ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన వ్యూహలతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రపంచ వ్యాప్త దిగ్గజ కంపెనీగా తీర్చిదిద్దాడు. తాజాగా ప్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేసినట్లు శనివారం రిలయన్స్ ప్రకటించింది. కాగా ప్యూచర్ గ్రూప్‌కు చెందిన వేర్‌హౌస్, హోల్‌సేల్, లాజిస్టిక్, రిటైల్ బిజినెస్ తదితర విభాగాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. అయితే ప్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేయడానికి డీల్ విలువ రూ.24,713 కోట్లు కుదుర్చుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఫ్యూచర్ గ్రూప్ విభాగాలైన ఫాషన్ లైఫ్ స్టైల్ తదితర బ్రాండ్స్ రిలయెన్స్ రిటైల్ వెంచర్‌లోకి రానున్నాయి.
కాగా భారీ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరక్టర్ ఇషా అంబానీ తెలిపింది. తాజా కొనుగోలుతో దాదాపుగా 1800 రిటైల్స్ స్టోర్స్ రిలయన్స్ స్వంతం కానున్నాయి. మరోవైపు రిలయన్స్ కొనుగోలు చేసిన ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్, ఈజీ డే, ఎఫ్‌బీబీ, సెంట్రల్, ఫుడ్ హాల్స్ లాంటి ఫార్మాట్‌లను దేశవ్యాప్తంగా 420 పట్టణాల్లో నిర్వహిస్తుందని ఇషా అంబానీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment