న్యూఢిల్లీ: కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్‌పై దివాలా పరిష్కార చర్యలకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), ముంబై బెంచ్ అనుమతించింది. ఈ సంస్థను వేలం వేయడం ద్వారా రుణదాతలు తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి మార్గం సుగమం అయింది. బియానీకి చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ సైతం దివాలా చర్యల పరిధిలోకి వెళ్లడం తెలిసిందే.
కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను చూసేందుకు పరిష్కార నిపుణుడిని ముంబై బెంచ్ నియమించినట్టు ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. పరిష్కార నిపుణుడి నియామకంతో కంపెనీ బోర్డు రద్దయిపోయింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ తమకు రూ.1.58 కోట్లు చెల్లించడంలో విఫలమైందంటూ ఢిల్లీకి చెందిన సరఫరాదారు ఫోర్‌సైట్ ఇన్నోవేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment