dues clear
-
ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్‌పై దివాలా పరిష్కార చర్యలకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ అనుమతించింది. ఈ సంస్థను వేలం వేయడం ద్వారా రుణదాతలు తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి మార్గం సుగమం అయింది. బియానీకి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ సైతం దివాలా చర్యల పరిధిలోకి వెళ్లడం తెలిసిందే. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను చూసేందుకు పరిష్కార నిపుణుడిని ముంబై బెంచ్ నియమించినట్టు ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. పరిష్కార నిపుణుడి నియామకంతో కంపెనీ బోర్డు రద్దయిపోయింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ తమకు రూ.1.58 కోట్లు చెల్లించడంలో విఫలమైందంటూ ఢిల్లీకి చెందిన సరఫరాదారు ఫోర్‌సైట్ ఇన్నోవేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. -
రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్టెల్.. కారణం ఇదే
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ గతంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించిన బాకీ మొత్తాన్ని ముందస్తుగా, పూర్తిగా చెల్లించేసింది. రూ. 15,519 కోట్లు ప్రభుత్వానికి కట్టినట్లు సంస్థ వెల్లడించింది. దీనితో కనీసం రూ. 3,400 కోట్ల మేర వడ్డీ వ్యయాల భారం తగ్గినట్లవుతుందని పేర్కొంది. 2014లో నిర్వహించిన వేలంలో ఎయిర్టెల్ రూ. 19,051 కోట్లకు 128.4 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. స్పెక్ట్రమ్ కొనుగోలుకు సంబంధించి 2026–27 నుంచి 2031–32 వరకూ 10 శాతం వడ్డీ రేటుతో వార్షికంగా వాయిదాల్లో చెల్లింపులు జరపాల్సి ఉంది. అయితే, ముందుగానే కట్టేయడం వల్ల ఆ మేరకు వడ్డీ భారం తగ్గినట్లవుతుంది. మూలధనాన్ని సమర్ధమంతంగా ఉపయోగించుకోవడంపై మరింత దృష్టి పెట్ట డం కొనసాగిస్తామని ఎయిర్టెల్ పేర్కొంది. -
నా చావుకి వాళ్లే కారణమంటూ వీడియో రికార్డ్ చేసి..
లక్నో: ఓ వ్యక్తి చేసిన అప్పు ముప్పుగా మారి తన ప్రాణాన్నే తీసింది. తీసుకున్న అప్పు చెల్లించినప్పటికీ ఇంకా ఇవ్వాలని వేధిస్తుండటంతో ఓ వ్యవసాయ క్షేత్రంలో సూసైడ్ నోట్‌తో పాటు వీడియో రికార్డు చేసి విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ విషాద ఘటన యూపీలోని ఫతేగంజ్‌లో చోటుచేసుకుంది. వీడియోలోని వివరాల ప్రకారం.. ఫతేగంజ్(పశ్చిమ)లోని నివాసముంటున్న చంద్రపాల్ గంగ్వార్ సంజార్పూర్లోని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. అవసరం నిమిత్తం అతను కొంతమంది నుంచి డబ్బుని అప్పుగా తీసుకున్నాడు. కొన్నాళ్లకు అప్పుని తిరిగి చెల్లించగా, వాళ్లు అంతటితో ఆగక ఇంకా చెల్లించాలని ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే వాళ్లు తన భార్యను హత్య చేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రపాల్ ఆత్మహత్యకు పాల్పడుతూ తన చావుకి ఆ ముగ్గురే కారణమంటూ తన ఆవేదనను ఆ వీడియోలో వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రపాల్ వీడియోలో తెలిపిన పేర్లు.. గంగ్వార్ గుడియా, పప్పు, సంతోష్. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్‌ను అరెస్ట్ చేసి మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఎస్బీఐ లాభం 55% జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.5,246 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,375 కోట్లతో పోలిస్తే 55 శాతం దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం రూ.89,348 కోట్ల నుంచి రూ. 95,374 కోట్లకు పెరిగింది. దాదాపు 7 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా మొండిబాకీలు భారీగా తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది. స్టాండెలోన్‌గా చూస్తే... బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే (స్టాండెలోన్‌గా) లెక్కలోకి తీసుకుంటే ఎస్బీఐ క్యూ2లో రూ.4,574 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ2లో లాభం రూ. 3,012 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం స్టాండెలోన్ ఆదాయం 3.5 శాతం పెరుగుదలతో రూ.72,851 కోట్ల నుంచి రూ. 75,342 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 24,600 కోట్ల నుంచి రూ.28,181 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (అసాధారణ అంశాలను తీసివేసిన తర్వాత) 12 శాతం ఎగబాకి రూ.14,714 కోట్ల నుంచి రూ.16,460 కోట్లకు పెరిగింది. ఇక నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) కూడా సెప్టెంబర్ క్వార్టర్లో 3.34 శాతానికి మెరుగుపడింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఎన్ఐఎం 3.22 శాతంగా నమోదైంది. మొండిబాకీలు దిగొచ్చాయ్... ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా తగ్గుముఖం పట్టాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 5.58 శాతానికి (పరిమాణం పరంగా రూ.1.25 లక్షల కోట్లు) తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఇవి 7.19 శాతంగా (రూ.1.61 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా 2.79 శాతం నుంచి 1.59 శాతానికి దిగొచ్చాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఎన్పీఏల విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల ప్రకారం లెక్కగడితే స్థూల ఎన్పీఏలు 5.88 శాతంగా, నికర ఎన్పీఏలు 2.08 శాతంగా ఉంటాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) 21.74 శాతం తగ్గుదలతో రూ.15,187 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు దిగొచ్చాయి. క్యూ2లో రుణవృద్ధి 6 శాతంగా నమోదుకాగా, డిపాజిట్లు 14.41 శాతం వృద్ధి చెందాయి. ఈ క్యూ2లో కొత్తగా రూ.2,756 కోట్ల విలువైన రుణాలు మొండిబాకీలుగా మారాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కొత్తగా మొండిబాకీలుగా మారిన రుణాల పరిమాణం రూ.8,805 కోట్లుగా ఉంది. ఎన్పీఏలకు ప్రొవిజన్ కవరేజీ రేషియో క్యూ2లో 81.23 శాతం నుంచి 88.19 శాతానికి భారీగా మెరుగుపడింది. ఇప్పటివరకూ రూ.6,495 కోట్ల రుణాలకు సంబంధించి వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణ దరఖాస్తులను బ్యాంక్ అందుకుంది. వీటిలో రిటైల్ రుణాలు రూ.2,400 కోట్లు కాగా, మిగినవి కార్పొరేట్ రుణాలు. అందులోనూ రూ.2,400 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలవేనని బ్యాంక్ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1.12 శాతం లాభపడి రూ. 207 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో (ఇంట్రాడేలో) రూ.198 కనిష్ట స్థాయిని, రూ.209 గరిష్టాన్ని తాకింది. పేటీఎం ఎస్బీఐ కార్డ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎస్బీఐ కార్డ్, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి పేటీఎం ఎస్బీఐ కార్డ్, పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ పేరుతో తదుపరితరం క్రెడిట్ కార్డ్స్‌ను వీసా ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ కార్డ్ యాప్‌తోపాటు పేటీఎం యాప్‌లోనూ ఈ కార్డులను నియంత్రించే సౌకర్యం ఉంది. కస్టమర్లు ఈ కార్డు ద్వారా పేటీఎం మాల్, మూవీ, ట్రావెల్ టికెట్లపై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మా అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో మళ్లీ పురోగతి నెలకొంది. చాలా కంపెనీలు కోవిడ్‌కు ముందున్నప్పటి కార్యకలాపాల స్థాయిల్లో 70–80 శాతాన్ని చేరుకున్నట్లు కనబడుతోంది. ట్రాక్టర్లతో సహా వాహన రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలకు ఇది నిదర్శనం. కొత్త మొండిబకాయిలు ఎక్కువగా వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలోనే నమోదయ్యాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మరో రూ.13,000 కోట్ల విలువైన రుణ పునర్వ్యవస్థీకరణ వినతులు రావచ్చని అంచనా వేస్తున్నాం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ -
టెల్కోలపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం సంస్థలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఏజీఆర్ బకాయిల ఛార్జీల చెల్లింపుల విషయంలో ఎలాంటి ఎలాంటి పునఃసమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఇందుకు అనుమతినిచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ను లెక్కించేందుకు మరోసారి ప్రయత్నించవద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. అసలు వీటిని ఎవరు సమీక్షించమన్నారంటూ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 24 న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు నిర్ణయించిన ఏజీఆర్ బకాయిలను స్వీయ అంచనా వేయడం లేదా తిరిగి అంచనా వేయడం ఉండదని స్పష్టం చేసింది. బకాయిలు వసూలుపై ప్రభుత్వ తీరుపై కూడా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీం పునర్స మీక్షకు గడువు ఇవ్వాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కోర్టును ప్రభావితం చేయడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఒకవేళ మళ్లీ తిరిగి సమీక్షిస్తే కోర్టు గతంలో తప్పుచేసినట్లు అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపుల పునర్సమీక్షకు అనుమతించిన అధికారుల్ని సహించేది లేదని హెచ్చరించింది. టెలికం కంపెనీలు తప్పనిసరిగా ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిదేనని గత ఆక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బకాయిల్ని మళ్లీ సమీక్షించాలంటూ అనేకసార్లు కోర్టును ఆశ్రయించాయి టెలికాం కంపెనీఉ. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెలలోనూ సుప్రీంకోర్టు సంస్థలపైనా, ప్రభుత్వంపై విరుచుకుపడింది. దీంతో కొన్ని సంస్థలు బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించాయి. కానీ మరోసారి కోర్టు సమీక్షిస్తే కొంత మినహాయింపు లభించే అవకాశం ఉందని భావించిన సంస్థలు వేచిచూశాయి. కానీ తాజా మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బకాయిలే పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏజీఆర్ బకాయిల చెల్లింపులు 20 ఏళ్ల పాటు వాయిదాల రూపంలో చెల్లించేందుకు సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను రూపొందించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏజీఆర్ చార్జీల చెల్లింపు వల్ల సంస్థ పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పేర్కొంది. లక్షలాది మంది వినియోగదారుల పైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఏజీఆర్ : మొత్తం బకాయిలు చెల్లించమని ఆదేశించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపు విషయంలో మరోసారి కేంద్రం టెల్కోలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన ఇప్పటివరకు టెలికాం ఆపరేటర్ల నుండి సుమారు రూ .25,900 కోట్లను ప్రభుత్వం అందుకుందనీ, త్వరలోనే పూర్తి చెల్లింపులు చేయమని టెల్కోలను మళ్లీ ఆదేశించామని పార్లమెంటుకు అందించిన సమాచారంలో కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే వెల్లడించారు. అక్టోబర్ 24, 2019 నాటి బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో అక్టోబర్ 24, 2019 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కొన్ని చెల్లింపులు చేశాయని తెలిపారు. మార్చి 4, 2020 రాసిన లేఖలో పూర్తి చెల్లింపులు చేయాలని ఆపరేటర్లను ఆదేశించామన్నారు. అలాగే టెలికాం రంగంలో గుత్తాధిపత్యం లేదా కార్టలైజేషన్‌ను నివారించడానికి కొత్త యాంట్రీ ట్రస్ట్ లాను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని మరో ప్రశ్నకుసమాధానంగా వెల్లడించారు. భారతి ఎయిర్టెల్ ఇప్పటివరకు రూ .18,004 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .3500 కోట్లు చెల్లించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. టాటా టెలిసర్వీసెస్ సుమారు రూ.4,197 కోట్లు చెల్లించగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.3.9 కోట్లు , రిలయన్స్ జియో సుమారు రూ .195 కోట్లు చెల్లించిందన్నారు. టెలికాం రంగంలో ఆర్థిక ఇబ్బందులపై జోక్యం చేసుకోవాలన్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఓఏఐ) అభ్యర్థన మేరకు టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించామన్నారు. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుందన్నారు. ఏజీఆర్ వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
బాకీలు వెంటనే కట్టేయండి
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్ సంబంధ మిగతా బాకీలను కూడా వెంటనే కట్టేయాలంటూ టెల్కోలను కేంద్రం ఆదేశించింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు ఇతర ఆపరేటర్లకు టెలికం శాఖ (డాట్) ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ’మరింత జాప్యం లేకుండా’ మిగతా బకాయిలు చెల్లించడంతో పాటు స్వీయ మదింపు గణాంకాలు తదితర వివరాలు కూడా సమర్పించాలని డాట్ సూచించినట్లు వివరించాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములాకు అనుగుణంగా డాట్ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, తమ స్వీయ మదింపు ప్రకారం డాట్ చెబుతున్న దానికంటే తాము కట్టాల్సినది చాలా తక్కువే ఉంటుందని టెల్కోలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా రూ. 26,000 కోట్లు మాత్రమే చెల్లించాయి. పీఎస్‌యూలకు మినహాయింపు.. ఏజీఆర్ బాకీల కేసు నుంచి టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలను సుప్రీం కోర్టు తప్పించినట్లు సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే పార్లమెంటుకు తెలియజేశారు. తగు వేదికల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించినట్లు రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు. సొంత అవసరాల కోసం తీసుకున్న స్పెక్ట్రంలో కొంత భాగాన్ని థర్డ్ పార్టీలకు ఇవ్వడం ద్వారా ఆదాయం ఆర్జించాయన్న ఉద్దేశంతో గెయిల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ఏజీఆర్‌పరంగా రూ. 2.7 లక్షల కోట్లు కట్టాలంటూ డాట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
టెల్కోలకు ఊరటపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల భారంతో సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగానికి సత్వరం ఊరటనిచ్చే చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర టెలికం శాఖ, ఇతర కీలక శాఖల సీనియర్ అధికారులు ఆదివారం దీనిపై అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా సాగిన సమావేశంలో నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. టెలికం పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపైనా ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద కేంద్రానికి టెలికం సంస్థలు సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉందని అంచనా. ఇందులో దాదాపు 60 శాతం పైగా భాగం ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలదే ఉంది. బాకీల చెల్లింపులో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో టెల్కోలు కొంత భాగాన్ని ఇప్పటికే జమ చేశాయి. అయితే, ఈ బాకీలు తమపై తీవ్ర భారం మోపుతాయని టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఇండియా చైర్మన్ కుమార మంగళం బిర్లా.. గతవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలతో ముమ్మరంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి : టెల్కోలకు మరిన్ని కష్టాలు) లెక్కింపు విధానం స్థిరంగా ఉండాలి: సీవోఏఐ ఏజీఆర్ బాకీల విషయంలో వ్యత్యాసాలు రాకుండా .. లెక్కింపు విధానం సర్కిళ్లవారీగా మారిపోకుండా స్థిరంగా ఉండేలా టెలికం శాఖ చూడాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ అభిప్రాయపడింది. ఏజీఆర్ బాకీల వసూలు కోసం టెల్కోల బ్యాంక్ గ్యారంటీలను కేంద్రం స్వాధీనం చేసుకుంటే .. అది పరిశ్రమ మనుగడకే ముప్పుగా పరిణమిస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. బకాయిల లెక్కింపులో తేడాలేమైనా ఉన్నాయేమో పరిశీలించేందుకు టెలికం శాఖ ప్రతిపాదించిన ’టెస్ట్ చెక్’ విధానం సాధారణంగా జరిగే ఆడిటింగ్ ప్రక్రియేనని ఆయన తెలిపారు. (టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్) -
బాకీలు చెల్లిస్తున్న టెల్కోలు
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికం సంస్థలు చెల్లింపులు ప్రారంభించాయి. సోమవారం భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్ కొంత మొత్తాన్ని కట్టాయి. టెలికం శాఖకు (డాట్) ఎయిర్టెల్ రూ. 10,000 కోట్లు, టాటా గ్రూప్ రూ.2,197 కోట్లు చెల్లించాయి. ‘భారతి ఎయిర్టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్‌ల తరఫున రూ.10,000 కోట్లు చెల్లించాం. మిగతా బాకీలపై స్వీయ మదింపు చేపట్టాం. సుప్రీం కోర్టులో తదుపరి విచారణ తేదీలోగా దీన్ని కట్టేస్తాం’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో రూ.9,500 కోట్లు భారతి ఎయిర్‌టెల్‌కి సంబంధించినవి కాగా రూ.500 కోట్లు భారతి హెక్సాకామ్కు చెందినవి. మరోవైపు, టాటా టెలీ, టాటా టెలీ (మహారాష్ట్ర) తరఫున మొత్తం బాకీల కింద రూ.2,197 కోట్లు కట్టేశామని, వీటికి సంబంధించిన లెక్కల వివరాలను కూడా డాట్‌కు అందజేశామని టాటా టెలీసర్వీసెస్ తెలిపింది. సోమవారం రూ.2,500 కోట్లు కట్టిన వొడాఫోన్ ఐడియా.. శుక్రవారం నాటికి మరో రూ.1,000 కోట్లు కడతామంటూ సుప్రీం కోర్టుకు విన్నవించింది. అప్పటిదాకా డాట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా సూచనలివ్వాలని కోరింది. అయితే, సుప్రీం కోర్టు దీన్ని తోసిపుచ్చింది. బ్యాంక్ గ్యారంటీల స్వాధీనం సహా బాకీల వసూలుకు అన్ని చర్యలూ తీసుకునేందుకు డాట్‌కు వెసులుబాటునిచ్చింది. డాట్ గణాంకాలను బట్టి సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం టెల్కోల నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద సుమారు రూ.1.47 లక్షల కోట్లు వసూలు కావాలి. ఎయిర్టెల్ సుమారు రూ. 35,586 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ సుమారు రూ.13,800 కోట్లు చెల్లించాలి. ఈ ఏడాది జనవరి 23లోగా వీటిని కట్టేయాలంటూ గతేడాది ఆదేశించినా.. అమలు కాకపోవడంపై ఇటీవల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీలు, డాట్ కదిలాయి. దీనిపై మార్చి 17న సుప్రీం కోర్టు తదుపరి విచారణ జరపనుంది. బ్యాంక్ గ్యారంటీలపై డాట్ దృష్టి.. బాకీలను పూర్తిగా వసూలు చేసుకునే క్రమంలో.. టెల్కోలిచ్చిన బ్యాంక్ గ్యారంటీలను స్వాధీనం చేసుకునే అవకాశాలను డాట్ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై డాట్ అధికారులు మంగళవారం సమావేశమై, నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించాయి. ఒకవేళ బ్యాంక్ గ్యారంటీలను నిజంగానే స్వాధీనం చేసుకుంటే... నిధులు సమీకరించుకునేందుకు నానా తంటాలు పడుతున్న వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు మూతబడక తప్పకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రెండు త్రైమాసికాల లైసెన్సు ఫీజులు, ఇతర బకాయిలకు సరిపడే స్థాయిలో ఈ బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు సంబంధించి ఇది సుమారు రూ.5,000 కోట్ల మేర ఉంటుంది. డాట్ లెక్కలను టెల్కోలు ప్రశ్నించాయి. తమ సొంత మదింపు ప్రకారమే కడతామంటూ సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ మొత్తం వివాద ప్రభావం బ్యాంకులపై ఎలా ఉండవచ్చన్న అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ఇంటర్వూ్య సందర్భంగా తెలిపారు. ఆ ఉత్తర్వులు.. నాన్–టెల్కోలకు కాదేమో: ధర్మేంద్ర ప్రధాన్ నాన్ టెలికామ్ ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కంపెనీలు ఏజీఆర్ బాకీలు కట్టాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు.. టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించకపోవచ్చని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. సమాచార లోపం వల్లే చమురు కంపెనీలకు కూడా డాట్ నోటీసులిచ్చి ఉంటుందని, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నాక తమ అభిప్రాయం తెలియజేశామని చెప్పారు. నోటీసులు అందుకున్న కంపెనీలకు టెలికం కార్యకలాపాలు ప్రధాన వ్యాపారం కాదన్నారు. స్పెక్ట్రం వాడుకున్నందుకు గాను గెయిల్, ఆయిల్ ఇండియా, పవర్‌గ్రిడ్ వంటి టెలికంయేతర కంపెనీలు కూడా రూ.2.7 లక్షల కోట్లు కట్టాలంటూ డాట్ నోటీసులివ్వటం తెలిసిందే. ద్రవ్య లోటు తగ్గుతుంది: ఆర్థికవేత్తల అంచనా టెలికం సంస్థలు రూ.1.20 లక్షల కోట్ల బాకీలు కట్టిన పక్షంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో.. సవరించిన గణాంకాల కన్నా ద్రవ్య లోటు తగ్గగలదని ఆర్థికవేత్తలు తెలిపారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఇది 3.5 శాతానికి పరిమితం కాగలదని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. సవరించిన గణాంకాల ప్రకారం ఇది 3.8 శాతం స్థాయిలో ఉండొచ్చని గతంలో అంచనా వేశారు. ‘టెల్కోలు బాకీలు కట్టేందుకు గడువైన మార్చి 16 తర్వాత ద్రవ్య లోటు పరిస్థితి గణనీయంగా మారిపోతుంది. ఏజీఆర్ బాకీలు కనీసం రూ.1.20 కోట్లు వసూలైనా.. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు.. జీడీపీలో 3.5 శాతానికి దిగి రావొచ్చు‘ అని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు, వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు మళ్లీ కాలుష్యకారక పాత ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారని తెలిపారు. గ్యాస్ సిలిండర్ అందుబాటు ధరల్లో అందించడం ద్వారా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. -
ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: ఏజీఆర్ వివాదంలో చిక్కుకున్న టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) సంబంధిత బకాయిలను రాబోయే కొద్ది రోజుల్లో టెలీకమ్యూనికేషన్ విభాగానికి (డాట్) జమ చేయనున్నట్లు వోడాఫోన్ ఐడియా శనివారం తెలిపింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమాచారాన్ని అందించింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, డాట్ విధించిన డెడ్‌లైన్ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై ఏర్పడ్డ సంక్షోభం నేపథ్యంలో కంపెనీ బోర్డు ప్రత్యేకంగా సమావేశ మైంది. డాంట్ అంచనాల ప్రకారం, వోడాఫోన్ ఐడియా బకాయిలు మొత్తం రూ .53,038 కోట్లు. వీటిలో రూ.24,729 కోట్ల స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కాగా, లైసెన్స్ ఫీజు రూ.28,309 కోట్లు. మరోవైపు శుక్రవారం అర్థరాత్రిలోపు బకాయిలు చెల్లించాలని డాట్ విధించిన గడువుపై తక్షణమే స్పందించిన మరో దిగ్గజ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ ఫిబ్రవరి 20న రూ. 10వేల కోట్లు, కోర్టువిచారణ లోపు మిగిలిన మొత్తం చెల్లిస్తామని ప్రకటించింది. కాగా టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో విలీనం తరువాత అతిపెద్ద సంస్థగా అవతరించిన వోడాఫోన్ ఇండియా భారీ అప్పుల్లో కూరుకుపోయింది. దీనికితోడు కస్టమర్ల సంఖ్య కూడా క్రమేపీ క్షీణిస్తోంది. దీనికి ఏజీఆర్ బకాయిల అంశం అగ్నికి ఆజ్యంలా తోడైంది. ఈ నేపథ్యంలోనే తమకు ఉపశమనం కల్పించకపోతే కంపెనీనీ మూసుకోవాల్సి వస్తుందని ఇటీవల వ్యాఖ్యానించింది. ఇది ఇలా వుండగా తాజాగా వరుసగా ఆరవ త్రైమాసికంలో కూడా కంపెనీ నష్టాలనే ప్రకటించింది. 2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో, రూ .6,439 కోట్ల నికర నష్టాన్ని మూట గట్టుకుంది. అటు స్టాక్మార్కెట్లో కంపనీ షేరు భారీగా పతనమైంది. ఏజీఆర్ సంక్షోభంతో కంపెనీ దివాలా ప్రకటిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యాపించాయి. మొండిపద్దుల గుదిబండ తమ మెడకుచుట్టుకుంటుందనే ఆందోలన అటు బ్యాంకింగ్ రంగంలో కూడా నెలకొంది. టెలికాం కంపెనీలు రూ 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏదైనా కంపెనీ దివాలా ప్రకటిస్తే.. దానికి బ్యాంకులు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజా ప్రకటనతో ఈ అంచనాలకు తెరపడింది. ఏజీఆర్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 17వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చదవండి : టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్ రూ.10 వేల కోట్లు కడతాం టెల్కోలపై సుప్రీం కన్నెర్ర! -
రూ.10 వేల కోట్లు కడతాం
సాక్షి,న్యూఢిల్లీ: సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల చెల్లింపులపై డాట్ తాజా ఆదేశాలపై ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ స్పందించింది. ఫిబ్రవరి 20 వ తేదీ నాటికి రూ.10వేల కోట్ల చెల్లిస్తామని తెలిపింది. మిగిలిన బకాయిలను తదుపరి విచారణ సమయాని కంటే ముందే సర్దుబాటు చేస్తామని వివరించింది. గౌరవనీయమైన సుప్రీంకోర్టు తీర్పు , అనంతరం టెలికాం విభాగం ఆదేశాలకు అనుగుణంగా, భారతి గ్రూప్ కంపెనీల తరపున 2020 ఫిబ్రవరి 20 నాటికి రూ .10,000 కోట్లు (ఖాతాలో) జమ చేస్తామని ఎయిర్టెల్ తెలిపింది. ఈ మేరకు డాట్ ప్రతినిధి( (ఫైనాన్స్) ఒక లేఖ రాసింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీతో సహా దాదాపు రూ .35,586 కోట్లను ఎయిర్టెల్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. చదవండి : టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్ -
టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై సుప్రీంకోర్టు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా టెలికాం విభాగం (డాట్) మరోషాక్ ఇచ్చింది. రాత్రి 11. 59 నిమిషాల్లోపు బకాయిలు చెల్లించాలని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం విభాగం గడువు విధించింది. శుక్రవారం అర్థరాత్రి లోపు మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసింది. బకాయిల వసూళ్లపై సుప్రీంకోర్టు డాట్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో తమకు ఉపశమనం లభిస్తుందని ఎదురు చూస్తున్న టెల్కోలకు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా వోడాఫోన్‌ఐడియాకు ఈ సమయంలో బకాయిలు చెల్లించడం తలకుమించిన భారమే. మరోవైపు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వోడాఫోన్ ఐడియా షేరు భారీగా నష్టపోయింది. కాగా ఏజీఆర్ బకాయిల విషయంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ టెలికం కంపెనీలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. రూ .1.47 లక్షల కోట్లు టెలికాం శాఖకు చెల్లించాలన్న ఆదేశాన్ని పాటించనందుకు వారిపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని సుప్రీం టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ అంశంలో సంబంధిత టెలికం శాఖ(డాట్) అధికారిని సైతం కోర్టు తప్పుపట్టింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొత్తం టెలికాం విభాగానికి రూ .88,624 కోట్లు చెల్లించాల్సివుంది. రిలయన్స్ జియో రూ.177 కోట్లను ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం -
ఎయిరిండియా పైలెట్ల సంఘం అల్టిమేటం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయివేటీకరణకు రంగం సిద్ధమవుతున్న తరుణంలోఎయిరిండియా పైలట్ల యూనియన్ ఘాటుగా స్పందించింది. తమకు రావ్సాలిన బకాయిలపై ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఎలాంటి నోటీసు పీరియడ్ (నోటీసు పీరియడ్ ఆరు నెలలు) ఇవ్వకుండా తక్షణమే సంస్థనుంచి నిష్క్రమించడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి డిసెంబరు 23న ఒక లేఖ రాశారు. ఎయిరిండియా అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైనందున, సంస్థ భవిష్యత్తుపై అనిశ్చితి మధ్య పనిచేసే పరిస్థితిలో తాము లేమని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఎ) హెచ్చరించింది. 2020 మార్చి 31 నాటికి ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించకపోతే ఎయిరిండియా మూసివేయడమే అన్న మంత్రి ప్రకటన ఆందోళన కలిగించే విషయమని లేఖలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా చట్టబద్ధమైన తమ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని ఐసీపీఏ కోరింది. గత రెండు మూడేళ్లుగా అనిశ్చితితో జీవిస్తున్నాం. ఫలితంగా చాలామంది ఉద్యోగులు ఈఎంఐ సహా ఇతర చెల్లింపులను చేయలేకపోయారు. ఇది తమ కుటుంబాలను బాగా ప్రభావితం చేసింది. ఇక తమ సహనం నశించి పోతోందని లేఖలో పేర్కొంది. ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పరిస్థితి తమకు రాకూడదని కోరుకుంటున్నామంది. మరోవైపు ఎయిరిండియా విక్రయంలో భాగంగా డైరెక్టర్ (ఆపరేషన్స్) డైరెక్టర్ (కమర్షియల్) డైరెక్టర్ (పర్సనల్) ముగ్గురు డైరెక్టర్లను పౌర విమానయాన మంత్రిత్వశాఖ నియమించు కోనుంది. వీరు సంస్థ ఎండీ అశ్వని లోహానీకి రిపోర్టు చేయాల్సి వుంటుంది. మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం జనవరి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగా దాదాపు 800పైగా పైలట్లు పనిస్తున్న ఎయిరిండియా రుణ భారం రూ. 58,000 కోట్లకు పై మాటే. ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేసిన రెండవ ప్రయత్నం విఫలమైతే విమానయాన సంస్థను మూసివేయవలసి ఉంటుందని హర్దీప్ సింగ్ పూరి నవంబర్‌లో రాజ్యసభకు తెలియజేశారు. -
టీటీడీ బకాయిలు చెల్లించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, తిరుమల: 2004 నుంచి 2018 వరుకు టీటీడీకి బకాయి ఉన్న 5 లక్షల పదివేల రూపాయల బిల్లులను ఏపీ ప్రభుత్వం క్లియర్ చేసింది. 2004 నుంచి పట్టు వస్త్రాల బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ప్రభుత్వం క్లియర్ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ శనివారం ఉత్తర్వులు వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మోత్సవాలకు తీసుకొచ్చే పట్టు వస్త్రాల బిల్లులను గత ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉంచాయి. 2019 వార్షిక బ్రహ్మోత్సవాలకు రూ.70వేలతో శ్రీవారికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాన్ని సమర్పించనున్నారు. ఈ నెల 30 నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 9 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. -
ఆర్‌కామ్‌కు ఆఖరి అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి మరోషాక్ తగిలింది. ఆర్‌కాం ఎరిక్సన్ వివాదంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై మంగళవారం సుప్రీంకోర్టు ఆర్‌కామ్‌కు గట్టి ఆదేశాలిచ్చింది. చెల్లింపుల ఆలస్యంపై జస్టిస్ రోహిన్టన్ ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్‌కాంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువును మరోసారి పెంచిన ధర్మాసనం ఇదే చివరిసారి పొడిగింపు అని స్పష్టంగా చెప్పింది. అంతేకాదు ఆలస్యమైతే సంవత్సరానికి 12శాతం వడ్డీ చెల్లించాలని కూడా తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 30లోపు రూ.550 కోట్లను చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో ఎరిక్సన్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. డిసెంబర్ 15లోపు స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు రూ.550 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఒకసారి గడువును పొడిగించిన సుప్రీం..ఇకపై గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
సాక్షి, పెద్దపల్లిరూరల్ : గౌరవ వేతనం చెల్లించడంతోపాటు పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని రేషన్‌డీలర్లు జిల్లా కేంద్రంలో శుక్రవారం భిక్షాటన చేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి వెం కటేశం మాట్లా డుతూ... కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబర్ నుంచి పెంచిన కమీషన్, పాత బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంచేయడం తగదన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఈ విషయమై ప్రభుత్వానికి విన్నవించుకున్నా... ఇప్పటికి ఫలితం లేదని వాపోయారు. బకాయి ఉన్న 400 కోట్ల రూపాయల కమీషన్‌ను వెంటనే చెల్లించి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న బియ్యం పంపిణీతో తమకు అందే కమీషన్ రేటు సరిపోవడంలేదన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకుంటే వచ్చేనెల ఒకటి నుంచి సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు మద్దెల నర్సయ్య, ఎలబోతారం శంకరయ్య, అడిచెర్ల రమేశ్, నంబయ్య, పెర్క లింగయ్య, కిషన్‌రెడ్డి, జయప్రద, పద్మ, సరస్వతీ, భారతీ, శ్రీనివాస్, ప్రభంజన్‌రెడ్డి, తోట శ్రీనివాస్, సత్యం, సాదిక్‌పాషా పాల్గొన్నారు. -
భారీ బకాయి:భారత్‌పై నిస్సాన్ దావా
జపాన్ వాహన తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. సుమారు 770 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ నిస్సాన్ మోటార్స్ ఇండియాపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. చాలా కాలంగా రావాల్సిన ఇన్సెంటివ్స్ను (సుమారు రూ.5 వేల కోట్లు)చెల్లించాలంటూ డిమాండ్ చేస్తోంది. గతేడాదే ప్రధాని నరేంద్ర మోదీకి లీగల్ నోటీస్ పంపించినట్లు నిస్సాన్ తెలిపింది. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన చట్టపరమైన నోటీసులో, దక్షిణ రాష్ట్రంలో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు కోసం 2008 ఒప్పందంలో భాగంగా తమకు తమిళనాడు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయలను చెల్లించాలని కోరింది. తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం 2008లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది నిస్సాన్. ఈ ఒప్పందం ప్రకారం తమిళనాడు ప్రభుత్వం ఇన్సెంటివ్స్ చెల్లించాల్సి ఉంది. నిజానికి ఇది 2015లో ఈ మొత్తం ఇవ్వాల్సి ఉన్నాప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనీ నిస్సాన్ పేర్కొంఆది. సంస్థ చైర్మన్ కార్లోస్ ఘోసన్ గత ఏడాది దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినా ఫలితం లేదని గతేడాది ఏకంగా ప్రధానికే లేఖ రాసినా ఫలితం లేదని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరినట్టు నిస్సాన్ తెలిపింది. అయితే అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అవసరం లేకుండా సమస్య పరిష్కారమవుతుందనే ఆశాభావాన్ని తమిళనాడు అధికారి ఒకరు వ్యక్తంచేశారు. ప్రధాని మంత్రిత్వం కార్యాలలయం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు దీనిపై డిసెంబర్లో దీనికి సంబంధించి తొలి వాదనలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయి మధ్యవర్తిత్వం లేకుండానే సమస్య పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఆ బకాయి విషయంలో ఎలాంటి విభేదం లేదని చెప్పారు. మొత్తాన్ని చెల్లిస్తామని , సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాని తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఇలాంటివి ఇండియాపై ఇప్పటికే 20 కేసులు ఉండటం గమనార్హం. ప్రపంచంలో మరే దేశంపై ఇన్ని కేసులు లేవని సమాచారం. -
పైసలిస్తేనే కరెంట్ ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసే దారులూ క్రమంగా మూసుకుపోతున్నాయి. తమకు రూ. 250 కోట్ల బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ను విక్రయించలేమని అనధికారికంగా పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ (పీటీసీ) స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్టీపీసీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లకు కూడా తెలంగాణ డిస్కంలు భారీగా బకాయి పడ్డాయి. 15 రోజుల్లో బిల్లు చెల్లిస్తేనే తాము విద్యుత్ విక్రయిస్తామని ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మొత్తం సక్రమంగా రాకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి. జూలై నుంచి బిల్లుల చెల్లింపులు నిల్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంల ఆర్థికపరిస్థితి కుంచించుకుపోతోంది. విద్యుత్‌కొనుగోలు, పంపిణీ ఖర్చు పెరిగినప్పటికీ చార్జీలు మాత్రం పెరగలేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మొత్తం రావడం లేదు. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో (ఉచిత విద్యుత్, గృహాలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేసినందుకు) ప్రతినెలా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 393 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.208 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. దీంతో డిస్కంలకు ఇప్పటివరకు 1,132 కోట్ల వరకు బకాయిపడింది. మరోవైపు వివిధ ప్రభుత్వశాఖలు, మునిసిపాలిటీలు, పంచాయతీలు కూడా విద్యుత్ బిల్లులను భారీగా చెల్లించాల్సి ఉంది. సబ్సిడీకి ఆర్థికశాఖ కొర్రీలు వేస్తోంది. రూ. 208 కోట్లకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది. దీంతో డిస్కంలకు విద్యుత్‌ను విక్రయించిన ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్టీపీసీ, టీ జెన్కోకు కూడా కలిపి మొత్తం 2 వేల కోట్ల బకాయిలున్నాయని అధికారులు అంటున్నారు. ఏపీలో బకాయిలు లేవు... ఏపీలో సెప్టెంబర్ 15 వరకు విద్యుత్ సరఫరా చేసిన అన్ని కంపెనీలకు ఏపీ డిస్కంలు బిల్లులు చెల్లించాయి. దీంతో ఏపీకే విద్యుత్ ఇచ్చేందుకు ఎన్టీపీసీతోపాటు అన్ని కంపెనీలు ముందు కొస్తున్నాయి. అందుకే ఏపీ 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొంటుంటే.. తెలంగాణకు కేవలం 3.5 ఎంయూల విద్యుత్తే దొరుకుతోంది.