కూతుళ్లకు ఆస్తి రాసిస్తానంటే... | Son kills mother help of his son for House assests | Sakshi
Sakshi News home page

కూతుళ్లకు ఆస్తి రాసిస్తానంటే...

Published Mon, Jun 27 2016 8:48 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

Son kills mother help of his son for House assests

పుట్లూరు(అనంతపురం): తన ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని అన్న కన్నతల్లిపై కక్ష కట్టిన కొడుకు ఆమె నిద్రిస్తున్న సమయంలో తన కొడుకు సాయంతో కర్రలతో దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గోపరాజుపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(75) తన తదనంతరం ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని చెప్తుండటంతో ఆమె పై కక్ష పెంచుకున్న చెన్నారెడ్డి, మనవడితో కలిసి ఈ రోజు తెల్లవారుజామున వృద్ధురాలిపై కర్రలతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement