సాక్షి, అనంతపురం : జిల్లాలో శాంతిభద్రతలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం అనంతపురం ఎస్పీని కలిశారు. ధర్మవరంలో వైఎస్‌ఆర్ సీపీ నేత చెన్నారెడ్డి హత్యకు ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులే కారణమని వైఎస్‌ఆర్ సీపీ నేతలు ఈ సందర్భంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పాలని వారు కోరారు.
ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, నాయకులు శంకర్ నారాయణ, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించే పద్ధతిని పోలీసులు మానుకోవాలన్నారు. టీడీపీ నేతలు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అప్పేచర్లలో జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. జిల్లాలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా లేవా అని వారు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment