ట్విట్టర్ కొత్త ఈసీగా గూగుల్ మాజీ ఉద్యోగి
న్యూయార్క్: ట్విట్టర్ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా.. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాజీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఒమిద్ కొర్డెస్టానీని నియమించారు. బుధవారం ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ఈ విషాయాన్ని ట్వీట్ చేశారు.
'ఈ రోజు ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఒమిద్ కొర్డెస్టానీని నియమించాం. ఒమిద్ సమర్థత, అనుభవం ఉన్న నాయకుడు. ఆయన మాకు సహాయ సహకారాలు అందిస్తారు. ట్విట్టర్ పురోగతికి సాయపడతారు' అని జాక్ డోర్సీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ 336 ఉద్యోగులను తొలగించిన మరుసటి రోజే కీలక నియామకాన్ని చేపట్టింది.