‘విల్‌ఫుల్ డిఫాల్టర్’ ట్యాగ్ నుంచి రక్షణ కోసం
న్యూఢిల్లీ: రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తాజాగా జాతీయ కంపెనీ చట్ట అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ని ఆశ్రయించింది. గ్రూప్ కంపెనీలను ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారు(విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించేందుకు ప్రభుత్వ రంగానికి చెందిన 11 రుణదాత సంస్థలు చర్యలు ప్రారంభించడంతో రక్షణ కలి్పంచమంటూ అపీలేట్‌కు అత్యవసర దరఖాస్తు చేసుకుంది. రుణదాతలను నిలువరించమని అభ్యరి్థస్తూ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కొత్త బోర్డు ఎన్‌సీఎల్‌ఏటీకి ఫిర్యాదు చేసింది.
బ్యాంకులు ఎన్‌సీఎల్‌ఏటీ గత ఆదేశాలను పాటించకపోవడం వల్ల నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆర్‌బీఐ నిబంధనల ముసుగులో గ్రూప్ కంపెనీల డైరెక్టర్లను బ్యాంకులు వేధిస్తున్నాయని తెలిపింది. విల్‌ఫుల్ డిఫాల్టర్ గుర్తింపు కమిటీముందు వ్యక్తిగత హాజరుకు డిమాండు చేస్తూ బ్యాంకులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు బెదిరించడంతోపాటు .. ప్రస్తుత డైరెక్టర్లు గ్రూప్ కంపెనీలను విల్‌ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment