే ఇబ్బందులు తప్పవు. - గెమ్మెలి రాజారావు, పీకే గూడెం, జీకేవీధి మండలం -
నల్లకుబేరులకు ఆర్బీఐ మరో షాక్..!
-
ఆర్బీఐ మరో షాక్..!
ముంబై: నల్లకుబేరులకు రిజర్వ్ బ్యాంక్ మరో్ షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆపరేషన్ బ్లాక్ మనీ పథకంలో భాగంగా అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. "నగదు ఉపసంహరణ'' లపై సరికొత్త పరిమితిలను విధించింది. ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన ఖాతాలనుంచి నగదు విత్ డ్రాకు పరిమితిని విధించింది. బినామీ ఆస్తి లావాదేవీ, డబ్బు లావాదేవీల నుంచి అమాయక రైతులు, గ్రామీణ ఖాతాదారుల రక్షించడానికి వీలుగా విత్ డ్రా లిమిట్ ను పదివేలకు కుదిస్తున్నట్టు వెల్లడించింది. కేవైసి ఖాతాదారులకు నెలలో పదివేలు, నాన్ కేవైసి ఖాతాదారులకు నెలలో అయిదువేలు విత్ డ్రాకు అనుమతినిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులు, ఇతర ఖాతాదారులకు అక్రమ లావాదేవీలనుంచి రక్షణ కల్పించేందుకుగాను ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే 10వేలకు పైన విత్ డ్రాకు సరియైన ఆధారాలు, పత్రాలు చూపించిన తరువాత బ్యాంక్ మేనేజర్ అనుమతితో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. -
పీఎఫ్ విత్ డ్రాయల్ కొత్త నిబంధనలు
30 దాకా నిలుపుదల న్యూఢిల్లీ: పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై పరిమితులు విధిస్తూ రూపొందించిన కొత్త నిబంధనలను ఏప్రిల్ 30 దాకా నిలుపుదల చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. రెండు నెలలకు పైగా ఉద్యోగం లేని చందాదారులు పూర్తి సెటిల్మెంట్ కోరుతూ ఈ నెలాఖరు దాకా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త నిబంధనల అమల్లో ఆటంకాల కారణంగా ఇవి మే 1 నుంచి అమల్లోకి రాగలవని ఈపీఎఫ్‌వో తెలిపింది. దీంతో ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ జారీ కావడానికి ముందున్న తరహాలోనే ఈ నెలాఖరు దాకా సెటిల్మెంట్ జరుగుతుందని పేర్కొంది. రిటైరయ్యే ఉద్యోగులు ప్రావిడెంటు ఫండు ఉపసంహరణ కోసం క్లెయిములు దాఖలు చేసుకునేందుకు వయోపరిమితిని 54 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు పెంచడంతో పాటు ఈపీఎఫ్ స్కీమ్ 1952కి ఈపీఎఫ్‌వో పలు సవరణలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు క్లెయిమెంటు రెండు నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే ప్రావిడెంట్ ఫండులో అప్పటిదాకా తన వంతుగా జమయిన అసలును, దానిపై వడ్డీని మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. కంపెనీ జమ చేసే మొత్తాన్ని మెచ్యూరిటీ తర్వాతే తీసుకోవడానికి సాధ్యపడుతుంది. వివాహం, శిశు జననం తదితర కారణాలతో రాజీనామా చేసిన మహిళలకు 2 నెలల తప్పనిసరి నిరుద్యోగ నిబంధన వర్తించదు. -
‘ఈపీఎఫ్’ ఉపసంహరణపై పన్నులేదు
► వెనక్కి తగ్గిన కేంద్రం ► ఉద్యోగులు, కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం ►పాత నిబంధనలే కొనసాగుతాయని లోక్‌సభలో ప్రకటించిన జైట్లీ ► బడ్జెట్ ప్రతిపాదనల్లోని 138, 139 పేరాలను తొలగిస్తున్నట్లు ప్రకటన ►ఎన్పీఎస్పై ప్రతిపాదనలు మాత్రం కొనసాగిస్తామని వెల్లడి న్యూఢిల్లీ: ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్- ఉద్యోగుల భవిష్యనిధి)’పై బడ్జెట్లో చేసిన పన్ను ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను ఉండదని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ చందాదారులు ఉపసంహరించుకునే సొమ్ములో మొత్తంలో 40 శాతం సొమ్ముపై పన్ను మినహాయింపు ఉంటుందని, మిగతా 60 శాతం సొమ్ముపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే నిపుణులతో చర్చించిన తర్వాత ఈపీఎఫ్ ఉపసంహరణ పన్ను ప్రతిపాదనను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. అయితే ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) నుంచి ఉపసంహరించుకునే సొమ్ములో 40 శాతంపై ఇచ్చిన పన్ను మినహాయింపు రాయితీ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యాజమాన్యాల తరఫున భవిష్యనిధికి జమయ్యే మొత్తంపై పన్ను మినహాయింపుపై విధించిన రూ.1.5 లక్షల పరిమితి ప్రతిపాదనను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘పన్ను’పై తీవ్రస్థాయిలో విమర్శలు ఇతర యాన్యుటీ పథకాల్లాగానే ఈపీఎఫ్‌పై కూడా పన్ను విధిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం... ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంపై కాకుండా దానికి సంబంధించిన వడ్డీపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు వేతనం రూ.15,000 దాటిన వారికి మాత్రమే ఈ ప్రతిపాదనలు వర్తిస్తాయని... 3.7 కోట్ల మంది చందాదారుల్లో పన్ను పరిధిలోకి వచ్చేది కేవలం 70 లక్షల మంది మాత్రమేనని పేర్కొంది. అయితే ఈ వివరణలు ఉద్యోగుల్లో గందరగోళాన్ని, భయాన్ని మరింత పెంచాయి. మరోవైపు ఈ పన్ను వల్ల భవిష్యత్తు అవసరాల కోసం ఈపీఎఫ్‌లో జమ చేసే మొత్తం తగ్గడమే కాకుండా ఈపీఎఫ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు హెచ్చరించారు. దీంతో అన్ని పక్షాలతో సమావేశమైన ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని 138, 139 పేరాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ పేరాల్లో ఎన్పీఎస్ 40 శాతం విత్‌డ్రాయిల్స్‌పై ప్రవేశపెట్టిన పన్ను మినహాయింపులు మాత్రం కొనసాగుతాయని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పించే విధంగా యాన్యుటీ పథకాల్లో పెట్టుబడిని ప్రోత్సహించడానికే ఈపీఎఫ్ ఉపసంహరణపై ప్రతిపాదనలు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఆదాయం సమకూరదని జైట్లీ పేర్కొన్నారు. ఈ పన్ను వల్ల ప్రైవేటు ఉద్యోగులు ఈపీఎఫ్‌లో దాచుకున్న మొత్తాన్ని మధ్యలో తీసేసుకోకుండా ఉంటారని... రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందేందుకు దోహదపడుతుందని చెప్పారు. కానీ ఈ నిర్ణయం వల్ల ఉద్యోగస్తులు ఎందులో పెట్టుబడి పెట్టాలన్న దానిపై స్వేచ్ఛ కోల్పోతారన్న అభిప్రాయంతో ఏకీభవించారు. ఉద్యోగులు, కార్మికుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పన్ను ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంటే ఈపీఎఫ్ నుంచి ఉపసంహరించుకునే మొత్తంపైగానీ, వడ్డీపై గానీ ఇక ఎటువంటి పన్ను ఉండదు. ఈపీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి పాత నిబంధనలే కొనసాగుతాయి. -
ఈపీఎఫ్ పన్ను ఉపసంహరణ
మధ్య తరగతికి ఊరటనిచ్చే చర్య న్యూఢిల్లీ: ఈపీఎఫ్ పన్ను విధింపుపై చెలరేగిన ఆందోళనలు సమంజసమైనవని భావించడంతో పన్ను విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఉద్యోగులకు మరింతగా ప్రయోజనం కల్పించడానికే ఈ పన్ను ప్రతిపాదన తెచ్చామని, అంతేకాని పన్ను ఆదాయం పెంచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. పెన్షన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికే ఈ ప్రతిపాదన ఉద్దేశమని పేర్కొన్నారు. ఫిక్కి ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు. వివాదస్పదమైన ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం సరైన చర్య అని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. సంప్రదింపుల ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనివల్ల అందరికీ అర్థమైందని కేపీఎంజీ ఇండియా హెడ్(ట్యాక్స్) గిరీష్ వన్వరి చెప్పారు. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం మధ్యతరగతికి ఊరటనిచ్చే చర్య అని నంగియా అండ్ కో ఈడీ నేహ మల్హోత్ర చెప్పారు. తమ రిటైర్మెంట్ పొదుపులను తమకు ఇష్టం వచ్చిన రీతిలో వినియోగించుకునే స్వేచ్ఛ వారికి లభించిందని వివరించారు. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం పట్ల ఆన్లైన్ పిటీషన్ ప్లాట్‌ఫారమ్ ఛేంజ్డాట్ఓఆర్జీ హర్షం వ్యక్తం చేసింది. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటీషన్‌పై సంతకాలు చేసిన రెండున్నర లక్షలమందికి ఇది అతిపెద్ద విజయమని పేర్కొంది. గుర్గావ్కు చెందిన ఆర్థిక రంగ నిపుణులు, వైభవ్ అగర్వాల్ ఈ ఆన్లైన్ పిటీషన్‌ను ప్రారంభించారు. -
ఉత్కంఠ భరితం
♦ అభ్యర్థులకు టీఆర్ఎస్ బుజ్జగింపులు ♦ గడువు ముగిశాక విత్‌డ్రా అంటూ ఆరోపణలు ♦ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులు ♦ కమిషనర్‌తో వాగ్వాదం.. ఈసీకి ఫిర్యాదు ఖమ్మం : నామినేషన్ల ఉపసంహరణల ఘట్టం ఆద్యంతం ఉత్కంఠభరితంగా మారింది. ఖమ్మం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకు 576 నామినేషన్లు ఆమోదం పొందగా.. బరిలో నిలిచిన అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పలేదు. వారిని ఉపసంహరింపజేసేందుకు ఆయా పార్టీల నాయకులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. పలు నామినేషన్లు గడువులోగా ఉపసంహరించగా.. మరికొన్ని నామినేషన్లు గడువు ముగిసినా ఉపసంహరించేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదు. దీంతో టీఆర్ఎస్ నాయకులు హైరానా పడాల్సి వచ్చింది. ఉపసంహరణ సమయం గడిచిపోయిందని కార్పొరేషన్ గేట్లను అధికారులు మూసివేశారు. ఈలోగా ఉపసంహరణకు అంగీకరించిన అభ్యర్థి సతీష్ కార్యాలయం లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీనిని గమనించిన కార్యాలయం లోపల ఉన్న సైదారావు అనే కార్యకర్త సతీష్ వద్దకు వచ్చాడు. గేటు ఇవతల ఉన్న సతీష్ వద్ద నుంచి నామినేషన్ ఉపసంహరణ పత్రాన్ని తీసుకుని సైదారావు.. తానే సతీష్ అంటూ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ తంతు జరిగిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుతోపాటు పలువురు కార్యకర్తలు కార్పొరేషన్ గేటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే కార్యాలయం గేట్లు వేయడంతో వాటిని నెట్టేందుకు నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గేటు ఎక్కి.. కార్యాలయంలోకి దూకి వెళ్లారు. పరిస్థితి విషమిస్తుందని గమనించిన పోలీసులు గేటు తాళం తీశారు. వెంటనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ డౌన్ డౌన్.. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న నాయకులు, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి కమిషనర్ చాంబర్‌కు వెళ్లి నిబంధనలు ఉల్లంఘించారని ప్రశ్నించారు. 49వ డివిజన్లో ఉపసంహరణ విషయంపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి కార్యాలయంలో ఎందుకున్నారని ప్రశ్నించారు. దీనికి కమిషనర్ సమాధానమిస్తూ.. రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక హోదా కల్పించామని, గడువు ముగిసిన తర్వాత ఎవరినీ అనుమతించలేదని చెప్పారు. ఏ విషయమైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడమే నా పని అని సమాధానమిచ్చారు. కమిషనర్‌గా ఉండి.. విషయం తెలియదని చెప్పడం సరికాదని కాంగ్రెస్ నాయకులు పట్టుపట్టారు. దీంతో జరిగిన విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. విచారణ జరిపిస్తామని కమిషనర్ చెప్పారు. అనంతరం కార్పొరేషన్ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా ఉపసంహరణ పత్రాలు తీసుకుంటున్నారని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం పేరుతో వినతిపత్రం అందజేసి.. కమిషనర్ చాంబర్ నుంచి బయటకొచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా అభ్యర్థుల ఉపసంహరణ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారికి బుద్ధి చెబుతారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. -
ఆగస్టు నుంచి ఆన్లైన్లో పీఎఫ్ ఉపసంహరణ!
న్యూఢిల్లీ: ఖాతాదారులు ఆన్లైన్లోనే పీఎఫ్ ఉపసంహరించుకునే వెసులుబాటును ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆగస్టు నుంచి ప్రవేశపెట్టనుంది. ఖాతాదారులకు పేపర్ వర్క్ లేకుండా సౌకర్యవంతంగా సేవలందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో అధికారి ఒకరు తెలిపారు. ఈ కొత్త సౌకర్యంతో కొన్ని గంటల్లోనే పీఎఫ్ సొమ్ము ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లలో చేరిపోతుందన్నారు. ఆన్లైన్ క్లెయిమ్స్‌కు ఖాతాదారులు యూనివర్సల్ అకౌంట్ నంబర్లు యాక్టివేట్ చేసుకోవాలని, బ్యాంకు ఖాతా తదితరాలతో కేవైసీ సమర్పించాలన్నారు. సికింద్రాబాద్, గుర్గావ్, ద్వారకా (ఢిల్లీ)లలో సెంట్రల్ డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
మిగిలేదెవరో?
►నేటితో నామినేషన్ల ఉపసంహరణకు తెర ►మధ్యాహ్నం 3 గంటలతో ముగియనున్న గడువు ► ఆలోగా బీ ఫారాలిచ్చిన వారే పార్టీల అభ్యర్థులు ► మిగతా వారు ఇండిపెండెంట్లుగా పరిగణన సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ పర్వానికి గురువారం తెరపడనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప సంహరణలకు గడువు ఉంది. మొత్తం 4,039 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. బరిలో మిగిలే అభ్యర్థులెవరనేది గురువారం తేలనుంది. వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. రెబల్స్ భయం... ఇతర పార్టీల్లోకి దూకవచ్చుననే సందేహం...ప్రలోభాలకు గురవుతారేమోననే అనుమానంతో అధిక శాతం అభ్యర్థులకు బుధవారం రాత్రి వరకు బి-ఫారాలివ్వలేదు. పార్టీల తరఫున బీ ఫారాల దాఖలుకు మరికొన్ని గంటల సమయమే మిగిలింది. అన్ని పార్టీలూ మధ్యాహ్నం ఒంటిగంట తర్వా తే బీ ఫారాలిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాతనే పార్టీల అసలు అభ్యర్థులెవరో తేలుతుంది. మిగి లిన వారిని ఇండిపెండెంట్లుగా పరిగ ణించనున్నట్టు సంబంధిత అధి కారులు తెలిపారు. మరి ఎందరు రెబల్స్ బరిలో ఉంటారో వేచి చూడాలి. విశ్వ ప్రయత్నాలు ఇప్పటికే కొన్ని పార్టీలు సామ,దాన, భేద దండోపాయాలతో రెబల్స్‌ను దారిలోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరికొన్ని పార్టీలు ఏమీ చేయలేక చేతులెత్తేశాయి. అధిక శాతం ఉపసంహరణలు గురువారమే ఉంటాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన ఎన్నికల సంఘం బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దీనికి అనుమతించింది. సమాచారం సకాలంలో అందకపోవడంతో ఎక్కువమంది ఉపసంహరించుకోలేకపోయారు. కేవలం 71 మంది మాత్రమే ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం ఉపసంహరణలు 94కు చేరాయి. బుధవారం వరకు నామినేషన్లు సక్రమంగా ఉండి... బరిలో మిగిలిన వారు 2,543 మంది. గడువు ముగిసేలోగా ఈ సంఖ్య దాదాపు సగానికి తగ్గవచ్చని అంచనా. బుధవారం వరకు రంగంలో ఉన్న వారిలో అత్యధికంగా లింగోజిగూడ, బేగంబజార్ వార్డుల్లో 39 మంది వంతున ఉన్నారు. 30 మందికన్నా ఎక్కువ అభ్యర్థులు ఉన్న వార్డుల్లో సూరారం (37), ఆల్విన్ కాలనీ (33), బాలానగర్(33), ఈస్ట్ఆనంద్బాగ్(32), రామ్‌నగర్(31) ఉన్నాయి. బుధవారం రాత్రి అధికారిక సమాచారం మేరకు.. మొత్తం నామినేషన్లు : 4,039 సక్రమంగా ఉన్నవి : 2,637 ఉపసంహరణలు : 94 రంగంలో ఉన్నవారు : 2,543 -
నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ
-
మిశ్రాపై కేసు ఉపసంహరణ
బెంగళూరు: భారత క్రికెటర్ అమిత్ మిశ్రా తనపై దాడి చేశాడంటూ ఫిర్యాదు చేసిన మహిళ ఆ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. గత నెలలో బెంగళూరులోని ఓ హోటల్లో మిశ్రా తనపై దాడి చేశాడని మూడు రోజుల క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చి దీనిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ‘మేమిద్దరం స్నేహితులం. గొడవ పడ్డాం. తిరిగి కలిసిపోతాం. తనని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. అందుకే కేసును ఉపసంహరించుకుంటున్నాను. ఇందులో ఎవరి ఒత్తిడి, బలవంతం లేదు’ అని ఆమె తెలిపింది. -
శ్రుతిహాసన్‌పై మరో పిటిషన్ ఉపసంహరణ
హైదరాబాద్: ఒప్పందం బేఖాతర్ చేశారంటూ సినీనటి శ్రుతిహాసన్‌పై దాఖలు చేసిన మరో పిటిషన్‌ను పిక్చర్ హౌస్ మీడియా ఉపసంహరించుకుంది. పిక్చర్ హౌస్ తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు 25వ అదనపు ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం అనుమతించారు. అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.10 లక్షలను కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని కోరుతూ పిక్చర్ హౌస్ గతంలో కోర్టును ఆశ్రయించింది. అయితే అడ్వాన్స్ ఇవ్వలేదని శ్రుతిహాసన్ తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి నివేదించారు. -
ప్రెగ్నెన్సీలో ‘పైకా’తో జాగ్రత్త!
ఆహారంగా పరిగణించని పదార్థాలను తినే రుగ్మతను పైకా అంటారు. సాధారణంగా పిల్లల్లో ఏదో ఒక దశలో కనిపించే ఈ విపరీత ప్రవర్తన పెద్దలలో తక్కువే. అయితే గర్భవతుల్లో మాత్రం కాస్త తరచుగా కనిపిస్తుంటుంది. ఈ రుగ్మత ఉన్నవాళ్లు మట్టి, బియ్యంలో మట్టి గడ్డలు, ఇసుక, పిండి, పెన్సిల్-ఎరేజర్ ముక్కలు, పేపర్, బొగ్గు, చాక్‌పీసులు, కాల్చేసిన అగ్గిపుల్లలు.. ఇలా అనేక రకాల వస్తువులు తింటుంటారు. ఇలా ఎందుకు చేస్తారనడానికి కారణాలు నిర్దిష్టంగా చెప్పలేం. అయితే కొన్ని పరిశీలనలు, అధ్యయనాల ప్రకారం... ఐరన్, క్యాల్షియం, జింక్, థయామిన్, విటమిన్-సి, విటమిన్-డి లోపాలు ఉన్న ప్పుడు, కొన్ని ఖనిజ లవణాల లోపాలు ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుందని తెలుస్తోంది. సమస్యలు: ఈ రుగ్మత వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, పొట్టలో పురుగులు రావడం (ఇన్ఫెస్టేషన్స్) వంటివి జరగొచ్చు. వెంట్రుకలు, ప్లాస్టిక్ వస్తువులు తినేవారిలో అవి పేగుల్లో ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కొన్ని సందర్భాల్లో లెడ్ లాంటి విష పూరితమైన పదార్థాలు కడుపులోకి చేరవచ్చు. చికిత్స : ఇలాంటి రుగ్మత ఉన్నవారికి మొదట రక్తహీనత (అనీమియా) ఉందా అని పరీక్షించాలి. అలాగే పొట్టలో పురుగులు పోయేలా డీ-వార్మింగ్ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు ఐరన్, ఇతర విటమిన్లు ఉండే పోషకాహారపు సప్లి మెంట్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. కొందరిలో అరుదుగా మానసిక చికిత్స కూడా అవసరం కావొచ్చు. -
ఆ బిల్లు వెనక్కు
కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల బిల్లు ఉపసంహరణకు ప్రభుత్వం మొగ్గు బెంగళూరు: విపక్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ధార్మిక సంస్థల నుంచి పూర్తీ వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇటీవల శీతాకాల శాసనసభ సమావేశాల్లో అనుమతి పొందిన కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల (సవరణ) బిల్లు అమలు కాకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రి మండలిలో ‘బిల్లు’ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో అందరు మంత్రులతో పాటు సీఎం సిద్ధరామయ్య కూడా ‘బిల్లు’ను అమల్లోకి తీసుకువస్తే ఎదుర్కొవాల్సిన పరిణామాలను న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్రకు వివరించారు. సుప్రీం కోర్టు సూచనలమేరకే నూతన బిల్లును రూపొందించాల్సి వచ్చిందని టీ.బీ జయచంద్ర ఇచ్చిన వివరణతో ఎవరూ సంతృప్తి చెందలేదు. అంతేకాకుండా రాష్ట్రంలోని ధార్మిక సంస్థలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రస్తుతం ఉన్న బిల్లు కాకుండా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీంతో అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి ఆ మేరకు ఏర్పాట్లు చూస్తానని టీ.బీ జయచంద్ర పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై టీ.బీ జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ... బిల్లు తేవడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. అయితే సుప్రీం కోర్టు సూచనల మేరకే తాము నూతన బిల్లును తీసుకురావాల్సి వస్తోందన్నారు. ఈ విషయాలను పేర్కొంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలోని అన్ని ధార్మిక సంస్థల అధిపతులకు లేఖలు రాయనున్నారని తెలిపారు. -
15 నుంచి ఓటర్ స్లిప్పుల జారీ
తనిఖీల్లో దొరికిన మొత్తం రూ. 92.58 కోట్లు 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండి స్వాధీనం రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడి హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 17 పార్లమెంట్ స్థానాలకు గాను 267 మంది రంగంలో మిగిలారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1682 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శనివారం వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో ఈ నెల 12వ తేదీ వరకు ఓటర్ల సంఖ్య 2,81,66,266గా ఉందని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో 3.63 కోట్ల మందితో కలిపి రాష్ట్రం మొత్తం మీద 6.45 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నందున, 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వానికి తెరపడుతుందన్నారు. 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్న స్థానాల్లో రెండేసి ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలవుతుందని, వారంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. ఓటరు స్లిప్పులను ఓటర్‌కు లేదా వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తామని, అందువల్ల ఈ వారం పాటు ఇళ్లలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. వాటిలో పోలింగ్ కేంద్రం సంఖ్య, ప్రాంతం, పోలింగ్ సమయం ముద్రించి ఉంటుందని వివరించారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చీరలు, ఇతర సామగ్రి పంపిణీకి సంబంధించి కలెక్టర్ నుంచి నివేదిక అందిందని, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. నోటా గుర్తు విషయంలో హైకోర్టు ఆదేశాలపై ఈసీకి నివేదించామని, వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భన్వర్‌లాల్ తెలిపారు. దేశంలోనే అత్యధికంగా నగదు స్వాధీనం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నగదు తరలిస్తున్న వారి నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటి వరకు 92.58 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. అలాగే 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండితోపాటు 3.48 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ డబ్బును కోర్టుకు అప్పగించి, ఆదాయపన్ను శాఖకూ సమాచారమిస్తున్నామన్నారు. సరైన ఆధారాలను చూపించి డబ్బును తిరిగి పొందవచ్చని, అలాగే ఆదాయపన్ను శాఖకు సరైన వివరాలు ఇవ్వలేనిపక్షంలో వారు విధించే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రానికి 400 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని, వాటిని నక్సల్ ప్రభావిత, ఫ్యాక్షన్ ప్రాంతాల్లో వినియోగించనున్నామని చెప్పారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎంపీకి పోటీ ఎక్కువ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం 39 మంది ఎంపీ అభ్యర్థులు, 554 మంది అసెంబ్లీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకొన్నారు. దీంతో మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల నుంచి అత్యధికంగా 30 మంది చొప్పున, నాగర్‌కర్నూలుకు అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు. నియోజకవర్గాలవారీగా చూస్తే.. ఆదిలాబాద్(8), పెద్దపల్లి(17), కరీంనగర్(17), నిజామాబాద్(16), జహీరాబాద్(10), మెదక్(13), మల్కాజిగిరి(30), సికింద్రాబాద్(30), హైదరాబాద్(16), చేవెళ్ల(16), మహబూబ్‌నగర్(10), నాగర్‌కర్నూల్(6), నల్లగొండ(9), భువనగిరి(13), వరంగల్(12), మహబూబాబాద్(17), ఖమ్మం ఎంపీ స్థానానికి 27 మంది రంగంలో ఉన్నారు. ఆందోల్ అసెంబ్లీ స్థానానికి ఐదుగురే..: మెదక్ జిల్లా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదుగురే రంగంలో నిలవగా.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, ఖమ్మం అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 25 మంది చొప్పున పోటీలో ఉన్నారు. కాగా జిల్లాల వారీగా చూస్తే... ఆదిలాబాద్‌లో 10 స్థానాలకు 124 మంది, నిజామాబాద్‌లో 9 సీట్లకు 101 మంది, కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాలకు 168 మంది, మెదక్‌లో పది స్థానాలకు 105 మంది, రంగారెడ్డిలో 14 స్థానాలకు 284 మంది, హైదరాబాద్‌లో 15 స్థానాలకు 298 మంది, మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలకు 144 మంది, నల్లగొండలోని 12 స్థానాల్లో 161 మంది, వరంగల్‌లో 12 నియోజకవర్గాలకు 154 మంది, ఖమ్మంలో పది స్థానాలకు 143 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. -
చెమటలు పట్టిస్తున్న రెబెల్స్
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సాహం... టికెట్టు ఆశించి భంగపడటం... ఏ పార్టీ టికెట్టు ఇవ్వకపోవటం... తన సత్తాపై ఉన్న వ్యక్తిగత నమ్మకం... మీరే పోటీకి దిగాలని అభిమానులు ఒత్తిడి చేయటం... ఇలా కారణమేదైతేనేం ఎన్నికల రంగంలో స్వతంత్రులు నిలుస్తారు. జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల ముద్ర బలంగానే ఉంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో మొత్తం 167 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో అత్యధికంగా 39 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. రెండో స్థానం ఏలేశ్వరం నగర పంచాయితీకి దక్కుతుంది. ఇక్కడ 20 మంది తలపడుతున్నారు. అత్యల్పంగా గొల్లప్రోలు నగర పంచాయతీలో కేవలం ఐదుగురు మాత్రమే బరిలో ఉన్నారు. ఉపసంహరణకు బేరసారాలు తమ విజయావకాశాలను దెబ్బతీయగలరని భావించే స్వంతత్ర అభ్యర్థులను ఉపసంహరింపజేసేందుకు ప్రధానపార్టీల అభ్యర్థులు కొందరు విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో స్వతంత్రులను ‘సైలంట్’గా ఉంచేందుకు, లోపాయికారీగా తమకు సహకరించేలా చేసేందుకు కొందరు ప్రధానపార్టీల అభ్యర్థులు బేరసారాలకు దిగుతున్నారు. అమలాపురం మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. స్వతంత్రులు ఒక్కోసారి చైర్మన్ పీఠం ఎన్నికలో కీలకం అవుతారు. వారికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారి గొంతెమ్మ కోర్కెలను తీర్చాల్సి ఉంటుంది. ఒక్కోసారి అనుకోని... ఊహించని పదవులు సాకారమవుతాయి. 2005 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు కౌన్సిల్లో సమాన సంఖ్యలో కౌన్సిలర్లు ఉండడంతో ఒకే ఒక్కడుగా నెగ్గిన స్వతంత్రుడు కీలకమయ్యారు. చైర్మన్‌గిరీ సగకాలం ఇస్తామని పెద్దమనుషుల ఒప్పందంతో అతని మద్దతు పొంది కాంగ్రెస్‌పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. రెబెల్స్‌తో తలనొప్పులు జిల్లాలోని మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్న 167 మందిలో దాదాపు 70 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. వీరందరూ పార్టీ టికెట్టు ఆశించి భంగపడినవారే. తమకు టికెట్టు దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో 20వ వార్డులో టీడీపీ రెబల్ స్వతంత్ర అభ్యర్థి ప్రధాన అభ్యర్థిని పరుగులు పెట్టస్తున్నారు. ఇదే మున్సిపాలిటీలో 12వ వార్డులో కూడా స్వతంత్ర అభ్యర్థి ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా పోటీలో ఉన్నారు. అమలాపురం మున్సిపాలిటీలో 2,3,12,14,16 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్ధులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తుని మున్సిపాలిటీలో 2,3, 20,25 వార్డుల్లో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రులుగా రంగంలో ఉన్నారు. ఇదే మున్సిపాలిటీలో మరో నాలుగు వార్డుల్లో కూడా స్వతంత్రులు తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీ 23వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ప్రచారం తదితర విషయాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నారు. పెద్దాపురం మున్సిపాలిటీ 20వ వార్డులో టీడీపీ రెబెల్ దూసుకుపోతున్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీలో 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి హల్చల్ ఎక్కువగా ఉంది. -
పల్లె గరం గరం
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ఉపసంహరణ గడువు ఈ నెల 24న ముగియ నుండడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ల్లో కొద్దిమేరకు అభ్యర్థులు తగ్గే అవకాశం ఉంది. పార్టీ టికెట్లు ద క్కుతాయని భావిస్తున్న వారు తమ గెలుపునకు ఆటంకంగా మారి పోటీలో ఉన్న వారిని నయానో.. భయానో ఒప్పించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కుల సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. హామీలు గుప్పిస్తూ తమను గెలి పిం చాలని తీర్మానాలు చేయించుకుంటున్నారు. తమకే ఓట్లు వేయించాలని కోరుతూ కులపెద్దల కాళ్లు వేళ్లూ పట్టడానికి కూడా వెనకాడడం లేదు. ఈ నేపథ్యం లో కులపెద్దలకు, సంఘాలకు తాము గెలిస్తే ఇచ్చే న జరానాలను ప్రకటిస్తున్నారు.వారిదే కీలక పాత్ర పరిషత్ ఎన్నికలలో తమవారిని గెలిపించుకునేందు కు ఆయా గ్రామాలలో సర్పంచులు,పల్లె గరం గరం వార్డు సభ్యులు కీలక భూమిక పోషిస్తున్నారు.తమకు అనుకూలమైన వారితో సమావేశాలు, బైఠక్‌లు జరుపుతున్నారు. పల్లెల్లో రాత్రీ, పగలు ప్రచార హోరు పెరిగిపోయింది. జిల్లాలో 36 జడ్పీటీసీలు స్థానాలు, 583 ఎంపిటీసీ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో స్థానంలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 157 నామినేషన్లు , ఎంపీటీసీ స్థానా లకు 1347 నామినేషన్లు వచ్చాయి. బీజేపీ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 68 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 597 నామినేషన్లు,టీఆర్ఎస్ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 141 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 1226 నామినేషన్లు, టీడీ పీ నుంచి జడ్పీటీసీ 67 నామినేషన్లు, ఎంపీటీ సీ 609 నామినేషన్లు, వైఎస్సార్సీపీ నుంచి జడ్పీటీసీ 6 నామినేషన్లు, ఎంపీటీసీ 19 నామినేష న్లు, సీపీఐ నుంచి జడ్పీటీసీ 3 నామినేషన్లు, ఎంపీటీసీ 21 నామినేషన్లు, సీపీఎం నుంచి జడ్పీటీసీ 5 నామినేషన్లు,ఎంపీటీసీ 15 నామినేష న్లు, లోక్‌సత్తా జడ్పీటీసీ 4 నామినేషన్లు, ఎంపీటీసీ 7 నామినేషన్లు, బీఎస్పీ జడ్పీటీసీ 3 నామినేషన్లు, ఎంపీటీసీ 9 నామినేషన్లు, ఇతర పార్టీల నుంచి జడ్పీటీసీ 7 నామినేషన్లు,ఎంపీటీసీ 18 నామినేషన్లు దాఖలయ్యాయి. -
‘మున్సిపల్’ నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరిరోజు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో సోమవారం 1,608 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపాలిటీల్లో 1,524 మంది, మున్సిపల్ కార్పొరేషన్లలో 84 మంది తమ నామినేషన్లను వెనక్కు తీసుకున్నారు. మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం ఆఖరిరోజు. రాజకీయ పార్టీలు ‘బీ’ ఫారాలు ఇప్పటివరకు ఇవ్వనిపక్షంలో.. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ అభ్యర్థులను స్వతంత్రుల కింద పరిగణిస్తారు. ఆదిలాబాద్‌లో బీజేపీ బోణీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలలో 34వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయిన బీజేపీ అభ్యర్థి నెక్రం కృష్ణను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సోమవారమిక్కడ అభినందించారు. ఇది శుభారంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని విజయాలు తథ్యమని కిషన్‌రెడ్డి చెప్పారు. కృష్ణను ఘనంగా సన్మానించారు. రేపు మీడియా ప్రతినిధులతో ఈసీ వర్క్‌షాపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రింట్ మీడియాకు పెయిడ్ న్యూస్, ఎన్నికల నిబంధనల గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం వర్క్ షాపును నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటల నుంచి అన్నిమాధ్యమాల పత్రికల సంపాదకులు, ప్రతినిధులతో జూబ్లీహాల్లో వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు.