న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్ సంస్థ జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్) తాజాగా రూ. 3,956 కోట్ల రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయ్యింది. ఇందులో అసలు రూ. 1,642 కోట్లు ఉండగా, వడ్డీ రూ. 2,314 కోట్లు ఉంది.
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వివిధ రూపాల్లో తీసుకున్న ఈ మొత్తాన్ని ఏప్రిల్ 30న చెల్లించాల్సి ఉన్నప్పటికీ విఫలమైనట్లు ఎక్సే్చంజీలకు తెలిపింది. తాము 2037 నాటికి రూ.29,277 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రూ. 3,956 కోట్లు మాత్రమే ఈ ఏడాది ఏప్రిల్ 30 కల్లా కట్టాల్సి ఉందని జేఏఎల్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment