న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
తమిళనాడుతో అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5-6 రోజులలో దక్షిణ కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 14 నుంచి 16వ తేదీ మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గడచిన 24 గంటల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. తూర్పు రాజస్థాన్‌లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. సంచోర్ (జలోర్)లో గరిష్టంగా 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఢిల్లీలో మేఘావృతమై గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: దేవర గట్టు కర్రల సమరంలో పారిన నెత్తురు.. 100మందికి పైగా భక్తులకి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment