
న్యూఢిల్లీ : నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్) సబ్‌స్క్రైబర్లకు మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పీఎఫ్‌ఆర్‌డీఏ తప్పనిసరి చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. మనీ లాండరింగ్ నివారణ చట్ట మార్గదర్శకాల ప్రకారం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రస్తుతమున్న సబ్‌స్క్రైబర్లకు, కొత్త సబ్‌స్క్రైబర్లకు ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్, సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యురిటైజేషన్ అసెట్ రికన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యురిటీ ఇంటరెస్ట్‌లను తప్పనిసరి చేసింది.
నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను సులభతరం చేసేందుకు, మెరుగుపరుచేందుకు ఎప్పడికప్పుడు పెన్షన్ అథారిటీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే సబ్‌స్క్రైబర్ల ప్రయోజనార్థం, ఆపరేషన్‌ను సులభతరం చేసేందుకు బ్యాంకు అకౌంట్ వివరాలను, మొబైల్ నెంబర్‌ను తప్పనిసరి చేసిన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సబ్‌స్క్రైబర్లు తప్పనిసరి నమోదు చేయాల్సిన వాటిలో వివరాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉందని, వాటిని బ్లాంక్‌గా వదిలేయకూడదని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఒకవేళ బ్లాంక్‌గా వదిలేస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment