borrowed money
-
అప్పుల ఆంధ్రప్రదేశ్.. మంగళవారం మరో 2000 కోట్లు!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయడంలో బిజీగా ఉంది. వచ్చే మంగళవారం మరోసారి అప్పు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి మరో రెండువేల కోట్లు అప్పు చేయనుంది కూటమి సర్కార్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. వచ్చే మంగళవారం మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకునేందుకు బాబు సర్కార్ సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం అప్పులు సమీకరించనుంది. ఇదిలా ఉండగా.. గత మంగళవారమే కూటమి సర్కార్ మూడు వేల కోట్లు అప్పు తెచ్చిన విషయం తెలిసిందే. -
సెప్టెంబర్ వరకూ కేంద్ర రుణం రూ.7.02 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 కోట్లు సమీకరించింది. అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. ఆర్థిక శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2021–22 బడ్జెట్ నిర్దేశాల ప్రకారం– కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12.05 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణ జరపాల్సి ఉంది. ఇందులో మొదటి ఆరు నెలల్లోనే రుణ లక్ష్యంలో 60 శాతం అంటే దాదాపు రూ.7.24 లక్షల కోట్ల సమీకరణ చేయాల్సి ఉంది. అయితే సమీకరణ లక్ష్యం కొంత తగ్గింది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కొంత మేర భర్తీ చేయడానికి మార్కెట్ నుంచి కేంద్రం రుణ సమీకరణలు జరుపుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతంగా ఉంది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం(రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే 8శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. ద్రవ్యలోటు కట్టడికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థికవేత్తలు కొందరు ఉద్ఘాటిస్తుండగా, కేవీ కామత్ లాంటి ప్రముఖ బ్యాంకర్లు ఈ విషయంలో కొంత సాహస వైఖరిని కేంద్రం ప్రదర్శించవచ్చని సూచిస్తున్నారు. -
నా చావుకి వాళ్లే కారణమంటూ వీడియో రికార్డ్ చేసి..
లక్నో: ఓ వ్యక్తి చేసిన అప్పు ముప్పుగా మారి తన ప్రాణాన్నే తీసింది. తీసుకున్న అప్పు చెల్లించినప్పటికీ ఇంకా ఇవ్వాలని వేధిస్తుండటంతో ఓ వ్యవసాయ క్షేత్రంలో సూసైడ్ నోట్‌తో పాటు వీడియో రికార్డు చేసి విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ విషాద ఘటన యూపీలోని ఫతేగంజ్‌లో చోటుచేసుకుంది. వీడియోలోని వివరాల ప్రకారం.. ఫతేగంజ్(పశ్చిమ)లోని నివాసముంటున్న చంద్రపాల్ గంగ్వార్ సంజార్పూర్లోని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. అవసరం నిమిత్తం అతను కొంతమంది నుంచి డబ్బుని అప్పుగా తీసుకున్నాడు. కొన్నాళ్లకు అప్పుని తిరిగి చెల్లించగా, వాళ్లు అంతటితో ఆగక ఇంకా చెల్లించాలని ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే వాళ్లు తన భార్యను హత్య చేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రపాల్ ఆత్మహత్యకు పాల్పడుతూ తన చావుకి ఆ ముగ్గురే కారణమంటూ తన ఆవేదనను ఆ వీడియోలో వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రపాల్ వీడియోలో తెలిపిన పేర్లు.. గంగ్వార్ గుడియా, పప్పు, సంతోష్. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్‌ను అరెస్ట్ చేసి మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
స్నేహితుడిని చంపి 200 ముక్కలు చేసి..
ముంబై : అప్పు తీర్చలేదని స్నేహితున్ని కిరాతంగా చంపి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి టాయిలెట్లో పడేశాడు ఓ కిరాతకుడు. మహారాష్ట్రలోని ముంబై సమీపంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని శాంటాక్రూజ్‌లో నివాసముంటున్న పింటూ శర్మ(42) అనే వ్యక్తి వద్ద వివాహం కొరకు గణేష్ కొల్హాద్కర్(58) అనే వ్యక్తి లక్ష రూపాయాలు అప్పు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత 40వేల రూపాయలను తిరిగి ఇచ్చారు. మిగతా అప్పును గణేష్ తీర్చలేకపోయాడు. దీంతో ఇరువురి మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే డిసెంబర్16న పింటూ.. గణేష్‌ను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. తర్వాత అప్పు విషయం తీసి ఇద్దరూ గొడవకు దిగారు. అనంతరం గణేష్‌ను బంగ్లాపై నుంచి కిందకు నెట్టేశాడు. కిందపడ్డ గణేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లిన పింటూ దానిని దాదాపు 200 ముక్కలు నరికాడు. తన ఇంటిలోని టాయిలెట్లో నాలుగు రోజుల పాటు ఆ ముక్కలను పడేసి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. అయితే మున్సిపల్ కార్మికులు స్థానికంగా ఉన్న డ్రైనేజీని శుభ్రపరుస్తుండగా మృతదేహం ముక్కలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు పింటూను అరెస్టు చేశారు. -
అప్పు డబ్బుల కోసం వెళ్తే అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ.. స్థానిక భాగ్యలక్ష్మికాలనీకి చెందిన సుకుమార్ దాస్ కిరాణ దుకాణం నిర్వహిస్తుంటాడు. ఇదే కాలనీకి చెందిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అయిన రాకేశ్‌కుమార్(26) అతడికి రూ.6,000 బకాయి పడ్డాడు. ఈ మొత్తం ఇవ్వాలని సుకుమార్‌దాస్ శుక్రవారం సాయంత్రం అతడిని అడిగాడు. తన ఇంటికి వస్తే డబ్బు అందజేస్తానని రాకేశ్ బదులిచ్చాడు. దీంతో సుకుమార్ దాస్ తన కుమార్తె(10)ను అతడి ఇంటికి పంపాడు. రాకేశ్‌కుమార్ ఆమెను ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలిపింది. ఈ మేరకు వారు శనివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.