నిందితుడు పింటూ శర్మను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు
ముంబై : అప్పు తీర్చలేదని స్నేహితున్ని కిరాతంగా చంపి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి టాయిలెట్‌లో పడేశాడు ఓ కిరాతకుడు. మహారాష్ట్రలోని ముంబై సమీపంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబైలోని శాంటాక్రూజ్‌లో నివాసముంటున్న పింటూ శర్మ(42) అనే వ్యక్తి వద్ద వివాహం కొరకు గణేష్ కొల్హాద్కర్(58) అనే వ్యక్తి లక్ష రూపాయాలు అప్పు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత 40వేల రూపాయలను తిరిగి ఇచ్చారు. మిగతా అప్పును గణేష్ తీర్చలేకపోయాడు. దీంతో ఇరువురి మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే డిసెంబర్16న పింటూ.. గణేష్‌ను తన ఇంటికి పిలిపించుకున్నాడు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. తర్వాత అప్పు విషయం తీసి ఇద్దరూ గొడవకు దిగారు. అనంతరం గణేష్‌ను బంగ్లాపై నుంచి కిందకు నెట్టేశాడు. కిందపడ్డ గణేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లిన పింటూ దానిని దాదాపు 200 ముక్కలు నరికాడు. తన ఇంటిలోని టాయిలెట్‌లో నాలుగు రోజుల పాటు ఆ ముక్కలను పడేసి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. అయితే మున్సిపల్ కార్మికులు స్థానికంగా ఉన్న డ్రైనేజీని శుభ్రపరుస్తుండగా మృతదేహం ముక్కలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు పింటూను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment