జపాన్ వాహన తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. సుమారు 770 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ నిస్సాన్ మోటార్స్ ఇండియాపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. చాలా కాలంగా రావాల్సిన ఇన్సెంటివ్స్‌ను (సుమారు రూ.5 వేల కోట్లు)చెల్లించాలంటూ డిమాండ్ చేస్తోంది. గతేడాదే ప్రధాని నరేంద్ర మోదీకి లీగల్ నోటీస్ పంపించినట్లు నిస్సాన్ తెలిపింది. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన చట్టపరమైన నోటీసులో, దక్షిణ రాష్ట్రంలో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు కోసం 2008 ఒప్పందంలో భాగంగా తమకు తమిళనాడు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయలను చెల్లించాలని కోరింది.
తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం 2008లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది నిస్సాన్. ఈ ఒప్పందం ప్రకారం తమిళనాడు ప్రభుత్వం ఇన్సెంటివ్స్ చెల్లించాల్సి ఉంది. నిజానికి ఇది 2015లో ఈ మొత్తం ఇవ్వాల్సి ఉన్నాప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనీ నిస్సాన్ పేర్కొంఆది. సంస్థ చైర్మన్ కార్లోస్ ఘోసన్ గత ఏడాది దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినా ఫలితం లేదని గతేడాది ఏకంగా ప్రధానికే లేఖ రాసినా ఫలితం లేదని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరినట్టు నిస్సాన్ తెలిపింది.
అయితే అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అవసరం లేకుండా సమస్య పరిష్కారమవుతుందనే ఆశాభావాన్ని తమిళనాడు అధికారి ఒకరు వ్యక్తంచేశారు. ప్రధాని మంత్రిత్వం కార్యాలలయం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
మరోవైపు దీనిపై డిసెంబర్‌లో దీనికి సంబంధించి తొలి వాదనలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయి మధ్యవర్తిత్వం లేకుండానే సమస్య పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఆ బకాయి విషయంలో ఎలాంటి విభేదం లేదని చెప్పారు. మొత్తాన్ని చెల్లిస్తామని , సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాని తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఇలాంటివి ఇండియాపై ఇప్పటికే 20 కేసులు ఉండటం గమనార్హం. ప్రపంచంలో మరే దేశంపై ఇన్ని కేసులు లేవని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment