న్యూఢిల్లీ : అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ జరిపిన అధ్యయనం ద్వారా దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తుల వివరాలను విడుదల చేసింది. అందులో అధికార భారతీయ జనతా పార్టీ 2900 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలోని రాజకీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువ 7,372 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఈ మొత్తంలో 7 జాతీయ పార్టీల ఆస్తుల మొత్తం 5349.25 కోట్ల కాగా , 2023.71 కోట్ల రూపాయలు ఆస్తులు 41 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినవని తన నివేదికలో పేర్కొంది.
జాతీయంగా బీజేపీ, ప్రాంతీయంగా సమాజ్ వాది నెం.1
ఏడీఆర్ నివేదిక ప్రకారం బీజేపీ 2904.18 కోట్లుతో మొదట నిలవగా, తరువాత కాంగ్రెస్ ( ఐఎన్‌సీ) 928.84 కోట్ల రూపాయల ఆస్తులతో రెండు , బీఎస్పీ రూ. 738 కోట్లుతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక ప్రాంతీయంగా 41 రాజకీయ పార్టీల మొత్తం ఆస్తులు చూస్తే 2023.71 కోట్ల రూపాయలు కాగా అందులో 1921 కోట్ల రూపాయల ఆస్తులు కేవలం టాప్ 10 పార్టీల పేరిట ఉన్నాయి. ఇక్కడ సమాజ్ వాది పార్టీ 572.21 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో నిలిచింది. ( చదవండి : స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా )
Comments
Please login to add a commentAdd a comment