Executive Chairman
-
గ్లాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 'శ్రీనివాస్ సాదు'
హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ శుక్రవారం (జూన్ 7) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ సీఈఓగా 'శ్రీనివాస్ సాదు'ను నియమించినట్లు ప్రకటించింది. ఈ నెల 10 నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ, న్యూయార్క్ నుంచి ఇండస్ట్రియల్ ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన సాదు.. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ నుంచి ఎంబీఏ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ నుంచి ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ వంటి చదువులు చదువుకున్నారు.వ్యాపార అభివృద్ధి, తయారీ కార్యకలాపాలు, సరఫరా గొలుసు నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలలో సాదుకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. ఈయన గత 22 సంవత్సరాలుగా.. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. 2000లో జనరల్ మేనేజర్‌గా, 2002లో సీనియర్ జనరల్ మేనేజర్‌గా, 2003లో వైస్ ప్రెసిడెంట్‌గా, 2005లో డైరెక్టర్‌గా, 2011లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కాగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
బయోటెక్నాలజీలో సాంకేతికతకు కీలక పాత్ర
న్యూఢిల్లీ: భవిష్యత్తులో బయోటెక్నాలజీ రంగ వృద్ధిలోనూ, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలోనూ సాంకేతికత చాలా కీలక పాత్ర పోషించగలదని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. నియంత్రణ ప్రక్రియలను సంస్కరించేందుకు, నూతన ఔషధాలను చాలా తక్కువ వ్యవధిలోనే మార్కెట్‌కు చేర్చేందుకు, వివిధ రంగాల్లో టెక్నాలజీని మరింత సమర్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఒక ఐడియా అత్యంత తక్కువ సమయంలో, ఏడాది వ్యవధిలోనే ప్రయోగశాల నుంచి మార్కెట్‌కు చేరగలిగితే బాగుంటుందని, ఇందుకోసం మన నియంత్రణ ప్రక్రియలను సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని మజుందార్–షా చెప్పారు. దీనికోసం జనరేటివ్ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటా ఆనలిటిక్స్ మొదలైనవి ఉపయోగపడగలవని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా ఉత్పత్తులను ఆమోదించడానికి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో నియంత్రణ సంస్థలు చాలా నెమ్మదిగా వ్యవహరిస్తుంటాయని మజుందార్–షా తెలిపారు. నియంత్రణ అధికారులకు టెక్నికల్ నైపుణ్యాలు ఉండి, టెక్నాలజీపై అవగాహన ఉంటేనే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. -
హాజీరా స్టీల్ ప్లాంటు పనులు వేగవంతం
అహ్మదాబాద్: హాజీరా ఉక్కు ప్లాంటు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆర్సెలర్‌మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్ తెలిపారు. ఇది 2026 నాటికల్లా అందుబాటులోకి రాగలదని ’వైబ్రెంట్ గుజరాత్’ సదస్సు 20 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 20,000 మంది పైచిలుకు వర్కర్లు పాలుపంచుకుంటున్నారని మిట్టల్ చెప్పారు. ఆర్సెలర్‌మిట్టల్‌లో భాగమైన ఏఎంఎన్ఎస్ ఇండియా గతేడాది అక్టోబర్‌లో హాజీరా ప్లాంటు సామరŠాధ్యలను 15 మిలియన్ టన్నులకు పెంచుకునేందుకు రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తొలి దశలో ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, ఆ తర్వాత మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మిట్టల్ చెప్పారు. భారత్ దిగుమతులను తగ్గించుకుని, స్వావలంబన సాధించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడం భారత్ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేసిందని మిట్టల్ చెప్పారు. అటు, గుజరాత్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇన్వెస్టర్ల సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వెల్స్పన్ సంస్థ చైర్మన్ బీకే గోయెంకా తెలిపారు. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై కసరత్తు చేసేందుకు జపానీస్ వ్యాపార బృందాన్ని నవంబర్‌లో ఆహా్వనించే యోచనలో ఉన్నట్లు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకీ తెలిపారు. తదుపరి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు వచ్చే ఏడాది జనవరి 10–12 మధ్య గాంధీనగర్‌లో నిర్వహించనున్నారు. -
పవన్ ముంజాల్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ ముంజాల్‌తోపాటు ఇతరుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుర్గావ్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు. పవన్ ముంజాల్‌తోపాటు ఇతర నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ గతంలోనే కేసు నమోదు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్(సీబీఐసీ) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తునకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని హీరో మోటో కార్ప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్లో పవన్ ముంజాల్ నివాసం, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిగాయని తెలియజేసింది. పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ గత ఏడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. -
ఫ్యూచర్ రిటైల్‌కు బియానీ రాజీనామా ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌కు ఇచ్చిన రాజీనామాను ప్రమోటర్ కిషోర్ బియానీ ఉపసంహరించుకున్నారు. జనవరి 23న ఆయన రాజీనామాను ప్రకటించారు. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్‌పై దివాలా పరిష్కార చర్యలు అమలవుతున్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్ దివాలా పరిష్కార ప్రక్రియను చూస్తున్న నిపుణుడు.. కిశోర్ బియానీ రాజీనామాలోని అంశాల పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో కిశోర్ బియానీ మార్చి 10వ తేదీ లేఖతో తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు ఫ్యూచర్ రిటైల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. రుణ దాతలకు రూ 14,809 కోట్ల నష్టానికి మాజీ డైరెక్టర్లు, ప్రస్తుత డైరెక్టర్లు కారణమయ్యారంటూ ఈ వారం మొదట్లో రిజల్యూషన్ ప్రొఫెషనల్, ఫ్యూచర్ రిటైల్ సంయుక్తంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దరఖాస్తు దాఖలు చేయడం గమనార్హం. వారి నుంచి ఈ మొత్తాన్ని వసూలుకు ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. -
మిస్త్రీకి టాటా చెల్లదు!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశించింది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే, టాటా సన్స్ స్వరూపాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడం కూడా చెల్లదని ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. వీటికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. ఈ లోగా దీనిపై టాటా గ్రూప్ అప్పీలు చేసుకోవచ్చని ఎన్ఎస్ఎల్ఏటీ తెలిపింది. ‘2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధం. కాబట్టి మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చు. అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధం అవుతుంది’ అని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ తుది ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, డైరెక్టర్ల బోర్డు లేదా వార్షిక సర్వసభ్య సమావేశంలో మెజారిటీ అనుమతులు అవసరమయ్యే ఏ నిర్ణయాలను ముందస్తుగా తీసుకోకూడదంటూ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను, టాటా ట్రస్ట్స్ నామినీని ఆదేశించింది. మిస్త్రీకి వ్యతిరేకంగా ఆర్టికల్ 75లోని నిబంధనలు ప్రయోగించరాదంటూ డైరెక్టర్ల బోర్డుకు, షేర్హోల్డర్లకు సూచించింది. అటు, టాటా సన్స్ స్వరూపాన్ని పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కిందకు మార్చాలన్న కంపెనీల రిజిస్ట్రార్ (ఆర్వోసీ) నిర్ణయాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీన్ని రికార్డుల్లో సత్వరం సరిచేయాలంటూ ఆర్వోసీని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. ఇక, మిస్త్రీకి వ్యతిరేకంగా 2018 జూలై 9న ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా తప్పుబట్టింది. ఇవి మిస్త్రీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయని, వీటిని రికార్డుల నుంచి తొలగించాలని పేర్కొంది. అయితే, మిస్త్రీని డైరెక్టరుగా కొనసాగించడం మినహా... ఆయన్ను చైర్మన్‌గా పునర్నియమించాలన్న ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని టాటా సన్స్ న్యాయవాది ఎన్సీఎల్ఏటీని అభ్యర్థించారు. చట్టపరంగా చర్యలు: టాటా సన్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు చూస్తుంటే అడిగిన దానికి మించే మిస్త్రీకి ఊరటనిచ్చినట్లు కనిపిస్తోందని టాటా సన్స్ వ్యాఖ్యానించింది. టాటా సన్స్, ఇతర లిస్టెడ్ టాటా కంపెనీల షేర్హోల్డర్లు.. చట్టబద్ధంగా షేర్‌హోల్డర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎన్సీఎల్ఏటీ ఏ విధంగా తిరస్కరిస్తుందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంది. ‘మా కేసు బలంగా ఉందని గట్టిగా విశ్వసిస్తున్నాం. తాజా ఆదేశాలకు సంబంధించి చట్టపరంగా ముందుకు వెడతాం‘ అని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తాజా పరిణామాలతో చంద్రశేఖరన్ టాటా గ్రూప్ ఉద్యోగులకు లేఖ రాశారు. లీగల్ అంశాలను సంస్థ చూసుకుంటుందని.. సిబ్బంది తమ కార్యకలాపాలపై దృష్టిపెట్టి, వాటాదారుల ప్రయోజనాలను కాపాడాలని పేర్కొన్నారు. గ్రూప్ కంపెనీల షేర్లు పతనం.. అపీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల నేపథ్యంలో.. టాటా గ్రూప్ కంపెనీల షేర్లు 4 శాతం దాకా క్షీణించాయి. బీఎస్ఈలో టాటా గ్లోబల్ బెవరేజెస్ 4 శాతం, టాటా కాఫీ 3.88 శాతం, టాటా మోటార్స్ 3.05 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాటా మోటార్స్ షేరు అత్యధికంగా క్షీణించింది. అటు ఇండియన్ హోటల్స్ కంపెనీ 2.48 శాతం, టాటా కెమికల్స్ 1.65 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 1.22 శాతం, టాటా పవర్ కంపెనీ 0.98 శాతం తగ్గాయి. మూడేళ్ల పోరాటం.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు టాటా సన్స్‌లో అవకతవకలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులు కాలరాస్తున్నారని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు ఎన్సీఎల్టీని (ముంబై) ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: అప్పటి టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్‌ను చైర్మన్‌గా నియమిస్తున్నట్లు టాటా సన్స్ ప్రకటించింది. ► 2017 ఫిబ్రవరి 6: టాటా గ్రూప్ సంస్థల హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ బోర్డు నుంచి డైరెక్టరుగా మిస్త్రీ తొలగింపు. ► 2017 మార్చి 6: మిస్త్రీ కంపెనీల పిటిషన్‌ను ఎన్సీఎల్టీ కొట్టేసింది. మైనారిటీ షేర్‌హోల్డర్ల తరఫున పిటిషన్ వేయాలంటే 10 శాతం వాటాలైనా ఉండాలన్న నిబంధనకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొంది. మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్‌లో 18.4 శాతం వాటాలు ఉన్నప్పటికీ.. ప్రిఫరెన్షియల్ షేర్లను పక్కన పెడితే కేవలం 3% వాటా మాత్రమే ఉండటం ఇందుకు కారణం. ఆ తర్వాత 10% వాటాల నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ మిస్త్రీ సంస్థలు చేసిన విజ్ఞప్తిని కూడా ఏప్రిల్ 17న ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. ► 2017 ఏప్రిల్ 27: ఎన్సీఎల్టీ ఆదేశాలపై మిస్త్రీ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2017 సెప్టెంబర్ 21: 10 శాతం వాటాల నిబంధన మినహాయింపు విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఎన్సీఎల్ఏటీ.. మిగతా ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఎన్సీఎల్టీని సూచించింది. ► 2017 అక్టోబర్ 5: కేసును ముంబై నుంచి ఢిల్లీకి మార్చాలంటూ ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్‌ను మిస్త్రీ సంస్థలు కోరాయి. అయితే, దీన్ని తిరస్కరించిన ప్రిన్సిపల్ బెంచ్.. రెండు సంస్థలకు కలిపి రూ. 10 లక్షల జరిమానా విధించింది. ► 2018 జూలై 9: టాటా గ్రూప్, రతన్ టాటాపై మిస్త్రీ ఆరోపణల్లో పసలేదని పిటిషన్లను కొట్టేసిన ఎన్సీఎల్టీ (ముంబై) ► 2018 ఆగస్టు 3: ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ మిస్త్రీ సంస్థలు అపీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఆగస్టు 29న మిస్త్రీ వ్యక్తిగత పిటిషన్‌ను కూడా స్వీకరించిన ఎన్సీఎల్ఏటీ.. మిగతా పిటిషన్లతో కలిపి విచారణ చేయాలని నిర్ణయించింది. ► 2019 మే 23: వాదనలు ముగిసిన అనంతరం ఎన్సీఎల్ఏటీ తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా మళ్లీ నియమించాలంటూ ఆదేశాలిచ్చింది. అప్పీలు చేసుకునేందుకు టాటా సన్స్‌కు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ఇది గుడ్ గవర్నెన్స్ విజయం ట్రిబ్యునల్ తీర్పుతో మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులు, గుడ్ గవర్నెన్స్ సూత్రాలకు విజయం లభించింది. ఈ విషయంలో మా వాదనలే నెగ్గాయి. ఎలాంటి కారణం లేకుండా, ముందస్తుగా చెప్పకుండా నన్ను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, ఆ తర్వాత డైరెక్టర్‌గాను తొలగించారు. వీటిని వ్యతిరేకిస్తూ మేం చేసిన వాదనలు సరైనవే అనడానికి తాజా తీర్పు నిదర్శనం. టాటా గ్రూప్ వృద్ధి చెందాలంటే కంపెనీలు, వాటి బోర్డులు, టాటా సన్స్ యాజమాన్యం.. బోర్డు, టాటా సన్స్ షేర్హోల్డర్లు .. అందరూ నిర్దిష్ట గవర్నెన్స్ నిబంధనలకు అనుగుణంగా కలిసి పనిచేయడం, అన్ని వర్గాల ప్రయోజనాలూ పరిరక్షించడం అవసరం. – సైరస్ మిస్త్రీ -
నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 27 నుంచే ఈ నియామకం వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటి వరకు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. అట్టడుగు వర్గాలు, వెనకబడిన వర్గాలకు నిష్పాక్షికమైన, అర్థవంతమైన న్యాయం అందించే లక్ష్యంగా సమీకృత న్యాయ వ్యవస్థను ప్రోత్సహించేందుకు 1987లో నల్సాను స్థాపించారు. జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా(ఎస్సీఎల్ఎస్సీ) కూడా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో ఎస్సీఎల్ఎస్సీలో పెండింగ్ కేసులు తగ్గాయి. జనవరి 2018 లో 3,800 కేసులు ఉండగా.. ఆగస్టు 2019 నాటికి 1811కు తగ్గాయి. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ శుక్రవారం జామ్‌నగర్ హౌజ్‌లోని నల్సా కార్యాలయం సందర్శించారు. నల్సా డైరెక్టర్ సునీల్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించారు. న్యాయ సేవలు అందించడంలో సమర్థతను, న్యాయ సేవలు పొందగలిగే అవకాశాలను పెంపొందించడంపై చర్చించారు. నల్సా భవిష్యత్తు కార్యక్రమాలకు మార్గదర్శకంగా జస్టిస్ ఎన్.వి.రమణ ఒక విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించారు. లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ సమర్థవంతంగా పనిచేసేలా చూడడం, డిజిటైజేషన్ చేయడం, న్యాయ సేవలు పొందడంలో ప్రొటోకాల్ రూపొందించడం వంటి కార్యక్రమాలపై నల్సా దృష్టిపెట్టనుంది. -
గోద్రెజ్‌లో కీలక మార్పు: కొత్త వారసురాలు
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రెజ్ (75)తన వారసత్వ నాయకత్వాన్ని మంగళవారం ప్రకటించారు. గోద్రెజ్ గ్రూపునకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీని తన కుమార్తెకు అప్పగించారు. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను కుమార్తె నిసాబా(39)కు అందజేశారు. దీంతో 17 ఏళ్ళ పాటు కంపెనీకి నాయకత్వం వహించిన ఆది గోద్రెజ్ ఇక మీదట గౌరవ చైర్మన్‌గా ఉంటారు. రెండు నెలల క్రితం ఛైర్మన్‌గా ఆది గోద్రెజ్ రాజీనామా అనంతరం ఈ కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుతం కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్ననిసాబా ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మే 10, 2017నుంచి అమల్లోకి రానుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అతిపెద్ద కంపెనీకి అధిపతి గా వ్యవహరిస్తున్న అతి చిన్న వయస్కురాలిగా నిసాబా నిలిచారు. తన తండ్రి క్రమశిక్షణ, ఫలితాలపై దృష్టి, వినయపూర్వకమైన విధానం తమ గ్రూపు డీఎన్ఏలో ఎల్లప్పుడూ ప్రధానంగా ఉంటుందని నిసాబా వ్యాఖ్యానించారు. అలాగే తాను జీఎస్పీఎల్ బోర్డులో కొనసాగుతాననీ, కంపెనీ ఎండీ, సీఈవోగా వివేక్ గంభీర కొనసాగుతారని ఆది గోద్రెజ్ ప్రకటించారు. జిసిపిఎల్ పునాదులు ఎంతో బలంగా ఉన్నాయనీ, ఇది కొత్త చైర్పర్సన్ కు బదిలీ చేయడానికి అనువైన సమయమని చెప్పారు. నిసాబా నాయకత్వంలో సంస్థ అభివృద్ధి దిశగా పయనిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. వినియోగదారుల వస్తువులు, రియల్ ఎస్టేట్, గృహోపకరణాలు, వ్యవసాయ రంగాలతో సహా వివిధ రంగాలలో సేవలందిస్తున్న ఉన్న గోద్రెజ్ గ్రూప్ లోని ప్రధాన సంస్థ జీసీపీఎల్. 2007 లో ప్రారంభించిన సంస్థ యొక్క అభివృద్ధిలో నిసాబా మాస్టర్ మైండ్ కీలకం. ముఖ్యంగా దేశీయ సేంద్రీయ వృద్ధి ఆవిష్కరణ, స్థిరీకరణ ద్వారా సంస్థను పరుగులు పెట్టించారు. అదే సమయంలో భారతదేశం బైట అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా జీపీసీఎల్ ప్రపంచవ్యాప్తమైంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో 2011 నుంచి పనిచేస్తున్న నిసాబా గత దశాబ్దంలో కంపెనీ వ్యూహంలో మరియు పరివర్తనలో నిసాబా కీలక పాత్ర పోషించారు. ఈ కాలంలో సంస్థ క్యాపిటలైజేషన్ 20రెట్లు అధిగమించింది. రూ. 3వేలకోట్ల నుంచి రూ.60వేల కోట్లకు చేరింది. అలాగే జనవరి మార్చ్ త్రైమాసికంలో అద్భుతమైన లాభాలను ప్రకటించింది. మార్చి 31, 2017 ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో జీసీపీఎల్ రూ. 9,608 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇది రూ. 8,753కోట్లుగాఉంది. కాగా ఆది గోద్రెజ్ ముగ్గురు సంతానంలో నిసాబా రెండవవారు. అతి పెద్ద కుమార్తె తాన్య దుబాష్ గోద్రేజ్ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు కల్పెష్ మెహతాను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు. -
ట్విట్టర్ కొత్త ఈసీగా గూగుల్ మాజీ ఉద్యోగి
న్యూయార్క్: ట్విట్టర్ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా.. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాజీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఒమిద్ కొర్డెస్టానీని నియమించారు. బుధవారం ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ఈ విషాయాన్ని ట్వీట్ చేశారు. 'ఈ రోజు ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఒమిద్ కొర్డెస్టానీని నియమించాం. ఒమిద్ సమర్థత, అనుభవం ఉన్న నాయకుడు. ఆయన మాకు సహాయ సహకారాలు అందిస్తారు. ట్విట్టర్ పురోగతికి సాయపడతారు' అని జాక్ డోర్సీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ 336 ఉద్యోగులను తొలగించిన మరుసటి రోజే కీలక నియామకాన్ని చేపట్టింది. -
ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్
చైర్మన్‌గా శేషసాయి బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి కేవీ కామత్ వైదొలగడంతో .. ఆ స్థానంలో రామస్వామి శేషసాయి నియమితులయ్యారు. బ్రిక్స్ కూటమి దేశాల అభివృద్ధి బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నామినేట్ కావడంతో కామత్ వైదొలిగారు. దీంతో 2011 జనవరి నుంచి కంపెనీ బోర్డులో స్వతంత్ర డెరైక్టరుగా ఉన్న శేషసాయి (67)ని నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమిస్తూ ఇన్ఫీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఆడిట్ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు సారథ్యం వహించడంలో అపార అనుభవం గల శేషసాయి నియామకం.. ఇన్ఫోసిస్ వృద్ధికి తోడ్పడగలదని కామత్ అభిప్రాయపడ్డారు. శేషసాయి ప్రస్తుతం అశోక్ లేల్యాండ్కి వైస్‌చైర్మన్‌గా, ఇండస్ఇండ్ బ్యాంక్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇతరత్రా బాధ్యతలను కొంత మేర తగ్గించుకుని ఇన్ఫోసిస్‌కు మరింత సమయం కేటాయించడంపై దృష్టి పెట్టనున్నట్లు శేషసాయి చెప్పారు. -
ఇన్ఫోటెక్ ఇక సైయంట్
- 3-5 ఏళ్లలో బిలియన్ డాలర్లకు - ప్రత్యేక గుర్తింపుకై పేరు మార్పు - ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్‌ను 1991లో స్థాపించాను. పెట్టుబడి రూ.20 లక్షలు. 6 వేల మంది వాటాదారులున్నారు. నేడు కంపెనీ మార్కెట్ విలువ రూ.4,000 కోట్లకు చేరుకుంది. వాటాదారుల పెట్టుబడికి విలువ చేకూర్చాం. మూడు నుంచి ఐదేళ్లలో బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదుగుతాం. ఈ లక్ష్యంతోపాటు నిర్వహణ లాభం పెంపు, కస్టమర్లు, ఉద్యోగుల సంతృప్తి కూడా మాకు ముఖ్యం అని అంటున్నారు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి. సంస్థ నూతన పేరు సైయంట్ లిమిటెడ్‌ను అధికారికంగా ప్రకటించిన అనంతరం బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ఫోటెక్ పేరు సాధారణంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా నూతన అధ్యాయం రాసేందుకే పేరు మార్చినట్టు పేర్కొన్నారు. సైన్స్, క్లయింట్, ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ల సమ్మేళనమే సైయంట్‌గా అభివర్ణించారు. 12 రంగాల్లో సేవలందిస్తున్నట్టు చెప్పారు. ఇంజనీరింగ్, నెట్వర్క్స్, ఆపరేషన్స్ ఇలా ఆరు విభాగాల్లో నాయకత్వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. మొత్తం ఆదాయంలో 98 శాతం పాత క్లయింట్ల నుంచే సమకూరుతోందని వివరించారు. ఈ ఏడాదీ నియామకాలు.. గత ఆర్థిక సంవత్సరంలో సైయంట్ నికరంగా 1,500 మందిని నియమించింది. 2014-15లో 1,500-1,800 మందిని నియమించనుంది. మూడేళ్లలో కాకినాడ కేంద్రంలో ఉద్యోగుల సంఖ్యను ప్రస్తుతమున్న 1,000 నుంచి 2 వేలకు పెంచనున్నారు. వైజాగ్ కేంద్రంలో 300 మంది ఉద్యోగులున్నారు. రెండేళ్లలో 700 మందిని అదనంగా జతచేయనున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి 500-600 మంది ఫ్రెషర్లను కంపెనీలోకి తీసుకుంటామని సైయంట్ ఎండీ, సీఈవో కృష్ణ బోదనపు సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. సిబ్బందిని ఇబ్బడిముబ్బడిగా చేర్చుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదని మోహన్‌రెడ్డి అన్నారు. ఒక ఉద్యోగి ద్వారా 30 వేల డాలర్ల ఆదాయాన్ని కంపెనీలు ఆశిస్తాయి. ఇప్పు డు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్ల వ్యాపార విధానాలు మారిపోయాయి. ఏటా నికరంగా ఎంత మందిని నియమించుకునేది చెప్పలేమన్నారు. మంచి నాయకత్వంతోనే.. సాఫ్ట్వేర్ రంగం గత మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మందకొడిగా ఉంది. విభజన కారణంగా హైదరాబాద్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. విభజన ప్రక్రియ పూర్తి అయింది కాబట్టి రానున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్‌కు మంచి రోజులొస్తాయి. దూరదృష్టి ఉన్న నాయకత్వంతోనే ఇది సాధ్యపడుతుందని మోహన్‌రెడ్డి అన్నారు. ‘సీమాంధ్రలో వైజాగ్‌తోపాటు ఇతర ప్రధాన నగరాలు అంతర్జాతీయంగా అనుసంధానమవ్వాలి. మంచి పాఠశాలలు, ఆధునిక వైద్యం అందుబాటులోకి రావాలి. అప్పుడే ఉద్యోగులు పనిచేసేందుకు, అలాగే పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తాయి. హైదరాబాద్ మాదిరిగా ఈ ప్రాంతంలోనూ అభివృద్ధి సాధ్యపడుతుంది. మాల్స్, మల్టీప్లెక్స్లున్న నగరాల్లో పని చేయడానికే ఉద్యోగులు ఉత్సాహం కనబరుస్తున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రాలాసియా మార్కెట్లు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపాదిత ఐటీఐఆర్‌లో పెట్టుబడులు రావాలంటే మెట్రో రైల్ వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు.