Chenna Reddy
-
ఆర్టీఐ కమిషనర్లుగా కాకర్ల చెన్నారెడ్డి, ఉల్చాల హరిప్రసాద్
-
విధ్వంసకర నిరసనలు మంచి పద్ధతి కాదు
సాక్షి, హైదరాబాద్: విధ్వంసకర, వినాశకర పద్ధతుల్లో నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య దేవాలయమైన భారత్‌కు మంచిది కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశం ఆయన చూపిన అహింసా మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ప్రజా ఉద్యమాల్లో హింసకు తావివ్వ రాదని, అర్థవంతమైన చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు. ఆదివారం శిల్పకళావేదికలో నిర్వహించిన మాజీ గవర్నర్, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి శత జయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెన్నారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన వెంకయ్య, వివిధ అంశాలపై భిన్న అభిప్రా యాలు తప్పుకాదని, ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సరైన సమాధానమివ్వడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ రోశయ్య, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ఓటమి.. చెన్నారెడ్డి విజయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనంగా వచ్చిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు స్వయంగా ఓటమి పాలవడం 1989 ఎన్నికల విశేషంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ పాలనపై విమర్శలకన్నా, ఆయన వ్యవహార శైలిపై ఎక్కువ నిరసనలు వ్యక్తమయ్యేవి. 31 మంది మంత్రులను తొలగించడం, ఆ తర్వాత వేరే రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్లడం, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్య వంటి పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఎన్టీఆర్ గత సారి తెలంగాణలోని నల్లగొండతో సహా మూడు చోట్ల గెలిచి రికార్డు నెలకొల్పితే, 1989లో తెలంగాణలోని కల్వకుర్తిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. రాయలసీమలోని హిందూపూర్ నుంచి గెలవడం ద్వారా ఎన్టీఆర్ అసెంబ్లీకి రాగలిగారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు తెలంగాణలో 58 సీట్లు దక్కగా, తెలుగుదేశం పార్టీకి 19 స్థానాలే వచ్చాయి. సీపీఐకి ఎనిమిది, సీపీఎం నాలుగు, బీజేపీ ఐదు, ఎంఐఎం నాలుగు , ఇండిపెండెంట్లు 8 స్థానాలు గెలుచుకున్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే రెడ్లు 40 మంది గెలవగా, వారిలో కాంగ్రెస్ నుంచి 26 మంది, టిడిపి నుంచి ఏడుగురు ఉన్నారు. వెలమ వర్గం నుంచి అత్యధికంగా 14 మంది గెలవడం మరో ప్రత్యేకత గా చెప్పాలి. బీసీలు 14 మంది గెలిస్తే కాంగ్రెస్ నుంచి 10 మంది విజయం సాధించగా, టీడీపీ నుంచి ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎస్సీలలో కూడా కాంగ్రెస్ 11 చోట్ల గెలిస్తే, టీడీపీకి మూడు సీట్లే వచ్చాయి. అయితే కాంగ్రెస్ నుంచి కమ్మ వర్గం నేతలు ఎవరూ ఈసారి కూడా గెలవలేదు. టీడీపీ, సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. ముస్లింలలో నలుగురు ఎంఐఎం వారే. బ్రాహ్మణులు ముగ్గురిలో ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఒకరు టీడీపీ నుంచి విజయం సాధించారు. వైశ్య నుంచి ఒకరు, క్రిస్టియన్ ఒకరు కూడా గెలిచారు. ఎస్టీల్లో కాంగ్రెస్ నేత రెడ్యా నాయక్ ఈసారి కూడా జనరల్ సీటు డోర్నకల్ నుంచి గెలిచారు. ఆయా వర్గాల నుంచి గెలుపొందిన ప్రముఖులలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆరోసారి విజయం సాధించారు. సి.రామచంద్రారెడ్డి, గడ్డెన్న, సంతోష్ రెడ్డి, కె.ఆర్ సురేష్ రెడ్డి, జీవన్‌రెడ్డి, పి.రామచంద్రారెడ్డి, పి.జనార్దనరెడ్డి, జానారెడ్డి తదితరులు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వారిలో మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, రఘుమారెడ్డి వంటివారు ఉన్నారు. జనతా పార్టీ నుంచి సి.నర్సిరెడ్డి, సీపీఎం పక్షాన నర్రా రాఘవరెడ్డి, బీజేపీ పక్షాన బద్దం బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా వెలమ నుంచి గెలిచినవారిలో కె.చంద్రశేఖరరావు యతిరాజారావు, జీవీ సుధాకరరావు, జలగం ప్రసాదరావు, చెన్నమనేని విద్యాసాగరరావు తదితరులు ఉన్నారు. కమ్మ వర్గం నుంచి మండవ వెంకటేశ్వరారవు, పువ్వాడ నాగేశ్వరరావు, బోడేపూడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ముస్లింలలో షబ్బీర్ అలీ, ఎస్సీలలో దామోదర రాజనరసింహ, పి.శంకరరావు, బోడ జనార్ధన్ తదితరులు ఉన్నారు. కాగా బీసీల నుంచి గెలిచిన ప్రముఖులలో డి.శ్రీనివాస్, పి.సుధీర్‌కుమార్, వి.హనుమంతరావు, ఓంకార్ తదితరులు ఉన్నారు. బ్రాహ్మణులలో ఎస్.వేణుగోపాలాచారి, శ్రీపాదరావు, పి.వి రంగారావు ఉన్నారు. బీసీ వర్గాలలో మున్నూరు కాపుల నుంచి ఏడుగురు గెలవడం విశేషం. గౌడ నుంచి ముగ్గురు గెలుపొందారు. -
చిన్నారెడ్డిపై కేసీఆర్ గెలవడు: రేవంత్‌రెడ్డి
సాక్షి, వనపర్తి/ పెబ్బేరు (కొత్తకోట): పన్నెండు ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణానది పుష్కరాల్లో ఘాట్ల నిర్మాణం మొదలుకుని దేవుడి గుడి వద్ద అమ్మే మొలతాడు వరకు 10 శాతం వరకు కాంట్రాక్టర్ల నుంచి నిరంజన్‌రెడ్డి కమీషన్ రూపంలో వసూలు చేశాడని ఇది అబద్ధం అయితే కృష్ణానది నీటిలో మునిగి బీచుపల్లిలో ఉన్న హనుమంతుడి మీద, లేదా రంగాపురం రంగసముద్రంలో మునిగి రంగనాయకుడి మీద ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పెబ్బేరులోని పీపీఎల్ గ్రౌండ్లో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెబ్బేరు పొలికేక, ప్రజాగ్రహ సభకు రేవంత్‌రెడ్డి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కేఎల్ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, జూరాల ప్రాజెక్టులతో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యా మలం అవుతుందని గుర్తుచేశారు. 35 ఏళ్లుగా వనపర్తి నియోజకవర్గాన్ని పాలించిన చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డిలు ఇద్దరూ జోడెద్దుల వలే అభివృద్ధి చేపట్టారని దాని ఫలితంతగానే నేడు రాష్ట్రంలో వనపర్తికి ప్రత్యేక స్థానం దక్కిందన్నారు. కొల్లాపూర్‌లో చెల్లని రూపాయి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అని అక్కడి ప్రజలు ఛీకొడితే వనపర్తి కి వచ్చి చిన్నారెడ్డిని ఓడగొడతానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. వనపర్తి నియోజవర్గంలో చిన్నారెడ్డిపై గెలవాలంటే నిరంజన్‌రెడ్డి వల్ల కాదని, తన గురువు కేసీఆర్ వచ్చి పోటీ చేసినా.. తాను ముందుండి చిన్నారెడ్డిని గెలిపిస్తానని స్పష్టం చేశారు. నిరంజన్‌రెడ్డి నీళ్ల నిరంజన్‌రెడ్డి అని ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారని, లా అని అక్షరం ఉండటం వల్లే ఇన్ని రోజుల పాటు జిల్లెల చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ని యోజకవర్గంలో గెలుస్తున్నారని జోతిష్యుడు చెప్పడం వల్ల నీళ్ల నిరంజన్‌రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నాడని, నిజానికి ఆయనకు వసూళ్ల నిరంజన్‌రెడ్డి అని పెడితే బాగుంటుందని హితవు పలికారు. బలాన్ని నిరూపించుకోవాలి.. మార్చి నెలలో పాలిటెక్నిక్ కళాశాలలో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సభ పెడితే పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని, దానికి వచ్చిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలను తీసుకువచ్చి, సభ పెట్టి సత్తా చాటుతానన్న నిరంజన్‌రెడ్డి, విఫలమయ్యారని, సగం మంది కూడా హాజరుకాక, సభ వెలవెలబోయిందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం పెబ్బేరులో జరిగిన సభకు వేలాది మంది ప్రజలు హాజరై వర్షం వచ్చినా లెక్కచేయకుండా విజయవంతం చేశారన్నారు. నిరంజన్‌రెడ్డి కేసీఆర్‌ను పిలిపించుకుని ఇక్కడ సభ పెట్టి చూపించి, తన బలమేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. 1985లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ వస్తే గోడలపై రాతలు రాసి ఆయన కోసం ప్రచారం చేశానని, మళ్లీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ప్రచారం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రాజీవ్‌గాంధీ కుటుంబంతో చిన్నారెడ్డికి ఎనలేని సంబంధం ఉందని, ఆయన బతికుంటే ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారని గుర్తుచేశారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీనిచ్చి, ముస్లింలు, గిరిజనులను కేసీఆర్ మోసం చేశారని తెలిపారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తామని హామీనిచ్చి నెరవేర్చలేదని, కష్టం తెలిసిన వ్యక్తిగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీని నెరవేర్చేలా చేస్తామన్నారు. కేసీఆర్ జీవితమంతా పొత్తులతోనే సాగిందని, అలాంటి కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం కోసం కూటమి ఏర్పాటు కాబోతుంటే అదేంటని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. కుటుంబ తెలంగాణ కూటమిని విచ్ఛిన్నం చేయడానికే ప్రజా తెలంగాణ కూటమిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాధితులను పరామర్శించవా? కొండగట్టు ప్రమాదంలో ఆర్టీసీ చరిత్రలోనే 59 మంది మృతిచెందారని, కన్నీటి చుక్క కార్చని కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై మమకారం ఉం దా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ చరిత్రలోనే ఇంత మంది చనిపోయినా కనీసం బాధితులను పరామర్శించడానికి కూడా రాకపోవడం దారుణమన్నారు. దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ విద్య, డబుల్ బెడ్రూం ఇళ్లు, లక్ష ఉద్యోగాలు భర్తీ వంటి పలురకాల హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్ల పాలనలో ఏమీ నెరవేర్చకుండా పాలన చేతకాక ప్ర భుత్వాన్ని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ హర్షవర్ధన్‌రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ నేత జి.మధుసూదన్‌రెడ్డి, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, నాగర్‌కర్నూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ధనలక్ష్మి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, గణేష్‌గౌడ్, రంజిత్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆభరణాలపై చెన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
చంద్రబాబు ధోరణిపై ఐవైఆర్ ఘాటు వ్యాఖ్యలు
-
అనంత ఎస్పీకి వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, అనంతపురం : జిల్లాలో శాంతిభద్రతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం అనంతపురం ఎస్పీని కలిశారు. ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీ నేత చెన్నారెడ్డి హత్యకు ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులే కారణమని వైఎస్ఆర్ సీపీ నేతలు ఈ సందర్భంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పాలని వారు కోరారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, నాయకులు శంకర్ నారాయణ, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించే పద్ధతిని పోలీసులు మానుకోవాలన్నారు. టీడీపీ నేతలు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అప్పేచర్లలో జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. జిల్లాలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా లేవా అని వారు ప్రశ్నించారు. -
అనంతలో వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
-
శ్రమయేవ జయతే..
ఆయన మనలాగే ఓ సగటు మనిషి. చదువు కోసం వాగులు, ఒర్రెలు దాటినవారే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా అండగా నిలిచిన అన్నదమ్ముల కలలను నెరవేర్చాడు. అందుకోసం మధ్యలో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చినా అందివచ్చిన అవకాశాలను ఆసరాగా చేసుకుని జీవిత ఉన్నత శిఖరాలకు మెట్లుగా మలచుకున్నాడు. ఓ దశలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులైనా అంతటితో సంతృప్తిచెందకుండా అనుకున్న లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించాడు. తన ఆశయూన్ని నెరవేర్చుకునేందుకు ఓ దశలో అజ్ఞాతంలోకి(కుటుంబానికి, మిత్రులకు దూరంగా) వెళ్లాడు. సమస్యలనే సాధనంగా చేసుకుంటూ ఆశయూన్ని అందుకున్నాడు. ఆయనే నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి. కుటుంబం.. విద్యాభ్యాసం.. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలోని శ్రీపురం అనే గ్రామంలో చింతకుంట చెన్నారెడ్డి, నర్సింగమ్మ దంపతుల ఆరో సంతానం మన జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి. నలుగురు అన్నలు, ఓ అక్క తర్వాత జన్మించిన ఆయనది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. చిన్నపాటి వ్యవసాయం ఉన్న ఆ కుటుంబంలో తండ్రితో పాటు నలుగురు అన్నలు కూడా వ్యవసాయమే చేసేవారు. అయితే, ఏడో తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చెన్నారెడ్డి కన్నుమూశారు. అప్పటినుంచీ అన్నలే ఆయనకు అన్నీ అయి పెంచి చదివించారు.తండ్రి చనిపోవడంతో ఆయన చదువుకునే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్నలు ప్రోత్సహించి చదివించినా, ఖాళీ ఉన్నప్పుడల్లా పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసేవారు. పదోతరగతి పూర్తయిన తర్వాత ఇక చదవకూడదని, ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవానుకున్నారు. వెంటనే హైదరాబాద్ వెళ్లి ఓ పెట్రోల్ పంపులో పనిచేశారు. అయితే, పదోతరగతిలో మంచి మార్కులు రావడంతో జూనియర్ కళాశాల యాజమాన్యం ఉచితంగా చదువు చెప్తామనడంతో ఇంటర్లో చేరారు. ఇంటర్ తర్వాత కూడా చదువు భారమవుతుందేమోనని భావిం చిన ఆయన అప్పుడు పెయింటర్‌గా పనిచేశారు. మళ్లీ ఇంటర్లో మంచి మార్కులు రావడంతో డిగ్రీలో చేరారు. 3వ తరగతి వరకు శ్రీపురంలో, 4నుంచి 7 వరకు పక్కనే ఉన్న కల్వాల్లో, 8 నుంచి ఇంటర్‌వరకు మక్తల్‌లో, డిగ్రీ నారాయణఖేడ్‌లో చదివిన నారాయణరెడ్డి బీఈడీ కోర్సును ఉస్మానియా యూనివర్శిటీలో చదివారు. ఆ తర్వాత ఎంఎస్సీ( మ్యాథ్స్) కూడా చేశారు. ఆ తర్వాత డీఎస్సీ రాసి టీచర్ ఉద్యోగం సంపాదించారు. 2008లో గ్రూప్-1 రాసి మొదటి ప్రయత్నంలోనే స్టేట్ 4వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సంపాదించారు. బీఈడీలో, డీఎస్సీలో కూడా ఆయన రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. 2011లో గద్వాల ఆర్డీఓగా, ఆ తర్వాత 2011లో పెద్దపల్లి ఆర్డీఓగా, అనంతరం ఈ ఏడాది జూలైలో సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన ఆయన జిల్లాల విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఈనెల 11న బాధ్యతలు స్వీకరించారు. జీవిత పాఠాలు ఒంటపట్టించుకుని.. జేసీ నారాయణరెడ్డికి చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే కోరిక బాగా ఉండేది. అందుకే అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ వచ్చేవారు. అయితే, ఇంటర్ తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడే ఆయన ఓ అవగాహనకు వచ్చారు. చదువే ఆయుధమని, ఆ ఆయుధాన్ని ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.వంశవృక్షంలో ఎక్కడో ఓ చోట టర్న్ రావాలని, ఆ టర్న్‌కు కారణం తానే కావాలని కలలు కన్నారు. ఇక, ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లిన తర్వాత జీవితంపై ఆయనకు ఓ స్పష్టత వచ్చింది. ఉస్మానియాలో ఉన్నప్పుడు జేబులో చిల్లిగవ్వ లేకుండా వారాల పాటు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే కష్టపడి చదివి డీఎస్సీ రాసి మహబూబ్‌నగర్ జిల్లా టాపర్‌గా నిలిచారు. అయితే, 2006 డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టిం గ్లు ఇవ్వడం ఆలస్యమైం ది. దీంతో మక్తల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు. అప్పుడు ఆయన జీతం నెలకు రూ.2,500మాత్రమే. అప్పటికే ఎమ్మెస్సీ, బీఈడీ అయిపోవడంతో అక్కడ పనిచేస్తున్న వారంతా ఆయన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఇంత చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడో అని హాస్య ధోరణిలో మాట్లాడుకోవడం ఆయనకు ఇబ్బంది అనిపించింది. రెండు నెలలకే ఆ ఉద్యోగాన్ని మానేసి మేనమామలు ఇచ్చిన ఆర్థిక భరోసా హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి ఇనిస్టిట్యూట్‌లో గ్రూప్స్ శిక్షణకు వెళ్లారు. అయితే, 2008లో ఆయనకు డీఎస్సీ పోస్టింగ్ ఇచ్చారు. తాను చదివిన కల్వాల్ పాఠశాలలోనే ఉద్యోగం వచ్చింది. ఉన్న ఊరే అయినా ఓ రూం అద్దెకు తీసుకుని చదువుకున్నారు నారాయణరెడ్డి. బడిలో పాఠాలు చెప్పడం, ఇంట్లో తినడం, రూంకు వెళ్లి చదువుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సివిల్స్ రాయలేదనే బాధ ఉండేది తన జీవిత ప్రస్థానం గురించి చెపుతూ జేసీ నారాయణరెడ్డి ఎంతో ఆర్ద్రతతో చెప్పిన ఓ మాట నిజంగా ఈనాటి యువతకు స్ఫూర్తిదాయకమే. ‘అయ్యో... నేను సివిల్స్ ఎందుకు రాయలేదు.. అని అప్పుడుప్పుడూ బాధపడుతుంటా... నాకు ఎప్పుడూ ఆ బాధ ఉంటుంది.’ అని చెప్పారు. ఆయన ఏ పరీక్ష రాసినా మంచి మార్కులే... ఏ పోటీ పరీక్షలోనయినా టాప్ ర్యాంకులే... అలాంటి సమయంలో సివిల్స్ రాసి ఉంటే మంచి ఫలితమే సాధించేవారు.. కానీ, ఆర్థిక అనివార్యత, జీవితంలో పడ్డ కష్టాలు ఆయనను ఏదో ఉద్యోగంలో చేర్పించాయి. కానీ, తన ఉద్యోగంలో కూడా నిబద్ధత ప్రదర్శిస్తూ సివిల్స్ రాయలేదనే బాధను అధిగమిస్తూ ఆయన ఉన్నతాధికారి స్థానానికి వచ్చారు. అంటే మనకున్న పరిమితుల్లో సర్దుకుపోతూనే ఉన్నత స్థానానికి వెళ్లాలన్న భావన జేసీ నారాయణరెడ్డి జీవితంలో స్పష్టంగా కనిపిస్తోంది. అజ్ఞాతమే.... ఇక, ఆ సమయంలో మరోసారి నారాయణరెడ్డి తన లక్ష్యాన్ని నెమరువేసుకున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేంత శక్తి ఇచ్చిన మెదడు... ఉద్యోగాన్ని కూడా సాధించి పెడుతుందని, అది జరగాల్సిందేనని భీష్మించుకున్నారు. వెంటనే అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. అంటే... ఎక్కడికో వెళ్లలేదు... చదువే పనిగా పెట్టుకుని కుటుంబానికి, స్నేహితులకు, ఇతర కార్యక్రమాలకు సమయం ఇవ్వలేదు. ఉదయం 5:30 నుంచి రాత్రి 11:30 వరకు ఒకటే పని... చదువుకోవడమే. కాలకృత్యాలు తీర్చుకోవడం, భోజన విరామ సమయాల్లో తప్ప ఆయన ఎప్పుడూ పుస్తకాలను అంటిపెట్టుకునే ఉండేవారు. 2007 జనవరి నుంచి 2008 ఆగస్టు వరకు ఆ పద్ధతిలోనే చదువుకుని గ్రూప్-1 ఉద్యోగం రాశారు. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయమేంటో తెలుసా... గ్రూప్-1 ద్వారానే తనకు కొత్త జీవితం రావాలి. లేదంటే తన ఆశలు సమాధి అయిపోవాలని నిర్ణయించుకున్నారంటే ఎంత పట్టుదలగా ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. ఇంత కష్టపడ్డా తానెప్పుడూ ఒత్తిడిని ఎదుర్కోలేదని నారాయణరెడ్డి ‘సాక్షి’తో ధీమాగా చెప్పారంటే ఎంత కష్టమయినా ఎదుర్కోవాలనే ఆయన పట్టుదలతో పాటు ఆయన చేసిన శ్రమ ఆయుధాలయ్యాయి. కష్టానికి నిర్వచనంగా ఆయనను విజయతీరాల వైపు తీసుకెళ్లాయి. అందుకే ఆయన కూడా పట్టుదల, శ్రమ అనే ఆయుధాలను ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకోవాలని నేటి యువతకు చెపుతున్నారు. శ్రమయే వజయేత అనే సూక్తికి నిలువుటద్దంగా నిలిచిన మన జేసీ నారాయణరెడ్డి జీవితాన్ని, ఆయన ఎదుర్కొన్న కష్టాలను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తి పొంది జిల్లా యువత తమ తమ జీవితాల్లో విజయతీరాలను చేరాలని ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది. -
బతుకమ్మ కవిత సొత్తు కాదు: శారద
► సంబురాల ధనంతో ఆత్మహత్యలు నివారించవచ్చు ► మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద వనపర్తిటౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ సంబురాల నిర్వహణకు గ్రామ స్థాయిలోని సర్పంచ్‌లకు నిధులు కేటాయించి ఉత్సవాలు నిర్వహిస్తే బాగుటుందని, బతుకమ్మ కవిత సొత్తైనట్లు నిధులన్నీ ప్రభుత్వం తెలంగాణ జాగృతికి కేటాయించడం అనైతికమని మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద అసహనం వ్యక్తం చేశారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి వచ్చిన ఆమె ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ ఉత్సవాలు జాతి సంస్కృతికి నిదర్శనమని, కవితే ప్రామాణికంగా జరగడం బాధాకరమన్నారు. జిల్లాల ఏర్పాటు మంచిదైనప్పటికీ ప్రభుత్వం సంబురాలు చేయాల్సిన అవసరం లేదని, మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుంటే సంబురాలు జరుపుకునేందుకు ఖర్చుపెట్టిన ప్రజాధనం రైతుల సంక్షేమానికి వినియోగించి ఉంటే రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. -
కూతుళ్లకు ఆస్తి రాసిస్తానంటే...
పుట్లూరు(అనంతపురం): తన ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని అన్న కన్నతల్లిపై కక్ష కట్టిన కొడుకు ఆమె నిద్రిస్తున్న సమయంలో తన కొడుకు సాయంతో కర్రలతో దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గోపరాజుపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(75) తన తదనంతరం ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని చెప్తుండటంతో ఆమె పై కక్ష పెంచుకున్న చెన్నారెడ్డి, మనవడితో కలిసి ఈ రోజు తెల్లవారుజామున వృద్ధురాలిపై కర్రలతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సంస్కృతి... సమాజాల సమర్చకుడు
కొత్త పుస్తకం జీవితంలో ఎన్నో కష్టాలు పడి పట్టుదలతో పైకొచ్చిన వ్యక్తి... ఉన్నతాధికారిగా పగ్గాలు చేతిలో ఉన్నా ప్రజల బాగు మర్చిపోని మనిషి... నమ్మి ఇచ్చిన బాధ్యతలను నిజాయితీతో, త్రికరణశుద్ధిగా నెరవేర్చిన పాలనాదక్షుడు... సాహితీ, సాంస్కృతిక రంగాలకు ప్రాణబంధువు... ఐ.ఎ.ఎస్‌గా, అంతకు మించి మంచి మనిషిగా మన్ననలందుకున్న అందరివాడు - రమణాచారి. ఆ కళా హృదయుడి జీవన తరంగాల నుంచి కొన్ని స్మృతి వీచికలు. రమణ బాల్యంలో వారిది ఉమ్మడి కుటుంబం. పూటకు పదిహేను విస్తళ్లు లేవాలి. ఇంటి యజమాని (నాన్నగారి) ఆదాయం మాత్రం నెలకు పాతిక రూపాయలు! ఆ ఇల్లాలు పద్మావతమ్మ అటు అత్తమామలు, మరుదులు, ఇటు తన సంతానం అయిదుగురులో ఎవరికీ ఏదీ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. పెద్ద కొడుకు రమణ పొద్దున్నే బాబాయిలతో కలిసి వెళ్లి రెండు కిలోమీటర్ల దూరం నుంచి తాగడానికి నీళ్లు తెచ్చేవారు. తర్వాత అందరి స్నానాలకు బావి నీళ్ల తోడి కాచేవారు. చెల్లెళ్లు అమ్మకు ఇంటి పనిలో సాయం చేసేశారు. రాత్రి ఏడు గంటలకు భోజనాలు అయిపోయేవి. పిల్లలందరూ ఒకే గొంగళి కప్పుకొని నిద్రపోయేవారు. నాలుగున్నరకి నిద్ర లేపేవారు. రోజూ రెండు గంటలు తప్పని సరిగా పాఠాలు చదివేవారు. చిన్నతనంలో వచ్చిన ఆ అలవాటు రమణని ఇప్పటికీ అంటి పెట్టుకునే ఉంది. అప్పట్లో రమణ కాళ్లకు చెప్పులుండేవి కావు. చిన్నాన్నలు వాడేసిన దుస్తులే వేసుకోవాల్సి వచ్చేది. అయితేనేం మొక్కవోని ఆత్మవిశ్వాసం ఉండేది. క్లిష్టమైన పాఠ్యాంశాన్నైనా అవగతం చేసుకోగల నేర్పు ఉండేది. 1975లో వరంగల్లులో కెమిస్ట్రీ లెక్చరరుగా ఉంటోన్న కాలంలో ఓ రోజు రమణ, మరో నలుగురు లెక్చరర్లతో పాటు కలెక్టరేట్‌కి వెళ్లారు. అక్కడ రేషన్‌కార్డు కోసం వెళ్ళినప్పుడు లెక్చరర్లని కూడా చూడకుండా ఓ గుమస్తా వాళ్లను అవమానించాడు. అంతే! ‘నేను కలెక్టర్‌ని కావాలి! లేదా పరిపాలనా రంగంలో ఉన్నత ఉద్యోగిగా ఉండాలి. సామాన్య ప్రజలకు న్యాయం దక్కేలా చేయాలి. గ్రూప్ వన్ పరీక్షలైనా రాస్తాను... అని రమణ పట్టుదలగా పరీక్షలు రాసి, కృతార్థుడయ్యారు. నందమూరి తారక రామారావు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోని కులీకుతుబ్‌షా డెవలప్మెంట్ అథారిటీని క్రియాశీలంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆలోచించారు...మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంత అభివృద్ధికి ఏర్పాటైన సంస్థకి అడ్మినిస్ట్రేటర్‌గా ఎవరిని నియమించాలి? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది? అడ్మినిస్ట్రేటర్ సమర్థుడై ఉండాలి. ఆయనకు ఇంగ్లీషు మాత్రమే వస్తే సరిపోదు, తెలుగు, ఉర్దూ బాషల్లో కూడా మంచి ప్రవేశం ఉండాలి. అన్ని మతాల, వర్గాల వారినీ కలుపుకొని పోగలగాలి. అటువంటి అధికారి ఎవరా? అని మంత్రిమండలిలో చర్చకు వచ్చింది. 1984 నాటికి రమణని భారత ప్రభుత్వం ఐ.ఏ.ఎస్. అధికారిగా కన్ఫర్మ్ చేసింది. ఆ కాలంలోనే నెల్లూరును గజగజలాడించిన పెనుతుపానుకు వేల మంది నిరాశ్రయులయ్యారు. రైతుల పంటలు, జీవితాలు నీళ్లపాలయ్యాయి. సైక్లోన్ స్పెషలాఫీసరుగా రమణ నెల్లూరు జిల్లా ప్రజలకు తక్షణ ప్రభుత్వ సాయం అందించడంలో కృతకృత్యులయ్యారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. అయితే ఇంకేం ‘వారినే నియమిద్దాం’ అన్నారు ముఖ్యమంత్రి. కులీకుతుబ్‌షా డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత రమణ దృష్టి కులీకుతుబ్‌షా సమాధులవైపు మళ్లింది. ఒక్క ముంతాజ్ బేగం సమాధి తాజ్‌మహల్‌గా ప్రపంచ ప్రసిద్ధి చెందితే ఏడు సమాధుల మాటేమిటి? వాటిని అభివృద్ధి పరిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు పేరొస్తుంది. ముఖ్యమంత్రి ఎన్టీయార్ పూనికతో కె.వి. రమణాచారి దృఢసంకల్పంతో అది ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకొంది. సుమారు నూరు ఎకరాల పైనున్న సమాధుల ప్రాంతంలో రెండు కోట్లతో అభివృద్ధిపరచే ప్రణాళికను సిద్ధంచేసి అమలుచేశారు. విదేశీ పర్యాటకులకూ ఆ ప్రాంతం ఆకర్షణగా నిలిచింది. ఓ పర్యాయం ఆంధ్ర మహిళాసభలో కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వెళ్లవలసి వచ్చింది. రమణని పిలిచి ప్రసంగం తయారు చేయమన్నారు. రమణ తయారుచేశారు. అది చదివి చెన్నారెడ్డి ఆనందించారు. ముఖ్యంగా ఆ ప్రసంగంలో రమణ ఉదహరించిన ఉర్దూ కవిత ‘లోగోంకే పాస్ వక్త్ హై / నఫ్రత్‌కే వాస్తే / జబ్కే హయాత్ కమ్హై / మొహబ్బత్కే వాస్తే’ (జనం వద్ద వైరం కోసం సమయం ఉంది... కానీ ప్రేమకోసం మాత్రం సమయం లేదు) ఆయన్ని బాగా ఆకట్టుకుంది. దీన్ని చెన్నారెడ్డి తన మిత్రులందరికీ చెప్పారు. ‘‘మా పీఆర్వో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఉద్దండుడు’’ అంటూ ప్రశంసించారు. అప్పట్నించీ చెన్నారెడ్డి ఇష్టుల్లో రమణ ఒకరు. సాంస్కృతిక శాఖలో అనే కాదు, ఏ శాఖలో అయినా అద్భుతాలు చేయవచ్చు. సృష్టించవచ్చు. మనకెందుకు? మన జీతం మనకొస్తోంది కదా అనుకుంటే చేసేదేముంటుంది! గత నలభై సంవత్సరాలుగా సాంస్కృతికశాఖ పనితీరును చాలా సన్నిహితంగా గమనిస్తూనే ఉన్నవారికి రమణ లాంటి ఇద్దరు ముగ్గురి హయాంలోనే అది చాలా క్రియాశీలంగా పనిచేసిందనిపిస్తుంది. సాంస్కృతికశాఖలో రమణ ఉన్నప్పుడే అఖిలాంధ్ర నాటకోత్సవాలు ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో మన తెలుగుజాతి చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేలా శాతవాహనోత్సవాలు, చాళుక్యోత్సవాలు, విజయనగరోత్సవాలు, కాకతీయోత్సవాలు, గోల్కొండోత్సవాలు - ఇలా ఉత్సవాల పరంపర మొదలుపెట్టి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘సౌజన్య సంస్కృతీ పథకం’ ప్రవేశపెట్టి రాష్ట్రంలోని వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలని ఆర్థిక సహకారం అందించారు. రమణ మాటల్లో చెప్పాలంటే ‘‘ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల కంటే సాంస్కృతిక సంస్థలు, సాహితీ సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం చేదోడు అందిస్తే విశేష జనాదరణ పొందగలమన్నది నా విశ్వాసం.’’