నేరెళ్ల శారద
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు వచ్చిన మహిళా ప్రభంజనం, మహిళా కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చి మహిళా సంఘాలకు రూ.960 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందని, ఇది తెలంగాణ మహిళల విజయమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయి పడిందని, ఈ బకాయిలు విడుదల చేయాలని తాము గతంలోనే ఉద్యమించామని అన్నారు. రాహుల్ వచ్చి మహిళా సంఘాల సమస్యలను ప్రస్తావించడంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment