
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయడంలో బిజీగా ఉంది. వచ్చే మంగళవారం మరోసారి అప్పు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి మరో రెండువేల కోట్లు అప్పు చేయనుంది కూటమి సర్కార్.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. వచ్చే మంగళవారం మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకునేందుకు బాబు సర్కార్ సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం అప్పులు సమీకరించనుంది. ఇదిలా ఉండగా.. గత మంగళవారమే కూటమి సర్కార్ మూడు వేల కోట్లు అప్పు తెచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment