defaulter
-
రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు
రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు గాను సిస్కా ఎల్ఈడీ లైట్స్పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రూ.7.70 కోట్ల బాకీల వసూలు కోసం రుణదాత సన్‌స్టార్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది.సిస్కా ఎల్ఈడీ లైట్స్ బోర్డును రద్దు చేసి దివాలా పరిష్కార ప్రొఫెషనల్‌గా దేవాశీష్ నందాను ఎన్సీఎల్టీ నియమించింది. సన్‌స్టార్ సరఫరా చేసిన ఉత్పత్తుల నాణ్యతపై వివాదం నెలకొందని, ఆ కంపెనీ దివాలా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్న సిస్కా వాదనలను తోసిపుచ్చింది. సన్‌స్టార్‌కి సిస్కా రుణం చెల్లించాల్సి ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలనఎస్ఎస్కే గ్రూప్‌లో భాగంగా ఉన్న సిస్కా ఎల్ఈడీ లైట్స్‌కి ఎలక్ట్రికల్ గృహోపకరణాల సంస్థ సన్‌స్టార్ ఇండస్ట్రీస్ 60 రోజుల క్రెడిట్ వ్యవధితో ఉత్పత్తులను సరఫరా చేసేది. తొలినాళ్లలో సక్రమంగానే చెల్లింపులు జరిపినప్పటికీ 2023 మార్చి నుంచి జులై వరకు పంపిన 25 ఇన్వాయిస్లను చెల్లించకుండా డిఫాల్ట్ కావడంతో సన్‌స్టార్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. -
జేపీ అసోసియేట్స్ రూ. 4 వేల కోట్లు డిఫాల్ట్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్ సంస్థ జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్) తాజాగా రూ. 3,956 కోట్ల రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయ్యింది. ఇందులో అసలు రూ. 1,642 కోట్లు ఉండగా, వడ్డీ రూ. 2,314 కోట్లు ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వివిధ రూపాల్లో తీసుకున్న ఈ మొత్తాన్ని ఏప్రిల్ 30న చెల్లించాల్సి ఉన్నప్పటికీ విఫలమైనట్లు ఎక్సే్చంజీలకు తెలిపింది. తాము 2037 నాటికి రూ.29,277 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రూ. 3,956 కోట్లు మాత్రమే ఈ ఏడాది ఏప్రిల్ 30 కల్లా కట్టాల్సి ఉందని జేఏఎల్ వివరించింది. -
చెల్లింపుల వైఫల్యంలో జేపీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జేపీ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్) రుణ చెల్లింపుల్లో విఫలమైంది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 4,059 కోట్ల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. జేపీ అసోసియేట్స్ దాఖలు చేసిన వివరాల ప్రకారం డిసెంబర్ 31న రూ. 1,713 కోట్ల అసలు, రూ. 2,346 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. వివిధ బ్యాంకులకు చెందిన రుణాలున్నట్లు పేర్కొంది. 2018 సెప్టెంబర్‌లో జేఏఎల్‌కు వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంక్ దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ అంశం జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇక పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ గతేడాది(2022) సెప్టెంబర్‌లో జేఏఎల్‌కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. సెప్టెంబర్ 15కల్లా రూ. 6,893 కోట్లు చెల్లింపుల్లో విఫలమైనట్లు ఫిర్యాదులో ఎస్బీఐ పేర్కొంది. కాగా.. 2022 డిసెంబర్లో జేఏఎల్సహా గ్రూప్‌లోని ఇతర కంపెనీలు మిగిలిన సిమెంట్ ఆస్తులను దాల్మియా భారత్‌కు విక్రయిస్తున్నట్లు వెల్లడించాయి. రూ. 5,666 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదుర్చుకున్నాయి. తద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. సిమెంట్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగనున్నాయి. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
భారత్‌కు ఎల్ఎన్జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్!
న్యూఢిల్లీ: భారత్‌కు 5 కార్గోల ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ను సరఫరా చేయడంలో రష్యా డిఫాల్ట్ అయ్యింది.రష్యన్ గ్యాస్ సరఫరా చేసే కంపెనీల్లో ఒకదానిపై ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెడితే దేశీ దిగ్గజం గెయిల్‌కి ఏటా 2.85 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతి కోసం రష్యన్ సంస్థ గాజ్ప్రోమ్కి చెందిన సింగపూర్ విభాగంతో దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. ఈ సింగపూర్ విభాగం ప్రస్తుతం జర్మనీకి చెందిన అనుబంధ సంస్థ కింద పనిచేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలపై రష్యా ప్రతీకార ఆంక్షలు విధించిన దేశాల్లో జర్మనీ కూడా ఉంది. ఫలితంగా సింగపూర్ విభాగానికి రష్యా గ్యాస్ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఎల్ఎన్జీ సరఫరాకు ఆటంకం కలిగింది. గెయిల్ ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. -
వడ్డీలు కట్టలేక చేతులెత్తేసిన ‘ఫ్యూచర్’!
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ తాజాగా రూ. 6.07 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. కంపెనీ గతంలో జారీ చేసిన మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు)పై ఈ నెల 20కల్లా వడ్డీ చెల్లించవలసి ఉన్నట్లు తెలియజేసింది. అయితే ప్రతికూల పరిస్థితులతో వీటిపై వడ్డీ చెల్లించలేకపోయినట్లు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రూ. 120 కోట్ల విలువైన సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. ఈ సెక్యూర్డ్ డిబెంచర్లను వార్షికంగా 10.15 శాతం కూపన్ రేటుతో జారీ చేసింది. కాగా.. ఈ నెల మొదట్లోనూ రూ. 29 కోట్ల విలువైన ఎన్‌సీడీలపై రూ. 1.41 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో కంపెనీ విఫలంకావడం గమనార్హం! -
Sri Lanka Economic Crisis: బ్రోచేవారెవరురా!
అనుకున్నంతా అయింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తమ సింహళ నూతన సంవత్సరాదికి ఒక రోజు ముందర అధికారికంగా చేతులెత్తేసింది. చేతిలో డబ్బులు లేవు గనక విదేశీ రుణాలను వెనక్కి చెల్లించడం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఉన్న అరకొర విదేశీ మారకద్రవ్య నిల్వలు ముడి చమురు లాంటి అత్యవసరాల దిగుమతులకు అవసరం. అందుకనే అప్పులు తీర్చడం ఆపేస్తోందన్న మాట. దీంతో, కనివిని ఎరుగని ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంక అంతర్జాతీయ యవనికపై తమ కష్టనష్టాలను చెప్పుకున్నట్టూ, ఒప్పుకున్నట్టూ అయింది. ఈ కష్టాలను కడతేర్చేందుకు ప్రభుత్వం అహరహం శ్రమిస్తోందనీ, ప్రజలు వీధికెక్కి నిరసన తెలిపే ప్రతి నిమిషం దేశానికి మరిన్ని డాలర్ల నష్టం తెస్తుందనీ ఆ దేశ ప్రధాని మహిందా రాజపక్స చేసిన అభ్యర్థన బేలతనానికి పరాకాష్ఠ. దేశ పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఓ ప్రణాళికను సిద్ధం చేస్తోందని ఆయన నమ్మబలుకుతున్నారు. కానీ, కష్టాల కడలి నుంచి ఈ ద్వీపదేశం బయటపడేదెట్లా? శ్రీలంక చరిత్రలోనే తొలిసారిగా 2020 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్స కుటుంబీకులు మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. ఎన్నడూ లేనంతటి బలమైన ప్రభుత్వం ప్రజల్లో ఆశలు రేపింది. ఆచరణలో మాత్రం దేశాధ్యక్షుడు గొటబయ, ఆయన అన్నయ్య ప్రధాని మహిందా, మంత్రులుగా కుటుంబ సభ్యులు – ఇలా రాజపక్స కుటుంబం దేశాన్ని సొంత జాగీరులా నడిపింది. అవినీతి, బంధుప్రీతి, ఇష్టారాజ్యపు ప్రభుత్వ ఆర్థిక విధానాలు – అన్నీ కలసి దేశానికి అశనిపాత మయ్యాయి. గమనిస్తే, కోవిడ్ తలెత్తినప్పటి నుంచి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగ జారుతూ వచ్చింది. ఆహార, ఇంధన కొరత సహా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో రుణాల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతానికి పక్కనపెట్టేయాల్సి వచ్చిందంటే, ఆర్థికంగా దేశం నిండా మునిగిందన్న మాట! ఆహారం, ఇంధనం, విద్యుత్ – ఇలా అన్నీ ఇప్పుడు కొరతే. అధ్యక్షుడు, మంత్రుల నివాసాలకు తప్ప దేశవాసులందరికీ కరెంట్ కష్టాలు, రేషన్ క్యూలు. గమనిస్తే, 2021–22లో శ్రీలంకలో వరి ఉత్పత్తి 13.9 శాతం మేర పడిపోయింది. గత అయిదేళ్ళలో ఎన్నడూ లేనంతగా దిగుమతులు హెచ్చాయి. ఇదీ స్వయంకృతమే. గొటబయ ప్రభుత్వం నిరుడు మే మొదట్లో సేంద్రియేతర ఎరువులు, ఆగ్రో– కెమికల్స్ దిగుమతిని నిషేధించింది. ఆరు నెలల పైచిలుకు తర్వాత నవంబర్ చివరలో నిషేధం ఎత్తేసింది. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరి ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ప్రస్తుత ఆహార కొరతకు ఇదీ ఓ కారణమైంది. దక్షిణాసియా మిత్రదేశాలు భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల వైపు ద్వీపదేశం ఆశగా చూస్తున్నదందుకే. రెండు, మూడేళ్ళలో తిరిగి చెల్లించే పద్ధతిలో ఆహార ధాన్యాలను అప్పుగానైనా తీసుకోవాలన్న ప్రతిపాదనలు వస్తున్నదీ అందుకే. పొరుగుదేశం శ్రీలంకను ఆదుకొనేందుకు ఇప్పటికే భారత్ తన వంతుగా ముందుకొచ్చింది. గడచిన ఒక్క వారంలోనే 16 వేల ఎం.టీల బియ్యం అందించింది. అది ఏ మూలకు అన్నది వేరే చర్చ. శ్రీలంక మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే సూచించినట్టు, ఐఎంఎఫ్‌తో చర్చలు ముగిసి, అప్పుల ఊబి నుంచి ఆ దేశాన్ని బయటపడేసే పని ఆచరణలోకి వచ్చే వరకు భారత్ – జపాన్ – చైనా – దక్షిణ కొరియా – ఐరోపా సమాజాల కన్సార్టియమ్ సాయం తీసుకోవడం మేలు. ఇప్పటికే భారత, చైనాల నుంచి కొలంబో రుణాలు తీసుకుంది. అది చాలదు. ఈ జూలైలో కాలపరిమితి తీరే 100 కోట్ల డాలర్ల అంతర్జాతీయ సార్వభౌమ బాండ్లతో సహా దాదాపు 400 కోట్ల డాలర్ల రుణాలను ఈ ఏడాదే కొలంబో తీర్చాల్సి ఉంది. అది వల్ల కాదని గ్రహించే, ఇప్పుడు హ్యాండ్సప్ అన్నది. ఔషధాల కొరతతో శస్త్రచికిత్సలను సైతం ఆపేసిన దేశంలో రానున్న రోజుల్లో ఆరోగ్య సంక్షోభం తలెత్తనుందని వార్త. కుటుంబ అవినీతి, అపసవ్య ప్రభుత్వ విధానాలు, అనేకానేక తప్పిదాలతో శ్రీలంక ఇలా వీధిన పడింది. నిజమే. ఆ పాత కథను పక్కనపెట్టి, నూతన ఉషోదయానికి బాటలు వేయడమే ఇప్పుడు ఎవరైనా తక్షణం చేయాల్సిన పని. ఆర్థికంగా దివాళా తీసినట్టు ప్రకటించినంత మాత్రాన శ్రీలంకలో సహజ వనరులు, మానవ వనరులు మృగ్యమయ్యాయని కాదు కదా! వాటి సవ్యమైన వినియోగంతో, దేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టడమే ఇప్పుడు కావాల్సింది. అనేక రంగాల్లో సత్తా ఉన్నా, చతికిలబడ్డ సాటి దేశాన్ని ఆదుకోవడమే అంతర్జాతీయ సమాజ కర్తవ్యం. అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకుంటామంటూ చైనా మంగళవారం పునరుద్ఘాటిం చింది. కానీ, రుణాల రీషెడ్యూలింగ్‌కి కొలంబో చేసిన అభ్యర్థనపై మాత్రం నోరు మెదపలేదు. ఇస్తా మని మాట ఇచ్చిన 250 కోట్ల అమెరికన్ డాలర్ల సాయం పైనా పెదవి విప్పలేదు. పొరపాటునో, గ్రహపాటునో ఎప్పుడైనా సరే వీధినపడ్డ పొరుగు దేశాలను ఆదుకొనేందుకు నిర్దిష్ట పరస్పర సహకార విధాన రూపకల్పన అవసరం అనిపిస్తోంది. ఐఎంఎఫ్ లాంటి వేదికలే ఇప్పుడు శ్రీలంకకు మిగిలిన ఆశలు. గతంలో 16 సార్లు ఐఎంఎఫ్ సాయంతో బయటపడినా, ఈసారి అత్యంత కీలకం. ఎల్టీటీఈతో 30 ఏళ్ళ యుద్ధం నుంచి బయటకొచ్చినట్టే, తాజా ఆర్థిక సంక్షోభం నుంచీ తేరుకుంటా మని శ్రీలంక పెద్దలు చెబుతున్నారు కానీ, అది మాటలు చెప్పినంత సులభం కాదు. కఠోరమైన రాజకీయ, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. ద్రవ్య స్వీయ క్రమశిక్షణతో పాటు అంతర్జాతీయ ఆపన్న హస్తాలూ తక్షణ అవసరమే. ప్రస్తుతం కొలంబోకు కావాల్సింది సానుభూతి కాదు... సహాయం! -
ఎన్సీడీ హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్ ఫిన్వెస్ట్ డిఫాల్ట్
న్యూఢిల్లీ: నాన్-కన్వర్టబుల్ డిబెంచర్(ఎన్సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుపై రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్(ఆర్ఎఫ్ఎల్) విఫలమైంది. రెలిగేర్ ఎంటర్ర్పైజెస్ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, రుణభారంలో ఉన్న తన అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ఎల్) మార్చి 28న నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులో డిఫాల్ట్ అయిందని తెలిపింది. ఈ విలువ దాదాపు రూ.2.41 కోట్లని ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. సంస్థ డిఫాల్ట్ వరుసగా ఇది రెండవనెల. తనకు రావాల్సిన-చెల్లించాల్సిన రుణాల్లో అసమతుల్యత కారణంగా బాండ్ హోల్డర్లకు ఫిబ్రవరి 25న చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులో(రూ. 96 లక్షల వడ్డీ చెల్లింపుల్లో) ఆర్ఎఫ్ఎల్ గత నెల్లో డిఫాల్ట్ అయ్యింది. డిఫాల్ట్ ఎందుకంటే... ఈ మేరకు వెలువడిన ప్రకటన ప్రకారం, ఆర్ఎఫ్ఎల్ రుణదాతలు సూచించినట్లుగా, సంస్థ అన్ని చెల్లింపులకు రుణదాతలు నియమించిన ఏఎస్ఎం (ఏజెన్సీస్ ఫర్ స్పెషలైజ్డ్ మానిటరింగ్) నుండి ముందస్తు ధృవీకరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారం, ఆర్ఎఫ్ఎల్ 2022 మార్చి 28న చెల్లించాల్సిన అర్హత కలిగిన డిబెంచర్ హోల్డర్లకు ‘ఎన్సీడీల సిరీస్-36 వడ్డీ చెల్లింపు సర్టిఫికేట్ కోసం’ ఏఎస్ఎంను ఆర్ఎఫ్ఎల్ అభ్యర్థించింది. అయితే ఇందుకు ఏఎస్ఎం ఆమోదం లభించలేదు. ఈ కారణంగా, అర్హత కలిగిన హోల్డర్లకు ఎన్సీడీ వడ్డీ మొత్తాన్ని ఆర్ఎఫ్సీ చెల్లించలేకపోతోంది. ఆర్బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో... ఆర్ఎఫ్ఎల్ బలహీన ఆర్థిక స్థితి కారణంగా జనవరి 2018 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రంలో (సీఏపీ) ఉంది. తాజా వ్యాపారాన్ని చేపట్టకుండా ఆంక్షలు ఉన్నాయి. రెలిగేర్ ఎంటర్ర్పైజెస్ ప్రమోటర్‌గా కొనసాగుతున్న ఆర్ఎఫ్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను మార్చి 11న ఆర్బీఐ తిరస్కరించింది. రుణభారంలో ఉన్న ఆర్ఎఫ్ఎల్పై ‘‘మోసపూరిత’’ ఆరోపణలు ఉండడమే దీనికి కారణం. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ, ఆర్ఎఫ్ఎల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకుంది. మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, అతని సోదరుడు మల్విందర్ సింగ్ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల కారణంగా కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దాదాపు రూ. 4,000 కోట్ల ఆర్థిక అవకతవకలపై పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. (చదవండి: అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఏడుగురు భారతీయులు!) -
డెడ్‌లైన్ ఫినిష్.. పెనుసంక్షోభం అంచున చైనా!
కమ్యూనిస్ట్ కంట్రీ పెనుసంక్షోభం అంచున నిలిచింది. ఓవైపు కరోనా సవాళ్లు, మరోవైపు కార్పొరేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న అధ్యక్షుడు జింగ్ పిన్ నిర్ణయాలు, ఇంకోవైపు రియల్టి రంగంలో పెనుసంక్షోభంతో ప్రపంచంలోనే రెండో పెద్ద అర్థిక వ్యవస్థ చైనా పతనం దిశగా దూసుకుపోతోంది. తాజాగా చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్’(ఎవర్‌గ్రాండే)కి విధించిన డెడ్‌లైన్ ముగియడంతో దాదాపు డిఫాల్టర్ అయినట్లేనని భావిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరున్న ఎవర్‌గ్రాండ్.. చెల్లింపుల గడువు ముగియడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు సుమారు 300 బిలియన్ల డాలర్ల బాకీ పడిన ఎవర్‌గ్రాండ్.. గడువులోగా వడ్డీలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. ఆస్తులు అమ్ముకున్నా(కొన్ని ఒప్పందాలు కుదరలేదు కూడా) కూడా సమయానికి చెల్లించలేకపోయింది. దీంతో పతన భయంతో చైనా రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు వణికిపోతున్నాయి. ఫిట్చ్ ప్రకటన సోమవారం నాటికల్లా (డిసెంబర్ 6, 2021) దాదాపు 1.2 బిలియన్ డాలర్ల అప్పును ఎవర్‌గ్రాండ్ చెల్లించాల్సి ఉంది. కానీ, బుధవారం నాటికి కూడా చెల్లింపులు జరగకపోవడంతో.. కంపెనీ దాదాపు డిఫాల్ట్‌గా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఫిట్చ్.. ఎవర్‌గ్రాండ్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించడం విశేషం. రియల్టి రంగంపై చైనా ప్రభుత్వం మోపిన ఉక్కుపాదం వల్లే ఎవర్‌గ్రాండ్ పతనం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను తట్టుకునేందుకు అడ్డగోలుగా డిస్కౌంట్లను ప్రకటించి.. ఇబ్బందుల పాలైంది ఎవర్‌గ్రాండ్. ఒకవేళ చైనాలో గనుక అతిపెద్ద కార్పొరేట్ పతనం ఏర్పడితే.. గ్లోబల్ మార్కెట్ సైతం కుదేలు కావడం ఖాయం. అప్పట్లో.. ఎవర్‌గ్రాండ్.. 1996 చైనాలో అర్బనైజేషన్ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో షెంజెన్ కేంద్రంగా ఏర్పాటైన రియల్ ఎస్టేట్ గ్రూప్. 2009లో 722 మిలియన్ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆపై 9 బిలియన్ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్గ్జౌ ఫుట్‌బాల్ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. చదవండి: ఎవర్‌గ్రాండ్ ఓనర్.. చినిగిన బట్టలతో బాల్యం.. కడుపు కాలి కుబేరుడు అయ్యాడు -
కదులుతున్న చైనా పునాదులు, డ్రాగన్‌కు మరో దెబ్బ
చైనా ఆర్ధిక మూలాలు ఒక్కొక్కటిగా దెబ్బతింటున్నాయి. ముంచుకొచ్చిన వరదలు, ఆహారం సంక్షోభం, ఇతర దేశాలు చైనాపై విధించిన వ్యాపారపరమైన ఆంక్షలు, పేట్రోగిపోతున్న కరోనాతో పాటు రియాలీ రంగంలో తలెత్తిన సంక్షోభం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ జీడీపీలో 29శాతంగా ఉన్న రియాలటీ రంగం కుదేలవుతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో చైనాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న ఎవర్ గ్రాండ్ డీఫాల్టర్ జాబితాలో చేరింది. తాజాగా మరొక రియల్ ఎస్టేట్ డెవలపర్ కైసా గ్రూప్ డిఫాల్టర్‌గా మిగిలిపోనున్నట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలతో చైనా పునాదులు కదిలిపోతున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. రియాలిటీ రంగంలో ఒడిదుడుకులు చూస్తుంటే అవి నిజమనిపిస్తున్నాయి. కైసా గ్రూప్ చైనాలో రియాల్టీ రంగానికి దెబ్బమీద దెబ్బపడుతున్నట్ల మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవర్ గ్రాండ్ తర్వాత కైసా గ్రూప్ డీఫాల్టర్ జాబితాలో చేరడం చైనా ఆర్ధిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగింది. షెన్జెన్కు చెందిన రియాలిటీ కంపెనీ కైసా గ్రూప్ షేర్లు హాంకాంగ్‌లో స్టాక్క్ మార్కెట్లో ట్రేడింగ్‌ను నిలిపివేశాయి. అంతేకాదు కైసాకు అనుబంధంగా అనుబంధ సంస్థలు నిర్వహించే ట్రేడింగ్ సైతం నిలిచిపోయిందని సీఎన్ఎన్ తెలిపింది. కైసా సస్పెన్షన్ కారణాలేంటో బహిర్గతం చేయకపోయినా.. ఆ కంపెనీకి ఆర్ధికపరమైన సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వ ఆర్థికరంగా చెందిన మీడియా సంస్థ సెక్యూరిటీస్ టైమ్స్.. కంపెనీ ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని, బకాయిలు చెల్లించలేకపోతుందని కథనాల్ని ప్రచురించింది. అయితే కైసా మాత్రం రియాలీ రంగంపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే క్రెడిట్ రేటింగ్ తగ్గించడం వల్ల సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఎవర్ గ్రాండ్, మోడరన్ ల్యాండ్ చైనా రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద సంస్థ ఎవర్ గ్రాండే. ఈ కంపెనీ 280 నగరాల్లో 1300 ప్రాజెక్టులను చేపట్టింది. 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ కంపెనీ దివాళా తీసిసింది. ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్లమేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థ జారీ చేసిన వివిధ బాండ్లపై సెప్టెంబర్ 23 వ తేదీకి 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాల్సి ఉంది. కానీ ఆ అప్పులు చెల్లించలేక డీఫాల్టర్ జాబితాలో చేరింది. ఎంతలా అంటే ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులుకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంది. ఇప్పుడు కైసా గ్రూఫ్ సైతం డీఫాల్టర్ జాబితాలో చేరనుండగా.. మరో రియాలిటీ సంస్థ మోడరన్ ల్యాండ్ సైతం తన అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. ఇటీవల చైనా రియాలిటీ రంగంలో జరుగుతున్న పరిణామాలపై డెవలపర్లు కంపెనీ చెల్లించాల్సిన బకాయిల గురించి కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మోడరన్ ల్యాండ్ ప్రతినిధులు బకాయిలు చెల్లించేందుకు తమకు మరింత సమయం కావాలని కోరారు. కోరిన గడువులోపు బకాయిలు చెల్లిస్తే సరేసరి. లేదంటే మోడరన్ ల్యాండ్ సైతం డీఫాల్టర్ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. చదవండి: చైనాకు మరో భారీషాక్, డ్రాగన్‌ను వదిలేస్తున్న టెక్ దిగ్గజ కంపెనీలు -
దివాలా తీసిన ఫోర్బ్స్ బిలీనియర్!!
రియాద్ : 10 ఏళ్ల క్రితం ఫోర్బ్స్ ప్రకటించే 100 ధనికుల జాబితాలో ఆయన ఒకరు. సౌదీ అరేబియాలో అతనొక బడా బిలీనియర్. కానీ ప్రస్తుతం అతని ఆస్తులన్నీ వేలానికి వచ్చాయి. ఆ కోట్లన్నీ ఎక్కడికి పోయాయో..? తీసుకున్న రుణాలు చెల్లించలేక చేతులెత్తేశాడు. చివరికి ఆయన ఆస్తులన్నింటిన్నీ అమ్మి, రుణదాతలు, తమ సొమ్మును రాబట్టుకోవాల్సిందిగా.. రుణ పరిష్కార ట్రిబ్యునల్ ఆదేశించింది. మాన్ అల్- సానియా ఒకప్పుడు సౌదీ అరేబియా అత్యంత ధనిక వంతుడు. 2007 ఫోర్బ్స్ జాబితాలో చోటు కూడా దక్కించుకున్నాడు. కానీ తన కంపెనీ సాద్ గ్రూప్, క్రెడిటార్లకు చెల్లించాల్సిన బిలినియన్ రియల్స్‌ను చెల్లించలేదు. 2009 నుంచి రుణాలు తిరిగి చెల్లించడం మానేశాడు. సాద్ గ్రూప్ దివాలా తీసింది. దీంతో అతన్ని గతేడాది అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సాద్ గ్రూప్ నుంచి రుణాలు రాబట్టుకోవడం కోసం క్రెడిటార్లు దాదాపు తొమ్మిదేళ్ల నుంచి వేచి చూస్తున్నారు. ఇదే సౌదీ అరేబియాలో దీర్ఘకాలికంగా నడుస్తున్న అతిపెద్ద రుణ వివాదం. ఈ రుణ వివాద కేసును పరిష్కరించేందుకు ముగ్గురు జడ్జిలతో కూడిన ట్రిబ్యునల్ గతేడాది ఇత్‌కాన్ అలియన్స్ అనే కన్సోర్టియంను ఏర్పాటు చేసింది. ఈ కన్సోర్టియం ఐదు నెలల్లో సాద్ గ్రూప్‌నకు చెందిన ఆస్తులను వేలాల ద్వారా విక్రయించాల్సి ఉంది. తొలి వేలంలో సంస్థకు చెందిన అభివృద్ధి చెందని, వాణిజ్య భూములను విక్రయించాలి. తూర్పు ప్రావిన్స్ ఖోబార్, డమ్మామ్లలో ఉన్న ఆదాయ, ఉత్పత్తి నివాస భవనాలను వేలం వేయాల్సి ఉంది. వీటిని అక్టోబర్ చివరిన వేలం వేయనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. మార్చిలోనే వేలంలో తొలి దశగా సాద్ గ్రూప్‌కు చెందిన 900 వాహనాలను ఇత్‌కాన్ విక్రయించింది. ఆ వేలంలో 125 మిలియన్ రియాన్లను పొందింది. వీటి ద్వారా అప్పటి వరకు ఉద్యోగులకు చెల్లించని వేతనాలను చెల్లించారు. ఆ తర్వాత వేలాల్లో బ్యాంకులతో కలిపి 34 మంది క్రెడిటార్లకు రుణాలను తిరిగి చెల్లించనున్నారు. సాద్ గ్రూప్ బ్యాంక్‌లకు 22 బిలియన్ డాలర్లు(లక్షన్నర కోట్లు) చెల్లించాల్సి ఉంది. అయితే మొత్తంగా సాద్ గ్రూప్‌కు 40 బిలియన్ రియాల్స్ నుంచి 60 బిలియన్ రియాల్స్ వరకు రుణాలు ఉంటాయని కొంతమంది అంచనావేస్తున్నారు. సానియా ఆస్తులన్నీ అమ్మి, క్రెడిటార్లకు బకాయిలు చెల్లించన తర్వాత అతన్ని విడుదల చేస్తారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. -
రుణ ఎగవేతదారుల జాబితా విడుదల
♦ 5,610 డిఫాల్టర్లు... ♦ 58,792 కోట్ల బకాయిలు: ఏఐబీఈఏ చెన్నై: బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద రూ.58,792 కోట్ల మేర రుణాలు పొంది ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారి జాబితాను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల్లోని 5,610 ఖాతాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో జాతీయ బ్యాంకులకు రూ.28,775 కోట్ల మేర రుణాలు ఎగవేసిన ఖాతాదారులు 3,192 మంది ఉన్నారు. ఒక్క ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులకే 1,546 ఖాతాదారుల నుంచి రూ.18,576 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ ఖాతాదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ఎస్బీఐ గ్రూపు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఇక ప్రైవేటు బ్యాంకులకు 792 మంది ఖాతాదారులు రూ.10,250 కోట్లు ఎగ్గొట్టారు. ఆర్థిక సంస్థలకు 42 మంది ఖాతాదారుల నుంచి రూ.728 కోట్లు, విదేశీ బ్యాంకులకు 38 ఖాతాదారుల నుంచి రూ.463 కోట్లు వసూలు కావాల్సి ఉంది. రోజురోజుకీ పెరుగుతున్న బకాయిలు ఈ సందర్భంగా ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ... బ్యాంకుల్లోని మొండి బకాయిలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.5.39 లక్షల కోట్లకు చేరుకున్నాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి ఇవి కేవలం రూ.2.78 లక్షల కోట్లేనని ఆయన గుర్తు చేశారు. ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల నుంచి రుణ బకాయిలు రాబట్టేందుకు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
'నన్ను అలా అనేముందు ఆలోచించుకోవాలి'
లండన్: బ్యాంకులకు భారీ మొత్తంలో ఐపీ పెట్టి ప్రస్తుతం విదేశాలకు చెక్కేసిన ఒకప్పటి వ్యాపార దిగ్గజం, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మీడియాపై మండిపడ్డారు. ఏదైనా ప్రచారం చేసేముందు నిజనిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. అసలు తనను ఎలా ఎగవేతదారుడని అంటారని ప్రశ్నించారు. కుదిరితే సమస్యను పరిష్కరించే మార్గం సూచించాలిగానీ మరింత పెద్దదిగా చేస్తే ఎలా అంటూ ట్వీట్ చేశారు. 'వారు చెప్పినట్లుగా జగడానికి పోవడం కాదు కానీ నేను ఎంతో వినమ్రంగా ఇండియన్ మీడియాకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నన్ను ఎగవేత దారుడనే ముందు నిజనిజలేమిటో ఒకసారి తనిఖీ చేసుకోవాలి' ఆయన ట్వీట్ చేశారు. 'సర్దుబాటు అవకాశం ఇవ్వకుండా నేనెందుకు ఎగవేతదారుడిని అవుతాను' అని ఆయన ప్రశ్నించారు. ఆర్థికపరమైన సమస్యలను నెమ్మదిగా సర్దుబాటు చేయాలని తాను ప్రయత్నిస్తుంటే ఉద్దేశపూర్వకంగానే తాను ఎగవేతకు పాల్పడినట్లుగా ప్రచారం చేశారని, అది చాలా బాధను కలిగించిందని చెప్పారు. రాజ్యసభ సభ్యత్వం నుంచి మాల్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు రోజే మాల్యా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
డిఫాల్టర్లు తప్పించుకోకుండా చూడటం బ్యాంకుల విధి: జైట్లీ
న్యూయార్క్: డిఫాల్టర్లు తప్పించుకొని పోకుండా చూడటం బ్యాంకుల బాధ్యతని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దాదాపు రూ.9,000 కోట్ల రుణ రికవరీకి బ్యాంకులు ప్రయత్నాలు ప్రారంభించడంతో మాల్యా లండన్ వెళ్లిపోయారని చెప్పారు. వాణిజ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏ డిఫాల్టర్ కూడా తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులపైన ఉందన్నారు. ‘మన వద్ద క్రిమినల్ చట్టాలను చూడటానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, సెటిల్మెంట్ విషయాల కోసం బ్యాంకులు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు వాటి వాటి పరిమితిలో సమర్థంగా పనిచేస్తున్నాయని భావిస్తున్నాను’ అని తెలిపారు. మాల్యా లాంటి వారు ఇతర దేశాలకు వెళ్లిపోయినా.. ప్రజా వ్యవస్థ రుణ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని చెప్పారు. -
దేశం కోసమైనా అప్పులు తీర్చండి
డిఫాల్టర్లకు పీఎన్బీ ఎండీ ఉష సూచన న్యూఢిల్లీ: చెల్లించగలిగే సామర్థ్యమున్న డిఫాల్టర్లు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునైనా తీసుకున్న అప్పుల్ని తీర్చాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ ఉషా అనంతసుబ్రహ్మణ్యన్ సూచించారు. ‘‘డబ్బులున్నా సరే తీసుకున్న అప్పును తీర్చడానికి ఇష్టపడని వారు కొందరుంటారు. అలాంటివాళ్లు తీర్చాల్సిందే’’ అని ఆమె చెప్పారు. సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్, ఇతర ఉద్దేశపూర్వక మొండి బకాయిదార్ల నుంచి బకాయిలు రాబట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై స్పం దిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) వల్ల ఇటు బ్యాంకులకు, అటు ప్రజలకు కూడా నిధులు అందుబాటులో లేకుండా పోతాయన్నారు. ఎగవేతదారుగా యునెటైడ్ బ్రూవరీస్.. కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్కిచ్చిన రుణాలకు సంబంధించి దాని హోల్డింగ్ సంస్థ యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను (యూబీహెచ్ఎల్)ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పీఎన్బీ ప్రకటించింది. ఎస్బీఐ ఇప్పటికే యూబీహెచ్ఎల్తో పాటు మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను విల్‌ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించడం తెలిసిందే. పీఎన్బీకి కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి రూ.800 కోట్లు రావాల్సి ఉంది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం కింగ్ఫిషర్కు రూ.6,900 కోట్ల పైగా రుణాలిచ్చింది. ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్లను విక్రయించగా కేవలం రూ. 1,100 కోట్లే రికవర్ అయ్యాయి. -
బకాయి చెల్లించకపోతే హామీదారుడు కూడా డిఫాల్టరే!:ఆర్బిఐ
హైదరాబాద్: బ్యాంకులలో రుణాలు తీసుకొని, ఎగ్గొట్టేవారి ఆట కట్టించేందుకు రిజర్వు బ్యాంకు నిబంధనలను కఠినతరం చేసింది. బకాయి తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లించకపోతే, అందుకు హామీగా ఉన్న వ్యక్తిని కూడా డిఫాల్టర్(willful deflator)గా ప్రకటిస్తారు. ఒక్కసారి డిఫాల్టర్‌గా ముద్రపడితే ఏ బ్యాంకు కూడా అతనికి లేక ఆమెకు రుణం ఇవ్వదు.బ్యాంకుల రుణబకాయిలు రాబట్టేందుకు రిజర్వు బ్యాంకు ఈ నిబంధనలు రూపొందించింది. **