
లక్నో: ఓ వ్యక్తి చేసిన అప్పు ముప్పుగా మారి తన ప్రాణాన్నే తీసింది. తీసుకున్న అప్పు చెల్లించినప్పటికీ ఇంకా ఇవ్వాలని వేధిస్తుండటంతో ఓ వ్యవసాయ క్షేత్రంలో సూసైడ్ నోట్‌తో పాటు వీడియో రికార్డు చేసి విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ విషాద ఘటన యూపీలోని ఫతేగంజ్‌లో చోటుచేసుకుంది.
వీడియోలోని వివరాల ప్రకారం.. ఫతేగంజ్(పశ్చిమ)లోని నివాసముంటున్న చంద్రపాల్ గంగ్వార్ సంజార్పూర్‌లోని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. అవసరం నిమిత్తం అతను కొంతమంది నుంచి డబ్బుని అప్పుగా తీసుకున్నాడు. కొన్నాళ్లకు అప్పుని తిరిగి చెల్లించగా, వాళ్లు అంతటితో ఆగక ఇంకా చెల్లించాలని ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే వాళ్లు తన భార్యను హత్య చేస్తామని బెదిరించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రపాల్ ఆత్మహత్యకు పాల్పడుతూ తన చావుకి ఆ ముగ్గురే కారణమంటూ తన ఆవేదనను ఆ వీడియోలో వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రపాల్ వీడియోలో తెలిపిన పేర్లు.. గంగ్వార్ గుడియా, పప్పు, సంతోష్. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్‌ను అరెస్ట్ చేసి మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment