బతుకమ్మ కవిత సొత్తు కాదు: శారద
► సంబురాల ధనంతో ఆత్మహత్యలు నివారించవచ్చు
► మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద
వనపర్తిటౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ సంబురాల నిర్వహణకు గ్రామ స్థాయిలోని సర్పంచ్‌లకు నిధులు కేటాయించి ఉత్సవాలు నిర్వహిస్తే బాగుటుందని, బతుకమ్మ కవిత సొత్తైనట్లు నిధులన్నీ ప్రభుత్వం తెలంగాణ జాగృతికి కేటాయించడం అనైతికమని మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద అసహనం వ్యక్తం చేశారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి వచ్చిన ఆమె ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
బతుకమ్మ ఉత్సవాలు జాతి సంస్కృతికి నిదర్శనమని, కవితే ప్రామాణికంగా జరగడం బాధాకరమన్నారు. జిల్లాల ఏర్పాటు మంచిదైనప్పటికీ ప్రభుత్వం సంబురాలు చేయాల్సిన అవసరం లేదని, మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుంటే సంబురాలు జరుపుకునేందుకు ఖర్చుపెట్టిన ప్రజాధనం రైతుల సంక్షేమానికి వినియోగించి ఉంటే రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు.