
Actress Hema Opened Up On Her Properties, Assests: క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించింది. అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.ఈ క్రమంలో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ ఈ విషయంపై స్పందించింది.
కెరీర్ ఆరంభంలో వేలల్లో పారితోషికం తీసుకునే తాను ప్రస్తుతం లక్షల్లో తీసుకోవాల్సి వస్తుందని, అయితే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతానని పేర్కొంది. ఇక తనకు వందల కోట్ల ఆస్తులైతే లేవు గానీ బాగానే ఆస్తులు ఉన్నాయని తెలిపింది. తన కూతుర్ని సెటిల్ చేసేంత డబ్బు సంపాదించానని, ఇప్పటికీ ఇంకా సంపాదిస్తూనే ఉన్నానని వివరించింది.