న్యూఢిల్లీ: ఇటీవల రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన అదానీ గ్రూప్ తాజాగా 13 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,066 కోట్లు) రుణాలను ముందస్తుగా చెల్లించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని బిలియనీర్.. గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తోంది.
యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో కంపెనీ కొద్ది రోజులుగా రుణాలను ముందుగానే చెల్లిస్తోంది. దీనిలో భాగంగా గత నెలలో 2024 జూలైలో గడువు తీరనున్న 13 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను బైబ్యాక్ చేసేందుకు అదానీ పోర్ట్స్ టెండర్‌కు తెరతీసింది.
ఈ బాటలో మరో 4 రుణాలను తిరిగి చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. టెండర్‌కు 41.27 కోట్ల డాలర్ల విలువైన బాండ్లు దాఖలైనట్లు అదానీ పోర్ట్స్ తాజాగా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment