డిఫాల్టర్లు తప్పించుకోకుండా చూడటం బ్యాంకుల విధి: జైట్లీ
న్యూయార్క్: డిఫాల్టర్లు తప్పించుకొని పోకుండా చూడటం బ్యాంకుల బాధ్యతని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దాదాపు రూ.9,000 కోట్ల రుణ రికవరీకి బ్యాంకులు ప్రయత్నాలు ప్రారంభించడంతో మాల్యా లండన్ వెళ్లిపోయారని చెప్పారు. వాణిజ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏ డిఫాల్టర్ కూడా తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులపైన ఉందన్నారు. ‘మన వద్ద క్రిమినల్ చట్టాలను చూడటానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, సెటిల్‌మెంట్ విషయాల కోసం బ్యాంకులు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు వాటి వాటి పరిమితిలో సమర్థంగా పనిచేస్తున్నాయని భావిస్తున్నాను’ అని తెలిపారు. మాల్యా లాంటి వారు ఇతర దేశాలకు వెళ్లిపోయినా.. ప్రజా వ్యవస్థ రుణ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని చెప్పారు.