న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌కు ఇచ్చిన రాజీనామాను ప్రమోటర్ కిషోర్ బియానీ ఉపసంహరించుకున్నారు. జనవరి 23న ఆయన రాజీనామాను ప్రకటించారు. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్‌పై దివాలా పరిష్కార చర్యలు అమలవుతున్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్ దివాలా పరిష్కార ప్రక్రియను చూస్తున్న నిపుణుడు.. కిశోర్ బియానీ రాజీనామాలోని అంశాల పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
దీంతో కిశోర్ బియానీ మార్చి 10వ తేదీ లేఖతో తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు ఫ్యూచర్ రిటైల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. రుణ దాతలకు రూ 14,809 కోట్ల నష్టానికి మాజీ డైరెక్టర్లు, ప్రస్తుత డైరెక్టర్లు కారణమయ్యారంటూ ఈ వారం మొదట్లో రిజల్యూషన్ ప్రొఫెషనల్, ఫ్యూచర్ రిటైల్ సంయుక్తంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దరఖాస్తు దాఖలు చేయడం గమనార్హం. వారి నుంచి ఈ మొత్తాన్ని వసూలుకు ఆదేశాలు జారీ చేయాలని కోరాయి.
Comments
Please login to add a commentAdd a comment