TS: కరోనా చికిత్స, టెస్ట్‌ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం | TS Govt Released GO 40 For Corona Treatment Charges In Hospitals | Sakshi
Sakshi News home page

TS: కరోనా చికిత్స, టెస్ట్‌ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం

Published Wed, Jun 23 2021 1:18 PM | Last Updated on Wed, Jun 23 2021 4:47 PM

TS Govt Released GO 40 For Corona Treatment Charges In Hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణలో భాగంగా రాష్టవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్ట్‌ ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది.  ఈ మేరకు కరోనా చికిత్సల ఛార్జీలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది. కోవిడ్‌ సోకి సాధారణ వార్డులో ఐసోలేషన్‌, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4 వేలు, ఐసీయూ గదిలో రోజుకు గరిష్టంగా రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ.9 వేలు, పీపీఈ కిట్‌ ధర రూ.273కి మించరాదని ఆస్పత్రుల ఛార్జిలను ఖారారు చేసింది. హెచ్‌ఆర్ సీటీ రూ.1995, డిజిటల్‌ ఎక్స్‌ రే రూ.1300, ఐఎల్‌6 రూ.1300 మాత్రమే ఛార్జ్‌ చేయాలని పేర్కొంది.  

అదే విధంగా డీ డైమర్‌ రూ.300, సీఆర్‌పీ రూ.500, ప్రొకాల్ సీతోసిన్ రూ.1400, ఫెరిటీన్‌ రూ.400, ఎల్‌డీహెచ్ రూ.140 ఛార్జీలను నిర్ణయించింది. సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలుగా, ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలుగా ధరలను ప్రభుత్వం ఖారారు చేసింది.

చదవండి: CM KCR: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్‌నా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement