న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ 2022 సెప్టెంబర్ 30కల్లా రూ. 56,943 కోట్ల రుణాలను పరిష్కరించినట్లు తెలియజేసింది. వివిధ ఆస్తుల మానిటైజేషన్ ద్వారా సంస్థల సంఖ్యను సైతం 302 నుంచి 101కు కుదించినట్లు వెల్లడించింది. వీటిలో 88 దేశీ సంస్థలుకాగా.. 13 ఆఫ్‌షోర్ కంపెనీలున్నట్లు పేర్కొంది. జాతీయ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌ఏటీ)కి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ వివరాలు పొందుపరచింది.
రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీ రిజల్యూషన్ పురోగతిపై తాజాగా సమాచారమిచ్చింది. సెప్టెంబర్‌కల్లా అంచనా రుణ పరిష్కారం రూ. 55,612 కోట్లుకాగా.. మరో రూ. 1,331 కోట్ల రు ణాలను లాభాల్లో ఉన్న గ్రీన్ సంస్థల ద్వారా చెల్లించినట్లు కంపెనీ ఎండీ నంద్ కిషోర్ తెలియజేశారు. కంపెనీ సంక్షోభంలో కూరుకుపోయే సమయానికి 169 దేశీ, 133 ఆఫ్‌షోర్ సంస్థలను కలిగి ఉంది. 2018లో తొలిసారిగా రుణ చెల్లింపుల్లో విఫలమైంది. ఇదే సమయంలో రూ. 90,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించవలసి ఉండటం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment