![SBI files insolvency petition against Jaiprakash Associates - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/30/JAI.jpg.webp?itok=TAd_X3OR)
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా పిటీషన్ దాఖలు చేసింది. 2022 సెప్టెంబర్ 15 నాటికి కంపెనీ మొత్తం రూ. 6,893 కోట్ల మేర బాకీ పడిందని పేర్కొంది.
జేఏఎల్ రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతున్నందున దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం నెలకొందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి భువన్ మదన్‌ను తాత్కాలిక పరిష్కార నిపుణుడిగా నియమించాలంటూ ప్రతిపాదించింది. మరోవైపు, రుణాల చెల్లింపు కోసం తమ సిమెంటు ప్లాంట్లను విక్రయించినట్లు జేఏఎల్ తెలిపింది. రుణదాతలకు చెల్లింపులు జరిపేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment