అత్యంత ప్రజాదరణ పొందిన పథకంగా అటల్‌ పెన్షన్‌ యోజన | Atal Pension Yojana has most popular social security scheme under NPS | Sakshi
Sakshi News home page

అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక భద్రత పథకంగా అటల్‌ పెన్షన్‌ యోజన

Published Sun, Sep 5 2021 7:14 PM | Last Updated on Mon, Sep 20 2021 11:49 AM

Atal Pension Yojana has most popular social security scheme under NPS - Sakshi

జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక భద్రత పథకంగా ‎అటల్ పెన్షన్ యోజన అవతరించింది. 4.2 కోట్ల చందాదారుల గల నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్‌)లో 66 శాతం లేదా 2.8 కోట్లకు పైగా చందాదారులు 2020-21 చివరిలో ఎపీవైని ఎంచుకున్నారని నేషనల్ పెన్షన్ సిస్టమ్స్(ఎన్‌పీఎస్‌) ట్రస్ట్ వార్షిక నివేదిక తెలిపింది.‎ అసంఘటిత రంగంలో ఉన్న పేద ప్రజలకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకమే ఈ అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) అటల్ పెన్షన్ యోజనను నిర్వహిస్తుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కనీసం 20 సంవత్సరాల పాటు ప్రతి నెల కొత్త మొత్తం పొదుపు చేస్తే ఆ తర్వాత వారికి నెలకు రూ.5,000 పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులకు నెలకు రూ.1000 నుంచి రూ.5000 మధ్య గ్యారెంటీడ్ కనీస నెలవారీ పెన్షన్ అందుతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించింది.(చదవండి: ఈడీ నోటీసులను కోర్టులో సవాల్‌ చేసిన సచిన్ బన్సాల్)

దీనిలో చేరాలంటే బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే సరిపోతుంది. టెర్మినల్ వ్యాధి లేదా ఖాతాదారుడు మరణించిన పరిస్థితుల్లో మినహా పెన్షన్ ముందస్తుగా చెల్లించడం, ఏపీవై నుంచి నిష్క్రమించడం జరగదు. మీరు ముందుగా చేరితే తక్కువ మొత్తం ప్రతి నెల కట్టాల్సి వస్తుంది కాబట్టి త్వరగా మీ పేరు నమోదు చేసుకుంటే మంచిది. ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌) ఈ పథకంలో చేరొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement