కరోనా: భారత్‌లో 5351కి చేరిన కేసులు | Corona: 5351 Cases Filed In India Till Wednesday Morning | Sakshi
Sakshi News home page

దేశ వ్యాప్తంగా 5351 కేసులు నమోదు

Published Wed, Apr 8 2020 10:33 AM | Last Updated on Wed, Apr 8 2020 10:54 AM

Corona: 5351 Cases Filed In India Till Wednesday Morning - Sakshi

న్యూఢిల్లీ : కరోనా రోజురోజుకి విజృంభిస్తూ.. మనవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 14 లక్షలు దాటగా భారత్‌లోను కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 5351 మంది కరోనా బారిన పడగా, 160 మంది మృత్యువాత పడ్డారు. 468 మంది కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గత రాత్రి వరకు రాష్ట్రాల వారీగా ఈ సంఖ్యను పరిశీలిస్తే మహారాష్ట్రలో 1018, తమిళనాడు 690, ఢిల్లీ 576, తెలంగాణ 404, రాజస్థాన్‌ 343, కేరళ 336, ఉత్తరప్రదేశ్‌ 332, ఆంధ్రప్రదేశ్‌ 314, మధ్యప్రదేశ్‌ 290, గుజరాత్‌ 175, కర్ణాటక 175, హరియాణ 143 కేసులు నమోదయ్యాయి. అలాగే జమ్మూకశ్మీర్‌లో 125, పంజాబ్‌ 99, పశ్చిమబెంగాల్‌ 91, ఒడిశా 42, బీహార్‌ 38, ఉత్తరాఖండ్‌ 31, అసోం 28, హిమాచల్‌ ప్రదేశ్‌ 27, చండీగఢ్‌ 18, లడఖ్‌ 14, అండమాన్ 10, ఛత్తీస్‌గఢ్‌ 10, గోవాలో 7, పుదుచ్చేరి 5, జార్ఖండ్‌ 4, మణిపూర్‌ 2 కేసులు నమోదవగా... అరుణాచల్‌ ప్రదేశ్‌, దాద్రా, మిజోరం, త్రిపురలో ఒక్కోకేసు నమోదయ్యాయి. (ఐసీయూలో ప్రధాని.. కోలుకోవాలని చప్పట్లు! )

ఇక ఏపీలో 329 పాజిటివ్‌ కేసులు, తెలంగాణలో 404 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 11 మంది మృతి చెందారు. కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని కేంద్రం ఆలోచిస్తుంది. ఇదే సరైన నిర్ణయమని పలు రాష్ట్రాలు సైతం సూచిస్తున్నాయి. కాగా ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌​ ఫ్లోర్‌ లీడర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. (కరోనా: ‘మానవత్వం చూపించండి ప్లీజ్‌’ )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement