NPS scheme
-
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్‌తోపాటు, ఎన్‌పీఎస్‌లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్‌పీఎస్‌లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్‌లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ/సిప్‌కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్‌లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్‌పీఎస్‌లో 60% నిధి, ఈపీఎఫ్‌లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్‌లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్‌పీఎస్‌లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్‌తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్‌పీఎస్‌లోనూ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఆంధ్రప్రదేశ్ మోడల్‌ను పాటిస్తూ కేంద్రం ఎన్‌పీఎస్‌లో మార్పులు!
ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో ఈ ఏడాది చివరి నాటికి మార్పులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి తెలిపిన వివరాల ప్రకారం..నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేస్తున్న కొన్ని మార్పులను ఈ ఏడాది చివరిలో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగి చివరిగా తీసుకున్న బేసిక్ జీతంలో 40-50% ఆధారంగా పెన్షన్‌కు హామీ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ మోడల్‌ను అనుసరించాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ పెన్షన్ కార్పస్‌లో లోటును పూరించడం మార్కెట్‌పై ఆధారపడుతుందన్నారు. ప్రస్తుతం ఎన్‌సీఎస్‌లో భాగంగా ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 10% జమ చేస్తారు. ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో మరో 14% జమ చేస్తుంది. అయితే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టబోయే ప్రతిపాదనల్లో ద్రవ్యోల్బణం అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రాబోయే సమావేశంలో దీనిపై మరింత చర్చించే అవకాశం ఉందని ఆ అధికారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పెన్షనర్లు డీఏతో పాటు తాము చివరిగా డ్రా చేసిన బేసిక్ జీతంలో 50% పొందే వీలుంది. ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి జాతీయ పెన్షన్ విధానాన్ని సవరించాలని, పాత పెన్షన్ విధానాన్ని పోలిన పథకాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఝార్ఖండ్ వంటి కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీని కింద రాష్ట్రాలు తమ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్‌పై అధిక భారాన్ని భరిస్తున్నాయి. ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధించిన కేంద్రం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) రెగ్యులేటర్ అయిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం..ఎన్పీఎస్ నిర్వహణలో ఉన్న రూ.9 లక్షల కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వాటా 79% ఉంది. మార్చి 31, 2023 నాటికి ఎన్పీఎస్ అందించే వివిధ పథకాల ద్వారా 6.3కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఇందులో 60.72 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 23.86 లక్షల మంది ఉన్నారు. -
నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్పీఎస్) పరిధిలోని సభ్యులు తమ స్వచ్ఛంద పింఛను జమలకు డైరెక్ట్ రెమిట్ (నేరుగా జమ) మార్గాన్ని ఎంపిక చేసుకుంటే, పీవోపీలకు వచ్చే నెల నుంచి రూ.15-10,000 వరకు కమీషన్ లభిస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. పీఎఫ్ఆర్డీఏ కొత్త నిబంధన కింద ఎన్పీఎస్ చందాదారులు నేరుగా జమ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల ఫీజుల రూపంలో నష్టపోయే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీలు) సంస్థలకు పరిహారాన్ని ఇవ్వడమే దీని లక్ష్యమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ రంగం, అటల్ పెన్షన్ యోజన పౌరులు ఎన్పీఎస్ చందాదారులుగా ఉంటారు. అయితే ఎన్పీఎస్కు, చందాదారులకు మధ్య అనుసంధానకర్తలను పీవోపీలుగా పేర్కొంటారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు పీవోపీల కిందకు వస్తాయి. ఎన్పీఎస్ ఖాతాలను తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్న పీవోపీలకు తమ నిర్ణయం మద్దతుగా నిలుస్తుందని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. -
బ్యాంక్‌తో పనిలేదు,మొబైల్ నుంచే ఎన్పీఎస్ అకౌంట్ ఓపెన్ చేయోచ్చు!
న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్ ఇండియా (బీవోఐ), పింఛను నిధి నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) సంయుక్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి. కే–ఫిన్‌టెక్ సాయంతో నూతన ఎన్పీఎస్ చందాదారుల చేరిక కోసం దీన్ని తీసుకొచ్చాయి. బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏకే దాస్ సమక్షంలో పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ దీన్ని ప్రారంభించారు. దీంతో మొబైల్ ఫోన్ నుంచే ఎన్పీఎస్ ఖాతా (స్వచ్ఛంద పింఛను ఖాతా) తెరవొచ్చు. ఎటువంటి పేపర్లు అవసరం లేకుండా, మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఎన్పీఎస్ ఖాతాను తెరవొచ్చని పీఎఫ్ఆర్డీఏ, బీవోఐ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. ఎంతో సులభంగా, వేగంగా కేవలం కొన్ని క్లిక్‌లతో ఖాతా ప్రారంభించొచ్చని ప్రకటించాయి. ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అది వెబ్ పేజీకి తీసుకెళుతుంది. అక్కడి డిజిటల్ దరఖాస్తును వివరాలతో పూర్తి చేయాలి. ఆధార్ నంబర్ ఇవ్వాలి. దీంతో డిజీలాకర్ సాయంతో ఫొటో, ఇతర వివరాలను ప్లాట్‌ఫామ్ తీసుకుని ప్రక్రియను పూర్తి చేస్తుంది. -
కేంద్రం పెన్షన్ పథకం రూల్స్ మారాయ్.. వివరాలు తెలుసుకోండి
రీటైర్మెంట్ తర్వాత జీవితం సాఫిగా సాగేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్పీఎస్)పేరిట పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా పెన్షన్ నిధి నియంత్రణ సంస్థ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీఏ) కొన్ని నిబంధనల్ని సడలించింది. మారిన సడలింపులు లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సడలించిన నిబంధనలు ►పీఎఫ్ ఆర్డీఏ సడలించిన నిబంధనల ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద సూచించిన పరిమితి వరకు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. ►ఎన్పీఎస్ అకౌంట్లో జమచేసే సొమ్ము మొత్తంలో రిటైర్మెంట్కు ముందు 25 శాతం దాకా తీసుకోవచ్చు ►రిటైర్మెంట్ తర్వాత ఎన్‌పీఎస్‌లో జమయ్యే నిధిలో 60 శాతం మేరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మరో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు వెచ్చించాలి. ►గడువుకు ముందే ఎవరైనా ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచింది. ►ఎన్‌పీఎస్‌లో చేరే వయసు ఇప్పటివరకూ 65 ఏళ్లు ఉండగా.. దీన్ని 70 ఏళ్లకు పెంచారు. ►ఎవరైనా 65 సంవత్సరాల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరితే, కనీసం 3ఏళ్ల పాటు కొనసాగాలి. ►ఒకవేళ 65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరి..3 సంవత్సరాల ముందే విత్‌డ్రా చేయాలనుకుంటే..జమ చేసిన మొత్తంలో 20% వరకు మాత్రమే పన్నురహిత ఉపసంహరణను అనుమతిస్తారు. మిగతా మొత్తం జీవితకాలం పెన్షన్‌గా ఉంటుంది. రూ.5 లక్షల నిధి మాత్రమే ఉంటే.. మొత్తం వెనక్కి.. గతంలో ఎన్పీఎస్ నుంచి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే సదుపాయం లేదు. ఉదాహరణకు పథకంలో జమ చేసిన మొత్తం రూ.2లక్షలు దాటితే.. పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40శాతంతో ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వీలుండేది. కానీ తాజాగా సడలించిన నిబంధనలతో రూ.5 లక్షల లోపు ఎన్పీఎస్ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసినా..ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. -
అత్యంత ప్రజాదరణ పొందిన పథకంగా అటల్ పెన్షన్ యోజన
జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక భద్రత పథకంగా అటల్ పెన్షన్ యోజన అవతరించింది. 4.2 కోట్ల చందాదారుల గల నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో 66 శాతం లేదా 2.8 కోట్లకు పైగా చందాదారులు 2020-21 చివరిలో ఎపీవైని ఎంచుకున్నారని నేషనల్ పెన్షన్ సిస్టమ్స్(ఎన్పీఎస్) ట్రస్ట్ వార్షిక నివేదిక తెలిపింది. అసంఘటిత రంగంలో ఉన్న పేద ప్రజలకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకమే ఈ అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) అటల్ పెన్షన్ యోజనను నిర్వహిస్తుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కనీసం 20 సంవత్సరాల పాటు ప్రతి నెల కొత్త మొత్తం పొదుపు చేస్తే ఆ తర్వాత వారికి నెలకు రూ.5,000 పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులకు నెలకు రూ.1000 నుంచి రూ.5000 మధ్య గ్యారెంటీడ్ కనీస నెలవారీ పెన్షన్ అందుతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించింది.(చదవండి: ఈడీ నోటీసులను కోర్టులో సవాల్ చేసిన సచిన్ బన్సాల్) దీనిలో చేరాలంటే బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే సరిపోతుంది. టెర్మినల్ వ్యాధి లేదా ఖాతాదారుడు మరణించిన పరిస్థితుల్లో మినహా పెన్షన్ ముందస్తుగా చెల్లించడం, ఏపీవై నుంచి నిష్క్రమించడం జరగదు. మీరు ముందుగా చేరితే తక్కువ మొత్తం ప్రతి నెల కట్టాల్సి వస్తుంది కాబట్టి త్వరగా మీ పేరు నమోదు చేసుకుంటే మంచిది. ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా (ఆన్లైన్/ఆఫ్‌లైన్) ఈ పథకంలో చేరొచ్చు. -
65 ఏళ్ల తర్వాత.. జాతీయ ఫించను పథకంలో చేరొచ్చు!
న్యూఢిల్లీ: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) పథకాన్ని మరింత ఆకర్షణీయంగా చేయాలన్న లక్ష్యంతో పింఛను నిధి అభివృద్ధి, నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలను సవరించింది. 65 ఏళ్ల తర్వాత చేరిన చందాదారులు ఈక్విటీలకు గరిష్టంగా 50 శాతం వరకు కేటాయింపులు చేసుకునేందుకు అనుమతించింది. ఎన్‌పీఎస్‌లో గరిష్ట వయసును 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచిన విషయం గమనార్హం. 75 ఏళ్ల వరకు ఇప్పటి వరకు ఎన్పీఎస్ పథకంలోకి 18–65 ఏళ్ల వయసు మధ్యన ప్రవేశించే అవకాశం ఉండగా.. ఇకమీదట 65 ఏళ్ల తర్వాత కూడా చేరొచ్చు. 75 ఏళ్ల వరకు పథకంలో కొనసాగొచ్చు. ఇప్పటికే రిటైర్మెంట్ వయసు ఆధారంగా ఎన్పీఎస్ ఖాతాను మూసేసిన వారు సైతం.. తాజా సవరణలతో తిరిగి కావాలనుకుంటే ఖాతాను తెరుచుకోవచ్చు. 65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరే వారు ఆటో ఆప్షన్ కింద ఈక్విటీలకు 15 శాతం, యాక్టివ్ చాయిస్ ఆప్షన్ కింద 50 శాతాన్ని కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలావుండగా, ఆదాయపన్ను నుంచి పింఛనుకు మినహాయింపునివ్వాలని భారతీయ పెన్షనర్స్ మంచ్ డిమాండ్ చేసింది. చదవండి : మాకు పెన్షన్‌పై ఐటీ మినహాయింపు ఇవ్వండి -
‘ఈ పథకం మాకొద్దు’- ట్విటర్‌ను హోరెత్తించిన ఉద్యోగులు
మరణమా.. రణమా అన్నంత ఉత్కంఠతో ఉద్యోగులు తమకు పాత పింఛను పథకం పునరుద్దరణ మాత్రమే శరణ్యమనీ.. మరో మారు తేల్చి చెప్పారనీ భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. అసాధారణ పోరాట పటిమతో మదిలో మాటను విశ్వ విదితం చేశారని, ఆ సంగతి సీపీఎస్ శ్రేణుల గుండె చప్పుడుతో దద్దరిల్లిన ట్విటర్ సాక్షిగా సుస్పష్టం అయిందని చెప్పారు. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న న్యూపెన్షన్ స్కీమ్ ఉద్యోగ వర్గాల సామాజిక మాధ్యమ ఉద్యమం అద్భుతంగా విజయం సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. నెల రోజుల ముందు నుంచే యావత్ భారతం మానసికంగా సిద్ధమై ఈ రోజు అవకాశం కోసం వేచి చూసిన నిరీక్షణ ఫలితమే ‘రిస్టోర్ ఓల్డ్ పెన్షన్’ ఆవిష్కృతమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి నాయకులు కూడా మున్ముందు జూమ్ సమావేశాలు నిర్వహించి ఎన్పీఎస్ కు చరమ గీతం పాడేలా ఉద్యోగ సంఘాలను సమాయత్తం చేశాయన్నారు. సీపీఎస్టీఈఏటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ సూచన మేరకు సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు ట్విటర్ ఖాతాల ద్వారా పాత పింఛను సాధన తమ లక్ష్యం అని గళం వినిపించారన్నారు. వారణాసి రామకృష్ణ ఆధ్వర్యంలో జలసౌధ లో ఇంజనీర్లు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారని చెప్పారు. కొత్త పింఛను పథకం రద్దే ఏకైక లక్ష్యం అని, వెసులు బాట్లు , సౌకర్యాల తో తమను ఏ మర్చలేరని లక్షలాది గొంతుకలు ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటాయన్నారు. దేశ వ్యాప్తంగా 70 లక్షలపై చిలుకు ఉద్యోగులు కొత్త పింఛను పథకం లో ఉండగా.. బుధవారం నాడు పది లక్షల ఉద్యోగుల హృదయ స్పందన ట్విటర్ సాక్షిగా మాకు కావాల్సింది పాత పింఛను పథకం మాత్రమే అన్న విషయం అటు పాలకులకు ఇటు జన బాహుళ్యానికి తేట తెల్లమైందని వివరించారు. కరోనా మూలంగా కేవలం సామాజిక మాధ్యమం అస్త్రంగానే పోరు జరిగిందని, కోవిడ్ తగ్గాక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు. -
NPS: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
మోదీ ప్రభుత్వం పెన్షనర్లకు భారీ ఊరట కలిగించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) తాజాగా నేషనల్ పెన్షన్ వ్యవస్థ(ఎన్పీఎస్) విత్‌డ్రాయెల్ నిబంధనలను సడలించింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, చందాదారుల ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్ల సెల్ఫ్ అటెస్డెడ్ కాపీలను డిజిటల్ రూపంలో స్వీకరించడానికి పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీఒపీ)ను అనుమతించింది. 2021 జూన్ 30 వరకు ఎన్పీఎస్ విత్‌డ్రాయెల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఒటీపీ/ఈ-సైన్ ఆధారంగా 'ఆన్లైన్ పేపర్‌లెస్ ఎగ్జిట్ ప్రాసెస్' ఎన్పీఎస్ చందాదారుల కోసం సీఆర్ఎ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పీఎఫ్ఆర్డీఏ ఒక సర్క్యూలర్ కూడా జారీ చేసింది. ఎన్పీఎస్ విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సబ్స్క్రైబర్లు డిజిటల్ రూపంలో సీఆర్ఏకు పంపొచ్చు. కోవిడ్ 19 సమయంలో ఎన్పీఎస్ విత్‌డ్రాయెల్‌కు సంబంధించి స్వయంగా డాక్యుమెంట్లు అందించడానికి పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పీఎఫ్ఆర్డీఏ తెలిపింది. జూలై 21, 2020 నాటి సర్క్యులర్‌లో పేర్కొన్న సర్క్యులర్ ప్రకారం చందాదారుల ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ కేసులకు సంబంధించి అనేక సందర్భాల్లో పిఆర్‌పిలు సిఆర్‌ఎకు రికార్డులు పంపించలేదని పిఎఫ్ఆర్డిఎ పేర్కొంది. కేసులు, కఠినమైన లేదా మృదువైన కాపీలు, రికార్డ్ కీపింగ్ మరియు కంట్రోల్ ప్రయోజనం కోసం విఫలం కాకుండా 2021 జూన్ 30 లోగా సంబంధిత CRA తో POP లు పంచుకోవలసి ఉంటుంది. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
రూ. 6 లక్షల కోట్లు దాటిన పింఛను నిధులు
న్యూఢిల్లీ: పింఛను పథకాల నిర్వహణలోని ఆస్తులు రూ.6లక్షల కోట్లను అధిగమించినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఇతర పింఛను పధకాల నిర్వహణతోపాటు, ఈ రంగ అభివృద్ధికి తోడ్పడేందుకు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైందే పీఎఫ్ఆర్డీఏ. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌తోపాటు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలను ఈ సంస్థ చూస్తోంది. ఈ రెండు పథకాల పరిధిలోని మొత్తం సభ్యుల సంఖ్య 4.28 కోట్లకు చేరుకోగా.. నిర్వహణ నిధులు రూ.6లక్షల కోట్లను దాటాయి. పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటై 13 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ స్థాయి పురోగతి నమోదైంది. 2020 అక్టోబర్ నాటికి రూ.5లక్షల కోట్ల నిర్వహణ ఆస్తుల మైలురాయిని పూర్తి చేసుకోగా.. తర్వాత ఏడు నెలల్లోనే మరో రూ.లక్ష కోట్లు ఈ రెండు పథకాల పరిధిలో వృద్ధి చెందడం గమనార్హం. ఎన్పీఎస్ కింద 74.10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వేతర విభాగం నుంచి 28.37 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పింఛను పథకాల పట్ల సభ్యుల్లో ఉన్న విశ్వాసమే ఈ వృద్ధికి కారణమని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా రిటైర్మెంట్ ప్రణాళిక, ఆర్థిక శ్రేయస్సు పట్ల వ్యక్తుల్లో అవగాహన పెరిగినట్టు చెప్పారు. చదవండి: ఆరేళ్లలో రూ.15లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు -
కరోనా : ఎన్పీఎస్ చందాదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ పెన్షన్ సిస్టం లేదా జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) తన చందాదారులకు ఊరట నిచ్చింది.కరోనా వైరస్ బారిన పడిన తమ చందారులు చికిత్స ఖర్చుల కోసం కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్డీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్-19 మహమ్మారిని అతి ప్రమాదకరమైన రుగ్మతగా గుర్తిస్తున్నామని ప్రకటించింది. ప్రాణాంతకమైన వ్యాధి సోకిన చందాదారులు ఇప్పుడు తమ ఎన్‌పిఎస్ ఖాతాల నుండి నిధులను పాక్షిక ఉపసంహరణకు అనుమతినిస్తున్నట్టు తెలిపింది. తమ పథకాలు సహజంగా సరళమైనవి కాబట్టి, నగుదును యాడ్ చేసుకోవడానికి గడువులు లేనందున, ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షన్ ఖాతాలకు నిధులను జోడించవచ్చని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతీం బంధ్యోపాధ్యాయ్ తెలిపారు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లల చికిత్స కోసం చందాదారులు ఎన్పీఎస్ నుంచి కొంతమొత్తం ఉపసంహరించుకోవచ్చని పీఎఫ్ఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి వైద్య ధృవీకరణ పత్రాన్ని అందించాలని స్పష్టం చేసింది. అలాగే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) చందాదారులకు ఈ నిబంధన వర్తించదని రెగ్యులేటింగ్ బాడీ స్పష్టం చేసింది ఎన్పీఎస్, ఏపీవై పథకాలను పీఎఫ్‌ఆర్‌డీఏనే నిర్వహిస్తోంది. మార్చి 31 నాటికి ఈ రెండు పథకాల్లో 3.46 కోట్ల మంది ఉన్నారు. కాగా భారతదేశంలో 6400 మందికి పైగా ప్రభావితం చేసిన కరోనా వైరస్ కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
రిటైర్మెంట్కు వీపీఎఫ్ ఆయుధం!
రిటైర్మెంట్ తర్వాత జీవితానికి సంబంధించి చాలా మందిలో ప్రణాళిక కనిపించదు. ఎన్నో ఏళ్ల తర్వాత అవసరాల కంటే ప్రస్తుత జీవన అవసరాలే వారికి ప్రాధాన్యంగా ఉంటుంటాయి. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ ఆదాయ వర్గాల్లో ఇది చూడొచ్చు. కానీ, 60 ఏళ్ల తర్వాత ఆర్జనా శక్తి తగ్గిపోయిన పరిస్థితుల్లో తమ జీవన అవసరాలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య ఖర్చులు భరించాలంటే.. కచ్చితంగా అందుకు చిన్న నాటి నుంచే తగిన ప్రణాళిక కావాలి. అన్ని అవసరాలను తీర్చేంత నిధి సమకూర్చుకోవాలి. దీన్ని విస్మరిస్తే విశ్రాంత జీవనంలో ఇబ్బందులు (స్థిర, చరాస్తులు కలిగిన వారు మినహా) ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎన్పీఎస్ నిధి ఎలానూ ఉంటుంది. ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్ సదుపాయం ఉంది. కానీ, దీని వాటా స్వల్ప మొత్తమే. ఇంకాస్త అదనంగా ఈపీఎఫ్‌కు జమ చేసుకుంటానంటే అందుకు వీలు పడదు. కానీ, ఇటువంటి వారు ఈపీఎఫ్‌కు అదనంగా మరికొంత మొత్తాన్ని ప్రతి నెలా స్వచ్ఛ్చంద భవిష్యనిధి (వీపీఎఫ్) రూపంలో సమకూర్చుకోవచ్చు. సులభ ప్రక్రియ ఈపీఎఫ్‌కు కొనసాగింపు వీపీఎఫ్. వేతన జీవులకే ఈ అవకాశం. వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది సులభమే. తాము పనిచేస్తున్న సంస్థకు ఆ విషయాన్ని తెలియజేసి రిజి స్ట్రేషన్ ఫామ్‌ను పూర్తి చేసి ఇస్తే సరిపోతుంది. ప్రతి నెలా ఎంత మొత్తాన్ని వీపీఎఫ్‌కు జమ చేయాలన్నది కూడా తెలియజేయాలి. అప్పటి వరకు కొనసాగుతున్న ఈపీఎఫ్ ఖాతాయే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. వీపీఎఫ్ రూపంలో అదనంగా జమ చేసే మొత్తం కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌కే కలుస్తుంది. వీపీఎఫ్‌లో పెట్టుబడుల పరంగా సౌలభ్యం కూడా ఉంది. వీలున్నంత కాలం ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత కొంత కాలం పాటు నిలిపివేయవచ్చు. అయితే, కొన్ని సంస్థలు ఏడాదికి ఒక్కసారే మార్పులకు అనుమతిస్తున్నాయి. రిస్క్‌లేని అధిక రాబడులు రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం స్థిరాదాయ సాధనాల్లో పొదుపు చేసుకోవాలనుకునే వారికి వీపీఎఫ్ ఒక మంచి సాధనమన్నది నిపుణుల అభిప్రాయం. ఈపీఎఫ్ చందాకు అదనంగా స్వచ్ఛందంగా ఉద్యోగులు ఇందులో జమ చేసుకోవచ్చు. ప్రైవేటు రంగ ఉద్యోగులకు వారి మూల వేతనం, డీఏలో 12 శాతాన్ని ప్రతి నెలా వేతనం నుంచి మినహాయించి వారి ఈపీఎఫ్ ఖాతాకు సంస్థలు జమ చేస్తుంటాయి. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా తన వాటాగా అందజేస్తుంది. కానీ, ఈ పరిమితికి మించి ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం లేదు. దీనికి అదనంగా రిటైర్మెంట్ ఫండ్ కోసం మరికొంత పొదుపు చేసుకోవాలని భావించే వారికి వీపీఎఫ్ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగి తన మూలవేతనం, డీఏకు నూరు శాతం సమాన మొత్తాన్ని ప్రతి నెలా వీపీఎఫ్‌లో జమ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 12,000, డీఏ రూ.3,000 అనుకుంటే అప్పుడు ప్రతి నెలా గరిష్టంగా రూ.15,000ను వీపీఎఫ్‌లో జమ చేసుకోవచ్చు. వీపీఎఫ్ ఎందుకు ఆకర్షణీయం అంటే.. ఈపీఎఫ్ చందాలపై లభించే వడ్డీ రేటే వీపీఎఫ్ నిధికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రతీ ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడులపై వచ్చిన ఆదాయం, నిధుల లభ్యతకు అనుగుణంగా వడ్డీ రేటును నిర్ణయిస్తుంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ రేటు 8.65 శాతం కాగా, 2019–20 సంవత్సరానికి 8.5 శాతంగా నిర్ణయించింది. స్థిరాదాయ పథకాల్లో ఇది అత్యధిక రేటు. కొంత మంది విడిగా పీపీఎఫ్ ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ పీపీఎఫ్తో పోలిస్తే కనీసం అర శాతానికి పైనే వీపీఎఫ్‌లో వడ్డీ రేటు ఉంటుందని ఆశించొచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండూ కూడా క్యుములేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలే. అంటే ఇందులో చేసే పెట్టుబడులపై వడ్డీ ఆదాయం ఏటా అసలుకు కలుస్తుంటుంది. దీంతో దీర్ఘకాలంలో మంచి కాంపౌండింగ్ వృద్ధి ఉంటుంది. అయితే, ఈపీఎఫ్ జమలకు వర్తించే లాకిన్, పాక్షిక ఉపసంహరణల నిబంధనలే వీపీఎఫ్‌కూ వర్తిస్తాయి. రాబడుల వ్యత్యాసం బ్యాంకు డిపాజిట్లపై ఇప్పుడు వడ్డీ రేటు 6.5% స్థాయిలకు పడిపోయింది. దీంతో వడ్డీ రేటు పరంగా వీపీఎఫ్ ఎంతో ఆకర్షణీయమనే చెప్పొచ్చు. పెద్దల కోసం ఉద్దేశించిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (8.6%)ను మినహాయిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లతో పోల్చి చూసినా వీపీఎఫ్ రేటే అధికం. ఈక్విటీల్లో ఈపీఎఫ్ పెట్టుబడులు పెరుగుతూ ఉండడం, కార్మిక సంఘాల డిమాండ్ల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్, వీపీఎఫ్‌పై అధిక వడ్డీ రేటును నిర్ణయించక తప్పడం లేదు. రిటైర్మెంట్ పథకం ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులకు అవకాశం ఉండడంతో దీర్ఘకాలంలో వీపీఎఫ్‌తో పోలిస్తే కొంత అదనపు రాబడులకు వీలుంది. కానీ, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే విషయంలో పరిమితులు న్నాయి. ఆ విధంగా చూసుకుంటే వీపీఎఫ్ ఎం తో సౌలభ్యం. ఈపీఎఫ్/వీపీఎఫ్‌కు చేసే జమ లకు కేంద్రం హామీ ఉండడం అదనపు ఆకర్షణ. పన్ను వర్తించని సాధనం వీపీఎఫ్‌కు చేసే జమలు, రాబడులు, ఉపసంహరణలు అన్నీ కూడా పన్ను ఆదా ప్రయోజనం కలిగినవి. ఎన్‌పీఎస్‌లో గడువు తీరే నాటికి సమకూరిన నిధిలో 40 శాతంపై పన్ను చెల్లించి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే, వీపీఎఫ్‌లో జమ అయిన మొత్తాన్ని ఎటువంటి పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఇందులో చేసే జమలకు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కనుక.. వాస్తవికంగా పొందే రాబడి రేటు మెరుగైనదిగా భావించాలి. అయితే, వడ్డీ రేటు 9.5 శాతం మించితే అప్పుడు ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో ఈపీఎఫ్, వీపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5–9 శాతం మధ్యే స్థిరపడడాన్ని చూస్తూనే ఉన్నాం. రిటైర్మెంట్ అనంతరం ఈపీఎఫ్, వీపీఎఫ్ నిధిని పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్కు ముందుగా ప్రత్యేక అవసరాల్లో కొంత వెనక్కి తీసుకున్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. అయితే, కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత తీసుకుంటేనే పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకముందే ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. అలాగే, అప్పటి వరకు ఆర్జించిన వడ్డీ రాబడిపైనా పన్ను పడుతుంది. అవసరాల్లో అక్కరకు.. ఆర్థిక అత్యవసరాల్లో ఈపీఎఫ్‌లో మాదిరే వీపీఎఫ్ బ్యాలెన్స్‌ను కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పిల్లల వివాహాలు, వారి ఉన్నత విద్య, వైద్య అవసరాల కోసం, గృహ కొనుగోలుకు ఇందులోని బ్యాలెన్స్‌ను వెనక్కి తీసుకునేందుకు ఈపీఎఫ్‌వో అనుమతిస్తుంది. నిర్ణీత కాలం పాటు ఉద్యోగం లేకుండా ఉన్నా బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఒక నెలకు మించి ఉద్యోగం లేకుండా కొనసాగితే, వీపీఎఫ్/ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వరుసగా రెండు నెలల పాటు ఉద్యోగం లేని యెడల మిగతా మొత్తాన్ని కూడా వెనక్కి తీసేసుకోవచ్చు. పీపీఎఫ్తో పోలిస్తే ఎన్నో విధాలుగా ఈపీఎఫ్, వీపీఎఫ్‌లు ప్రయోజనకరం. పీపీఎఫ్‌లో పాక్షిక ఉపసంహరణలు, అది కూడా ఏడో ఏట నుంచే అవకాశం కల్పిస్తారు. 15 ఏళ్లు పూర్తయిన తర్వాతే పూర్తిగా వెనక్కి తీసుకోగలరు. కానీ, ఈపీఎఫ్/వీపీఎఫ్‌లో ఉపసంహరణల పరంగా సౌలభ్యత ఎక్కువ. పైగా రాబడి రేటు కూడా పీపీఎఫ్‌లో ప్రస్తుతమున్న 7.9 శాతంతో పోలిస్తే ఎక్కువే. -
ఒక పెట్టుబడి.. రెండు ప్రయోజనాలు
శివరామ్ ఉద్యోగంలో చేరిన కొత్తలో... పదేళ్ల క్రితం సంప్రదాయ జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. ఏటా ప్రీమియం రూపంలో రూ.40,000 వరకు చెల్లిస్తున్నాడు. ఇటీవల గృహ రుణం తీసుకోవడంతో... జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించడం కష్టంగా మారింది. శ్రీరామమూర్తి ఏడాది క్రితం ఎన్‌పీఎస్‌లో చేరాడు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనంలో భాగంగా ఎన్‌పీఎస్‌లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. దీనికి అదనంగా ఇన్వెస్ట్ చేయాలని ఉంది. కానీ, పన్ను మినహాయింపు ఉంటుందా? అన్నది సందేహం. పన్ను ఆదా సాధనాల విషయంలో వేతన జీవులకు పక్కా ప్రణాళిక ఉండాలి. శివరామ్ పన్ను ఆదా కోసం ఎండోమెంట్ పాలసీ తీసుకుని పొరపాటు చేశానని అనుకుంటున్నాడు. ఎందుకంటే కవరేజీ తక్కువ, రాబడులు కూడా స్వల్పమే. పైగా ప్రీమియం ఎక్కువ. దీనివల్ల ఇతర పెట్టుబడుల ప్రణాళిక దెబ్బతింటుంది. ఏటా మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి పన్ను పడకుండా ఉండేందుకు ఎక్కువ మంది చివరి మూడు నెలల్లోనే పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటారు. ఆ తరహా వారికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా సాధనాలు, వాటి∙ప్రయోజనాలు వివరించేదే ఈ కథనం. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలు పన్ను ఆదా విభాగంలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆదాయ పన్ను ఆదా కోసం దీన్ని మెరుగైన సాధనంగానే చూడొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఒక ఆర్థిక సంవత్సరంలో మూలధన లాభాల పన్ను రూ.లక్ష మించినప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018లో స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉండగా... ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితులే ఉండొచ్చు. అయితే, దీర్ఘకాలం కోసం క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసే వారు వీటి గురించి ఆందోళన చెందనక్కర్లేదు. అయితే, మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే అంతా ఒకేసారి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా జనవరి నుంచి మార్చి వరకు మూడు సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఇన్వెస్ట్రోగ్రఫీ సీఈవో శ్వేతా జైన్ సూచించారు. ఫండ్స్ పేరు 3 ఏళ్ల రాబడులు మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ 19.06 ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్ 12.67 ఆదిత్య బిర్లా ట్యాక్స్ రిలీఫ్96 12.48 ప్రిన్సిపల్ ట్యాక్స్ సేవింగ్ 12.59 యాక్సిల్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 12.38 డీఎస్పీ ట్యాక్స్‌సేవర్ 12.13 ఎన్పీఎస్ జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో గత ఐదేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 10.84 శాతంగా ఉన్నాయి. రిటైర్మెంట్ సమయంలో వెనక్కి తీసుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును రద్దు చేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఈక్విటీల్లో యాక్టివ్ చాయిస్ కింద 75 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ పీఎఫ్ఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలతో ఎన్పీఎస్ ఆకర్షణీయంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్‌పీఎస్‌లో 60 ఏళ్ల సమయంలో ఉపసంహరించుకునే 60 శాతంలో 20 శాతం పైన పన్ను చెల్లించాలన్న నిబంధన ఉంది. దీన్ని తొలగించడం పెద్ద ముందడుగుగా క్లియర్ ట్యాక్స్ సీఈవో అర్చిత్గుప్తా పేర్కొన్నారు. 70 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా పీఎఫ్ఆర్డీఏ కల్పించింది. వీటిల్లో ఫండ్స్ పనితీరును గమనిస్తే... ఈక్విటీలో 50 శాతం ఇన్వెస్ట్ చేసే విభాగం ఫండ్ మేనేజర్ ఏడాది రాబడి మూడేళ్లు రాబడి ఐదేళ్లు రాబడి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ 3.37 9.56 11.31 ఎస్బీఐ పెన్షన్ ఫండ్ 4.12 9.98 11.45 యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ 3.19 9.85 11.41 కోటక్ పెన్షన్ ఫండ్ 1.37 9.58 11.22 హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఫండ్ 3.71 10.22 – పెన్షన్ ప్లాన్లు పెన్షన్ ప్లాన్లు కూడా సెక్షన్ 80సీ కింద పెట్టుబడి ప్రయోజనం అందించేవే. అయితే, ఎన్పీఎస్, యులిప్‌లతో పోలిస్తే ఇవి అంత ఆకర్షణీయం కావు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలకు అదనంగా రూ.50,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు పన్ను మినహాయింపు ఉంది. పని చేస్తున్న కంపెనీ ఉద్యోగి పెన్షన్ కోటా కింద జమ చేస్తే అదనపు పన్ను మినహాయింపు కూడా ఉంది. కానీ బీమా కంపెనీలు అందించే పెన్షన్ ప్లాన్లకు ఈ ప్రయోజనాలు లేవు. కొత్త యులిప్ పాలసీల్లో చార్జీలు చాలా వరకు దిగొచ్చాయి. బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో మాత్రం చార్జీలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. యులిప్‌ల మాదిరే బీమా పెన్షన్ ప్లాన్లలోనూ చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ జాతీయ పొదుపు పత్రా ల్లో పెట్టుబడులకూ సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు ఉంది. దీనిలో ప్రస్తుత వడ్డీ రేటు 8%. ఈక్విటీల గురించి అర్థం చేసుకునే ఓపిక, తీరిక లేని వారు, పెట్టుబడి పెట్టి నిశ్చితంగా ఉండాలనుకునే వారు దీన్ని పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైనది. దీనిలో వచ్చే వడ్డీ ఆదాయం తదుపరి ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు వీలుంటుంది. ఉదాహరణకు 2019 జనవరిలో ఎన్ఎస్సీలో రూ.50,000 ఇన్వెస్ట్ చేశారనుకుంటే, 2020 జనవరి నాటికి రూ.4,000 వడ్డీ ఆదాయం లభిస్తుంది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో దీనిపై మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన వారికీ ఇది అనువైనదే. బ్యాంకుల్లో వీటిని పొందొచ్చు. బ్యాంకు ఎఫ్డీలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ 7.5–8.25% మధ్య ఉంది. సెక్షన్ 80 సీ పన్ను ఆదా కోసమయితే, ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు తిరిగి ఈ డిపాజిట్‌ను రద్దు చేసుకోవడానికి ఉండదు. నెట్ బ్యాంకింగ్ ఉన్న వారు ఆన్లైన్లోనే కొన్ని క్లిక్‌లతో ఈ డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ వడ్డీ రేటు ఐడీఎఫ్సీ బ్యాంకు 8.25 ఏయూస్మాల్ ఫైనాన్స్ 8.00 లక్ష్మీ విలాస్ బ్యాంకు 7.75 డీసీబీ బ్యాంకు 7.75 ఆర్బీఎల్ బ్యాంకు 7.60 బీమా పాలసీలు ఆర్జించే వ్యక్తికి మరణ ప్రమాదం ఎదురైతే, అతడు లేదా అతనిపై ఆధారపడిన వారికి ఆర్థిక ఇక్కట్లు ఎదురవుతాయి. అందుకే తమపై ఆధారపడిన వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బీమా పాలసీ తీసుకోవాలి. కానీ, అది టర్మ్ ప్లాన్ రూపంలో ఉంటే మంచిది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు ఓ వ్యక్తి కుటుంబానికి సరిపడా బీమా రక్షణ అందించలేవు. ఎందుకంటే వార్షికంగా రూ.5 లక్షల ఆదాయం కలిగిన 30 ఏళ్ల వ్యక్తికి వార్షికంగా కనీసం రూ.40–50 లక్షల కవరేజీ అవసరం. ఎండోమెంట్ పాలసీ అయితే ఇంత కవరేజీ కోసం రూ.ఏడాదికి రూ.4–5 లక్షల ప్రీమియం చెల్లించాలి. కానీ రూ.5,000లోపు ప్రీమియంతోనే 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.50 లక్షల టర్మ్ పాలసీని పొందొచ్చు. టర్మ్ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియానికి కూడా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్...(పీపీఎఫ్) 2019 జనవరి–మార్చి నెలకు వడ్డీ 8 శాతంగా ఉంది. వడ్డీ రేట్లు ఇటీవలి కాలంలో కాస్త తగ్గినప్పటికీ... పీపీఎఫ్ సాధనం ఇప్పటికీ మంచి సాధనంగా ఆర్థిక సలహాదారుల అభిప్రాయం. రాబడి పూర్తిగా పన్ను రహితం. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన సాధనం అవుతుంది. ఎందుకంటే ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుందని తెలిసిందే. అయితే, ఇప్పటికే ప్రావిడెండ్ ఫండ్‌కు కొంత కేటాయించే వారు పన్ను ఆదా కోసం మరింతగా అదే బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వివేకం అనిపించుకోదు. దీనికి బదులు ఇక్కడి ప్రత్యామ్నాయ సాధనాల్లో మీకు అనువైనది ఎంచుకోవచ్చు. పీపీఎఫ్ పథకంలో పెట్టుబడులు, రాబడులకు హామీదారు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పూర్తి భద్రత ఉంటుంది. ఏ పోస్టాఫీసు శాఖ లేదా బ్యాంకు శాఖలో అయినా పీపీఎఫ్ ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్ సదుపాయం కలిగిన బ్యాంకులో ఎంచుకుంటే సౌలభ్యంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.7 శాతంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారికి పన్ను ఆదా సాధనంగా ఇది ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వార్షికంగా రూ.50,000 వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తూ గతేడాది నిర్ణయం తీసుకుంది. దీంతో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం మరింత ఆకర్షణీయత సంతరించుకుంది. దీంతో 60 ఏళ్లు దాటిన వారికి వార్షికంగా రూ.3.5 లక్షలకు పన్ను లేనట్టు అవుతుంది. 80 ఏళ్లు దాటిన వారికి రూ.5.5 లక్షలకు పన్ను ఉండదు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు అన్నింటిలోకీ అధిక వడ్డీ రేటు ఉన్నది ఈ పథకంలోనే. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని, మరో ఉద్యోగంలో చేరని వారు 58 ఏళ్లకే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజన కుమార్తెల పేరిట పొదుపు చేసుకుని పన్ను ఆదా పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.5 శాతం. వడ్డీ రేటును ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌తో ముడిపెట్టినందున ప్రతీ క్వార్టర్‌కు మారుతుంటుంది. పీపీఎఫ్ పథకంలో కంటే అధిక వడ్డీ రేటు ఇందులో లభిస్తోంది. పీపీఎఫ్‌లో మాదిరే గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షల వరకు ఉంది. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. కనీసం రూ.250 పెట్టుబడితో పోస్టాఫీసు లేదా ఎంపిక చేసిన బ్యాంకుల్లో దీన్ని ఆరంభించొచ్చు. తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెల పేరిటే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఇద్దరు కుమార్తెల పేరిట రెండు ఖాతాలు ప్రారంభించిన వారు రెండింటిలోనూ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల వివాహాలు, ఉన్నత విద్య అవసరాలకు ఉపయోగపడే పథకం. యులిప్‌లు యూనిట్ లింక్డ్ బీమా పథకాలను ‘యులిప్’లుగా పిలుస్తారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై దీర్ఘకాలంలో లాభాలు గడించే వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యులిప్‌లు బీమాతో కూడిన పెట్టుబడి పథకాలు కావడంతో వీటికి మినహాయింపు ఉంది. యులిప్‌ల్లో కేవలం ఈక్విటీలే కాకుండా డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. యులిప్ పాలసీల్లో ఈక్విటీ నుంచి డెట్ ఫండ్స్‌కు మారినా పన్ను వర్తించదు. ఫండ్స్‌లో మాదిరిగా కాకుండా, యులిప్ పాలసీల్లో డెట్ అయినా ఈక్విటీ ఫండ్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆర్జించే మొత్తంపైనా పన్ను ఉండదు. కాగా ఐదేళ్ల పాటు లాకిన్. గడువు లోపు ముందుగానే తప్పుకుంటే సరెండ్ చార్జీల వంటివి ఉంటాయి. యులిప్ల్లోనే చైల్డ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. పిల్లల పేరిట తీసుకుంటే, పాలసీ గడువు లోపు సంరక్షణ చూసే తల్లి లేదా తండ్రి అకాల మరణం చెందితే, పిల్లల పేరిట పెట్టుబడి ఆగకుండా కొనసాగుతుంది. -
పెన్షన్ కోసం... మీ ‘ప్లాన్’ ఏంటి?
ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ లేక ఎన్‌పీఎస్‌లో (జాతీయ పెన్షన్ విధానం) చేరి... దాన్నుంచి పెన్షన్ అందుకునే పరిస్థితి ఉంది. ఇక ప్రయివేటు ఉద్యోగులో..? ఏదో కొద్ది మందికి ఆయా సంస్థలు సొంత ట్రస్టుల్ని పెట్టుకుని పెన్షన్ ఇస్తున్నాయి తప్ప 90 శాతానికిపైగా ఇలాంటి సౌకర్యం లేనివారే. ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారి గురించి చెప్పనే అక్కర్లేదు. మరి వీళ్లందరికీ రిటైరయ్యాక కూడా స్థిరంగా నెలనెలా కొంత ఆదాయం వచ్చేదెలా? ఇదిగో... దీనికోసం ఉద్దేశించినవే పెన్షన్ పథకాలు. వీటిలో బీమా పెన్షన్ పథకాలకు మొదట్లో బాగా ఆదరణ ఉండేది కానీ... మధ్యలో ఎవ్వరూ వీటివైపు చూడటం మానేశారు. కాకపోతే, ఐఆర్డీఏ బీమా ఉత్పత్తుల విషయంలో చేపట్టదలిచిన తాజా సంస్కరణలు ఆచరణలోకి వస్తే గనక ఇవి మళ్లీ మునుపటిలా ఆకర్షణీయంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. యూనిట్ ఆధారిత పెన్షన్ ప్లాన్లను (యూఎల్‌పీపీ) మరింత సౌకర్యంగా, జాతీయ పెన్షన్ పథకానికి (ఎన్పీఎస్) దీటుగా ఉండేలా ఐఆర్డీఏ కీలక మార్పులను ప్రతిపాదించింది. అయినప్పటికీ యులిప్ పెన్షన్ ప్లాన్లతో పోలిస్తే ఎన్పీఎస్ చాలా చౌక. ఇందులో చార్జీలు చాలా తక్కువ కూడా!!. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం యూనిట్ ఆధారిత బీమా పథకాల (యులిప్) గురించి చాలా మందికి తెలుసు. యూఎల్పీపీల పనితీరు కూడా వాటి మాదిరే ఉంటుంది. కాకపోతే వీటిల్లో బీమా ఉండదు. ఏ ఫండ్స్‌లో పెట్టబడులు పెట్టాలన్నది ఇన్వెస్టర్ల ఇష్టానికే పరిమితం. ఇక యులిప్‌లు, యూఎల్‌పీపీలు రెండింటిలోనూ ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు కాబట్టి తొలి నాళ్లలోనే పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా చూడటమే ఈ లాకిన్ పీరియడ్ ఉద్దేశం. యూఎల్పీపీలో పాక్షిక ఉపసంహరణలకు అవకాశం లేదు. పాలసీ కాల వ్యవధి ముగియకముందే పెట్టుబడులను నగదుగా మార్చుకోవాలనుకుంటే మూడింట ఒకవంతు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లో (ప్రతి నెలా పెన్షన్ చెల్లించే ప్లాన్) పెట్టాల్సి ఉంటుంది. లేదా సింగిల్ ప్రీమియం పెన్షన్ పాలసీ కొనుగోలుకు వినియోగించుకోవచ్చు. కాల వ్యవధి ముగిశాక కూడా, మూడింట ఒకవంతు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. మిగిలింది యాన్యుటీగా మార్చుకోక తప్పదు. ఎన్పీఎస్... ఇపుడు మారింది ‘‘ఎన్పీఎస్ పథకంలో రూ.50,000 పెట్టుబడులపై సెక్షన్ 80సీకి అదనంగా పన్ను మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు! రిటైర్మెంట్ సమయంలో వెనక్కి తీసుకునే 60 శాతం నిధులపైనా తాజాగా పన్నును తొలగించారు’’అని హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ సీఈవో సుమీత్ శుక్లా చెప్పారు. ఎన్‌పీఎస్‌లో ఏటా కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం తప్పనిసరి. అలాగే, 60 ఏళ్లు రాక ముందే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలనుకుంటే అందుకు అవకాశం లేదు. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లోనే అందుకు అవకాశం కల్పిస్తారు. పిల్లల విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా తీవ్రమైన అనారోగ్యం ఎదురైతే చికిత్స అవసరాల కోసం ఎన్పీఎస్ నిధిలో 25 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మొత్తం ఎన్పీఎస్ కాల వ్యవధిలోపు మూడు సార్లు పాక్షిక ఉపసంహరణలకు అవకాశం ఇస్తారు. ఒకవేళ 60 ఏళ్లు నిండకముందే ఎన్పీఎస్ నుంచి వైదొలగాలనుకుంటే అప్పటి వరకు ఉన్న మొత్తం నిధుల్లో కేవలం 10 శాతమే చేతికి వస్తాయి. మిగిలిన 90 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో చేరిన వారు 60 ఏళ్ల వయసుకు వచ్చాక మొత్తం నిధిలో 60 శాతాన్ని తీసేసుకుని మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో పెడితే సరిపోతుంది. అదే యూఎల్‌పీపీల్లో అయితే మొత్తం నిధిలో మూడింట ఒక వంతు అంటే 33.33 శాతమే తీసుకుని, మిగిలిన 66 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్పీఎస్ మాదిరే, యూఎల్పీపీల్లోనూ కాల వ్యవధి తీరిన తర్వాత 60 శాతాన్ని వెనక్కి తీసుకునేందుకు, కాల వ్యవధిలోపు పాక్షిక ఉపసంహరణలకు అవకాశం కల్పించే ప్రతిపాదనలను ఐఆర్డీఏ తాజా ముసాయిదా నిబంధనల్లో ఉన్నాయి. ఇవి అమలైతే ఈ విషయాల్లోనూ యూఎల్‌పీపీలు ఎన్పీఎస్కు ఏ మాత్రం తీసిపోవు. పెట్టుబడుల తీరు ఇలా... యూఎల్‌పీపీలు ప్రస్తుతానికి పూర్తి ఈక్విటీ ఫండ్స్‌ను ఆఫర్ చేయడం లేదు. ఎన్‌పీఎస్‌లో మాత్రం 75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుంది. అయితే, ఈ రెండు రకాల ఉత్పాదనల్లోనూ పరిమితులున్నాయి. ‘‘ఐఆర్డీఏ తన ముసాయిదా నిబంధల్లో మెచ్యూరిటీపై గ్యారంటీని ఐచ్ఛికం చేసింది. దీంతో కస్టమర్లు దీర్ఘకాలంలో తగినంత నిధిని సమకూర్చుకునేందుకు గాను అగ్రెస్సివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది’’ అని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ డైరెక్టర్ మాణిక్నాంజియా తెలిపారు. ఎన్‌పీఎస్‌లోనూ గతంలో ఈక్విటీల్లో గరిష్ట పరిమితి 50 శాతమే ఉండేది. జీఎన్ బాజ్‌పాయి కమిటీ ఈక్విటీల్లో 100 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌కు సిఫారసు చేయగా, ఆ తర్వాత ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పరిమితిని 75 శాతానికి పెంచారు. ఫండ్స్ కంటే ఎన్పీఎస్ మెరుగే... ప్రస్తుతం ఎన్పీఎస్ పథకంలో రిటైర్మెంట్ సమయానికి మొత్తం నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో 20 శాతంపై పన్ను పడుతోంది. ఇకపై పూర్తి 60 శాతానికి పన్ను మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ పన్ను మినహాయింపు ఉంది. దీంతో ఈపీఎఫ్, పీపీఎఫ్ మాదిరే ఎన్పీఎస్కూ మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు లభించింది. మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎన్పీఎస్ మెరుగైనది. ఎందుకంటే... రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ నిధిలో 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన 60 శాతాన్ని రూపాయి కూడా పన్ను చెల్లించకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటుగా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే అందరికీ లభిస్తుంది. 2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరూ ఎన్‌పీఎస్‌లో చేరడం తప్పనిసరి. పథకంలో తాజా మార్పుతో ప్రైవేటు ఉద్యోగులకూ ప్రయోజనం కలగనుంది. ఏ పథకంలో ఎంత వ్యయాలు? పథకాలు ఏవైనా అందులో ఇన్వెస్టర్లు భరించాల్సిన వ్యయాలు కీలకం అవుతాయి. దీర్ఘకాలంలో రాబడులను ఇవి నిర్దేశిస్తాయి. ఎన్పీఎస్ పథకంలో ప్రస్తుతం 0.001 శాతాన్నే పెట్టుబడుల నిర్వహణ ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు భవిష్యత్తులో పెరగొచ్చు. కానీ యూఎల్‌పీపీల్లో ఫండ్ మేనేజ్మెంట్ చార్జ్ 1.35 శాతం వరకు ఉంటోంది. పంపిణీ ఖర్చులు మొదటి ఏడాది ప్రీమియంలో 7.5 శాతం మేర, ఆ తర్వాత ఏటా ప్రీమియంలో 2 శాతం మేర ఉంటాయి. ఎన్‌పీఎస్‌లో అయితే ఈ ఫీజు కేవలం 0.25 శాతానికే పరిమితం చేశారు. అది కూడా గరిష్ట పరిమితి రూ.25,000గానే ఉంది. ఇతర వ్యయాలు చూసుకున్నా మొత్తం మీద ఎన్‌పీఎస్‌లో చార్జీలు చాలా తక్కువ. అంకెల్లో పెద్ద తేడా అనిపించకపోవచ్చు. ఉదాహరణకు... ఓ యూఎల్‌పీపీ పథకంలో ఏటా రూ.లక్ష చొప్పున 8 శాతం రాబడి రేటు అంచనా ఆధారంగా 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు మొత్తం నిధి రూ.24 లక్షలు అవుతుంది. అదే ఎన్‌పీఎస్‌లో ఇంతే మొత్తం 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే, ఇంతే రాబడి రేటు ప్రకారం సమకూరే మొత్తం రూ.29 లక్షలు అవుతుంది. చార్జీల్లో వ్యత్యాసం వల్ల 15 ఏళ్ల కాలంలో ఏకంగా రూ.5 లక్షల రాబడిని నష్టపోయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఏది నయం?..: వ్యయాలు, సౌకర్యాల రీత్యా ఎన్పీఎస్ మొదటి స్థానంలో నిలుస్తుంది. పైగా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణలపైనా ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించడం అదనపు ఆకర్షణ. ‘‘ఎన్‌పీఎస్‌లో సెక్షన్ 80సీకి అదనంగా రూ.50,000 పెట్టుబడులపై పన్ను మినహాయింపు కూడా మరో ఆకర్షణ. పైగా ఎన్పీఎస్ ద్వారా యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇతర పెన్షన్ ప్లాన్ ద్వారా యాన్యుటీని కొనుగోలు చేస్తే 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి’’ అని సుమీత్ శుక్లా తెలిపారు. తమ పెట్టుబడుల్లో 20 శాతాన్నే ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన నిధులను పీపీఎఫ్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని తాను సూచిస్తానని లాడర్–7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేశ్ సెడగోపన్ చెప్పారు. ఇక యూఎల్‌పీపీల్లో ప్రస్తుతం రిటైర్మెంట్ సమయంలో 33.33 శాతం మొత్తానికే పన్ను మినహాయింపు ఉంది. అయితే, ఐఆర్డీఏ ప్రతిపాదన అమల్లోకి వస్తే అప్పుడు 60 శాతం నిధిపైనా పన్ను మినహాయింపు లభిస్తుందని ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సీఎల్ భరద్వాజ్ తెలిపారు. -
పెన్షన్‌దారులకు ఆ రెండు తప్పనిసరి
న్యూఢిల్లీ : నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) సబ్స్క్రైబర్లకు మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పీఎఫ్ఆర్డీఏ తప్పనిసరి చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. మనీ లాండరింగ్ నివారణ చట్ట మార్గదర్శకాల ప్రకారం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతమున్న సబ్స్క్రైబర్లకు, కొత్త సబ్స్క్రైబర్లకు ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్, సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యురిటైజేషన్ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యురిటీ ఇంటరెస్ట్‌లను తప్పనిసరి చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను సులభతరం చేసేందుకు, మెరుగుపరుచేందుకు ఎప్పడికప్పుడు పెన్షన్ అథారిటీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే సబ్స్క్రైబర్ల ప్రయోజనార్థం, ఆపరేషన్‌ను సులభతరం చేసేందుకు బ్యాంకు అకౌంట్ వివరాలను, మొబైల్ నెంబర్‌ను తప్పనిసరి చేసిన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సబ్స్క్రైబర్లు తప్పనిసరి నమోదు చేయాల్సిన వాటిలో వివరాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉందని, వాటిని బ్లాంక్‌గా వదిలేయకూడదని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఒకవేళ బ్లాంక్‌గా వదిలేస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుందని పేర్కొంది. -
నిండు నూరేళ్లూ... హ్యాపీగా
♦ పెరుగుతున్న ఆయుర్దాయం; తగ్గుతున్న ఉద్యోగ కాలం ♦ తక్కువ వ్యవధిలోనే ఎక్కువ సంపదకు ప్రణాళిక కావాలి ♦ వయసులో ఉన్నప్పటి నుంచే రిటైర్మెంట్ ప్లాన్ తప్పనిసరి ♦ అధిక రాబడులను ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు బెటర్ ♦ అందుకోసం ఈక్విటీ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్లు చూడొచ్చు ♦ రిటైరయ్యాక అంతా ఒకేసారి వెనక్కి తీసుకోవద్దు ♦ అప్పుడే హాయిగా చివరి మజిలీ ఇదివరకట్లా కాదు. ఇప్పుడు పెద్ద వయసు వారి సంఖ్య పెరుగుతోంది. కారణం! సగటు ఆయుర్దాయం పెరిగింది. మన దేశంలోనే కాదు!! ప్రపంచమంతటా ఇదే ధోరణి. మరి వృద్ధాప్యంలో ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం లభించినపుడు... నిండు నూరేళ్లూ ఏ ఇబ్బందీ లేకుండా సౌకర్యవంతంగా జీవించాలి కదా? ప్రతి చిన్న దానికీ రాజీ పడకుండా... అవసరాలను చంపుకోకుండా జీవించాలి కదా? అలా చేయాలంటే చివరి మజిలీని చక్కగా డిజైన్ చేసుకోవాలి. అందుకు కాస్త ప్లానింగ్ ఉండాలి. అదెలాగో తెలియజేసేదే ఈ కథనం... మన దేశంలో 1997లో సగటు ఆయుర్దాయం 57 ఏళ్లు. అదిప్పుడు 70 ఏళ్లు దాటిపోయింది. పురుషులు సగటున 77 ఏళ్లు, మహిళలు 78 ఏళ్ల పాటు జీవించగలుగుతున్నారు. ఇవి సగటు లెక్కలే. కొందరు 80 నుంచి 90 ఏళ్ల వరకూ ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవిస్తున్నారు. కానీ ఏ ఉద్యోగమైనా 60 ఏళ్లకే రిటైర్ కావాల్సిందే. వృత్తి, వ్యాపారాలయితే మాత్రం ఆరోగ్యం సహకరించే వరకూ చేసుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న వైద్య రంగం, నూతన ఆవిష్కరణల వల్ల వచ్చే 20 ఏళ్లలో సగటు ఆయుర్దాయం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మరి వృద్ధాప్యంలో జీవించి ఉన్నంత వరకూ అవసరాలు చూసేదెవరు? యుక్త వయసులోనే పిల్లలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంటే సంక్షేమం చూసేది ఎవరు. అందుకే విశ్రాంత జీవనానికి యుక్త వయసు నుంచే సర్వసన్నద్ధం కావాలి. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం తగ్గుతున్న పని కాలం గతంతో పోలిస్తే నేడు ఆర్జన కాలం తక్కువగా ఉంటోంది. ఒకప్పుడు డిగ్రీ అయ్యాక 20–21 ఏళ్ల నుంచే సంపాదన మొదలు పెట్టేవారు. కానీ, ఇపుడు ఉన్నత డిగ్రీలు ఉద్యోగాలకు కీలక అర్హతగా మారుతుండడంతో 22–25 ఏళ్లకు గానీ ఉద్యోగం మొదలు పెట్టడం లేదు. పైగా ఎక్కువ కాలం పాటు కష్టపడకుండా త్వరగా రిటైర్మెంట్ తీసుకోవాలన్నది కొందరి ఆలోచన. అనారోగ్యం, పనిలో పెరిగిపోతున్న ఒత్తిళ్ల వంటి కారణాలూ ఉంటున్నాయి. ఇక వృద్ధాప్యంలోకి వచ్చిన వారికి కుటుంబ పరంగా తగినంత రక్షణ కూడా ఉండడం లేదు. భవిష్యత్తులో పిల్లలు తమ పెద్దల సంక్షేమ బాధ్యతను కూడా చూడకపోవచ్చన్న అభిప్రాయాన్ని క్రిసిల్ ఫండ్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం డైరెక్టర్ జిజు విద్యాదరణ్ వ్యక్తం చేశారు. ఒకవేళ చూసినా వారిపై ఆర్థికంగా చాలా భారం పడుతుందట!! అందుకే విశ్రాంత జీవనానికి చక్కటి ప్లాన్ అవసరం అన్నారాయన. పింఛనుకూ భరోసా లేదు పింఛనుకూ తగినంత భరోసా లేకుండా పోతోంది. ప్రభుత్వ రంగంలో 2004 మార్చి తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్‌ను ఎన్పీఎస్ పథకంతో ముడిపెట్టారు. ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్ తరహా పథకాలైనా ఉన్నాయి గానీ, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు, స్వయం ఉపాధిపై ఆధారపడిన వారికి ఎటువంటి సామాజిక భద్రతా పథకాలూ లేవు. రిటైర్మెంట్ తర్వాత కనీసం 20, 30 ఏళ్ల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్ అయిన తర్వాత ఖర్చులు తగ్గుతాయన్న ఆలోచన కొందరిలో ఉంటుంది. కానీ అప్పుడే పెరుగుతాయి. ముఖ్యంగా వైద్యం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. హెల్త్ పాలసీ తీసుకున్నా ప్రీమియం రూ.20 నుంచి రూ.30వేల మధ్య ఉంటుంది. ఉదాహరణకు 7 శాతం ద్రవ్యోల్బణం అంచనాతో 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఏడాదికి రూ.3 లక్షలు అవసరం అయితే... ఇదే వ్యక్తికి 80 ఏళ్ల వయసుకు వచ్చే సరికి రూ.96 లక్షలు కావాల్సి ఉంటుంది. ముందు నుంచే... విశ్రాంత జీవనంలో అవసరాలన్నింటినీ అవగాహన చేసుకున్న తర్వాత అందుకు పటిష్టమైన ప్రణాళికను యుక్త వయసు నుంచే ఆచరణలో పెట్టాలి. రిటైర్మెంట్ జీవనం కోసం చిన్న వయసు నుంచే ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే కాంపౌండింగ్ వల్ల భారీ నిధి సమకూరుతుంది. ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అంచనా వేసి, మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర, ఇతర రిస్క్‌లను పరిగణనలోకి తీసుకుని కావాల్సిన నిధి గురించి ఓ అంచనాకు రావచ్చు. ఆ తర్వాత అందుకు తగ్గ సంపదను సమకూర్చే సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నిధులను దారి మళ్లించొద్దు పింఛను కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే అవసరాలకు మళ్లించే పొరపాటు చేయకూడదు. కంపెనీ మారినప్పుడు ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకోకుండా కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవాలి. ఐదేళ్ల లోపు ఈపీఎఫ్ చందాలను వెనక్కి తీసుకుంటే వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌లో ముందస్తు నిధుల ఉపసంహరణ అవకాశాలను తప్పనిసరి సందర్భాల్లోనే వినియోగించుకోవాలన్నది నిపుణులు ఇచ్చే సూచన. ఇక రిటైర్మెంట్ నిధి కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు, అవసరమైనప్పుడు వాటిని సులభంగా వెనక్కి తీసుకునే వెసులుబాటును దుర్వినియోగం చేసుకోకూడదు. ఆర్జనను ఆపొద్దు విశ్రాంత జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే 60 ఏళ్లకే కష్టపడడాన్ని ఆపేసి కాలుపై కాలేసుకుని కూర్చుంటాననడం సరైంది కాదు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నట్టు... శరీరం సహకరించినంత వరకూ పనిచేసుకోవాలని, తద్వారా మరింత ఆర్థిక భద్రతకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. రాబడులను పెంచుకోవాలి... ఈక్విటీల్లో పెట్టుబడులు ద్రవ్యోల్బణం రేటును మించి వేగంగా వృద్ధి చెందుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది కీలకం. ఎందుకంటే వారి ఎన్పీఎస్ పథకంలో ఈక్విటీలో పెట్టుబడులు 15 శాతానికే పరిమితం. అందుకే వారు విడిగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించాలి. ఉద్యోగ పరంగా భద్రత ఎక్కువగా ఉంటుంది గనుక కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుని ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని నిపుణుల సూచన. తద్వారా దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవచ్చంటున్నారు. ఈపీఎఫ్ చందాదారులు కూడా ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించొచ్చు. నిధిని కాపాడుకోవడమూ ముఖ్యమే... ఉద్యోగ జీవితం నుంచి రిటైరయ్యాక విచ్చలవిడిగా ఖర్చు చేయడం తేలికే. అప్పటి వరకు పొదుపు చేసిన నిధి భారీ సంపదగా మారి ఉంటే ఖర్చు విషయంలో నియంత్రణలు అక్కర్లేదు కానీ... పరిమితంగా ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందే. రిటైర్ అయిన తర్వాత కూడా ఈక్విటీల్లో 20 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసుకోవాలనేది నిపుణుల సూచన. రిస్క్ తక్కువగా ఉండే ఈక్విటీ సాధనాలైన ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని వారు చెబుతున్నారు. మరోవైపు డెట్ పథకాలైన ఈపీఎఫ్, పీపీఎఫ్ నిధులను రిటైర్ అయిన వెంటనే వెనక్కి తీసుకోకుండా కొన్నాళ్లు పొడిగించుకోవడం కూడా సరైనదే. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి అధిక రాబడులను ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు పెట్టుకోవడం మరో ఆప్షన్. పన్ను ప్రయోజనాన్ని కల్పించే డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి క్రమానుగతంగా కొద్ది కొద్దిగా ఉపసంహరించుకోవడాన్నీ పరిశీలించొచ్చు. అదే సమయంలో అధిక రాబడుల కోసం భద్రత లేని సాధనాల్లో పెట్టుబడులు పెటొద్దు.