assests
-
అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది.అయితే ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్‌లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతకుముందు బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది. కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అక్టోబర్ 2017లో తమ అరిన్ జన్మించింది. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా ఆసిన్ భర్త రాహుల్ శర్మ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్ సక్సెస్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం.రాహుల్ శర్మ మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. అనంతరం కెనడా వెళ్లి సస్కట్చేవాన్ యూనివర్సిటీ నుంచి కామర్స్ బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. చదువు పూర్తయిన వెంటనే రాహుల్ శర్మ తన తండ్రి వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. అప్పుడు కేవలం రూ. 3 లక్షల మొదలైన వ్యాపారం ఇప్పుడేమో ఏకంగా రూ. 1300 కోట్లకు చేరుకుంది.రాహుల్ శర్మ మొదట మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడి, సీఈఓగా ఉన్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి 2000 మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. ఆ తరువాత 2008లో మొబైల్ రంగంలోకి ప్రవేశించారు. 2010 నాటికి హ్యూ జాక్మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందించే సంస్థగా దేశంలోనే టాప్ లో నిలిచింది. 2017లో భారతదేశపు తొలి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లి కార్ప్ కంపెనీకి వ్యవస్థాపకుడు కూడా రాహుల్ శర్మనే. కేవలం రూ.3 లక్షలతో వ్యాపార మొదలు పెట్టి.. వందల కోట్లకు చేరుకున్న రాహుల్ శర్మ నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. అక్షయ్ కుమార్ వల్లే పరిచయం..ఆసిన్‌ను పెళ్లి చేసుకోవడానికి రాహుల్ శర్మకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సహకరించాడు. అక్షయ్ కుమార్, అసిన్ కలిసి నటించిన కామెడీ చిత్రం హౌస్‌ఫుల్ 2. అదే సమయంలో అక్షయ్ తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ శర్మకు ఆసిన్‌ను పరిచయం చేశాడు. అలా రాహుల్, అసిన్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆసిన్ ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు. వీరికి ఢిల్లీలో ఫామ్‌హౌస్ ఉంది. అతని వద్ద ఖరీదైన బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్య్లూ, మెర్సిడెజ్ బెంజ్, రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల పరిష్కారం
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ 2022 సెప్టెంబర్ 30కల్లా రూ. 56,943 కోట్ల రుణాలను పరిష్కరించినట్లు తెలియజేసింది. వివిధ ఆస్తుల మానిటైజేషన్ ద్వారా సంస్థల సంఖ్యను సైతం 302 నుంచి 101కు కుదించినట్లు వెల్లడించింది. వీటిలో 88 దేశీ సంస్థలుకాగా.. 13 ఆఫ్‌షోర్ కంపెనీలున్నట్లు పేర్కొంది. జాతీయ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ)కి దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ వివరాలు పొందుపరచింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీ రిజల్యూషన్ పురోగతిపై తాజాగా సమాచారమిచ్చింది. సెప్టెంబర్‌కల్లా అంచనా రుణ పరిష్కారం రూ. 55,612 కోట్లుకాగా.. మరో రూ. 1,331 కోట్ల రు ణాలను లాభాల్లో ఉన్న గ్రీన్ సంస్థల ద్వారా చెల్లించినట్లు కంపెనీ ఎండీ నంద్ కిషోర్ తెలియజేశారు. కంపెనీ సంక్షోభంలో కూరుకుపోయే సమయానికి 169 దేశీ, 133 ఆఫ్‌షోర్ సంస్థలను కలిగి ఉంది. 2018లో తొలిసారిగా రుణ చెల్లింపుల్లో విఫలమైంది. ఇదే సమయంలో రూ. 90,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించవలసి ఉండటం గమనార్హం! -
ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు రూ.54 లక్షల కోట్లు
ముంబై: ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు 2022 మార్చి నాటికి రూ.54 లక్ష కోట్లకు చేరాయని, వాణిజ్య బ్యాంకుల బ్యాలన్స్ షీట్ పరంగా చూస్తే పావు శాతం మేర ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావు కరాడ్ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీలు కుప్పకూలిపోవడంతో, ఎన్బీఎఫ్సీ రంగం దీర్ఘకాలంగా సంక్షోభాన్ని చూడడం తెలిసిందే. దీన్నుంచి ఈ రంగం బయటకువచ్చి మెరుగైన పనితీరు చూపిస్తుండడాన్ని మంత్రి ప్రస్తావించారు. సీఐఐ నిర్వహించిన ఎన్బీఎఫ్సీ సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. సూక్ష్మ, మధ్య స్థాయి కంపెనీలకు రుణాలు అందించడం ద్వారా ఎన్బీఎఫ్సీలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈల కార్యకలాపాల విస్తరణకు, మరింత మందికి ఉపాధి కల్పనకు ఎన్బీఎఫ్సీలు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకులతో పోలిస్తే రుణాల మంజూరులో ఎన్బీఎఫ్సీలే అధిక వృద్ధిని చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు రుణాల పరంగా 10 శాతం వృద్ధిని చూపిస్తే, బ్యాంకుల రుణ వితరణ వృద్ధి ఇందులో సగమే ఉందన్నారు. -
ఆర్సెలర్ నిప్పన్ చేతికి ఎస్సార్ ఆస్తులు
న్యూఢిల్లీ: సొంత(వినియోగ) పోర్టులు, విద్యుత్ మౌలిక ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేసినట్లు రూయాల కుటుంబ సంస్థ ఎస్సార్ గ్రూప్ తాజాగా వెల్లడించింది. గుజరాత్‌లోని హజీరా, ఒడిషాలోని పారదీప్‌వద్ద గల ఈ ఆస్తులను ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్)కు అమ్మివేసినట్లు తెలియజేసింది. వెరసి ఎస్సార్ పోర్ట్స్ అండ్ టెర్మినల్స్(ఈపీటీఎల్), ఎస్సార్ పవర్ లిమిటెడ్(ఈపీఎల్)ను 2.05 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,500 కోట్లు) విక్రయించింది. దీంతో రుణరహితంగా మారే బాటలో ఆస్తుల మానిటైజేషన్‌ను పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. డీల్‌లో భాగంగా 270 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, 25 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల హజీరా(గుజరాత్) పోర్టు, 12 ఎంటీ వార్షిక సామర్థ్యంగల పారదీప్(ఒడిషా) పోర్టు ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ సొంతమయ్యాయి. కాగా.. ఆస్తుల మానిటైజేషన్‌తో 25 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లు) రుణ చెల్లింపులను పూర్తి చేయడం ద్వారా గ్రూప్ రుణరహితంగా నిలిచినట్లు ఎస్సార్ క్యాపిటల్ డైరెక్టర్ ప్రశాంత్ రూయా పేర్కొన్నారు. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
పీకల్లోతు కష్టాల్లో ఇమ్రాన్ ఖాన్.. ఆ వివరాలు దొరికితే ఇక జైలుకే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆస్తులు, రాబడిపై విచారణకు పాక్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇమ్రాన్ ఆస్తులు, ఆదాయ పత్రాలపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని ప్రధాని షెబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) సెంట్రల్ సెక్రటేరియట్‌లోని నలుగురు ఉద్యోగుల బ్యాంక్ ఖాతా వివరాలపై ఆరా తీయనుంది. వీరు తాహిర్ ఇక్బాల్, మొహమ్మద్ నోమన్ అఫ్జల్, మొహమ్మద్ అర్షద్ న్యూస్ ఇంటర్నేషనల్ వార్తాపత్రిక మొహమ్మద్ రఫీగా గుర్తించారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐలోని ఈ నలుగురు ఉద్యోగుల ప్రైవేట్ ఖాతాలలోకి భారీ మొత్తంలో డబ్బులు చేరినట్లు అధికారులు గుర్తించారు. అయితే దీనిపై పూర్తి విచారణ జరిపి ఆధారాలతో సహా బయటపెట్టి వారిని అరెస్ట్ చేసేందుకు పాక్ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే 2013 నుంచి 2022 మధ్య పార్టీ విదేశీ విరాళాలకు సంబంధించిన పత్రాల ఫోరెన్సిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇండిపెండెంట్ ఆడిటర్లు ఈ ప్రక్రియను చేపట్టనుండగా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ తదుపరి చర్యలు చేపడతాయి. పీటీఐ రికార్డుతో పాటు పార్టీ అధినేత అంతర్జాతీయ బ్యాంక్ ఖాతాల వివరాల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ పదవీకాలంలో వచ్చిన డేటా ఎక్స్ఛేంజ్ ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకోనుంది. యుఎస్, యుకె, కెనడా, నార్వే, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సహా ఇతర విదేశీ బ్యాంకు ఖాతాల రికార్డుల వివరాలను సేకరించేందుకు పాక్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. చదవండి: ఉత్కంఠ రేపుతున్న రష్యా విక్టరీ డే.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు! -
మనీలాండరింగ్ కేసులో ఈడీ చర్యలు
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి జైల్లో ఉన్న ఎన్సీపీ నేత, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో మహ్మద్ నవాబ్ మహ్మద్ ఇస్లాం మాలిక్, ఆయన కుటుంబ సభ్యులు, సొలిడస్ సంస్థ, మాలిక్ ఇన్ఫ్రా సంస్థల ఆస్తులను పీఎంఎల్ చట్టం కింద అటాచ్ చేశామని ఈడీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని గోవావాలా కాంపౌండ్, వాణిజ్య సముదాయం, మూడు ఫ్లాట్లు, రెండు నివాస ఫ్లాట్లు, ఒస్మానాబాద్ జిల్లాలోని 147.79 ఎకరాల భూమిని అటాచ్ చేసినట్లు పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను ఈడీ ఫిబ్రవరిలో అరెస్టు చేసింది. విచారణకు సుప్రీం ఓకే మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసి జైల్లో ఉంచిన తనను తక్షణం విడుదల చేయాలని కోరుతూ నవాబ్ మాలిక్ చేసిన అభ్యర్ధనపై విచారణకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. మాలిక్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ చేసిన అభ్యర్థనపై సీజేఐ జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ పరిశీలించి, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించింది. పీఎంఎల్ చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని, కానీ తన క్లయింటును 2000 సంవత్సరానికి ముందు జరిగిన నేరానికి పీఎంఎల్ఏ కింద అరెస్టు చేశారని సిబాల్ వాదించారు. అంతకుముందు ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో మాలిక్ సుప్రీంను ఆశ్రయించారు. మాలిక్ విడుదల అభ్యర్థనను పీఎంఎల్ఏ కోర్టు కొట్టివేయడంలో తప్పులేదని, అలాగే ఆయన్ను రిమాండ్‌కు పంపడంలో కూడా ఎలాంటి తప్పు జరగలేదని, అందువల్ల జైలు నుంచి విడుదల చేయాలన్న మాలిక్ కోరికను తిరస్కరిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. -
ప్రముఖ నటి హేమకు వంద కోట్ల ఆస్తులున్నాయా?
Actress Hema Opened Up On Her Properties, Assests: క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించింది. అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.ఈ క్రమంలో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ ఈ విషయంపై స్పందించింది. కెరీర్ ఆరంభంలో వేలల్లో పారితోషికం తీసుకునే తాను ప్రస్తుతం లక్షల్లో తీసుకోవాల్సి వస్తుందని, అయితే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతానని పేర్కొంది. ఇక తనకు వందల కోట్ల ఆస్తులైతే లేవు గానీ బాగానే ఆస్తులు ఉన్నాయని తెలిపింది. తన కూతుర్ని సెటిల్ చేసేంత డబ్బు సంపాదించానని, ఇప్పటికీ ఇంకా సంపాదిస్తూనే ఉన్నానని వివరించింది. -
లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు? తొలి రెమ్యునరేషన్ ఎంతంటే..
Lata Mangeshkar Total Net Worth: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఐదేళ్ల ప్రాయంలోనే గాయనిగా ప్రస్థానం ప్రారంభించిన లతా మంగేష్కర్ అతి తక్కువ కాలంలోనే విశేష గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 50వేల పైచిలుకు పైగా పాటలు పాడి శ్రోతలను విశేషంగా అలరించారు. అలా సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో వేల పాటలు పాడిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. 1950ల కాలంలో ఒక్కో పాటకు సుమారు 500రూపాయల పారితోషికాన్ని అందుకునేవారట. అప్పట్లో ఆశా భోస్లే సహా పేరున్న సింగర్స్‌కి సైతం 150 రూపాయలు ఇచ్చేవారట. కానీ ఆ సమయంలో కూడా లతాజీకి అందరికంటే అత్యధికంటే రెమ్యునరేషన్ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోస్లే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన లతా జీ సంపాదన. ఇప్పుడు వంద కోట్లకు పైగా చేరుకుంది. ఆమెకు ముంబై సహా పలు కొన్ని నగరాల్లో విలసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. అలా చనిపోయే నాటికి లతా మంగేష్కర్ ఆస్తుల విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగానే ఉందని సమాచారం. -
పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్.. అక్రమంగా..
రాయగడ(భువనేశ్వర్): ఉపాధ్యాయుడు శిశిర్‌కుమార్ సిమోలి విజిలెన్స్ వలకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లపై శనివారం ఆకస్మిక దాడులు చేపట్టిన అధికారులు పలు విలువైన దస్తావేజులు, నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుతం జిల్లాలోని కాశీపూర్ సమితి, దొరగుడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆయనకు సంబంధించి, కాశీపూర్‌లోని ఆరు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయన్న సమాచారం అధికారులకు తెలిసింది. దీంతో విజిలెన్స్ డీఎస్పీలు సుశాంత్‌కుమార్ బిశ్వాల్, అనంతప్రసాద్ మల్లిక్, కళావతి భాగ్‌ల నేతృత్వంలో 4 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించారు. తొలుత దొరగుడ(కాశీపూర్ సమితి)లోని ఇంట్లో తనిఖీలు చేపట్టిన సిబ్బంది రూ.2.88 లక్షల నగదు, 1 ఇన్నోవా కారు, మరొక బొలెరొ కారు, 408 గ్రాముల బంగారం, 229 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండంతస్తుల భవనాలు రెండు, మూడంతస్తుల భవనం ఒకటికి సంబంధించిన దస్తావేజులు, రాయగడ స్టేట్ బ్యాంక్‌లో జమ చేసిన రూ.21.68 లక్షలకు సంబంధించి, బ్యాంక్ పాస్‌పుస్తకాలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. -
మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది.. 40 కోట్ల ఆస్తి చేజారుతుందని..
బొమ్మనహళ్లి (కర్ణాటక): హత్యకు గురైన అర్చనారెడ్డి కేసులో పోలీసులు ఆమె రెండో భర్తతో పాటు కుమార్తె సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర ఆగ్నేయ డీసీపీ శ్రీనాథ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 27న నగరానికి చెందిన అర్చనా రెడ్డి హోసూరు రోడ్డులో కారులో వస్తుండగా కొందరు అడ్డుకుని నరికి చంపారు. విచారణ చేసిన పోలీసులకు అర్చనారెడ్డిని హత్యకు ఆమె రెండో భర్త నవీన్‌తో పాటు ఆమె కుమార్తె యువికారెడ్డి (21) కుట్ర పన్నినట్లు తేలింది. నవీన్ రూ. 40 కోట్ల ఆస్తులు చేయిజారి పోయే ప్రమాదం ఉందని యువికారెడ్డికి చెప్పాడు. దీంతో ఆమెను హత్య చేయడానికి సతీశ్‌తో పాటు మరికొంతమందిని ఏర్పాటు చేశారు. ఈనెల 27న జిగిని పురసభ ఎన్నికల్లో ఓటు వేసి కారులో వస్తుండగా అతి దారుణంగా నరికి చంపారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. -
హైపర్ ఆది ఆస్తుల విలువెంతో తెలుసా?
Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన కామెడీ, టైమింగ్ పంచులతో తెగ నవ్విస్తుంటాడు. ఆయన చేసే కామెడీ స్కిట్లు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తాయి. తనదైన కామెడీ టైమింగుతో అలరించే హైపర్ ఆదికి బుల్లితెరపై మాంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుందని టాక్. ఈవెంట్‌ను బట్టి హైపర్ ఆది పారితోషికం డిమాండ్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఒక్క స్కిట్‌కి గానూ లక్షల్లో అందుకుంటాడని, దీన్ని బట్టి ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడని వార్తలు వస్తున్నాయి. అటు బుల్లితెరతో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న ఆది కామెడీ షోలతో బాగానే వెనకేసుకున్నట్లు తెలుస్తుంది. సొంత ఊర్లో ఇప్పటికే సుమారు 16ఎకరాలు కొన్న ఆది తాజాగా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. చదవండి: ‘వరుడు కావలెను' ముందు నాగచైతన్యకు చెప్పా: డైరెక్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ రన్‌టైం ఎంతో తెలుసా? -
ఆస్తులు లాగేసుకుని బయటకు గెంటేశారు
సాక్షి,తిరువళ్లూరు(చెన్నై): ఆస్తులను లాగేసుకుని కుమారులు ఇంటి నుంచి బయటకు గెంటేశారని.. తనకు న్యాయం చేయాలని విశ్రాంత హెచ్ఎం కలెక్టర్ ఎదుట విలపించాడు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి తాలుకా చెన్నీర్‌కుప్పం గ్రామానికి చెందిన పరశురామన్‌కు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రెండేళ్ల క్రితం మృతి చెందారు. పరశురామన్‌కు చెన్నీర్‌కుప్పంలో సుమారు రూ.6 కోట్ల విలువైన 30 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని కొడుకులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని తండ్రిని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో పరశురామన్ సోమవారం కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. స్పందించిన కలెక్టర్ పూర్తి విచారణకు ఆదేశించారు. -
అత్యధిక ఆస్తుల కల్గిన పొలిటికల్ పార్టీ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ : అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ జరిపిన అధ్యయనం ద్వారా దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తుల వివరాలను విడుదల చేసింది. అందులో అధికార భారతీయ జనతా పార్టీ 2900 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలోని రాజకీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువ 7,372 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఈ మొత్తంలో 7 జాతీయ పార్టీల ఆస్తుల మొత్తం 5349.25 కోట్ల కాగా , 2023.71 కోట్ల రూపాయలు ఆస్తులు 41 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినవని తన నివేదికలో పేర్కొంది. జాతీయంగా బీజేపీ, ప్రాంతీయంగా సమాజ్ వాది నెం.1 ఏడీఆర్ నివేదిక ప్రకారం బీజేపీ 2904.18 కోట్లుతో మొదట నిలవగా, తరువాత కాంగ్రెస్ ( ఐఎన్‌సీ) 928.84 కోట్ల రూపాయల ఆస్తులతో రెండు , బీఎస్పీ రూ. 738 కోట్లుతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక ప్రాంతీయంగా 41 రాజకీయ పార్టీల మొత్తం ఆస్తులు చూస్తే 2023.71 కోట్ల రూపాయలు కాగా అందులో 1921 కోట్ల రూపాయల ఆస్తులు కేవలం టాప్ 10 పార్టీల పేరిట ఉన్నాయి. ఇక్కడ సమాజ్ వాది పార్టీ 572.21 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో నిలిచింది. ( చదవండి : స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా ) -
అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ
-
నికర ఆస్తులు
-
యూనిటెక్ ఆస్తుల వేలానికి సుప్రీం ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలపై కొరడా ఝళింపించేలా దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యూనిటెక్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. యూనిటెక్ డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని ఆదేశించింది. మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ డింగ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారులను యూనిటెక్ మోసగించింది. కనుక కొనుగోలుదారుల సొమ్మును తిరిగి చెల్లించాలంటే ఆ సంస్థ ఆస్తులను వేలం వేయాల్సిందేనని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీం తాజాగా ఆదేశాలిచ్చింది. సంస్థకు చెందిన కోలకతా ఆస్తులను వేలం/విక్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తద్వారా రూ.25కోట్లను కొనుగోలుదారుల డబ్బును తిరిగి చెల్లిచాలని కోరింది. అలాగే ఈ ప్రక్రియంలో సహకారం అందించేందుకు మరో ఇద్దరు వ్యక్తులను నియమించుకునేలా సుప్రీంకోర్టు సహాయకుడు ఎమికస్ క్యూరీ పవన్శ్రీ అగర్వాల్‌కు అనుతినిచ్చింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు 11కి వాయిదా వేసింది. సంస్థ డైరెకర్ట వ్యక్తిగత ఆస్తులతోపాటు ఇతర ఆస్తుల వివరాలను అందించాలని, మే 11 నాటికి 100 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్ చేయకపోతే వారి ఆస్తులను వేలం వేయాలని సుప్రీం యూనిటెక్ సంస్థను గతంలో హెచ్చరించింది. అయితే యూనిటెక్ సమర్పించిన నివేదికపై అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలోనే యూనిటెక్కు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, వారణాసి, తమిళనాడులోని శ్రీపెరంబుదుర్లోని ఆస్తులను విక్రయించి, ఆ సొమ్మును గృహ కొనుగోలుదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని జూలై 5న కమిటీని కోరింది. కాగా కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుని, వారికి సరైన సమయంలో ఇళ్లను నిర్మించి ఇవ్వలేదన్న ఆరోపణలపై యూనిటెక్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు మరో డైరెక్టర్ అజయ్ చంద్ర గత ఏడాది కాలంగా జైలులో ఉన్నారు. -
కూతుళ్లకు ఆస్తి రాసిస్తానంటే...
పుట్లూరు(అనంతపురం): తన ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని అన్న కన్నతల్లిపై కక్ష కట్టిన కొడుకు ఆమె నిద్రిస్తున్న సమయంలో తన కొడుకు సాయంతో కర్రలతో దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గోపరాజుపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(75) తన తదనంతరం ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని చెప్తుండటంతో ఆమె పై కక్ష పెంచుకున్న చెన్నారెడ్డి, మనవడితో కలిసి ఈ రోజు తెల్లవారుజామున వృద్ధురాలిపై కర్రలతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'అవినీతికి పేటెంట్ చంద్రబాబుదే'
-
ఆస్తీమీద కన్నేసి భార్య పై హత్యయత్నం
-
జగతి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై స్టే