nerella sharadha
-
అది తెలంగాణ మహిళల విజయం: నేరెళ్ల శారద
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు వచ్చిన మహిళా ప్రభంజనం, మహిళా కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చి మహిళా సంఘాలకు రూ.960 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందని, ఇది తెలంగాణ మహిళల విజయమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయి పడిందని, ఈ బకాయిలు విడుదల చేయాలని తాము గతంలోనే ఉద్యమించామని అన్నారు. రాహుల్ వచ్చి మహిళా సంఘాల సమస్యలను ప్రస్తావించడంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. -
బతుకమ్మ కవిత సొత్తు కాదు: శారద
► సంబురాల ధనంతో ఆత్మహత్యలు నివారించవచ్చు ► మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద వనపర్తిటౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ సంబురాల నిర్వహణకు గ్రామ స్థాయిలోని సర్పంచ్లకు నిధులు కేటాయించి ఉత్సవాలు నిర్వహిస్తే బాగుటుందని, బతుకమ్మ కవిత సొత్తైనట్లు నిధులన్నీ ప్రభుత్వం తెలంగాణ జాగృతికి కేటాయించడం అనైతికమని మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద అసహనం వ్యక్తం చేశారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం మహబూబ్నగర్ జిల్లా వనపర్తికి వచ్చిన ఆమె ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ ఉత్సవాలు జాతి సంస్కృతికి నిదర్శనమని, కవితే ప్రామాణికంగా జరగడం బాధాకరమన్నారు. జిల్లాల ఏర్పాటు మంచిదైనప్పటికీ ప్రభుత్వం సంబురాలు చేయాల్సిన అవసరం లేదని, మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుంటే సంబురాలు జరుపుకునేందుకు ఖర్చుపెట్టిన ప్రజాధనం రైతుల సంక్షేమానికి వినియోగించి ఉంటే రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు.