సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ పెన్షన్ సిస్టం లేదా జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) తన చందాదారులకు ఊరట నిచ్చింది.కరోనా వైరస్ బారిన పడిన తమ చందారులు చికిత్స ఖర్చుల కోసం కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్-19 మహమ్మారిని అతి ప్రమాదకరమైన రుగ్మతగా గుర్తిస్తున్నామని ప్రకటించింది.
ప్రాణాంతకమైన వ్యాధి సోకిన చందాదారులు ఇప్పుడు తమ ఎన్‌పిఎస్ ఖాతాల నుండి నిధులను పాక్షిక ఉపసంహరణకు అనుమతినిస్తున్నట్టు తెలిపింది. తమ పథకాలు సహజంగా సరళమైనవి కాబట్టి, నగుదును యాడ్ చేసుకోవడానికి గడువులు లేనందున, ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షన్ ఖాతాలకు నిధులను జోడించవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ సుప్రతీం బంధ్యోపాధ్యాయ్ తెలిపారు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్
జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లల చికిత్స కోసం చందాదారులు ఎన్‌పీఎస్ నుంచి కొంతమొత్తం ఉపసంహరించుకోవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి వైద్య ధృవీకరణ పత్రాన్ని అందించాలని స్పష్టం చేసింది. అలాగే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) చందాదారులకు ఈ నిబంధన వర్తించదని రెగ్యులేటింగ్ బాడీ స్పష్టం చేసింది ఎన్‌పీఎస్, ఏపీవై పథకాలను పీఎఫ్‌ఆర్‌డీఏనే నిర్వహిస్తోంది. మార్చి 31 నాటికి ఈ రెండు పథకాల్లో 3.46 కోట్ల మంది ఉన్నారు. కాగా భారతదేశంలో 6400 మందికి పైగా ప్రభావితం చేసిన కరోనా వైరస్ కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment