IL&FS
-
ఎన్సీఎల్ఏటీకి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తాజాగా జాతీయ కంపెనీ చట్ట అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించింది. గ్రూప్ కంపెనీలను ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారు(విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించేందుకు ప్రభుత్వ రంగానికి చెందిన 11 రుణదాత సంస్థలు చర్యలు ప్రారంభించడంతో రక్షణ కలి్పంచమంటూ అపీలేట్కు అత్యవసర దరఖాస్తు చేసుకుంది. రుణదాతలను నిలువరించమని అభ్యరి్థస్తూ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కొత్త బోర్డు ఎన్సీఎల్ఏటీకి ఫిర్యాదు చేసింది. బ్యాంకులు ఎన్సీఎల్ఏటీ గత ఆదేశాలను పాటించకపోవడం వల్ల నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ముసుగులో గ్రూప్ కంపెనీల డైరెక్టర్లను బ్యాంకులు వేధిస్తున్నాయని తెలిపింది. విల్‌ఫుల్ డిఫాల్టర్ గుర్తింపు కమిటీముందు వ్యక్తిగత హాజరుకు డిమాండు చేస్తూ బ్యాంకులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు బెదిరించడంతోపాటు .. ప్రస్తుత డైరెక్టర్లు గ్రూప్ కంపెనీలను విల్‌ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల పరిష్కారం
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ 2022 సెప్టెంబర్ 30కల్లా రూ. 56,943 కోట్ల రుణాలను పరిష్కరించినట్లు తెలియజేసింది. వివిధ ఆస్తుల మానిటైజేషన్ ద్వారా సంస్థల సంఖ్యను సైతం 302 నుంచి 101కు కుదించినట్లు వెల్లడించింది. వీటిలో 88 దేశీ సంస్థలుకాగా.. 13 ఆఫ్‌షోర్ కంపెనీలున్నట్లు పేర్కొంది. జాతీయ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ)కి దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ వివరాలు పొందుపరచింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీ రిజల్యూషన్ పురోగతిపై తాజాగా సమాచారమిచ్చింది. సెప్టెంబర్‌కల్లా అంచనా రుణ పరిష్కారం రూ. 55,612 కోట్లుకాగా.. మరో రూ. 1,331 కోట్ల రు ణాలను లాభాల్లో ఉన్న గ్రీన్ సంస్థల ద్వారా చెల్లించినట్లు కంపెనీ ఎండీ నంద్ కిషోర్ తెలియజేశారు. కంపెనీ సంక్షోభంలో కూరుకుపోయే సమయానికి 169 దేశీ, 133 ఆఫ్‌షోర్ సంస్థలను కలిగి ఉంది. 2018లో తొలిసారిగా రుణ చెల్లింపుల్లో విఫలమైంది. ఇదే సమయంలో రూ. 90,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించవలసి ఉండటం గమనార్హం! -
PNB SCAM: బ్యాంకులకు మళ్లీ కన్నం.. ఈసారి రూ.2060 కోట్ల మోసం !
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) వరుస దెబ్బలను ఎదుర్కొంటోంది. రూ.2,060 కోట్ల భారీ రుణ ఖాతాను మోసపూరితమైనదిగా గుర్తించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తమిళనాడు పవర్ ఖాతాను నిరర్థక రుణ ఖాతా (ఎన్పీఏ)గా ప్రకటించింది. ఢిల్లీ జోనల్ ఆఫీస్ పరిధిలోని ‘ఎక్స్ట్రా లార్జ్ కార్పొరేట్ బ్రాంచ్’ పరిధిలో ఇది జరిగినట్టు తెలిపింది. ఈ ఖాతాకు సంబంధించి ఆర్బీఐకి రిపోర్ట్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలను అనుసరించి ఈ ఖాతాకు రూ.824 కోట్ల కేటాయింపులు చేసినట్టు పేర్కొంది. పీఎన్బీ కంటే ముందే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తమిళనాడు పవర్ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించడం గమనార్హం. రూ.148 కోట్ల రుణాన్ని ఎన్పీఏగా ప్రకటించి ఆర్బీఐకి సమాచారం ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థే (ఎస్పీవీ) ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తమిళనాడు పవర్. తమిళనాడులోని కడలోర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల అమలుకు దీన్ని ఏర్పాటు చేసింది. మూడు విభాగాలు... నిర్ణీత కాలవ్యవధిలోపు రుణ చెల్లింపులు రాని ఖాతాలను ఎన్పీఏగా గుర్తించి ఆర్బీఐకి తెలియజేయాల్సి ఉంటుంది. ఎస్ఎంఏ–0 విభాగం కింద ఖాతాలను డిఫాల్ట్ కేసుగా పరిణిస్తారు. 30రోజులుగా అసలు, వడ్డీ చెల్లింపులు చేయని ఖాతాలు ఈ విభాగం కిందకు వస్తాయి. బకాయి మొత్తాన్ని చెల్లించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఎంఎస్ఏ–1 విభాగం కింద 31–60 రోజులుగా చెల్లింపులు చేయని (పూర్తిగా/పాక్షికంగా) ఖాతాలను చేరుస్తారు. దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ కింద పరిష్కార చర్యలను బ్యాంకులు చేపడతాయి. ఎస్ఎంఏ–3 కింద 61–90 రోజులుగా చెల్లింపులు చేయని ఖాతాలు వస్తాయి. ఈ ఖాతాలను బ్యాంకులు ఎన్సీఎల్టీ ముందుకు తీసుకెళతాయి. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ సంస్థ విక్రయం
ముంబై: వ్యర్థాల నిర్వహణ(వేస్ట్ మేనేజ్మెంట్) అనుబంధ సంస్థను విక్రయించినట్లు దివాళాకు చేరిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తాజాగా వెల్లడించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్(ఐఈఐఎస్ఎల్)గా పిలిచే ఈ కంపెనీలో పూర్తి వాటాను పీఈ దిగ్గజం ఎవర్‌స్టోన్ గ్రూప్‌నకు అమ్మినట్లు పేర్కొంది. అనుబంధ సంస్థ ఎవర్‌ఎన్విరో రిసోర్స్ మేనేజ్మెంట్ ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని ఎవర్‌స్టోన్ కొనుగోలు చేసినట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలియజేసింది. డీల్ విలువను వెల్లడించనప్పటికీ ఈ విక్రయం ద్వారా రూ. 1,200 కోట్లమేర రుణభారాన్ని తగ్గించుకోను న్నట్లు తెలుస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై దివాళా చట్టంలో భాగంగా ఎన్సీఎల్టీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఐఈఐఎస్ఎల్ సమీకృత వేస్ట్‌మేనేజ్‌మెంట్ కంపెనీగా సేవలందిస్తోంది. ప్రధానంగా మునిసిపల్ వ్యర్థాలకు సంబంధించి నిర్మాణం, తొలగించడం, కలెక్షన్, రవాణా, ఇంధన తయారీ తదితర పలు విభాగాలలో సర్వీసులను సమకూర్చుతోంది. ప్రస్తుతం రోజుకి 8,400 టన్నుల వ్యర్థాల నిర్వహణను చేపడుతోంది. -
స్కూల్‌నెట్ ఇండియా విక్రయానికి ఓకే..
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని విద్యా రంగ సంస్థ విక్రయానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతినిచ్చింది. స్కూల్‌నెట్ ఇండియా (గతంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్)లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కున్న 73.69% వాటాలను ఫలాఫల్ టెక్నాలజీకి విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. ఫలాఫల్ మాతృసంస్థ లెక్సింగ్టన్ ఈక్విటీ హోల్డింగ్స్ (ఎల్‌ఈహెచ్‌ఎల్)కు ఇప్పటికే స్కూల్‌నెట్‌లో 26.13 శాతం వాటా ఉంది. స్కూల్‌నెట్‌కు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ క్లస్టర్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ (ఐసీడీఐ), స్కిల్ ట్రెయినింగ్ అసెస్మెంట్ మేనేజ్మెంట్ పార్ట్నర్స్ (ఎస్‌టీఏఎంపీ) అనే రెండు అనుబంధ సంస్థలు ఉన్నాయి. అలాగే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఎస్‌డీసీ)లో కూడా 80% వాటాలు ఉన్నాయి. తాజా ఫలాఫల్ టెక్నాలజీ దాఖలు చేసిన బిడ్ ప్రకారం స్కూల్‌నెట్‌లో సుమారు 73 శాతం వాటాలను రూ. 7.39 కోట్లకు కొనుగోలు చేయడంతో పాటు ఆ సంస్థ రుణాలను కూడా తీర్చేందుకు సంస్థ అంగీకరించింది. దీంతో డీల్‌కు మార్గం సుగమమైంది. ఈ లావాదేవీ పూర్తయితే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ మొత్తం రుణభారం సుమారు రూ. 600 కోట్లు తగ్గుతుందని సంబంధిత వర్గాలు తెలపాయి. -
ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయం అర్థించే వారికి ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సహాయం అందాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్ని రాష్ట్రాల న్యాయ సేవల సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు, సభ్య కార్యదర్శులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘పోలీస్ స్టేషన్‌కు హాజరవ్వాల్సి వచ్చినప్పటి నుంచే న్యాయ సహాయార్థులకు న్యాయ సేవలు అందించాలి. సరైన సమయంలో అప్పీలు దాఖలు చేయడం, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలు, సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవడం, బెయిల్ అప్లికేషన్ అవసరమైన వారిని గుర్తించడం, వారికి న్యాయ సేవలు అందించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. శిక్ష పడిన వారికి న్యాయ సేవలు అందించే దిశగా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో నల్సా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రమంగా అన్ని రాష్ట్రాలకు దీనిని విస్తరించాలని నిర్ణయించారు. నేర బాధితులకు న్యాయ సహాయం అందించాలన్న మరో ముఖ్యమైన అంశంపైనా చర్చించారు. 2020లో ఐదు జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహించనున్నట్టు వివరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ రెండో శనివారం ఈ అదాలత్‌లను నిర్వహిస్తారు. -
విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!
ముంబై: ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి, స్టాన్‌చార్ట్ ఇండియా సీఈవో జరీన్ దారువాలా ఈ కేసు విచారణకు ఇప్పటిదాకా హాజరుకాకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్సీఎల్టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసుకు సంబంధించి ఆడిటింగ్ సంస్థలు డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్, బీఎస్ఆర్ అసోసియేట్స్‌కు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో చుక్కెదురైంది. వాటిపై విధించిన నిషేధానికి సంబంధించి తాత్కాలికంగానైనా ఊరటనిచ్చేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫ్రాడ్ కేసులో ముందస్తు షెడ్యూల్ ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, సెప్టెంబర్ 20న జరిగే తదుపరి విచారణ దాకా తుది ఉత్తర్వులేవీ జారీ చేయబోమని పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ ఆడిటింగ్ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు గాను రెండు సంస్థలపైనా అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే, దీన్ని సవాలు చేస్తూ డెలాయిట్, బీఎస్ఆర్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దాదాపు రూ. 95,000 కోట్ల మేర రుణాలు బాకీపడిన సంగతి తెలిసిందే. -
ఫుట్‌బాల్ టికెట్లు, వాచీలు..!
న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్ పొందేందుకు కంపెనీ మేనేజ్మెంట్ ఏవిధంగా అడ్డదారులు తొక్కారన్న వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా తాయిలాలిచ్చి ఏవిధంగా కుంభకోణానికి తెరతీసినది గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర ఆడిట్లో వెల్లడయింది. దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలకు మెరుగైన రేటింగ్స్ ఇచ్చిన వివాదంలో ఇప్పటికే ఇద్దరు సీఈవోలను రెండు రేటింగ్ ఏజెన్సీలు సెలవుపై పంపాయి. ఇక, కొత్తగా ఏర్పాటైన బోర్డు... గత మేనేజ్మెంట్ వ్యవహారాల నిగ్గు తేల్చేలా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలను కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌కు అప్పగించింది. 2008–2018 మధ్య కాలంలో గ్రూప్ సంస్థల బాండ్లు తదితర సాధనాలకు అధిక రేటింగ్ ఇచ్చి, ఆయా సంస్థలు భారీగా నిధులు సమీకరించుకోవడంలో రేటింగ్ ఏజెన్సీలు పోషించిన పాత్రపై ఆడిట్ నిర్వహిస్తున్న గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఇండియా రేటింగ్స్ అధికారికి లబ్ధి.. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ (ఐటీఎన్‌ఎల్), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎఫ్ఐఎన్), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు 2008–2018 మధ్యకాలంలో ప్రధానంగా కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ సంస్థలు రేటింగ్ సేవలు అందించాయి. 2012 సెప్టెంబర్– 2016 ఆగస్టు మధ్యకాలంలో ఐఎఫ్ఐఎన్ మాజీ సీఈవో రమేష్ బవా, ఫిచ్ రేటింగ్స్‌లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విభాగం హెడ్ అంబరీష్ శ్రీవాస్తవ మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణలను గ్రాంట్ థార్న్టన్ పరిశీలించింది (ఇండియా రేటింగ్స్‌కి ఫిచ్ మాతృసంస్థ). శ్రీవాస్తవ భార్య ఓ విల్లా కొనుక్కోవడంలోనూ, డిస్కౌంటు ఇప్పించడంలోనూ రమేష్ తోడ్పాటునిచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే, విల్లా కొనుగోలు మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం జరగ్గా.. దానిపై వడ్డీని మాఫీ చేసేలా చూడాలంటూ యూనిటెక్ ఎండీ అజయ్ చంద్రను కూడా రమేష్ కోరినట్లు నివేదికలో పేర్కొంది. -
ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: దాదాపు రూ. 90,000 కోట్ల రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులో తీవ్ర నేరాల విచారణ సంస్థ (ఎస్ఎఫ్ఐవో) దర్యాప్తు వేగవంతం చేసింది. మోసాల్లో పాలుపంచుకున్న ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే, లోపాలను గుర్తించడంలో జాప్యానికి గల కారణాల అన్వేషణకు రిజర్వ్ బ్యాంక్ అంతర్గతంగా విచారణ జరపాలని సూచించింది. ఉన్నతాధికారులు కుమ్మక్కై పాల్పడిన మోసం కారణంగా వాటిల్లిన నష్టాలను రాబట్టేందుకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఫిన్) కొత్త మేనేజ్మెంట్ తగు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఎస్ఎఫ్ఐవో పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థ అయిన ఐఫిన్ వ్యవహారంపై విస్తృతంగా దర్యాప్తు చేసిన అనంతరం ఎస్ఎఫ్ఐవో తాజాగా తొలి చార్జి షీటు దాఖలు చేసింది. ఈ భారీ ఆర్థిక కుంభకోణం వెనుక 9 మంది కోటరీ ఉన్నట్లు అందులో పేర్కొంది. కంపెనీని ఇష్టారాజ్యంగా నడిపిస్తూ కొందరు స్వతంత్ర డైరెక్టర్లు, ఆడిటర్లు కుమ్మక్కై ఈ కుంభకోణానికి వ్యూహ రచన చేసినట్లు ఆరోపణలు చేసింది. హరి శంకరన్, రవి పార్థసారథి, అరుణ్ సాహా, రమేష్ బవా, విభవ్ కపూర్, కే రామ్‌చంద్ తదితరులు ఈ కోటరీలో ఉన్నట్లు పేర్కొంది. రుణాలు, నికరంగా చేతిలో ఉన్న నిధుల లెక్కింపులో ఐఫిన్ అవకతవకలకు పాల్పడుతోందంటూ 2015 నుంచి ఆర్బీఐ అనేక నివేదికల్లో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐవో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో జరిమానాల విధింపులో జాప్యానికి గల కారణాలను వెలికితీసేందుకు అంతర్గతంగా విచారణ జరపాలని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి ఎస్ఎఫ్ఐవో తెలిపింది. -
డెలాయిట్పై ఐదేళ్ల నిషేధం?
ముంబై: ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ కేసులో అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం డెలాయిట్ కూడా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల ఆడిటింగ్ ప్రక్రియ విషయంలో డెలాయిట్ అక్రమాలకు పాల్పడిందని కేసును దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్ఎఫ్ఐఓ) నిగ్గు తేల్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్ ప్రకారం డెలాయిట్పై నిషేధం విధించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాయత్తం అవుతోందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.91,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు.. బకాయిలు తీర్చలేక చేతులెత్తేసిన(డిఫాల్ట్) సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కంపెనీని తన అధీనంలోకి తీసుకోవడంతోపాటు చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు ఏజెన్సీలతో విచారణను వేగవంతం చేసింది. కాగా, ఈ ఉదంతంపై డెలాయిట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీస్(ఐఎఫ్ఐఎన్)పై దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. ఆడిటింగ్ ప్రమాణాలు, ఇతరత్రా చట్టాలు, నిబంధనలకు లోబడే తాము ఆడిట్‌ను నిర్వహించామని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు మొత్తం 347 అనుబంధ సంస్థలు ఉండగా.. ఇందులో మెజారిటీ కంపెనీలకు చిన్నాచితకా ఆడిట్ సంస్థలే ఆడిటింగ్‌ను నిర్వహించాయని కూడా డెలాయిట్ అంటోంది. అంతేకాకుండా గ్రూప్‌లో రెండు ప్రధాన కంపెనీలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్కు ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అయిన ఎస్ఆర్బీసీ అండ్‌కో 2017–18, 2018–19లో ఆడిట్ చేపట్టిందని పేర్కొంది. అదేవిధంగా ఐఎఫ్‌ఐఎన్‌కు 2018–19లో కేపీఎంజీ పార్ట్నర్ అయిన బీఎస్ఆర్ ఆడిట్ చేపట్టిందని వెల్లడించింది. చాలా ఏళ్లుగా తాము ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ ఆడిటింగ్ చేస్తున్నామని.. చాలా వరకూ రుణాలకు తగినంత తనఖాలు ఉన్నాయనేది డెలాయిట్ వాదన. నైట్‌ఫ్రాంక్ వంటి సంస్థలతో దీనిపై స్వతంత్ర వేల్యుయేషన్ కూడా జరిగిందని అంటోంది. నిషేధం ఎన్నాళ్లు... సత్యం స్కామ్‌లో ఇప్పటికే ఒక అంతర్జాతీయ ఆడిట్ అగ్రగామి ప్రైస్ వాటర్‌హౌస్(పీడబ్ల్యూ)పై 2018లో సెబీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పీడబ్ల్యూకు చెందిన రెండు పార్ట్నర్ సంస్థలను మూడేళ్లు నిషేధించారు. ఇప్పుడు డెలాయిట్‌పైనా ఇదే తరహా కొరడా ఝళిపిస్తే.. నిషేధాన్ని ఎదుర్కొన్న రెండో అంతర్జాతీయ ఆడిట్ సంస్థగా నిలవనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల్లో చోటుచేసుకున్న తీవ్రమైన ఆర్థిక అవకతవకలను కావాలనే చూసీచూడనట్లు వదిలేసినట్లు డెలాయిట్పై అంతర్గత వేగు(విజిల్‌బ్లోయర్) ఎస్‌ఎఫ్‌ఐఓకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో సంక్లిష్టతను ఆసరాగా చేసుకుని ఎగ్జిక్యూటివ్‌లతో డెలాయిట్ కుమ్మక్కయిందని.. ఇందుకుగాను భారీగా ఫీజులు, కాంట్రాక్టులను దక్కించుకుందనేది విజిల్‌బ్లోయర్ ఆరోపణ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ మాజీ చీఫ్ రవి పార్థసారథి అక్రమాలకు డెలాయిట్ దన్నుగా నిలిచిందని కూడా లేఖలో సంచలన ఆరోపణలు ఉన్నాయి. గతవారంలో డెలాయిట్ మాజీ సిఈఓను ఈ కేసులో ఎస్ఎఫ్ఐఓ విచారించింది. డెలాయిట్పై ఈ ఆరోపణలు రుజువైతే ఐదేళ్ల వరకూ నిషేధాన్ని విధించొచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం : మాజీ సీఎండీకి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ( ఐఎల్ఎఫ్ఎస్) సంక్షోభం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎల్ ఎఫ్ఎస్ మాజీ ఎండీ, సీఈవో రమేష్ బావాను తీవ్రమైన నేరాల దర్యాప్తు కార్యాలయం (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ఎస్ఎఫ్ఐఓ) అరెస్టు చేసింది. గ్రూప్ ఎంటిటీలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా అధికారులు ఈ చర్య తీసుకున్నారు. భారీగా పన్ను ఎగవేత కేసులో ఆరోపణులు ఎదుర్కొంటున్న రమేష్ బావా తనను అరెస్టు చేయకుండా, క్రిమినల్ ప్రొసిడింగ్స్ ఆపివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించిన కొద్ది రోజుల అనంతరం ఈ అరెస్ట్ జరిగింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తు సంస్థ అయిన ఎస్ఎఫ్ఐఓ కంపెనీల చట్టం 447 సెక్షన్ ప్రకారం రమేష్ బావాను అదుపులో తీసుకుంది. కాగా రూ.94,215 కోట్ల రుణ ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు సంస్థల రుణ భారంమొత్తం రూ. 94వేల కోట్లు. ఈ కేసులో ఏప్రిల్ 1న సంస్థ మాజీ చైర్మన్ హరి శంకర్‌ను ఎస్ఎఫ్ఐఓ అరెస్టు చేసింది. -
బంధన్ బ్యాంక్ లాభం 10 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.331 కోట్లకు ఎగసిందని బంధన్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ నికర లాభంపై కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ భారం ప్రభావం చూపించింది. ఈ సంస్థకు ఇచ్చిన రుణాలకు ఈ బ్యాంక్ పూర్తిగా కేటాయింపులు జరపాల్సి వచ్చింది. ఈ కేటాయింపులు లేకపోతే, నికర లాభం మరింతగా పెరిగి ఉండేది. కాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఏ మాత్రం రుణాలిచ్చిందనేది ఈ బ్యాంక్ వెల్లడించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల పుణ్యమాని ఈ బ్యాంక్ మొండి బకాయిలు భారీగా పెరిగాయి. 54 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం.... గత క్యూ3లో రూ. 1,336 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 41 శాతం వృద్ధితో రూ.1,884 కోట్లకు ఎగసిందని బ్యాంక్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు. రుణాలు 46 శాతం వృద్ధి చెంది రూ.35,599 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రుణ వృద్ధి జోరుగా ఉండటం, మార్జిన్లు పటిష్టంగా(10.5 శాతం) ఉండటంతో నికర వడ్డీ ఆదాయం 54 శాతం ఎగసి రూ.1,124 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇతర ఆదాయం 48 శాతం పెరిగి రూ.234 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ లాభం రూ.574 కోట్ల నుంచి 57 శాతం పెరిగి రూ.900 కోట్లకు చేరిందని తెలిపారు. గత క్యూ3లో 9.9 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 10.3 శాతానికి పెరిగిందని వివరించారు. తగ్గిన రుణనాణ్యత... ఇన్ని సానుకూలాంశాలున్నా ఈ బ్యాంక్ రుణ నాణ్యత తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 1.29 శాతంగా ఉన్న స్థూల మొండిబకాయిల నిష్పత్తి ఈ క్యూ3లో 2.41 శాతానికి పెరిగింది. అలాగే నికర మొండి బకాయిలు 0.69 శాతం నుంచి 0.70 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో రూ.124 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.474 కోట్లకు పెరిగాయని ఘోష్ పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి ఇచ్చిన రుణాల కోసం రూ.385 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వెల్లడించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేటాయింపులు లేకపోతే మొత్తం కేటాయింపులు రూ.90 కోట్లుగానే ఉండేవని వివరించారు. హెచ్డీఎఫ్సీ గ్రూప్‌నకు చెందిన గృహ్ ఫైనాన్స్ కంపెనీని కొనుగోలు చేయడానికి ఈ బ్యాంక్ ఇటీవలనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగిస్తుందన్న ధీమాను బ్యాంక్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బంధన్ బ్యాంక్ షేర్ పెరిగింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నా, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ షేర్లు పతనమైనా, బంధన్ బ్యాంక్ షేర్ 4 శాతం ఎగసి రూ.472 వద్ద ముగిసింది. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రోడ్డు ఆస్తుల అమ్మకం!
ముంబై: భారీ రుణ భారంతో కుదేలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ భారత్‌లోని రహదారుల ఆస్తులన్నింటినీ విక్రయానికి పెట్టింది. రహదారుల రంగానికి సంబంధించిన కంపెనీల్లో ఈక్విటీ వాటాను విక్రయించనున్నామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరించిన 1,774 కి.మీల మేర ఉన్న ఏడు ఆపరేషనల్ యాన్యుటీ ఆధారిత ప్రాజెక్ట్‌లను, 6,572 కి.మీ. మేర విస్తరించిన 8 టోల్ ఆధారిత ప్రాజెక్టుల్లో వాటాను విక్రయించనున్నామని పేర్కొంది. అంతేకాకుండా 1,736 కి.మీ. మేర విస్తరించిన నిర్మాణంలోని 4 రోడ్డు ప్రాజెక్టుల్లోని వాటాను కూడా అమ్మకానికి పెట్టినట్లు వివరించింది. తిరువనంతపురంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను, ఈపీసీ విభాగానికి సంబంధించిన ఆస్తులను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్కు చెందిన నిర్వహణ, మెయింటెనెన్స్ వ్యాపారాలను కూడా ఈ గ్రూప్ విక్రయించనున్నది. -
అమ్మేయడమే సరైన పరిష్కారం!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) పూర్తిగా విక్రయించేయడం కూడా ఒక పరిష్కార మార్గమని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా ప్రతిపాదనలన్నీ పరిశీలించిన మీదట విక్రయం ఒక్కటే సరైన పరిష్కారమయ్యేట్లు కనిపిస్తోందని చెప్పారాయన. ‘వాటాదారులు, రుణ సంస్థల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కి సంబంధించినంత వరకూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి సమర్పించిన నివేదికలో సంస్థ విక్రయ అంశం కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని విక్రయించడమే సరైన మార్గం కావచ్చు’ అని శ్రీనివాస్ చెప్పారు. విభాగాల వారీగా విడగొట్టి విక్రయించడం లేదా అన్ని విభాగాలను కలిపి అమ్మేయడం లాంటి ప్రతిపాదనలున్నట్లు తెలియజేశారు. ఈ ప్రతిపాదనలన్నింటితో సరైన పరిష్కారం లభించగలదన్నారు. రూ.91,000 కోట్ల రుణభారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్‌లోని దాదాపు 358 అనుబంధ సంస్థలు దాదాపు రూ.91,000 కోట్ల మేర రుణాలు బాకీ పడిన సంగతి తెలిసిందే. ఇందులో సింహభాగం రూ.57,000 కోట్లు బ్యాంకు రుణాలే కాగా, అందులోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చినవే అధికంగా ఉన్నాయి. ఐఎల్ఎఫ్ఎస్ ఆగస్టు 27 నుంచి పలు రుణాలు డిఫాల్ట్ అవుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో, మార్కెట్లలో పెను దుమారం రేపిన ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటక్ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ఇటీవలే సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఎన్సీఎల్టీకి సమర్పించింది. ఐఎల్ఎఫ్ఎస్లో ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీకి నాలుగో వంతు వాటాలుండగా, జపాన్‌కి చెందిన ఒరిక్స్ కార్పొరేషన్‌కి 23.5 శాతం వాటాలున్నాయి. మిగతా వాటాదారుల్లో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (12.5 శాతం), ఐఎల్ఎఫ్ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ట్రస్ట్ (12 శాతం), హెచ్‌డీఎఫ్‌సీకి (9.02 %), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.67 %), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6.42%) మొదలైనవి ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు సంక్షోభం లేదు.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ద్రవ్య లభ్యత సమస్యలు మాత్రమే ఎదుర్కొంటున్నాయని, సంక్షోభమేమీ లేదని శ్రీనివాస్ చెప్పారు. ఎన్బీఎఫ్సీలు తమ తమ వ్యాపార విధానాలను పునఃసమీక్షించుకుని, నిలకడగా రాణించే విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఎల్ఎఫ్ఎస్ ఉదంతంతో వ్యవస్థలో నిధుల కొరత చర్చనీయమైన సంగతి తెలిసిందే. ఎన్బీఎఫ్సీ విభాగంలోనూ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలే ఎక్కువగా లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటున్నాయని శ్రీనివాస్ చెప్పారు. ‘ఇది ముఖ్యంగా ఒక విభాగంలో ఏర్పడిన సమస్య. ఇందులో పెద్ద పెద్ద సంస్థలున్నప్పటికీ నేను ప్రత్యేకంగా ఏ సంస్థ పేరూ ప్రస్తావించను. పరిస్థితి క్రమంగా సర్దుకుంటుంది. కానీ ఆ రంగంలోని సంస్థలు తమ వ్యాపార విధానాలను కూలంకషంగా పునఃసమీక్షించుకుని, నిధుల లభ్యత.. వినియోగం తదితర అంశాల మధ్య భారీ వ్యత్యాసాల్లేకుండా నిలకడైన వ్యాపార విధానాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఐఎల్ఎఫ్ఎస్ అంశంపై స్పందిస్తూ... 300 పైచిలుకు కంపెనీలలో అనేక సమస్యలను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) దర్యాప్తు చేస్తోందని శ్రీనివాస్ చెప్పారు. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేద్దామా..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) సంక్షోభం మరింత విస్తరించకుండా సమస్య పరిష్కారానికి కొత్త బోర్డు పలు మార్గాలు పరి శీలిస్తోంది. ఆర్థికంగా బలమైన ఇన్వెస్టరుకు సంస్థను గంపగుత్తగా విక్రయించడం ద్వారా వ్యాపారాన్ని నిలబెట్టాలన్న ప్రతిపాదన కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు కంపెనీ కొత్త బోర్డు బుధవారం సమర్పించబోయే ప్రణాళికల్లో ఇది ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాపారాలను వివిధ విభాగాలుగా విడగొట్టి వేర్వేరుగా విక్రయించడం లేదా ఏకమొత్తంగా అమ్మేయాల్సిన అవసరం రాకుండా గ్రూప్ స్థాయిలో తగినంత నిధులను సమకూర్చడం తదితర ప్రతిపాదనలు వీటిలో ఉన్నట్లు వివరించాయి. రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పలు లోన్లను తిరిగి చెల్లించడంలో విఫలం కావడం, అది మార్కెట్లపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం తెలిసిందే. కంపెనీ ఖాతాల ప్రకారం మార్చి 2018 నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ దాదాపు రూ. 63,000 కోట్ల రుణం తీసుకుంది. కంపెనీ వ్యవహారాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) విచారణ జరుపుతోంది. సంస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ సారథ్యంలో కొత్త బోర్డును నియమించింది. ఈ బోర్డు అక్టోబర్ 31న తగు పరిష్కార ప్రణాళికను ఎన్సీఎల్టీకి సమర్పించాల్సి ఉంది. కంపెనీ వ్యవహారాలపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ రుణాల చెల్లింపు కోసం నిధులను సమీకరించుకునే దిశగా ప్రధాన, ప్రధానేతర వ్యాపారాలను విక్రయించే అంశాన్ని బోర్డు పరిశీలించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌పై చర్యలకు నో
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దాని గ్రూప్ సంస్థలపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అన్ని చర్యలపై స్టే విధిస్తూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశాలిచ్చింది. గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాల చెల్లింపులకు సంబంధించి 90 రోజుల మారటోరియం విధించాలన్న అభ్యర్ధనను ఎన్సీఎల్టీ తోసిపుచ్చడంతో.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. 90 రోజుల మారటోరియంపై తమ తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా గ్రూప్‌నకు అత్యధికంగా రుణాలిచ్చిన 5 ఆర్థిక సంస్థలకు ద్విసభ్య ఎన్సీఎల్ఏటీ బెంచ్ సూచించింది. ‘తదుపరి ఉత్తర్వులిచ్చే దాకా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దాని 348 అనుబంధ సంస్థలపై ఏ కోర్టు లేదా ట్రిబ్యునల్ ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టకుండా స్టే విధించడమైనది’ అని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను నవంబర్ 13కి వాయిదా వేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణభారం దాదాపు రూ. 90,000 కోట్ల మేర ఉంది. రుణాలను చెల్లించని పక్షంలో రుణదాతలు కంపెనీపై దావాలు వేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఎన్సీఎల్టీని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. మారటోరియం విధించిన పక్షంలో కంపెనీని వేగంగా గట్టెక్కించడానికి తగు ప్రణాళికలను రూపొందించడానికి కొత్త బోర్డుకు అవసరమైన సమయం దొరుకుతుందని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ లాయర్ విన్నవించారు. అది జరగకపోతే కంపెనీ దేశవ్యాప్తంగా 70–80 దావాలు ఎదుర్కొనాల్సి వస్తుందని తెలిపారు. టర్మ్ రుణం, కార్పొరేట్ రుణం, డిబెంచర్లు మొదలైనవి వెంటనే చెల్లించాలంటూ రుణదాతల నుంచి ఒత్తిళ్లు రాకుండా అపీలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. అలాగే, తమ వద్ద ఉన్న కంపెనీ నిధులను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమకు రావాల్సిన బకాయిల కింద సర్దుబాటు చేసుకోవడానికి కూడా వీల్లేదని పేర్కొంది. కంపెనీకి ఊరట.. ఎన్సీఎల్ఏటీ మధ్యంతర ఉత్తర్వులతో రుణదాతల ఒత్తిళ్ల నుంచి కొంత ఊరట లభించగలదని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగు పరిష్కార ప్రణాళికను రూపొందించేందుకు కొత్త బోర్డుకు అవకాశం లభిస్తుందని వివరించింది. మరోవైపు ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ స్వాగతించింది. భారీ రుణాల చెల్లింపు కన్నా జీతాల చెల్లింపు, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం ముఖ్యమని పేర్కొంది. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పరిరక్షణకు చర్యలు..
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ విలువను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బోర్డు పేర్కొంది. వ్యవస్థాగతంగా కీలకమైన సంస్థను గట్టెక్కించే ప్రణాళిక రూపకల్పన కోసం తరచూ భేటీ కానున్నట్లు తెలిపింది. గురువారం తొలిసారిగా భేటీ అయిన కొత్త బోర్డు దాదాపు అయిదు గంటల పాటు కంపెనీ వ్యవహారాలపై చర్చించింది. గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇతర వాటాదారులతో కూడా తగు సమయంలో భేటీ కానున్నట్లు సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ ఉదయ్ కొటక్.. విలేకరులకు తెలిపారు. గ్రూప్ ఆడిట్ కమిటీ చైర్మన్‌గా బోర్డు సభ్యుడు, ప్రముఖ ఆడిటర్ నందకిశోర్ ఎంపికయ్యారని చెప్పారు. దాదాపు రూ. 91,000 కోట్ల రుణ భారమున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతుండటం.. మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రంగంలోకి దిగి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు కొత్త బోర్డును నియమించింది. ఉదయ్ కొటక్ సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డులో సెబీ మాజీ చైర్మన్ జీఎన్ బాజ్‌పాయ్, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది, ఐఏఎస్ అధికారి మాలిని శంకర్, టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తదితరులు ఉన్నారు. మారుతీ చైర్మన్ పదవి నుంచి తప్పుకునేది లేదు: భార్గవ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం నేపథ్యంలో తాను మారుతీ సుజుకీ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న వార్తలను ఆర్సీ భార్గవ ఖండించారు. చట్టప్రకారం తాను తప్పు చేసినట్లు రుజువైతే తప్ప తప్పుకోనక్కర్లేదని గతంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ డైరెక్టరుగా వ్యవహరించిన భార్గవ తెలిపారు. వడ్డీలు చెల్లించేందుకు తగినన్ని నిధులు లేవన్న అంశం మేనేజ్మెంట్కు మూడు నాలుగేళ్లుగా తెలుసన్నారు. బోర్డు సమావేశాల్లో పలు మార్లు ఇది చర్చకు వచ్చేదని, తగు పరిష్కార మార్గాలపై ప్రణాళికల రూపకల్పన కూడా జరిగేదని చెప్పారాయన. యాజమాన్య నిర్వహణ లోపాలు, నిర్లక్ష్య ధోరణుల ఆరోపణలతో 10 మంది మాజీ డైరెక్టర్లపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వేసిన పిటీషన్లో భార్గవ పేరు కూడా ఉంది. ఈ పది మందిని ఇతర కంపెనీల బోర్డుల్లో కొనసాగనివ్వబోరంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మార్కెట్‌పై సంక్షోభ ప్రభావం పెద్దగా పడదు: జైట్లీ ఐఎల్ఎఫ్ఎస్ సంస్థలో సంక్షోభాన్ని మొదట్లోనే నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కనుక ఇదేమంత తీవ్ర ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రూ.91,000 కోట్ల రుణాలను తీసుకుని, ఇటీవల పలు చెల్లింపుల్లో ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ విఫలం కావడంతో, బోర్డును ప్రభుత్వం సస్పెండ్ చేసి తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఐఎల్ఎఫ్ఎస్లో సంక్షోభం మార్కెట్లలో నిధుల సమస్యకు దారితీస్తుందన్న ఆందోళనలు తలెత్తడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్‌కోటక్ నేతృత్వంలో ఐఎల్ఎఫ్ఎస్కు కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ‘‘ఇది దేశ అంతర్గత అంశం. వేగంగా దీనికి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. కనుక ఏమంత తీవ్ర ప్రభావం ఉండదు’’అని జైట్లీ పేర్కొన్నారు. -
సత్యం బాటలో ఐఎల్ఎఫ్ఎస్!
ముంబై/న్యూఢిల్లీ: దశాబ్దం కిందటి సత్యం కంప్యూటర్స్ ఉదంతం తరహాలోనే తాజాగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ను కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ప్రస్తుత బోర్డును రద్దు చేసింది. ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డును నియమించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం దేశీ మార్కెట్లలో ప్రకంపలను సృష్టిస్తున్న నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, దాని అనుబంధ సంస్థల యాజమాన్య అధికారాలు తమకు అప్పగించాలని, బోర్డును మార్చాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ) కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) సోమవారం పిటిషన్ వేసింది. ఇందుకు అనుమతులిస్తూ ఎన్సీఎల్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కేంద్రం లేవనెత్తిన అంశాలపై అక్టోబర్ 15లోగా వివరణనివ్వాలంటూ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు నోటీసులు ఇచ్చింది. ‘ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత.. కంపెనీల చట్టంలోని సెక్షన్ 241 (2), 242లను ప్రయోగించడానికి, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కార్యకలాపాలు.. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయని ప్రకటించడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నాం‘ అని ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. ఈ సెక్షన్ ప్రకారం.. ఏదైనా కంపెనీ వ్యవహారాలు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్న పక్షంలో ఆ సంస్థ వ్యవహారాలను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం ఎన్సీఎల్టీని ఆశ్రయించవచ్చు. ట్రిబ్యునల్ కూడా తగు ఆదేశాలివ్వవచ్చు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం తర్వాత కేంద్రం స్వయంగా ఒక కంపెనీ బోర్డును తన నియంత్రణలోకి తీసుకోవడం ఇదే తొలిసారి. కుంభకోణం దరిమిలా 2009లో సత్యం బోర్డును అప్పటి ప్రభుత్వం రద్దు చేయడం, ఆ తర్వాత కంపెనీ.. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చేతికి చేరడం తెలిసిందే. ఎకానమీకి ముప్పు.. కంపెనీ ఆర్థిక స్థిరత్వంపైన, క్యాపిటల్ మార్కెట్లపైన ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత బోర్డును, యాజమాన్యాన్ని కొనసాగించడం వల్ల కంపెనీతో పాటు, సంస్థలో సభ్యులకూ ఇబ్బందేనని, ప్రజా ప్రయోజనాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఎన్సీఎల్టీ ముందు ఎంసీఏ తమ వాదనలు వినిపించింది. గతంలో తీసుకున్న రుణాలను సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలం కావడం వల్లే దాదాపు రూ. 1.15 లక్షల కోట్ల అసెట్స్ ఉన్నప్పటికీ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ప్రస్తుతం రూ. 91,000 కోట్ల మేర రుణాలకు వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఉందని ఆక్షేపించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ డైరెక్టర్లు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని, కంపెనీ గానీ దివాలా తీస్తే అనేక మ్యూచువల్ ఫండ్స్ పతనమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి భారీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ) మూతబడితే... ఆర్థిక మార్కెట్లలో నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తం దేశ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున పరిస్థితి చక్కదిద్దేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కేంద్రం పేర్కొంది. గతంలో సత్యం కంప్యూటర్స్ ఉదంతంలోనూ కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసిన సంగతిని నివేదించింది. ఇప్పటికే కంపెనీ వ్యవహారాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ మరిన్ని రుణాలు డిఫాల్ట్ కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విశ్వాస పునరుద్ధరణ ముఖ్యం .. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు తగినన్ని నిధుల లభ్యత ఉండేలా చూసేందుకు, మరిన్ని డిఫాల్టుల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తయ్యేలా చూస్తామని పేర్కొంది. క్యాపిటల్, ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వం కోసం ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌పై విశ్వాసాన్ని పునరుద్ధరించడం కీలకమని తెలిపింది. సంస్థను గట్టెక్కించేందుకు అసెట్స్ విక్రయం, కొన్ని రుణాల పునర్వ్యవస్థీకరణ, ఇన్వెస్టర్లు.. ఆర్థిక సంస్థలు కొత్తగా మరిన్ని నిధులు సమకూర్చడం తదితర చర్యలు తీసుకోవాలని తెలిపింది. మరిన్ని దివాలా ఉదంతాలను నివారించడానికి ఇవి అత్యవసరమని పేర్కొంది. ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటు ఆరుగురు సభ్యుల కొత్త బోర్డుకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ నియమితులయ్యారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ జీఎన్ బాజ్‌పాయ్, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినీత్ నయ్యర్, ఐఏఎస్ అధికారిణి మాలినీ శంకర్, సీనియర్ ఆడిటర్ నందకిశోర్‌లు ఇందులో సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 8న ఈ బోర్డు తొలిసారిగా సమావేశం కానుంది. అక్టోబర్ 31 నాటికల్లా తమ పరిశీలనలు, మార్గదర్శ ప్రణాళికపై నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: జైట్లీ జాతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్.. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని జైట్లీ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ లాంటి విపరీత ఆలోచనా విధానాలున్నవారే ఐఎల్ఎఫ్ఎస్లో ఆర్థిక సంస్థల పెట్టుబడులను కుంభకోణంగా వర్ణిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిన ఐఎల్ ఎఫ్ఎస్కు తోడ్పాటునివ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసిన కేవీ థామస్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుంచి కాసిన్ని వివరాలు తెలుసుకోవాలంటూ రాహుల్ గాంధీకి హితవు పలికారు. తన ఫేవరెట్ కంపెనీ ఐఎల్ఎఫ్ఎస్ దివాలా తియ్యకుండా చూసేందుకు, మోసగాళ్లను కాపాడేందుకు ఎల్ఐసీ డబ్బును ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై జైట్లీ ఈ మేరకు స్పందించారు. ‘50.5% వాటాలతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 30.5% వాటాతో యూటీఐ.. 1987లో ఐఎల్ఎఫ్ఎస్ ఏర్పాటు కుంభకోణమా? 2005లో ఎల్ఐసీ 15%, 2006లో మరో 11.10% వాటాలు కొనడం కూడా కుంభకోణమేనా? 2010లో ఎల్ఐసీ మరో 19.34 లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడులన్నీ కుంభకోణమే అంటారా‘ అని జైట్లీ ప్రశ్నించారు. -
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ : సత్యం లాంటి ఆపరేషన్
సాక్షి, ముంబై: ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్)కు కేంద్ర ప్రభుత్వం సత్యం లాంటి ఆపరేషన్ చేపట్టింది. డిఫాల్టర్‌గా నమోదైన ఈ సంస్థ బోర్డును కేంద్రం రద్దు చేసింది. మేనేజ్మెంట్ను తన స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ) ముంబై బ్రాంచ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుత బోర్డు స్థానంలో తాత్కాలికంగా మరో బోర్డును కేంద్రం ప్రతిపాదించింది. దీనికి నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొటక్ మహింద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ నియమితులయ్యారు. ముంబై బెంచ్ జడ్జీలు ఎంకే శ్రావత్, రవికుమార్ దురైసమీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ పిటిషన్‌ను సమర్దిస్తున్నామని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ప్రకటించింది. తాజా పరిణామంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ మరో సత్యం ఉదంతం కానుందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ మొత్తం బకాయిలు రూ. 90వేల కోట్లు ఉండగా, వీటిలో బ్యాంకులు రుణాలు రూ. 57వేల కోట్ల దాకా ఉన్నాయి. అయితే కంపెనీ పునర్ వ్యవస్థీకరిస్తే తాము రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివిధ ఆర్థిక సంస్థలు పేర్కొనడంతో కంపెనీ మేనేజ్మెంట్ను మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. నిపుణులు కూడా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సమస్య పరిష్కారానికి సత్యం తరహా పరిష్కారం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు తమ రుణాలను తీర్చే ప్రణాళికలో ఉన్నట్టు సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూపు వైస్ చైర్మన్, ఎండీ హరి శంకర్ శనివారం ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్.. తక్షణ మూలధన అవసరాలు తీర్చుకునేందుకు రైట్స్ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సేకరించే ప్రతిపాదనకు సంస్థ మాజీ బోర్డు శనివారం ఆమోదం తెలిపింది. అలాగే తమకు ద్రవ్య మద్దతు ఇవ్వాల్సిందిగా సంస్థ ప్రధాన ప్రమోటర్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ, 25.34 శాతం వాటా), ఎస్బీఐను కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ షేర్లు 17శాతం పుంజుకున్నాయి. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ నిధుల ప్రణాళికకు ఇన్వెస్టర్ల ఆమోదం
ముంబై: ఆర్థిక సంక్షోభంతో కుదేలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్)కి కాస్త ఊరట లభించే దిశగా దాదాపు రూ. 15,000 కోట్ల దాకా నిధుల సమీకరణ ప్రతిపాదనకు సంస్థలో ఇన్వెస్టర్లు ఆమోదముద్ర వేశారు. నాన్ కన్వర్టబుల్ డెట్ ఇష్యూ ద్వారా ఈ నిధులను సంస్థ సమీకరించనుంది. అలాగే రుణ సమీకరణ పరిమితిని రూ. 35,000 కోట్ల దాకా (40 శాతం మేర) పెంచుకునేందుకు, రైట్స్ ఇష్యూకి వీలుగా షేర్ క్యాపిటల్‌ను పెంచుకునేందుకు కూడా వాటాదారులు ఆమోదముద్ర వేసినట్లు సంస్థ వెల్లడించింది. మరోవైపు, పునర్వ్యవస్థీకరణను రూపొందించేందుకు అల్వారెజ్ అండ్ మార్సల్ సంస్థను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ నియమించుకుంది. దాదాపు రూ. 91,000 కోట్ల రుణ భారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థలు.. రీపేమెంట్లో డిఫాల్ట్ అవుతుండటం.. స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, జపాన్‌కి చెందిన ఒరిక్స్ కార్పొరేషన్ మొదలైన వాటికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో వాటాలు ఉన్నాయి. -
మళ్లీ డిఫాల్టయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్
ముంబై: ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెల్లింపుల సంక్షోభం మరింత ముదురుతోంది. వాణిజ్య పత్రాలపై వడ్డీ చెల్లింపుల్లో ఈ కంపెనీ మరోసారి విఫలమైంది. సోమవారం చెల్లించాల్సిన వడ్డీని తాము చెల్లించలేకపోయినట్లు ఈ కంపెనీ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. అయితే ఎంత మొత్తం చెల్లించటంలో విఫలమయ్యారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. చెల్లింపుల్లో విఫలం కావడం ఈ గ్రూప్‌కు ఈ నెలలో ఇది మూడో సారి. ‘సిడ్బీ’ నుంచి తీసుకున్న రూ.1,000 కోట్ల స్వల్పకాలిక రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ విఫలమైంది. ఈ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ ఒకటి రూ.500 కోట్ల రుణ చెల్లింపులో కూడా విఫలమైంది. కాగా రుణ చెల్లింపులు, కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధిత అంశాలపై ఆరోపణలు రావడంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రమేశ్ సి బావా, కొందరు కీలకమైన బోర్డ్ సభ్యులు గత శుక్రవారం రాజీనామా చేశారు. రూ.91,000 కోట్ల రుణ భారం... కాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.91,000 కోట్లుగా ఉన్నట్లు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నొముర ఇండియా తెలియజేసింది. ఈ రుణంలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ వాటా రూ.35,000 కోట్లని, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటా రూ.17,000 కోట్లుగా ఉంటుందని వివరించింది. తనే పరిష్కరించుకుంటుంది: గర్గ్ న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) తన సమస్యలను తానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వ్యాఖ్యానించారు. ‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. దానికంటూ స్వతంత్ర బోర్డు, షేర్హోల్డర్లు ఉన్నారు. కాబట్టి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తన సమస్యలను తానే స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆ సమర్ధత ఉందనే నేను భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. ఆస్తులు, అప్పుల మధ్య తాత్కాలిక వ్యత్యాసం ఏర్పడవచ్చని.. కానీ అంతిమంగా ఆ సంస్థే ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని గర్గ్ చెప్పారు. ఇందులో ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయమేమీ లేదని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో కేంద్రానికి నేరుగా వాటాలేమీ లేకపోయినప్పటికీ.. ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు వాటాలు ఉన్నాయి. ఎల్ఐసీకి నాలుగో వంతు వాటా ఉండగా, జపాన్‌కి చెందిన ఓరిక్స్ కార్పొరేషన్‌కు 23.5 శాతం, ఎస్బీఐకి 6.42 శాతం, హెచ్‌డీఎఫ్‌సీకీ 9 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 7.67 శాతం మేర వాటాలు ఉన్నాయి. సిడ్బి నుంచి తీసుకున్న రూ. 1,000 కోట్ల స్వల్పకాలిక రుణాలను చెల్లించలేక ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ డిఫాల్ట్ అయిందన్న సంగతి సెప్టెంబర్ 4న బైటపడిన సంగతి తెలిసిందే. -
ఐఎల్ఎఫ్ఎస్కు రూ.237 కోట్ల కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.237 కోట్ల విలువైన ఆర్డరును జార్ఖండ్ బిజిలీ వితరన్ నిగమ్ నుంచి దక్కించుకుంది. ఇందులో భాగంగా ధన్‌బాద్ ఎలక్ట్రిక్ సప్లై సర్కిల్‌తోపాటు డుంకా–సహీబ్‌గంజ్ ఎలక్ట్రిక్ సప్లై సర్కిల్లోని కొన్ని పట్టణాల్లో విద్యుదీకరణ పనులను చేపడతారు. 24 నెలల్లో ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రమోటర్ల వాటాలు తనఖా
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రమోట్ చేస్తున్న కంపెనీల్లో మూడు సంస్థలు తమ వాటాలను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రస్ట్ కంపెనీ, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌కు తనఖా పెట్టాయి. జీఎంఆర్ హోల్డింగ్స్, జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ, జీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ కలిసి మొత్తం 19.13 శాతం వాటాలను తనఖా ఉంచాయి. జీఎంఆర్ ఇన్ఫ్రా మాతృసంస్థ జీఎంఆర్ హోల్డింగ్స్ ఏప్రిల్ 28, 30న రెండు విడతలుగా 5.23 శాతం వాటాలను, జీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ సైతం 0.38 శాతం వాటాలను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వద్ద తనఖా ఉంచాయి. అలాగే జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ 13.52 శాతం వాటాలను రెండు లావాదేవీల్లో ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్, ఐఎల్‌ఎఫ్‌ఎల్ ట్రస్ట్ కంపెనీ వద్ద తనఖా ఉంచాయి. మంగళవారం బీఎస్ఈలో జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర 2.82 శాతం క్షీణించి రూ. 15.48 వద్ద ముగిసింది.