Kishore biyani
-
కొనుగోలు చేసేవాళ్లే లేరా.. మూసివేత దిశగా బిగ్‌బజార్?
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) కొనుగోలు చేసేందుకు సరైన కొనుగోలుదారుపై రుణదాతలు ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో సంస్థ మూసివేత దిశగా చర్యలు ప్రారంభం కానున్నాయి. సంస్థ లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ముంబై బెంచ్)లో పరిష్కార నిపుణుడు (ఆర్పీ) దరఖాస్తు సమర్పించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఎఫ్ఆర్ఎల్ తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఎఫ్ఆర్ఎల్కు రూ. 30,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉంది. సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2020లో రిలయన్స్ రిటైల్ ప్రతిపాదించినప్పటికీ .. అమెజాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా రుణదాతలు దాన్ని తిరస్కరించారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌పై 2022 జులై 20 నుంచి దివాలా ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ప్రారంభమయ్యాయి. పరిష్కార చర్యలకు గడువును ఎన్సీఎల్టీ నాలుగు సార్లు పొడిగించినప్పటికీ తగిన పరిష్కారం లభించలేదు. చివరి సారిగా నిర్దేశిత గడువులోగా స్పేస్ మంత్ర రూ. 550 కోట్లకు బిడ్ వేసినప్పటికీ రుణదాతల కమిటీలో (సీవోసీ) దానికి తగినంత స్థాయిలో మద్దతు లభించలేదు. దీంతో ఎఫ్ఆర్ఎల్ లిక్విడేషన్ బాట పట్టనుంది. -
ఫ్యూచర్ ఫోరెన్సిక్ ఆడిట్‌పై కోర్టుకు బియానీ
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) ఫోరెన్సిక్ ఆడిట్ ప్రక్రియపై సంస్థ డైరెక్టర్ కిశోర్ బియానీ తాజాగా బోంబే హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బీడీవో ఇండియా ఆగస్టు 9న సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుతో పాటు మొత్తం ఆడిట్ ప్రక్రియను సవాలు చేస్తూ ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేసినట్లు కంపెనీ తెలిపింది. వివరాల్లోకి వెడితే.. గతేడాది జూలై 20న ఎఫ్‌ఆర్‌ఎల్‌పై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి ముగియాలి. ఇందులో భాగంగా కంపెనీ ఖాతాలను ప్రధాన రుణదాత బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) తరఫున బీడీవో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. దీనిపై తమ సమాధానాలు తెలపాల్సిందిగా కిషోర్ బియానీ, ఆయన సోదరుడు రాకేష్ బియానీకి బీవోఐ సూచించింది. -
కిశోర్ బియానీకి సెబీ జరిమానా
న్యూఢిల్లీ: సెబీ తాజాగా ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన సంస్థలు, వ్యక్తులకు విడిగా రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించింది. వీటిని 45 రోజుల్లోగా చెల్లించాలంటూ ఆదేశించింది. కిశోర్ బియానీ, ఫ్యూచర్ కార్పొరేట్ రీసోర్సెస్(ఎఫ్‌సీఆర్‌ఎల్)సహా 14 సంస్థ లు, వ్యక్తులపై సెబీ జరిమానా విధించింది. ప్రాగ్జిస్ హోమ్ రిటైల్‌లో ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా పెరిగిన నేపథ్యంలో వాటాదారుల(పబ్లిక్)కు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంది. అయితే ప్రాగ్జిస్ హోమ్ రిటైల్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించకపోవడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. తప్పనిసరిగా మార్పిడయ్యే 3,180 డిబెంచర్ల(సీసీడీలు)ను ఈక్విటీగా మార్చడంతో 2020 ఫిబ్రవరి 11కల్లా ప్రాగ్జిస్లో ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా 5.71 శాతం పెరిగింది. తద్వారా ప్రాగ్జిస్ ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా 47.43% నుంచి 53.13 శాతానికి బలపడింది. అయితే ఎస్‌ఏఎస్‌టీ నిబంధనల ప్రకారం ఇప్పటివరకూ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించకపోవడంతో సంబంధిత 15 సంస్థలు, వ్యక్తులకు సెబీ జరిమానా విధించింది. -
ఫ్యూచర్ రిటైల్‌కు బియానీ రాజీనామా ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌కు ఇచ్చిన రాజీనామాను ప్రమోటర్ కిషోర్ బియానీ ఉపసంహరించుకున్నారు. జనవరి 23న ఆయన రాజీనామాను ప్రకటించారు. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్‌పై దివాలా పరిష్కార చర్యలు అమలవుతున్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్ దివాలా పరిష్కార ప్రక్రియను చూస్తున్న నిపుణుడు.. కిశోర్ బియానీ రాజీనామాలోని అంశాల పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో కిశోర్ బియానీ మార్చి 10వ తేదీ లేఖతో తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు ఫ్యూచర్ రిటైల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. రుణ దాతలకు రూ 14,809 కోట్ల నష్టానికి మాజీ డైరెక్టర్లు, ప్రస్తుత డైరెక్టర్లు కారణమయ్యారంటూ ఈ వారం మొదట్లో రిజల్యూషన్ ప్రొఫెషనల్, ఫ్యూచర్ రిటైల్ సంయుక్తంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దరఖాస్తు దాఖలు చేయడం గమనార్హం. వారి నుంచి ఈ మొత్తాన్ని వసూలుకు ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. -
ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్‌పై దివాలా పరిష్కార చర్యలకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ అనుమతించింది. ఈ సంస్థను వేలం వేయడం ద్వారా రుణదాతలు తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి మార్గం సుగమం అయింది. బియానీకి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ సైతం దివాలా చర్యల పరిధిలోకి వెళ్లడం తెలిసిందే. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను చూసేందుకు పరిష్కార నిపుణుడిని ముంబై బెంచ్ నియమించినట్టు ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. పరిష్కార నిపుణుడి నియామకంతో కంపెనీ బోర్డు రద్దయిపోయింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ తమకు రూ.1.58 కోట్లు చెల్లించడంలో విఫలమైందంటూ ఢిల్లీకి చెందిన సరఫరాదారు ఫోర్‌సైట్ ఇన్నోవేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. -
ఫ్యూచర్ రిటైల్ చైర్మన్‌గా బియానీ రాజీనామా
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ రిటైల్ చైర్మన్, డైరెక్టరు పదవులకు కిశోర్ బియానీ రాజీనామా చేశారు. ‘దురదృష్టకరమైన వ్యాపార పరిస్థితుల ఫలితంగా‘ సంస్థ సీఐఆర్‌పీని ఎదుర్కొనాల్సి వస్తోందంటూ పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) పంపిన రాజీనామా లేఖలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కంపెనీపై అభిరుచితో తాను సంస్థ వృద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డానని, కానీ ప్రస్తుత వాస్తవ పరిస్థితులను బట్టి ముందుకు సాగాల్సి వస్తోందని బియానీ పేర్కొన్నారు. కంపెనీని ఆర్పీ తన ఆధీనంలోకి తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియ అంతా పూర్తి చేసినట్లు భావిస్తున్నానని ఆయన తెలిపారు. తాను తప్పుకున్నప్పటికీ రుణదాతలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. భారత్‌లో ఆధునిక రిటైల్ కు ఆద్యుడిగా బియానీ పేరొందారు. బిగ్ బజార్, ఈజీడే, ఫుడ్‌హాల్ వంటి బ్రాండ్స్ కింద ఒక దశలో 430 నగరాల్లో 1,500 అవుట్‌లెట్స్‌ను ఎఫ్ఆర్ఎల్ నిర్వహించింది. అయితే, రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో కంపెనీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా పిటీషన్ వేసింది. -
ఫ్యూచర్ లైఫ్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 136 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 348 కోట్ల నష్టాలు ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతంపైగా నీరసించి రూ. 273 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 298 కోట్ల ఆదాయం అందుకుంది. మొత్తం వ్యయాలు 33 శాతంపైగా క్షీణించి రూ. 437 కోట్లకు చేరాయి. గత క్యూ1లో ఇవి రూ. 656 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. రుణదాతలతో కుదిరిన వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రానున్న 12 నెలల్లోగా అసలు రూ. 422 కోట్లు చెల్లించవలసి ఉన్నట్లు ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ తెలియజేసింది. వీటిలో దీర్ఘకాలిక రుణాల వాటా రూ. 277 కోట్లుకాగా.. స్వల్పకాలిక రుణాలు రూ. 145 కోట్లుగా తెలియజేసింది. ఈ జూన్ 30కల్లా బ్యాంకులకు చెల్లించవలసిన రూ. 335 కోట్ల రుణ చెల్లింపుల్లో ఇప్పటికే విఫలమైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆస్తుల కంటే అప్పులు రూ. 1,181 కోట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
రిలయన్స్‌తో ఒప్పందంపై ఫ్యూచర్‌కు ఊరట!
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌కు తన గ్రూప్ సంస్థల విక్రయానికి సంబంధించి కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌కు ఊరట లభించింది. ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మంగళవారం కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్‌కు అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుచిత్ర కనుపర్తి, చంద్రభన్‌సింగ్ లతో కూడిన ఇరువురు సభ్యుల ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తోసిపుచ్చినట్లు సమాచారం.అయితే ఈ వార్తలపై పంపిన ఈమెయిల్స్‌కు అటు అమెజాన్‌కానీ, ఇటు ఫ్యూచర్‌కానీ సమాధానం ఇవ్వలేదు. అమెజాన్‌కు తక్షణం నష్టం లేదు సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఒకవేళ ఫ్యూచర్ జరిపే ఈజీఎం గ్రూప్ సంస్థల విక్రయానికి ఆమోదముద్ర వేసినప్పటికీ, సంబంధిత స్కీమ్‌కు ఎన్సీఎల్టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్ ఎన్సీఎల్టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్సీఎల్టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్‌కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ, తుది ఉత్తర్వుఇవ్వవద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోదముద్ర పొందితే, ‘తరువాత ఆర్ర్‌బిట్రేషన్ పక్రియలో విజయం సాదిస్తే’ రిలయన్స్‌తో ఒప్పందం ప్రక్రియ పూర్తికి ఐదారు నెలల సమయం ఆదా అవుతుందనీ వివరించింది. సుదీర్ఘ న్యాయ వివాదం రిలయన్స్‌కు ఫ్యూచర్ గ్రూప్‌ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్‌బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్ వచ్చింది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: అమెజాన్ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్ఆర్ఎల్ -
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌పై సుప్రీంకు అమెజాన్
ముంబై: ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్స్ రిటైల్ గ్రూప్ విలీన ప్రక్రియను కొనసాగించేందుకు కిశోర్ బియానీకి అనుమతి ఇస్తూ ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. అమెజాన్ తన పిటిషన్ లో హైకోర్టు 22 మార్చి డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును "చట్టవిరుద్ధం" అన్యాయమని పేర్కొంది. రూ.24,713 కోట్లకు రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్(ఎఫ్‌సీపీఎల్)లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ.24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి (ఆర్ఐఎల్) విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌కు అనుమతుల కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్ తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్ఆర్ఎల్ ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్‌ని ఆశ్రయించింది. చదవండి: జియో ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్! -
కిషోర్ బియానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రిటైల్, హోల్‌సేల్ వ్యాపారం అమ్మకానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందంపై ముందుకు వెళ్లకుండా ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)ను తీవ్ర స్థాయిలో నిరోధిస్తూ 2021 మార్చి 18న జేఆర్ మిథా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన 134 పేజీల తీర్పుపై డివిజనల్ బెంచ్ సోమవారం తదుపరి విచారణ వరకూ స్టే విధించింది. ఫ్యూచర్ రిటైల్ దాఖలు చేసిన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం అనుమతిస్తూ, ఈ కేసులో ప్రతివాదైన గ్లోబల్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 18న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు అన్నింటిపై స్టే విధించాలన్న ఫ్యూచర్ గ్రూప్ తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో సింగిల్ జడ్జి గత మధ్యంతర ఉత్తర్వులపై డివిజనల్ బెంచ్ స్టే విధించడం, అనంతరం కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు కూడా వెళ్లడం వంటి అంశాల నేపథ్యంలో కేసులో మార్చి 18న సింగిల్ జడ్జి తుది తీర్పు ఎలా ఇస్తారని సాల్వే వాదించారు. ఆయా వాదనలతో ఏకీభవించిన హైకోర్డు డివిజనల్ బెం చ్, సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించి తదుపరి కేసు విచారణను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: (రూ.24,713 కోట్ల ఒప్పందం.. ఫ్యూచర్ గ్రూప్ మరో అడుగు) న్యాయపోరాటం ఇదీ... ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్ (ఎఫ్‌సీపీఎల్)లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి (ఆర్ఐఎల్) విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌కు అనుమతుల కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్.. తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్ఆర్ఎల్.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్‌ని ఆశ్రయించింది. అమెజాన్‌తో ఎఫ్‌సీపీఎల్ ఒప్పంద నిబంధనలు, ఆర్ఐఎల్–ఎఫ్ఆర్ఎల్ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ లోపునే ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఫ్యూచర్ గ్రూప్‌ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కీలక ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్చూచ్ గ్రూప్ ఆ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలు శిక్ష ఎందుకు విధించరాదని ప్రశ్నిస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచ్చింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. -
రూ.24,713 కోట్ల ఒప్పందం.. ఫ్యూచర్ గ్రూప్ మరో అడుగు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు తన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారం అమ్మకానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందంపై గ్లోబల్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ ఒప్పందంపై ముందుకు వెళ్లకుండా తనను తీవ్రస్థాయిలో నియంత్రిస్తూ, గురువారం నాడు (2021 మార్చి 18) జేఆర్ మిథా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన 134 పేజీల తీర్పును డివిజనల్ బెంచ్ వద్ద అప్పీల్ చేసినట్లు ఫ్యూచర్ రిటైల్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. డివిజనల్ బెంచ్ క్రితం మధ్యంతర స్టే ఉత్తర్వులు వెకేట్ కాలేదు... ఫ్యూచర్ రిటైల్ శుక్రవారం నాడు ఒక కీలక ప్రకటన చేస్తూ, ఈ కేసుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు జరుగుతున్న విచారణపై సింగిల్ జడ్జి తీర్పు ఎటువంటి ప్రభావాన్ని చూపబోదని స్పష్టం చేసింది. రిలయన్స్‌తో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ ఒప్పంద అమలు విషయంలో ఎన్సీఎల్టీ ఇప్పటికే తన ఉత్తర్వులను రిజర్వ్ చేసిన విషయాన్ని ఆ ప్రకటనలో ఫ్యూచర్ ప్రస్తావించింది. ఈ అంశానికి సంబంధించి 2021 ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను ఫ్యూచర్స్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. రిలయన్స్‌తో ఫ్యూచర్స్ ఒప్పందంపై ఎన్సీఎల్టీ ప్రొసీడింగ్స్ యధావిధిగా కొనసాగవచ్చని, అయితే తుది ఉత్తర్వులు మాత్రం ఇవ్వడానికి లేదని 2021 ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టు తన రూలింగ్‌లో స్పష్టం చేసిన విషయాన్ని కిషోర్ బియానీ నేతృత్వంలోని సంస్థ ప్రస్తావించింది. అదే విధంగా సింగిల్ జడ్జి ఇప్పుడు ఇచ్చిన తీర్పులో కొన్ని, కీలక ప్రధాన అంశాలు 2021 ఫిబ్రవరి 2వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో (ఒప్పందంపై ముందుకు వెళ్లవద్దని ఫ్యూచర్‌ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు) కూడా ఉన్నాయని ఫూచర్స్ ప్రస్తావిస్తూ, దీనిపై తాము వేసిన అప్పీల్‌కు చీఫ్ జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ 2021 ఫిబ్రవరి 8న సానుకూలమైన రూలింగ్ ఇస్తూ, సిం గిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. దీనిపై అమెజాన్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, సింగిల్ జడ్జి (2021 ఫిబ్రవరి 2న ఇచ్చిన) మధ్యంతర ఉత్తర్వులపై డివిజనల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం ‘వెకేట్’ చేయలేదన్నది కీలకమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ‘స్టే’ ఆదేశాలు ఇప్పటికీ అమల్లోనే ఉన్నట్లు భావించాలని తమకు న్యాయ నిపుణులు సూచనలు ఇస్తున్నట్లు తెలిపింది. వివరాలు ఇలా..: ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్ (ఎఫ్‌సీపీఎల్)లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి (ఆర్ఐఎల్) విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌కు అనుమతుల కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్.. తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్ఆర్ఎల్.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్‌ని ఆశ్రయించింది. అమెజాన్‌తో ఎఫ్‌సీపీఎల్ ఒప్పంద నిబంధనలు, ఆర్ఐఎల్–ఎఫ్ఆర్ఎల్ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్ .. సుప్రీంను ఆశ్రయించింది. ఈ లోపు ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఫ్యూచర్ గ్రూప్‌ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కీలక ఆదేశాలు ఇచ్చింది. -
హైకోర్టు షాక్ : ఫ్యూచర్ గ్రూపు షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ తగిలింది. రిలయన్స్ రీటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ కిషోర్ బియానీ డీల్‌కు బ్రేక్ పడిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ గ్రూపు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ముఖ్యంగా ఫ్యూచర్ రిటైల్ రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేసింది. దాదాపు 11 శాతం కుప్పకూలి లోయర్ సర్క్యూట్ అయింది. అంతేకాదు తాజా పరిణామంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,029 కోట్లకు పడిపోయింది. (రిలయన్స్ డీల్‌కు బ్రేక్ : బియానీకి భారీ ఎదురుదెబ్బ) ఫ్యూచర్ రిటైల్ మాత్రమే కాదు, అనేక ఇతర ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి. ఫ్యూచర్ కన్స్యూమర్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో 9.15 శాతం పడిపోగా, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 8.95 శాతం క్షీణించింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ షేర్లు కూడా దాదాపు 10 శాతం, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ షేర్లు 4.99 శాతం తగ్గాయి. గడువులోగా అన్ని రెగ్యులేటరీ ఆమోదాలను పొందడంలో ఫ్యూచర్ రిటైల్ విఫలమైతే, రిలయన్స్ ఈ ఒప్పందానికి దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రభావితమైంది. కాగా ఫ్యూచర్ రిటైల్ రూ .24,713 కోట్ల ఒప్పందానికి వ్యతిరేకంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సియాక్) జారీ చేసిన ఎమర్జెన్సీ అవార్డు (ఇఎ) ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు గురువారం రద్దు చేసింది. కంపెనీ ఉద్దేశపూర్వంగానే ఉత్తర్వులను నిర్లక్క్ష్యం చేసిందని పేర్కొన్న కోర్టు, బియానీతో ఇతర ప్రముఖుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ డీల్‌కు బ్రేక్ : బియానీకి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్‌తో న్యాయపోరాటంలో ఫ్యూచర్ గ్రూప్‌నకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో న్యాయస్థానం పేర్కొంది.(మాల్యా, మోదీ, మెహెల్‌కు నిర్మలాజీ షాక్) కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని, ఈ ఒప్పందంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు జస్టిస్ జెఆర్ మిధా ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూపుకు సంబంధించిన బియానీ, ఇతరుల ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలులో ఎందుకు ఉంచకోడదని ప్రశి్నస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచి్చంది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. -
గందరగోళం సృష్టిస్తోంది..
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో డీల్ విషయంలో మోకాలడ్డుతున్న అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్ కిషోర్ బియానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు అక్కరకు రాని వ్యవహారంలో తలదూరుస్తూ అమెజాన్ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఫ్యూచర్ గ్రూప్ ఉద్యోగులకు లేఖ రాశారు. అమెజాన్‌తో వివాదం విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు బియానీ ప్రయత్నం చేశారు. ‘అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని గెలిచినా.. భారత్‌లో విఫలమయ్యాడని చరిత్ర చెబుతోంది. భారతీయ వినియోగదారులకు అందిస్తున్న సేవలు, మీ అండతో దేశ ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూప్ చట్టబద్ధంగానే ముందుకు సాగుతోందని .. స్టాక్ ఎక్సే్చంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి కూడా డీల్‌కు అనుమతులు పొందిందని పేర్కొన్నారు. లిటిగేషన్లతో వేధిస్తోంది ..అమెజాన్ ఒక ప్రణాళిక ప్రకారం మీడియాలో దుష్ప్రచారం సాగిస్తోందని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని లీక్ చేస్తోందని కిషోర్ బియానీ ఆరోపించారు. ఫ్యూచర్ రిటైల్, డైరెక్టర్ల బోర్డు, రుణదాతలతో పాటు తనతో పాటు తండ్రి, పిల్లలు, కుటుంబసభ్యులను కూడా విడిచి పెట్టడం లేదని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పరమైన ఆర్థిక సంక్షోభం కారణంగా రిలయన్స్ గ్రూప్‌తో నిర్మాణాత్మక డీల్ కుదుర్చుకోవడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్లిస్టేడ్ సంస్థ ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు 2019 ఆగస్టులో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్యూచర్ కూపన్స్‌కి వాటాలు ఉన్న ఫ్యూచర్ రిటైల్ సంస్థలో కొన్నేళ్ల తర్వాత అమెజాన్ కూడా వాటాలు కొనుగోలు చేయొచ్చు. అయితే, కరోనా దెబ్బతో రిటైల్‌ను రిలయన్స్‌కు సుమారు రూ. 24,713 కోట్లకు విక్రయించాలని ఫ్యూచర్ గ్రూప్ నిర్ణయించుకోవడంతో వివాదం వచ్చి పడింది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా .. దానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. మరోవైపు, ఫ్యూచర్ గ్రూప్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నియంత్రణ సంస్థలు దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. ఒప్పంద ఉల్లంఘనకు గాను బియానీని అరెస్ట్ చేయడంతో పాటు ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది. -
అమెజాన్ : కిషోర్ బియానీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు 3.4 బిలియన్ డాలర్ల రిలయన్స్ రీటైల్ డీల్ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ అలుపెరుగని పోరాటం చేస్తోంది. మరోవైపు ఈ ఒప్పందం అమలును అడ్డుకునేందుకు అమెజాన్ ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఫ్యూచర్ గ్రూపు సీఈఓ కిషోర్ బియానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరికలాంటిదే అమెజాన్ ప్రయస కూడా అని అభివర్ణించారు. ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకు వీరుడు ఇండియాలో తోక ముడిచాడనేది చరిత్ర చెబుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. (బియానీని అరెస్ట్ చేయండి!) రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ ఆస్తుల విక్రయం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్న అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బియానీ తాజా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారతీయ కస్టమర్లపై ఆధిపత్యం కోసం అమెజాన్ చేస్తున్న కార్పొరేట్ యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక అంతర్గత లేఖ రాశారు. రిలయన్స్ రీటైల్ ఒప్పందానికి సంబంధించి అన్ని నిబంధనలను పాటించామని, రెగ్యులేటరీ ఇటీవలి ఆమోదమే ఇందుకు నిదర్శనమన్నారు. 1,700 దుకాణాలు, వేలాది మంది ఉద్యోగుల మనుగడకు ఈ ఒప్పందం కీలకమని తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ నిరాకరించింది. (అమెజాన్‌కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ) -
బియానీని అరెస్ట్ చేయండి!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ ఆస్తుల విక్రయ ప్రక్రియపై అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం– అమెజాన్ సోమవారం కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. స్థిర, చర ఆస్తులుసహా బియానీ కుటుంబ సభ్యుల ఆస్తులన్నింటినీ వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వాటిని జప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. బియానీ, ఆయన కుమార్తె అష్ని, వ్యవస్థాపక కుటుంబంలోని ఏడుగురు సభ్యులు, అలాగే కంపెనీ సెక్రటరీసహా ముగ్గురు ఇతర అధికారులను ‘‘అదుపు’’లోకి తీసుకోవాలని కోరింది. ఫ్యూచర్ గ్రూప్ సంస్థల డైరెక్టర్లను అరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వమని అభ్యర్థించింది. న్యాయ వ్యవస్థలపై గౌరవం లేదు! రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కు ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ ఆస్తుల విక్రయ ప్రక్రియను వెంటనే నిలుపుచేయాలని కూడా అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం– అమెజాన్ హైకోర్టును కోరింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, అలాగే స్టాక్ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా అంశాలకు సంబంధించి తనకు అనుకూలంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ (ఈఏ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను భారతీయ చట్టాల (ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ అలాగే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఆర్డర్ 39 రూర్ 2ఏ) ప్రకారం అమలు చేయవచ్చని, తద్వారా తన ప్రయోజనాలు కాపాడాలని తన తాజా పిటిషన్లో అమెజాన్ పేర్కొంది. ఫ్యూచర్–రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఒప్పందానికి సెబీ, స్టాక్ ఎక్సేంజీలు అనుమతి ఇచ్చిన కేవలం కొద్ది రోజులకే అమెజాన్ ఈ విషయంలో తాజా అడుగులు వేయడం గమనార్హం. భారత్‌లో రెగ్యులేటరీ సంస్థ ఇచ్చిన ఎటువంటి ఆదేశాలూ ప్రతివాది ఫ్యూచర్ గ్రూప్ అమలు పరచలేకుండా తగిన ‘‘ఇంజెన్షన్’’ ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్లో అమెజాన్ కోరడం గమనార్హం. లేదంటే అమెజాన్ గతేడాది ఆగస్టులో ఫ్యూచర్ కూపన్స్‌లో కొనుగోలు చేసిన 49 శాతం వాటాల ప్రయోజనాలు పొందలేదని స్పష్టం చేసింది. నిజానికి ఎస్ఐఏసీ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు జనవరి 23 వరకే అమల్లో ఉంటాయి. ఈ ఉత్తర్వులను పొడిగించాల్సి ఉంది. అయితే ఎస్ఐఏసీ మధ్యంతర ఆదేశాల పునఃపరిశీలన లేదా సవరణ, సడలింపు, ఎత్తివేతలకు సంబంధించి ఎవ్వరూ (వివాదంలోని ఏ పార్టీ) తదుపరి పిటిషన్ వేయనందున ఆర్బిట్రేషన్ ఉత్తర్వుల గడువు సాంకేతికంగా ఆటోమేటిక్(దానికదే)గా పెరుగుతుందని తన పిటిషన్లో అమెజాన్ పేర్కొనడం గమనార్హం. ఎస్ఐఏసీ ఆదేశాలను గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్, ప్రమోటర్లు తదితర ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడంలేదనీ అమెజాన్ తాజా పిటిషన్లో ఆరోపించింది. కనీసం ఈఏ ఆదేశాలను సవాలు చేయడం లేదని పేర్కొంది. న్యాయం, చట్టం అమలు, ఆర్బిట్రల్ ప్రక్రియ, బాధ్యతల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందని పేర్కొంది. కొనుగోలు హక్కు మాకే: అమెజాన్ ► ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్‌కు కూడా ఎఫ్‌ఆర్‌ఎల్‌లో సాంకేతికంగా వాటాలు సంక్రమించినట్లయింది. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ► ఇటీవలి కరోనా ప్రేరిత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) విక్రయిస్తున్నట్లు గతేడాది ఆగస్టు 29న ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. ∙ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకిస్తోంది. న్యాయపోరాటంలో ఇప్పుడు అమెజాన్ (తాజాగా ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌తో) కొత్త అడుగు వేసినట్లయ్యింది. ► ఎన్బీఎఫ్సీ సంస్థ కేన్ ఫిన్ హోమ్స్ ఈ ఏడాది(2020–21) మూడో త్రైమాసికంలో రూ. 132 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 24 శాతం వృద్ధికాగా.. గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో రూ. 107 కోట్ల లాభం నమోదైంది. -
అమెజాన్‌కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో (ఆర్ఐఎల్) రిటైల్ ఆస్తుల విక్రయానికి కుదుర్చుకున్న ఒప్పందం సెబీ ఆమోదం లభిస్తే రెండు నెలల్లోపే పూర్తవుతుందన్న ఆశాభావాన్ని ఫ్యూచర్ గ్రూపు అధినేత కిశోర్ బియానీ వ్యక్తం చేశారు. ఫ్యూచర్ గ్రూపు పరిధిలో ఉన్న అన్ని రకాల రిటైల్, లాజిస్టిక్స్ ఆస్తుల విక్రయానికి ఆయన గతేడాది ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికే ఫ్యూచర్ రిటైల్‌లో పరోక్షంగా 5 శాతం వాటా కలిగిన అమెజాన్ దీన్ని వ్యతిరేకిస్తూ సింగపూర్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లడంతో డీల్‌కు అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ అంశంలో కాంట్రాక్టు ఉల్లంఘన జరగనందున ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఫ్యూచర్ గ్రూప్ అమెజాన్‌కు స్పష్టం చేసింది. ఈ వివాదంపై బియానీ తన అంతరంగాన్ని ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. ‘‘ఒక్కసారి సెబీ ఆమోదం లభిస్తే ఎన్సీఎల్టీ, వాటాదారుల ఆమోదం తీసుకుంటాము. ఇందుకు 45-60 రోజులు పట్టొచ్చు. జనవరి చివర్లో ఆర్బిట్రేషన్ మొదలవుతుంది. డీల్, ఆర్బిట్రేషన్ ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతాయి. ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని గ్రూపుతో చేసుకున్న డీల్.. ఫ్యూచర్ గ్రూపు పరిధిలోని ఒకసంస్థ(ఫ్యూచర్ కూపన్స్)లో అమెజాన్‌కు ఉన్న వాటాకు సంబంధించినది కాదు’’అని కిశోర్ బియానీ వివరించారు. లాక్‌డాన్ కారణంగా తమ ఫ్యూచర్ రిటైల్ వ్యాపారం తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లి, రుణ భారం భారీగా పెరిగిపోవడంతో సాయం కోసం అమెజాన్‌ను ఎన్నో సందర్భాలు సంప్రదించినా ఫలితం దక్కలేదని స్పష్టం చేశారు. ‘‘కోవిడ్, లాక్డౌన్ ఆరంభం నుంచి అమెజాన్‌తో అదే పనిగా సంప్రదింపుల్లోనే ఉన్నాము. ఈ విషయమై వారికి అవగాహన లేకపోవడం అన్న ప్రశ్నే లేదు. షేర్ల ధరలు పడిపోవడంతో తనఖాలో ఉంచిన షేర్ల విక్రయం విషయమై గతేడాది మార్చిలో అమెజాన్‌కు లేఖ కూడా రాయడం జరిగింది’’ అని బియానీ వివరించారు. అయినా, చూద్దాంలేనన్న స్పందన అమెజాన్ నుంచి వ్యక్తమైనట్టు చెప్పారు. (జెఫ్ బెజోస్ టాప్ : మరో రికార్డు) వాస్తవం కాదు..: అమెజాన్ ‘‘ఫ్యూచర్ రిటైల్‌కు ఎటువంటి సాయాన్ని ఆఫర్ చేయలేదనడం నిజం కాదు. ఒకవైపు భాగస్వాములతో పలు అవకాశాల పట్ల చర్చిస్తూనే..మరోవైపు ఫ్యూచర్ గ్రూపు ప్రమోటర్లతోనూ సంప్రదింపులు కొనసాగించాము. టర్మ్ షీట్‌పై సంతకం కూడా చేశాము’’ అంటూ అమెజాన్ అధికార ప్రతినిధి స్పందించారు. కాగా ముకేశ్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో 24,000 కోట్ల రూపాయల డీల్ తరువాత ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య వివాదం నెలకొంది. ఆర్ఐఎల్తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని,ఇందుకు తమకునష్టపరిహారం చెల్లించాల్సి ఉందని అమెజాన్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. -
ఫ్యూచర్ గ్రూప్ షేర్లకు ఆర్ఐఎల్ జోష్
దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)తో డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో 20-5 శాతం మధ్య జంప్‌చేశాయి. లడఖ్ తూర్పు ప్రాంతంలో సరిహద్దు వద్ద చైనా బలగాలతో తిరిగి సైనిక వివాదాలు తలెత్తినట్లు వెలువడిన వార్తలు మార్కెట్లను ఒక్కసారిగా దెబ్బతీశాయి. అయినప్పటికీ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్.. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో చేరనుండటంతో ఈ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఈ డీల్‌పై అంచనాలతో ఫ్యూచర్ గ్రూప్ షేర్లలో ర్యాలీ కొనసాగుతున్న విషయం విదితమే. షేర్ల జోరు ఆర్ఐఎల్తో డీల్ నేపథ్యంలో అమ్మకందారులు కరువుకావడంతో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలన్నీ అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ 20 శాతం దూసుకెళ్లి రూ. 162కు చేరగా.. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ 5 శాతం జంప్‌చేసి రూ. 153ను చేరింది. ఇతర కౌంటర్లలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 5 శాతం ఎగసి రూ. 21 వద్ద, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 5 శాతం బలపడి రూ. 159 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 28 వద్ద ఫ్రీజయ్యింది. ఇక ఫ్యూచర్ కన్జూమర్ 5 శాతం పుంజుకుని రూ. 12 వద్ద కదులుతోంది. రూ. 24,713 కోట్లు వారాంతాన కుదర్చుకున్న డీల్‌లో భాగంగా ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లతోపాటు.. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాలను ఆర్ఐఎల్ రూ. 24,713 కోట్లకు సొంతం చేసుకోనుంది. సూపర్ మార్కెట్ చైన్ బిగ్బజార్సహా.. ఫుడ్‌హాల్, క్లాతింగ్ చైన్ బ్రాండ్ ఫ్యాక్టరీలను ఫ్యూచర్ గ్రూప్ నిర్వహిస్తోంది. వివిధ విభాగాల నిర్వహణకు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ సప్లైచైన్ సొల్యూషన్స్‌ను కిశోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ సామ్రాజ్యంలోకి ఫ్యూచర్ గ్రూప్..
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన వ్యూహలతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రపంచ వ్యాప్త దిగ్గజ కంపెనీగా తీర్చిదిద్దాడు. తాజాగా ప్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేసినట్లు శనివారం రిలయన్స్ ప్రకటించింది. కాగా ప్యూచర్ గ్రూప్‌కు చెందిన వేర్‌హౌస్, హోల్‌సేల్, లాజిస్టిక్, రిటైల్ బిజినెస్ తదితర విభాగాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. అయితే ప్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేయడానికి డీల్ విలువ రూ.24,713 కోట్లు కుదుర్చుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఫ్యూచర్ గ్రూప్ విభాగాలైన ఫాషన్ లైఫ్ స్టైల్ తదితర బ్రాండ్స్ రిలయెన్స్ రిటైల్ వెంచర్లోకి రానున్నాయి. కాగా భారీ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరక్టర్ ఇషా అంబానీ తెలిపింది. తాజా కొనుగోలుతో దాదాపుగా 1800 రిటైల్స్ స్టోర్స్ రిలయన్స్ స్వంతం కానున్నాయి. మరోవైపు రిలయన్స్ కొనుగోలు చేసిన ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్, ఈజీ డే, ఎఫ్‌బీబీ, సెంట్రల్, ఫుడ్ హాల్స్ లాంటి ఫార్మాట్లను దేశవ్యాప్తంగా 420 పట్టణాల్లో నిర్వహిస్తుందని ఇషా అంబానీ పేర్కొంది. -
ముకేశ్ చేతికి ఫ్యూచర్ గ్రూప్ రిటైలింగ్!
కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రిటైల్ బిజినెస్‌ను బిలియనీర్ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో నగదు రూపేణా డీల్ కుదుర్చుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. డీల్ విలువ రూ. 30,000 కోట్లవరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఒకే సంస్థగా.. రుణ భారంతో కొద్ది రోజులుగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చర్చలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తద్వారా రిటైల్ బిజినెస్‌ను ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం ఆర్ఐఎల్కు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. డీల్‌పై అంచనాలు ఎలా ఉన్నాయంటే.. తొలుత గ్రోసరీ, దుస్తులు, సప్లై చైన్, కన్జూమర్ బిజినెస్‌లతో కూడిన ఐదు లిస్టెడ్ కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనం కానున్నాయి. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం గ్రూప్‌నకు చెందిన రిటైల్ బ్యాకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెరసి ఫ్యూచర్ రిటైల్, లైఫ్‌స్టైల్, సప్లై చైన్, మార్కెట్స్ కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనంకానున్నట్లు అంచనా. విలీనం తదుపరి మొత్తం రిటైల్ ఆస్తులను ఒకే యూనిట్‌గా ఆర్ఐఎల్కు విక్రయించనుంది. చెల్లింపులు ఇలా! పరిశ్రమవర్గాల అంచనా ప్రకారం రిలయన్స్ తొలుత రూ. 13,000 కోట్లను ఫ్యూచర్ గ్రూప్ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మరో రూ. 7,000 కోట్లను భూయజమానులు, వెండార్స్‌కు చెల్లించనుంది. మరో రూ. 7,000 కోట్లవరకూ ప్రమోటర్ గ్రూప్‌నకు విడుదల చేసే అవకాశముంది. తదుపరి దశలో రూ. 3,000 కోట్లు వెచ్చించడం ద్వారా ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 16 శాతం వరకూ వాటాను సొంతం చేసుకోనుంది. ఫ్యూచర్ కన్జూమర్‌కు చెందిన ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులు, టెక్స్టైల్ మిల్స్, బీమా విభాగాలను ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కలిగి ఉండవచ్చని అంచనా. ఫుడ్, ఫ్యాషన్ సరఫరాలకు వీలుగా ఆర్ఐఎల్తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కుదుర్చుకోనుంది. ఈ వివరాలపై రెండు కంపెనీలూ స్పందించేందుకు నిరాకరించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. షేర్ల జోరు బోర్డు సమావేశం నేపథ్యంలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలన్నీ లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ 4.3 శాతం జంప్‌చేసి రూ. 136కు చేరగా.. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ 4.7 శాతం ఎగసి రూ. 145ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 2 శాతం ఎగసి రూ. 19.6 వద్ద, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 2 శాతం బలపడి రూ. 151 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 26.65 వద్ద ఫ్రీజయ్యింది. ఇక ఫ్యూచర్ కన్జూమర్ 2 శాతం పుంజుకుని రూ. 11.15 వద్ద కదులుతోంది. -
‘ఫ్యూచర్’ వ్యాపారం.. రూ. 40కే భోజనం!
పంజాబ్: ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి ఫ్యూచర్ గ్రూప్ అడుగుపెడుతోంది. భోజనప్రియులకు సరసమైన ధరలకే నోరూరించే వంటకాలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వెల్లడించింది. సొంత వంటశాలలను ఏర్పాటు చేసి.. ఇక్కడ నుంచి రూ.40కే భోజనం, రూ.10కే రెండు సమోసాలను అందించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ కిషోర్ బీయానీ తెలియజేశారు. ఫ్యూచర్‌పే యాప్ ద్వారా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తామని వెల్లడించిన ఆయన.. హోటల్ ఏర్పాటు లేదని, కేవలం డోర్ డెలివరీలు మాత్రమే ఉంటాయని స్పష్టంచేశారు. ‘త«థాస్తు’ పేరిట యాప్‌లో ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటుచేయడం ద్వారా ఈ సేవలను ప్రారంభించనున్నామని తెలిపారు. తమ బ్రాండ్ బియ్యం, గోధుమ పిండి వినియోగం పెంచడంలో ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ సహకరించనుందన్నారు. ‘ఇప్పటివరకు ఫ్యాషన్పైన దృష్టి సారించాం. ఇక నుంచి ఆహార వ్యాపారంపై ఫోకస్ పెంచుతున్నాం. దీర్ఘకాలంలో ఈ విభాగం ద్వారా 50–60 శాతం అమ్మకాలను అంచనావేస్తున్నాం’ అని వెల్లడించారు. -
ఈ-కామర్స్ పెట్టుబడులపై బియానీ కీలకవ్యాఖ్యలు
కోల్ కత్తా : ఫ్యూచర్ గ్రూప్ అధినేత, సీఈవో కిషోర్ బియానీ అందరికీ సుపరిచితమే. ఆఫ్ లైన్ రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆఫ్ లైన్ రిటైలర్లకు గట్టి పోటీగా నిలుస్తున్న ఆఫ్ లైన్ రిటైలర్లలో పెట్టుబడులపై ఆయన స్పందించిన తీరు చూస్తే, నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఈ-కామర్స్ లో పెట్టుబడులు పెట్టాలనుకోవడం అత్యంత మూర్ఖమమైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం రెండేళ్ల వరకు తాను ఈ-కామర్స్ రంగంలో పెట్టుబడులు పెట్టబోనని స్పష్టీకరించారు. ఆయన ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణాలున్నాయంట. ఈ గ్రూప్ ఇప్పటికే రూ.300 కోట్ల మేర నష్టాల్లో మునిగిపోయిందని, పరిశ్రమల మెగా ప్రకటనల వల్ల కంపెనీ భారీగా నష్టాలను చవిచూస్తున్నాయని తెలిసింది. కంపెనీ ఎక్కువ ఆదాయాలను ఆర్జించడానికి మొదటి నుంచి తమ సంప్రదాయ ఆదాయాల్లోనే వెచ్చిచూస్తూ వస్తోందని బియానీ చెప్పారు. ఆన్ లైన్ స్పేస్ లో పెట్టుబడులు అనేవి చాలా మూర్ఖమమని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతీయ ఈ-కామర్స్ ఇండస్ట్రీ రూ.2500 కోట్లతో ఉందని, కానీ అంతేమొత్తంలో నష్టాలు కూడా ఉన్నట్టు తెలిపారు. మొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆన్ లైన్ లో నగదును ఆర్జించిపెట్టడం లేదన్నారు. ఒకవేళ ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, కనీసం రెండేళ్ల బ్రేక్ తర్వాతనే దీని గురించి ఆలోచించాలని నిర్ణయించామని బియానీ చెప్పారు. 10 ఏళ్ల క్రితమే ఈ గ్రూప్ ఆన్ లైన్ లో తొలి వెంచర్ ప్రారంభించింది. అది ఫ్యూచర్ బజార్.కామ్. కానీ ప్రస్తుతం ఇది రూ.250 కోట్ల నష్టాల్లో ఉంది. ఇతర వెబ్ వెంచర్లు బిగ్ బజార్ డైరెక్ట్, ఫ్యాబ్ ఫర్నిష్ లు ఏకంగా మూత పడ్డాయి. ప్రస్తుతం తమ గ్రూప్ డిపార్ట్ మెంటల్ చైన్ బిజినెస్ లలో ప్రత్యర్థులు షాపర్స్ స్టాప్, లైఫ్ స్టయిళ్లను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుందని బియానీ చెప్పారు. కొత్తగా 15 సెంట్రల్ స్టోర్లను ఈ ఏడాది ఏర్పాటుచేయడానికి రూ.300 కోట్లను పెట్టుబడులుగా పెట్టాలనుకుంటున్నామని బియానీ తెలిపారు. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 50ని అధిగమిస్తుందన్నారు. తమ వృద్ధి రేటు కూడా 40 శాతం పెరుగుతుందని చెప్పారు. జీఎస్టీ అమలుకు రిటైలర్లు సిద్ధంగా ఉన్నాయని, ప్యాక్డ్ ఫుడ్, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు కిందకి దిగొస్తాయని పేర్కొన్నారు. -
బీఆర్ఎల్ ఎండీగా కిషోర్ బియానీ
ముంబై : ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ బియానీని భారతీ రిటైల్ లిమిటెడ్ (బీఆర్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది. భారతీ గ్రూప్స్ రిటైల్ బిజినెస్ తో పునర్ వ్యవస్థీకరణ పూర్తి అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అయితే ఎఫ్ఆర్ఎల్ బోర్డు సభ్యుడిగా బియానీ కొనసాగుతారని కంపెనీ తెలిపింది. బీఆర్ఎల్ తో వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ కు జాయింట్ డైరెక్టర్ గా ఉన్న రాకేష్ బియానీ కూడా బీఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ మిట్టల్ కంపెనీ బోర్డు డైరెక్టర్లలో సభ్యుడిగా కొనసాగనున్నారు. -
ఫ్యూచర్, భారతీ రిటైల్ వ్యాపారాల విలీనం
పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం; విలువ రూ.750 కోట్లు ⇒ రూ.15,000 కోట్ల సంస్థగా ఆవిర్భావం... ⇒ కిశోర్ బియానీ చేతికే పగ్గాలు... న్యూఢిల్లీ: దేశీ రిటైల్ రంగంలో మరో కీలకమైన, భారీ విలీనానికి బాటలు పడ్డాయి. కిశోర్ బియానీ సారథ్యంలోని ఫ్యూచర్ గ్రూప్.. తమ రిటైల్ వ్యాపారాన్ని మొత్తం భారతీ గ్రూప్‌నకు చెందిన రిటైల్ బిజినెస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరగనున్నట్లు ఈ డీల్ విలువ రూ.750 కోట్లుగా అంచనా. అంతేకాదు విలీనం తర్వాత రూ.15,000 కోట్ల విలువైన టర్నోవర్‌తోపాటు దేశంలోనే అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ సంస్థల్లో ఒకటిగా కూడా ఆవిర్భవించనుంది. మరోపక్క, విలీన సంస్థపై నియంత్రణ అంతా కిశోర్ బియానీకే దక్కనుంది. కాగా, ఆదిత్య బిర్లా గ్రూప్ తమ బ్రాండెడ్ అపారెల్ వ్యాపారాలన్నింటినీ విలీనం చేసి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మర్నాడే ఫ్యూచర్, భారతీ ఒప్పందం వెలువడటం గమనార్హం. డీల్ స్వరూపం ఇదీ... రెండంచెల్లో జరిగే ఈ ఒప్పందం ప్రకారం.. ఫ్యూచర్ గ్రూప్ తమ రిటైల్ వ్యాపారాన్ని విడదీసి భారతీ రిటైల్‌లో విలీనం చేస్తుంది. అదేవిధంగా భారతీ గ్రూప్ కూడా తమ రిటైల్ ఇన్ఫ్రా బిజినెన్ను విభజించి ఫ్యూచర్ రిటైల్‌లో కలిపేస్తుంది. ఈ విలీనం ద్వారా రెండు ప్రత్యేక కంపెనీలు(రిటైల్, ఇన్ఫ్రా) ఆవిర్భవిస్తాయని.. వీటి ఉమ్మడి టర్నోవర్ రూ.15,000 కోట్లుగా ఉంటుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిశోర్ బియానీ విలేకరులకు తెలిపారు. రెండు విలీన సంస్థల్లో భారతీ రిటైల్‌కు 15 శాతం చొప్పున వాటా లభిస్తుంది. ముందుగా రూ.500 కోట్ల విలువైన షేర్లను... కొంతకాలం తర్వాత షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుండే రూ.250 కోట్ల విలువైన ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లు(ఓసీడీ) దక్కుతాయి. డీల్ ప్రకారం ఫ్యూచర్ రిటైల్ వాటాదారులకు ఒక్కో షేరుకి(రూ.2 ముఖవిలువ) భారతీ రిటైల్ నుంచి ఒక షేరు(1:1 నిష్పత్తి) కేటాయిస్తారు. ఇదేవిధంగా ఫ్యూచర్ రిటైల్ కూడా భారతీ రిటైల్ షేర్హోల్డర్లకు రూ.2 ముఖ విలువగల ఫుల్లీ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్లను 1:1 నిష్పత్తిలో జారీ చేస్తుంది. భారతీ రిటైల్ జారీ చేసే షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. ఇక ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లకు రెండు కొత్త సంస్థల్లో 46-47 శాతం చొప్పున వాటా లభిస్తుంది. ఉమ్మడి సంస్థకు మొత్తం 243 నగరాల్లో 570 స్టోర్లు ఉంటాయి. తాము రిటైల్ బిజినెస్ నుంచి వైదొలగడంలేదని.. ఈ వ్యూహాత్మక విలీనం ద్వారా మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే ఇరు కంపెనీల ప్రణాళిక అని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారతీ మిట్టల్ చెప్పారు. ఇరు కంపెనీల వాటాదారులు, కస్టమర్లకు ఈ డీల్‌తో మరింత ప్రయోజనం లభిస్తుందన్నారు. కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఇతరత్రా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ విలీన ఒప్పందం పూర్తవుతుంది. డీల్ నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ షేరు ధర 12 శాతంపైగా లాభపడి రూ.130 వద్ద స్థిరపడింది. ఒకానొకదశలో 18 శాతం ఎగసి రూ.137 గరిష్టాన్ని కూడా తాకింది. 2021కల్లా 4,000 చిన్న స్టోర్లు: బియానీ ఈ డీల్ తర్వాత కూడా భారతీ ఈజీడే చైన్ స్టోర్లు, తమ బిగ్‌బజార్ స్టోర్లు యథాతథంగా కార్యకలాపాలను కొనసాగిస్తాయని కిశోర్ బియానీ పేర్కొన్నారు. అయితే, 2021 నాటికి కొత్తగా 4,000 చిన్న స్థాయి రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది తమ ప్రణాళిక అని ఆయన వెల్లడించారు. ఉత్తరాదిలో ఈజీడే పేరుతో, దక్షిణ-పశ్చిమ భారత్‌లో నీల్గిరీస్, కేబీ బ్రాండ్‌తో ఈ కొత్త సోర్టు తెరుస్తామని తెలిపారు. వాల్‌మార్ట్‌తో క్యాష్ అండ్ క్యారీ వ్యాపార భాగస్వామ్యం నుంచి బయటికొచ్చేశాక.. పూర్తిస్థాయిలో రిటైల్ వ్యాపారం కోసం భారతీ గ్రూప్ అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా(ప్రధానంగా ఉత్తరాదిన) భారతీ రిటైల్ 210 ఈజీడే స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్ గ్రూప్ కూడా తమ ఫ్యాషన్ రిటైల్ చైన్ ప్యాంటలూన్స్లో మెజారిటీ వాటాను 2012లో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు విక్రయించిన తర్వాత వ్యాపారాన్ని స్థిరీకరించే పనిలోపడింది. ప్రస్తుతం బిగ్‌బజార్ పేరుతో హైపర్మార్కెట్లు, ఫుడ్‌బజార్ బ్రాండ్‌తో సూపర్‌మార్కెట్లతోపాటు వివిధ ఇతర రిటైల్ ఫార్మాట్లను ఫ్యూచర్ గ్రూప్ నిర్వహిస్తోంది. భారతీ రిటైల్‌కు ప్రస్తుతం రుణభారమేమీలేదు. ఇక కొత్తగా ఏర్పడే రిటైల్ సంస్థకు రూ.1,200 కోట్లు, ఇన్ఫ్రా సంస్థకు రూ.3,500 కోట్లు చొప్పున రుణ భారం ఉంటుంది. -
ఫ్యూచర్ గ్రూప్ చేతికి నీలగిరీస్ స్టోర్లు
న్యూఢిల్లీ: దక్షిణాదిలో విస్తరించిన నీలగిరీస్ చైన్ స్టోర్లను ఫ్యూచర్ కన్సూమర్ ఎంటర్ప్రైజెస్ సొంతం చేసుకుంది. రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్‌నకు ఇది అనుబంధ సంస్థకాగా, ఇందుకు రూ. 300 కోట్లను వెచ్చించనుంది. ఈ విషయాన్ని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా స్టోర్ల నెట్‌వర్క్‌ను విస్తరించే బాటలో నీలగిరీస్‌లో 100% వాటా కొనుగోలు మరో ముందడుగు వంటిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో తక్కువ పెట్టుబడుల పద్ధతిలో ఫ్రాంచైజీల ద్వారా వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలు చిక్కుతుందని తెలిపారు. తయారీలో మరింత నైపుణ్యం, కొత్త బ్రాండ్లు పరిచయం చేసేందుకు అవకాశముంటుందని తెలిపారు. దక్షిణాదిపై పట్టు నీలగిరీస్ను కొనుగోలు చేసేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఏడాది కాలంగా ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ భారతంలో విస్తరించిన కంపెనీ దక్షిణాదిలోనూ పట్టుచిక్కించుకునేందుకు నీలగిరీస్ ఉపయోగపడనుంది. ఫ్రాంచైజీ విధానంలో 140 ఔట్లెట్లను నీలగిరీస్ నిర్వహిస్తోంది. దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాలకు చెందిన పట్టణ ప్రాంతాలలో స్టోర్లను ఏర్పాటు చేసింది. డైరీ, బేకరీ, చాకొలెట్స్ తదితర ఆహార సంబంధ ఉత్పత్తుల బ్రాండ్లను కలిగి ఉంది. బెంగళూరులో తయారీ ప్లాంట్ ఉంది.