insolvency petition
-
బైజూస్‌కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. ఎన్‌క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్‌పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్‌క్లాట్ తీర్పు ఇచ్చింది. -
ఎన్సీఎల్ఏటీలో కాఫీ డే సంస్థకి ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్)కి ఊరట లభించింది. కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణ వరకు స్టే విధించింది. కంపెనీ పిటీషన్‌పై మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఐడీబీఐ ట్రస్టీషిప్ సరీ్వసెస్ (ఐడీబీఐటీఎస్ఎల్)ను ఆదేశించింది. వివరాల్లోకి వెడితే, రూ. 228.45 కోట్ల మొత్తాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయిన కాఫీ డే సంస్థపై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ని ఐడీబీఐటీఎస్ఎల్ ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ, కంపెనీ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. అయితే, సస్పెండ్ అయిన కంపెనీ బోర్డు సీఈవో మాళవిక హెగ్డే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
జైప్రకాశ్ అసోసియేట్స్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దివాలా పిటిషన్ల విషయంలో ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. జేపీ గ్రూప్‌లో కీలకమైన జేఏఎల్ ప్రధానంగా నిర్మాణం, హాస్పిటాలిటీ తదితర వ్యాపారాలు సాగిస్తోంది. కంపెనీ 2037 కల్లా మొత్తం రూ. 29,805 కోట్ల రుణాలను (వడ్డీతో కలిపి) కట్టాల్సి ఉండగా ఇందులో రూ. 4,616 కోట్లు 2024 ఏప్రిల్ 30 నాటికి చెల్లించాల్సి ఉంది. దీన్ని చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం వల్ల లిక్విడిటీ కొరత ఏర్పడటమే డిఫాల్ట్ కావడానికి కారణమంటూ జేఏఎల్ వినిపించిన వాదనలను తోసిపుచ్చిన ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలిచ్చింది. -
బైజూస్‌పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)–బెంగళూరులో దివాలా పిటిషన్ దాఖలైంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మేర టర్మ్ లోన్–బీ (టీఎల్‌బీ) ఇచి్చన రుణదాతల్లో 80 శాతం సంస్థలు కలిసి గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ద్వారా దీన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దివాలా పిటిషన్ విషయం ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు. బైజూస్ ఈ వ్యవహారమంతా నిరాధారమైనదని పేర్కొంది. రుణదాతల చర్యలపై అమెరికా కోర్టుల్లో పలు కేసులు నడుస్తుండగా ఎన్సీఎల్టీని ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను తీర్చేసుకునేందుకు టీఎల్‌బీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు బైజూస్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు కాకుండా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇచ్చిన రుణాన్ని టీఎల్‌బీ లోన్‌గా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టీఎల్‌బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
చిట్టీల పేరుతో సామాన్యులకు టోకరా.. పక్కా ప్రణాళికతోనే మోసం చేస్తున్న వ్యాపారులు!
కోదాడ: కోదాడ కేంద్రంగా జరుగుతున్న చిట్టీ వ్యాపారుల మోసాలకు తెరపడడం లేదు. అవసరానికి ఉపయోగపడతాయని రూపాయి.. రూపాయి జమ చేస్తున్న సామాన్యులను చిట్టీల వ్యాపారులు నిండా ముంచుతున్నారు. 20 నుంచి 30 సంవత్సరాలు ఇదే వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యాపారులు సామాన్యులకు దాదాపు రూ.25కోట్లు కుచ్చుటోపి పెట్టారు. నాలుగు సంవత్సరాల క్రితం కోదాడకు చెందిన సేవా చిట్స్ యజమాని రూ.20కోట్లు చెల్లించకుండా మొహం చాటేయగా.. తాజాగా మరో వ్యాపారి దాదాపు రూ.6కోట్ల మేర ఐపీ పెడుతున్నట్లు సమాచారం. ఒక చిట్టీ నిర్వహణకు మాత్రమే అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో చిట్టీలను నడుపుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. తెలివిగా తప్పించుకుంటున్నారు.. రిజిస్టర్ చిట్టీ ఒకటి మాత్రమే అనుమతి తీసుకొని కోట్ల రూపాయలు చిట్టీలు నడుపుతున్న వీరు బోర్డు తిప్పేస్తే బాధితులకు చిల్లిగవ్వ కూడా రావడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందే వీరు తమ ఆస్తులను ఇతరులకు గుట్టచప్పుడు కాకుండా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించి ఐపీ దాఖలు చేస్తుండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కోర్టులకు చేరుతున్న వ్యవహారం సంవత్సరాల తరబడి తేలకపోవడంతో బాధితులు పూర్తిగా నష్టపోతున్నారు. కోదాడలో ఇలా ఒక చిట్టీకి మాత్రమే అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో చిట్టీలను నడుపుతున్న సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కాఫీ డే గ్లోబల్‌పై దివాలా పిటిషన్!
న్యూఢిల్లీ: ప్రముఖ కేఫ్ కాఫీ డే చైన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ (సీడీజీఎల్)పై దాఖలైన దివాలా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంగళూరు బెంచ్ అడ్మిట్ చేసింది. రూ.94 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ, బకాయిలను రాబట్టుకునేందుకుగాను కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను (సీఐఆర్‌పీ) ప్రారంభించాలని కంపెనీ ఫైనాన్షియల్ క్రెడిటార్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ స్వీకరించింది. సీడీజీఎల్ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఎన్సీఎల్టీ లిఖితపూర్వక ఆదేశాల కోసం సీడీజీఎల్ ఎదురుచూస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి తన అనుబంధ సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కూడా పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సీడీజీఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సీడీజీఎల్ ఆదాయం రూ. 920.41 కోట్లు. నష్టం రూ.67.77 కోట్లు. -
వీడియోకాన్‌పై ఆడిట్ సందేహాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఖాతా పుస్తకాల ఆడిట్ సమీక్షలో కొన్ని పద్దులు, లావాదేవీల నమోదుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రమోటర్ ధూత్ కుటుంబం నిర్వహణలో ఉన్నప్పుడు వీటి నమోదు జరిగి ఉండవచ్చని ఆడిట్ సమీక్ష పేర్కొంది. కంపెనీపై దివాలా చట్ట చర్యలు ప్రారంభించకముందు ఈ సందేహాస్పద లావాదేవీలు నమోదైనట్లు ఆడిట్ అభిప్రాయపడింది. కాగా.. వీడియోకాన్ రుణపరిష్కార నిపుణులు ఇప్పటికే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు ఇలాంటి లావాదేవీలను రద్దు చేయడం, ప్రక్కన పెట్టడంపై దరఖాస్తు చేశారు. ఈ ఆడిట్ సమీక్ష వివరాలను గత నాలుగు త్రైమాసికాల ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న సందర్భంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. దివాలా చట్ట నిబంధనల ప్రకారం ప్రిఫరెన్షియల్, విలువ తక్కువగా మదింపు, అక్రమ లావాదేవీల గుర్తింపునకు రుణ పరిష్కార నిపుణులు చేపట్టిన స్వతంత్ర లావాదేవీ ఆడిట్ సమీక్ష అనంతరం ఈ అంశాలు బయటపడినట్లు వివరించింది. రుణ పరిష్కార నిపుణులు 2021 జూన్(క్యూ1), సెప్టెంబర్(క్యూ2), డిసెంబర్(క్యూ3), 2022 మార్చి(క్యూ4)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను క్రోడీకరించి పూర్తిఏడాది(2021–22) పనితీరును ప్రకటించారు. వెరసి వీడియోకాన్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ ఆదాయం రూ. 756 కోట్లకు చేరగా.. రూ. 6,111 కోట్లకుపైగా నికర నష్టం నమోదైంది. -
ఎన్సీఎల్ఏటీకి గో ఫస్ట్ లీజుదార్లు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రక్రియను వ్యతిరేకిస్తూ విమానాల లీజుదార్లు ఒక్కొక్కరుగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ జీవై ఏవియేషన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్ సంస్థలు.. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటీషన్ దాఖలు చేశాయి. ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ ఇప్పటికే పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌కు చెందిన జీవై ఏవియేషన్.. గో ఫస్ట్‌కు 9 విమానాలు, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్ ఒకటి, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ 5 విమానాలను లీజుకిచ్చాయి. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న గో ఫస్ట్ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ టీ) విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీ ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిచ్చింది. కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న ఉత్తర్వులను రిజర్వ్ చేసిన ఎన్సీఎల్టీ దాదాపు వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా బుధవారం నాడు ఆదేశాలను వెలువరించింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంటు.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. గో ఫస్ట్ తాను బాకీల విషయంలో డిఫాల్ట్ అయ్యానని, రుణదాతల నుంచి వచ్చిన డిమాండ్ నోటీసులను కూడా సమర్పించిందని, లీజు సంస్థలు కూడా దీన్ని ఖండించడం లేదని ద్విసభ్య ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో దివాలా చట్టంలోని సెక్షన్ 10 కింద కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనుంది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవరీ చేసుకోవడానికి గానీ ఉండదు. గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్‌పై దివాలా పరిష్కార చర్యలకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ అనుమతించింది. ఈ సంస్థను వేలం వేయడం ద్వారా రుణదాతలు తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి మార్గం సుగమం అయింది. బియానీకి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ సైతం దివాలా చర్యల పరిధిలోకి వెళ్లడం తెలిసిందే. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను చూసేందుకు పరిష్కార నిపుణుడిని ముంబై బెంచ్ నియమించినట్టు ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. పరిష్కార నిపుణుడి నియామకంతో కంపెనీ బోర్డు రద్దయిపోయింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ తమకు రూ.1.58 కోట్లు చెల్లించడంలో విఫలమైందంటూ ఢిల్లీకి చెందిన సరఫరాదారు ఫోర్‌సైట్ ఇన్నోవేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. -
సింటెక్స్ మాజీ ఎండీకి ఎన్సీఎల్ఏటీలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా ప్రక్రియకు వ్యతిరేకంగా సింటెక్స్ ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్, ఎండీ రాహుల్ అరుణ్‌ప్రసాద్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై కార్పొరేట్ దివాలా ప్రక్రియ(సీఐఆర్‌పీ)ను ఆమోదిస్తూ, 2021 ఏప్రిల్ 6న ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్ఏటీ బెంచ్ తాజాగా సమర్థించింది. ఇన్వెస్కో అసెట్ మేనేజ్మెంట్(ఇండియా) అభ్యర్థనకు అనుగుణంగా అహ్మదాబాద్ బెంచ్ గతంలో సింటెక్స్‌పై ఐసీఆర్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ అరుణ్‌ప్రసాద్ పెట్టుకున్న అభ్యర్ధనలో ఎలాంటి మెరిట్ కనిపించలేదని బెంచ్ పేర్కొంది. దీంతో మధ్యంతర అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా.. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై సీఐఆర్‌పీ దాదాపు పూర్తికానుంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ సంయుక్తంగా వేసిన బిడ్‌కు 98.88 శాతం వోటింగ్ లభించింది. వెరసి 2023 ఫిబ్రవరి 10న ఎన్సీఎల్టీ రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించింది. -
‘జీ’పై ఐపీఆర్‌ఎస్ దివాలా అస్త్రం
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజ్‌పై రచయితలు, కంపోజర్లు, మ్యూజిక్ పబ్లిషర్లతో కూడిన నాన్–ప్రాఫిట్ సొసైటీ ద ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ(ఐపీఆర్‌ఎస్) దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది. రాయల్టీకింద రూ. 211.41 కోట్ల చెల్లింపుల్లో విఫలమైనట్లు పేర్కొంటూ ఐపీఆర్‌ఎస్ దివాలా చట్ట ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీని ఆశ్రయించినట్లు స్వయంగా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే ఈ క్లెయిమును తిరస్కరిస్తున్నట్లు జీ తెలియజేసింది. క్లెయిము మొత్తాన్ని తాను చెల్లించాల్సిన పనిలేదని వివరించింది. ఈ మేరకు తాను ఎన్సీఎల్టీలో సమాధానం దాఖలు చేస్తామని తెలిపింది. లిటరరీ, మ్యూజికల్ వర్క్‌లకు సంబంధించి రాయల్టీలు చెల్లించవలసి ఉన్నట్లు ఐపీఆర్‌ఎస్ ప్రస్తావించినట్లు వివరించింది. ఈ కేసుపై గతంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఐపీఆర్‌ఎస్ కోరుతున్న సొమ్ము బకాయికాదని, చెల్లించవలసిన అవసరంలేదని వివరణ ఇచ్చింది. -
జేఏఎల్‌పై ఎస్బీఐ దివాలా పిటీషన్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా పిటీషన్ దాఖలు చేసింది. 2022 సెప్టెంబర్ 15 నాటికి కంపెనీ మొత్తం రూ. 6,893 కోట్ల మేర బాకీ పడిందని పేర్కొంది. జేఏఎల్ రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతున్నందున దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం నెలకొందని ఎస్బీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి భువన్ మదన్‌ను తాత్కాలిక పరిష్కార నిపుణుడిగా నియమించాలంటూ ప్రతిపాదించింది. మరోవైపు, రుణాల చెల్లింపు కోసం తమ సిమెంటు ప్లాంట్లను విక్రయించినట్లు జేఏఎల్ తెలిపింది. రుణదాతలకు చెల్లింపులు జరిపేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. -
దేశంలో దివాలా కేసులు ఎన్నో తెలుసా!
జూన్ 2022 నాటికి ఇన్సాల్వెన్సీ చట్టం కింద దాదాపు 1,999 దివాలా కేసులు నమోదయినట్లు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. ఇందులో 436 రియల్టీకి సంబంధించినవని వెల్లడించారు. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) కోసం పట్టే సమయం వ్యాపార స్వభావం, వ్యాపార సైకిల్స్ (ఒడిదుడుకులు), మార్కెట్ సెంటిమెంట్, మార్కెటింగ్ వ్యవహారాలు సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి కాలంలో మందగమనం సహజమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, ప్రధాన మంత్రి కార్యాలయం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతర అధికారుల నుండి దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) ఫిర్యాదులను స్వీకరిస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపిన మంత్రి, 2022 జూలై 31వ తేదీ వరకూ ఈ తరహా 6,231 ఫిర్యాదులను స్వీకరించినట్లు వెల్లడించారు. వీటిపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఒక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఆర్పీ(రిజల్యూషన్ ప్రొఫెషనల్)పై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్కు ఒక ఫిర్యాదు అందినట్లు తెలిపారు. దీనిపై తగిన చర్యలను తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. సీబీఐ కూడా దివాలా పక్రియ దుర్వినియోగానికి సంబంధించి ఒక ఫిర్యాదును అందుకున్నా, తప్పు జరిగినట్లు తేలలేదని తెలిపారు. చదవండి: అధ్యక్షా.. బాస్ అంటే ఇట్టా ఉండాలా.. అదిరిపోయే జీతం, బోలెడు బెనిఫిట్స్ కూడా.. -
ఎస్బీఐ లోన్ : అనిల్ అంబానీకి ఊరట
సాక్షి,న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీ ఊరట లభించింది.1200 కోట్ల రూపాయల రుణం విషయంలో ఎస్బీఐ చేపట్టనున్న దివాలా చర్యలను ఢిల్లీ హైకోర్టు అడ్డుకుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సోదరుడు, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై దాఖలైన దివాలా పిటిషన్‌ను కోర్టు గురువారం నిలిపివేసింది. అలాగే ఆస్తులను విక్రయించకుండా అనిల్ అంబానీని నిలువరిస్తూ ఆదేశాలు జారీచేసింది. (చదవండి : అనిల్ అంబానీకి ఎస్బీఐ షాక్) అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ తీసుకున్న కార్పొరేట్ రుణాలపై అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇవి మొండి బకాయిలుగా మారటంతో దివాలా చట్టం ప్రకారం అంబానీ నుంచి రూ.1200 కోట్లను రాబట్టేందుకు ఎస్బీఐ రంగంలోకి దిగింది. కార్పొరేట్ రుణాల చెల్లింపుల ప్రక్రియకు ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను నియమించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఎస్బీఐ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మొబైల్ సేవల్ సంస్థ ఆర్‌కామ్ 2002లో అనిల్ అంబానీ ప్రారంభించారు. కానీ పోటీకి నిలబడలేక, భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ఆ తరువాత 2016లో ముకేశ్ అంబానీ సృష్టించిన జియో సునామీతో మరింత కుదేలై దివాలా తీసింది. అటు 2017 జనవరిలో రుణ చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో ఆర్‌ఐటిఎల్ రుణాన్ని 26 ఆగస్టు 2016 నుండి నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది బ్యాంకు. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు మూతపడ్డాయి. మరోవైపుఈ విషయం కార్పొరేట్ రుణానికి సంబంధించినదని, వ్యక్తిగత రుణానికి చెందినది కాదని అడాగ్ గ్రూపు గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే రుణ పరిష్కార ప్రణాళికలకు రుణదాతలు అంగీకరించారని, ట్రైబ్యునల్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు తెలిపింది. -
దివాలా ప్రక్రియకు డీహెచ్ఎఫ్ఎల్
బెంగళూర్ : హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్పై దివాలా ప్రక్రియను చేపడుతున్నట్టు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది. డీహెచ్ఎఫ్ఎల్ బోర్డును తొలగించిన ఆర్బీఐ దివాలా ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది. డీహెచ్ఎల్ఎఫ్ను ఆర్బీఐ తదుపరి చర్యల నిమిత్తం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు తరలించనుంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన డీహెచ్ఎఫ్ఎల్ వివిధ బ్యాంకులు, మ్యూచ్‌వల్ ఫండ్లు సహా రుణదాతలకు రూ లక్ష కోట్ల వరకూ రుణాలను చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థలనూ దివాలా చట్టం కిందకు తీసుకువస్తూ ఈనెల 15న నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్పై దివాలా ప్రక్రియ చేపట్టడం గమనార్హం. డీహెచ్ఎల్ఎఫ్తో పాటు అల్టికోపైనా దివాలా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
రూ 40,400 కోట్లు రాబట్టాయి : ఆర్బీఐ నివేదిక
సాక్షి, ముంబై : దివాలా చట్టానికి కోరలుతేవడం, సర్ఫేసి చట్ట సవరణలతో 2017-18 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు ఒత్తడికి లోనయ్యే రుణాల రికవరీలో గణనీయ పురోగతి సాధించాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ 40,400 కోట్ల రాని బాకీలను వసూలు చేశాయని ఇవి 2017 ఆర్థిక సంవత్సరంలో రూ 38,500 కోట్లుగా నమోదయ్యాయని ఈ నివేదిక తెలిపింది. దివాలా చట్టం (ఐబీసీ), సర్ఫేసి చట్టం, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, లోక్ అదాలత్ వంటి వివిధ మార్గాల్లో బ్యాంకులు మొండి బకాయిలు, రాని బాకీలను పరిష్కరించుకున్నాయని పేర్కొంది. ఇక ఐబీసీ ద్వారా బ్యాంకులు రూ 4900 కోట్ల మేర రాని బాకీలను వసూలు చేయగా, సర్ఫేసి చట్టం ద్వారా రూ 26,500 కోట్లను రాబట్టాయని 2017-18లో బ్యాంకింగ్ ధోరణలు, పురోగతిపై ఆర్బీఐ ఈ వారాంతంలో విడుదల చేసిన వార్షిక నివేదికలో పొందుపరిచింది. మొండి బకాయిల సత్వర వసూలుకు సర్ఫేసి చట్టాన్ని సవరిస్తూ బాకీ దారు 30 రోజుల్లోగా తన ఆస్తుల వివరాలను వెల్లడించకుంటే మూడు నెలల జైలు శిక్షతో పాటు పలు కఠిన నిబంధనలు విధించడంతో రుణాల వసూలు ప్రక్రియ వేగవంతమైందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. మరోవైపు బకాయిదారు ఆస్తుల వివరాలతో నిర్ధేశిత గడువులోగా ముందుకు రాకుంటే తనఖాలో ఉంచిన ఆస్తులను ఆయా బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చనే నిబంధన కూడా రుణాల సత్వర వసూళ్లకు ఊతమిస్తోందని పేర్కొంది. ఇక ఐబీసీ ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు అధికంగా వసూలవుతున్నాయని వెల్లడించింది. మొండి బకాయిలు, రాని బాకీల వసూళ్లలో ఐబీసీ ముఖ్యమైన మార్గంగా ఉపకరిస్తోందని తెలిపింది. -
‘ఐపీ’తో టోపీ
చిట్టీల పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేయడం.. విచ్చలవిడిగా అప్పులు చేయడం.. ఇలా సేకరించిన సొమ్ముతో ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు చేయడం.. అదను చూసి ‘ఐపీ’ పెట్టేసి భాగస్వాములు, ప్రజల నెత్తిన టోపీ పెట్టేయడం.. ఇలాంటి ఘటనలు కామారెడ్డిలో తరచూ వెలుగు చూస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన ‘రక్షణ’.. కొందరికి ఆయుధంగా మారింది. భాగస్వాములు, జనాల నమ్మకమే పెట్టుబడిగా భారీగా కూడబెట్టుకొని, ఆ తర్వాత దివాళా తీశామని కోర్టు తలుపు తట్టడం షరా మామూలుగానే మారింది. సాక్షి, కామారెడ్డి: ఐపీ.. ఈ పదం వింటేనే కామారెడ్డి వ్యాపారుల్లో ఇప్పుడు వణుకు పుడుతోంది. చిట్టీలు వేసిన వారి గుండెల్లో దడ పుట్టిస్తోంది. చిన్నా చితకా పొదుపు చేసిన సొమ్మును ఫైనాన్సుల్లో చిట్టీలు, పెట్టుబడుల రూపంలో పెట్టిన వారిలో కలకలం రేపుతోంది. దివాళా పేరిట టోకరా వేస్తూ కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపుతుండడంతో మార్కెట్లో తీవ్ర అయోమయం, గందరగోళం నెలకొంది. గత రెండేళ్ల కాలంలో జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో ఎనిమిది మంది ఐపీ బాట పట్టి, నమ్మిన వారికి సుమారు రూ. 20 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. 2016లో నలుగురు, 2017లో ముగ్గురు, ఈ సంవత్సరం ఆరంభంలోనే ఒకరు ఐపీ బాట పట్టారు. నాలుగైదు జిల్లాలకు కూడలిగా, వ్యాపార వాణిజ్య కేంద్రంగా పేరున్న కామారెడ్డి పట్టణంలో ఇప్పుడు ఎక్కడికెళ్లినా ‘ఐపీ’ల ముచ్చట్టే వినిపిస్తున్నాయి. నమ్మి నిండా మునిగిన వారు ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో తెలిసిన వారినల్లా కలుస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు. మోసపోయిన వారికి అసలు ఐపీ అంటే ఏమిటి? దాని పర్యవసానాలు ఏమిటి? అన్న దానిపై అవగాహన లేకపోవడంతో ఐపీ పెట్టాడని తెలిస్తేనే హడలి పోతున్నారు. నోటీసులు అందుకున్న వారు డబ్బులు పోవడం ఏమో గాని ఎలా వ్యవహరించాలో తెలియక అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకు పెడుతున్నారు..? చిట్టీలు, ఫైనాన్స్ రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్న వ్యాపారులు కొందరు ఇష్టారీతిన డబ్బును సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. మరికొందరు ‘రియల్’ వ్యాపారంలో పెట్టి బురిడీ కొడుతుంటే, ఇంకొందరేమో ఆస్తులను కూడబెట్టుకొంటున్నారు. ఇంకొందరు అధిక వడ్డీలు చెల్లించడం ద్వారా నష్టపోతున్నారు. అయితే, నష్టాలను కప్పిపెడుతూ నమ్మిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకుంటున్నారు. చివరకు ఆస్తులను ఇతరుల పేరిట మార్చడం, అమ్ముకోవడం ద్వారా వచ్చిన సొమ్మును దాచుకుని ఐపీ బాట పడుతున్నారు. అయితే, ఈ పిటిషన్లు దాఖలయినప్పుడు కోర్టుకు వచ్చి న్యాయ æపోరాటం చేసే వ్యాపారులు తక్కువగా ఉండడంతో వంచకుల ఆటలు సాగుతున్నాయి. కొందరు నమ్మిన వారికి టోపీ పెట్టడానికి ముందస్తు ప్రణాళికతో ఐపీ ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే, బడా వ్యాపారులు ఐపీ జాబితాలో ఉన్నపుడు వారి వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా లోలోపల సెటిల్మెంట్లు చేసుకుని, చిన్న పెట్టుబడిదారులను నిండా ముంచుతున్నారు. ‘టోపీ’ పెడితే ఏం చేయాలి..? మన వద్ద సొమ్ము తీసుకున్న వారెవరైన ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసినప్పుడు మన వద్ద ఉన్న డాక్యుమెంట్లు, ప్రామీసరీ నోట్లు, చెక్‌ల ద్వారా కోర్టులో కేసు నమోదు చేసి, కోర్టు డిక్రీ తీసుకునే అవకాశం ఉంది. ఇలా డిక్రీ తీసుకుంటే దాని విలువ 12 ఏళ్ల వరకు ఉంటుంది. ఐపీ పెట్టిన వ్యక్తి తిరిగి వ్యాపారంలో పుంజుకుంటే అతని వద్ద నుంచి డబ్బు తిరిగి రాబట్టుకునే అవకాశం ఈ డిక్రీ కల్పిస్తుంది. అయితే, చాలా సందర్బాల్లో ఐపీ పిటిషన్ దాఖలు కాగానే రుణదాతలు మిన్నకుండి పోతున్నారు. మరికొందరు పెద్ద మొత్తంలో సొమ్ములు ఇచ్చాం.. ఇన్‌కం ట్యాక్స్ బాధలుంటాయని భయపడి ఐపీ పెట్టిన వారితో రాజీ కుదుర్చుకుంటున్నారు. చాలా సందర్చాల్లో రుణ దాతల వద్ద అప్పు ఇచ్చినట్టు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండడం లేదు. అయితే, ‘నష్టపోయిన’ వ్యాపారులు రుణ దాతల పేర్లను ఐపీ కేసులో చూపుతున్నందువల్ల దాని ఆధారంగా రుణ వసూలు చేసుకోవడానికి దావా వేసే అవకాశాలు ఉన్నట్టు న్యాయవాదులు చెబుతున్నారు. రాజీ నాటకం.. ఐపీని అడ్డం పెట్టుకుని కొందరు రాజీ పేరిట సగానికి పైగా సొమ్ము ఎగ్గొంట్టేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఇటీవల ఐపీ పెట్టిన ఓ వ్యాపారి తాను ఇవ్వాల్సిన వారి పేర్లను ఇన్సాల్వెన్సీ పిటిషన్లో చేర్చకుండా బినామీ పేర్లు చేర్చినట్టు సమాచారం. అసలు అప్పు ఇచ్చిన వారికి మాత్రం ‘మీ పేర్లు ఐపీలో లేవు.. మీతో ఎంతో కొంతకు సెటిల్మెంట్ చేసుకుంటానంటూ’ నమ్మబలుకుతున్నట్టు తెలుస్తోంది. ఐపీ అంటే.. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటీషన్. వ్యాపారంలో నష్టాలు వచ్చినపుడు రుణ గ్రహీతలను రక్షించడానికి తయారు చేసిన చట్టమిది. నష్టాల బారిన పడిన వ్యకి తాను దివాళా తీసినట్టు ప్రకటించమని కోర్టును ఆశ్రయించి, తనకున్న అప్పులు, ఆస్తుల జాబితాను సమర్పించి, నష్టాలకు కారణాలను వివరించి కోర్టునుంచి రక్షణ పొందే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది. అయితే, ఈ రక్షణ ప్రస్తుతం మోసగాళ్లకు వరంగా మారింది. ఐపీని అస్త్రంగా చేసుకుని ‘కొందరు’ నమ్మిన వారికి టోపీ పెడుతున్నారు. అయితే, ఈ చట్టం అప్పులు తీసుకున్న వారికే కాదు, ఇచ్చిన వారికి సైతం రక్షణ కల్పిస్తోంది. రుణ గ్రహీత నుంచి తమకు రావాల్సిన రొక్కం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించి సదరు వ్యక్తిని దివాళాకోరుగా ప్రకటించమనే అవకాశం చట్టం కల్పిస్తోంది. దివాళా పిటిషన్ దాఖలా చేసిన వ్యక్తి ఆస్తులను, అప్పులను ఇతర సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కోర్టు సదరు వ్యక్తి దివాళా తీసినట్టు ప్రకటిస్తుంది. అయితే, దివాళా పిటిషన్లు దాఖలు అవుతున్నప్పటికీ కోర్టు విచారణ పూర్తయి దివాళా తీసినట్టు ప్రకటించిన కేసులు చాలా చాలా తక్కువే. -
అడ్డంగా దోచేయ్.. ఐపీ పెట్టేయ్!
సాక్షి, హైదరాబాద్: వ్యాపారం పేరుతో హంగూ ఆర్భాటం చేస్తూ కార్యాలయాలు తెరవడం.. అందమైన బ్రోచర్లతో అకట్టుకోవడం.. కొన్నాళ్లపాటు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి చేతులెత్తేయడం.. తీరా ఐపీ (ఇన్‌సాల్వేషన్ పిటిషన్) పెట్టి జనానికి కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టడం! రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న దర్జా దోపిడీ ఇది!! సాధారణ దొంగతనాల్లో పోయే సొమ్ము కన్నా.. ఇలాంటి మోసాల్లో జనం పోగొట్టుకుంటున్న సొమ్ము పదింతలు ఎక్కువగా ఉంటోంది. అడ్డగోలుగా డిపాజిట్లు సేకరించి ఐపీ పెట్టడం సర్వసాధారణమైపోయింది. గడచిన ఏడాది రాష్ట్రంలో 628 దొంగతనాలు, దోపిడీల్లో జనం నష్టపోయింది రూ.150 కోట్లు. కానీ 852 ఆర్థిక నేరాల్లో జరిగిన మోసం అక్షరాల రూ.1523 కోట్లు. ఈ నేరాల్లో 628 మంది కోర్టుల్లో ఐపీ పెట్టారు. 300 ఐపీలను కోర్టులు అనుమతించాయి. మిగిలినవి విచారణ దశలో ఉన్నాయి. ఏటా ఐపీ పెడుతున్న సొమ్ము సగటున రూ.వెయ్యి కోట్లకుపైగానే ఉంటోంది. 90 శాతం మంది పక్కా ప్లాన్‌తోనే ఐపీ పెడుతున్నారు. వీళ్లంతా కోర్టు కేసు పూర్తికాగానే వేరే ప్రదేశంలో పెద్ద ఎత్తున వ్యాపారం తెరుస్తున్నారు. చట్టపరమైన అడ్డంకులు లేకుండా కుటుంబీకులు, బంధువుల పేర్లతో సంస్థలను నడుపుతున్నారు. యథావిధిగా బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందుతున్నారు. ఆదాయం పన్నుశాఖ ఇంటిలిజెన్స్ విభాగం ఇలాంటి కొన్ని కేసులను గుర్తించింది. వారి ఆదాయం పన్ను రిటర్నులను క్షుణ్ణంగా పరిశీలించాలని అంతర్గత నివేదిక ద్వారా అప్రమత్తం చేశారు. 2008-09 నుంచి 2011 వరకూ వచ్చిన 15 ఐపీ కేసుల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఐపీకి ముందు కుటుంబీకులను వ్యాపారంలో భాగస్వాములుగా చేర్పించుకుంటున్నారు. ఆ తర్వాత వారే కొత్త వ్యాపారాలు నడుపుతున్నట్టు రిటర్నులు దాఖలు చేశారు. విజయవాడ, విశాఖపట్టణానికి చెందిన 8 కేసుల్లో ఐపీ పెట్టిన వారి కుటుంబీకులు ఉన్నట్టుండి కొత్తగా కోట్ల రూపాయల వ్యాపారం ప్రారంభించారు. ఈ సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చింది? భాగస్వాములు ఎవరు? వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి? అనే విషయంలో అనేక సందేహాలున్నాయి. వీటిని నివృత్తి చేయాలని ఐటీ అధికారులు నోటీసులు పంపారు. ఇప్పటివరకు నమోదైన ఐపీ కేసుల్లో 340కిపైగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవే ఉండడం గమనార్హం.