న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారం రాజకీయ మలుపు తిరిగేసింది. భారత్ వీడటానికి కంటే ముందు తాను ఆర్థిక మంత్రిని కలిసినట్టు విజయ్ మాల్యా నిన్న సంచలన విషయాలు వెల్లడించాడు. విజయ్ మాల్యా చేసిన ఈ కామెంట్లపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఈ విషయంపైస్వతంత్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
‘విజయ్ మాల్యా నేడు లండన్‌లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధాని వెంటనే ఈ విషయంపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. ఆర్థిక మంత్రి తన పదవి నుంచి దిగిపోవాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మాల్యా భారత్ వదిలి వెళ్లేలా ఎప్పుడు, ఎలా అనుమతి ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వెస్ట్‌మినిస్టర్ కోర్టులో జరుగుతున్న అప్పగింత కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన మాల్యా, కోర్టు వెలుపల ఈ కామెంట్లు చేశారు.
అయితే అది అధికారిక సమావేశం కాదంటూ తర్వాత మాట మార్చారు. మాల్యా కామెంట్లు చాలా చెత్తగా ఉన్నాయని, అసలు మాల్యా తనను కలిసేందుకు 2014 నుంచి అపాయింట్‌మెంటే ఇవ్వలేదని జైట్లీ కొట్టిపారేశారు. కాగా, నిన్నటితో మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు విచారణ పూర్తయింది. దీనిపై డిసెంబర్ 10న లండన్ కోర్టు తీర్పు వెల్లడించనుంది.
చదవండి.. (జైట్లీని కలిశాకే.. భారత్ వీడాను)
Comments
Please login to add a commentAdd a comment