కమ్యూనిస్ట్ కంట్రీ పెనుసంక్షోభం అంచున నిలిచింది. ఓవైపు కరోనా సవాళ్లు, మరోవైపు కార్పొరేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న అధ్యక్షుడు జింగ్ పిన్ నిర్ణయాలు, ఇంకోవైపు రియల్టి రంగంలో పెనుసంక్షోభంతో ప్రపంచంలోనే రెండో పెద్ద అర్థిక వ్యవస్థ చైనా పతనం దిశగా దూసుకుపోతోంది. తాజాగా చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్’(ఎవర్‌గ్రాండే)కి విధించిన డెడ్‌లైన్ ముగియడంతో దాదాపు డిఫాల్టర్ అయినట్లేనని భావిస్తున్నారు.
ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరున్న ఎవర్‌గ్రాండ్.. చెల్లింపుల గడువు ముగియడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు సుమారు 300 బిలియన్ల డాలర్ల బాకీ పడిన ఎవర్‌గ్రాండ్.. గడువులోగా వడ్డీలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. ఆస్తులు అమ్ముకున్నా(కొన్ని ఒప్పందాలు కుదరలేదు కూడా) కూడా సమయానికి చెల్లించలేకపోయింది. దీంతో పతన భయంతో చైనా రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు వణికిపోతున్నాయి.
ఫిట్చ్ ప్రకటన
సోమవారం నాటికల్లా (డిసెంబర్ 6, 2021) దాదాపు 1.2 బిలియన్ డాలర్ల అప్పును ఎవర్‌గ్రాండ్ చెల్లించాల్సి ఉంది. కానీ, బుధవారం నాటికి కూడా చెల్లింపులు జరగకపోవడంతో.. కంపెనీ దాదాపు డిఫాల్ట్‌గా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఫిట్చ్.. ఎవర్‌గ్రాండ్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించడం విశేషం.
రియల్టి రంగంపై చైనా ప్రభుత్వం మోపిన ఉక్కుపాదం వల్లే ఎవర్‌గ్రాండ్ పతనం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను తట్టుకునేందుకు అడ్డగోలుగా డిస్కౌంట్‌లను ప్రకటించి.. ఇబ్బందుల పాలైంది ఎవర్‌గ్రాండ్. ఒకవేళ చైనాలో గనుక అతిపెద్ద కార్పొరేట్ పతనం ఏర్పడితే.. గ్లోబల్ మార్కెట్ సైతం కుదేలు కావడం ఖాయం.
అప్పట్లో..
ఎవర్‌గ్రాండ్.. 1996 చైనాలో అర్బనైజేషన్ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో షెంజెన్ కేంద్రంగా ఏర్పాటైన రియల్ ఎస్టేట్ గ్రూప్. 2009లో 722 మిలియన్ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆపై 9 బిలియన్ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్‌గ్జౌ ఫుట్‌బాల్ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది.
చదవండి: ఎవర్‌గ్రాండ్ ఓనర్.. చినిగిన బట్టలతో బాల్యం.. కడుపు కాలి కుబేరుడు అయ్యాడు
Comments
Please login to add a commentAdd a comment