women Congress workers
-
గాంధీభవన్ గేట్‌కు తాళం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ బస్‌భవన్ వద్ద నిరసన వ్యక్తం చేసేందు కు బయల్దేరిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ఏకంగా గాంధీభవన్‌కే తాళం వేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై గాంధీభవన్‌లో ఉన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఇతర నాయకులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు తాళం తీశారు. దీంతో గాంధీభవన్ బయటకు వచ్చిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో గాంధీభవన్ దగ్గరే మహిళా కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఈ పరిణామంతో కొద్దిసేపు గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు. బస్సు చార్జీలతో పాటు బస్‌పాస్‌ల ధరలను కూడా రూ.200 నుంచి 300 శాతం పెంచిందని మండిపడ్డారు. తాజాగా మరోసారి ఆర్టీసీ చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. -
అది తెలంగాణ మహిళల విజయం: నేరెళ్ల శారద
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు వచ్చిన మహిళా ప్రభంజనం, మహిళా కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చి మహిళా సంఘాలకు రూ.960 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందని, ఇది తెలంగాణ మహిళల విజయమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయి పడిందని, ఈ బకాయిలు విడుదల చేయాలని తాము గతంలోనే ఉద్యమించామని అన్నారు. రాహుల్ వచ్చి మహిళా సంఘాల సమస్యలను ప్రస్తావించడంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. -
మహిళా కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: సీపీఎం మద్దతుదారుడు, పత్రికా విశ్లేషకుడు చెరియాన్ పిలిప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ టికెట్ల కోసం కొందరు మహిళా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రహస్యంగా అర్థనగ్న (షర్ట్ లెస్) నిరసనలు తెలిపి చివరికి టికెట్లు పొందరాని ఆరోపించి వివాదంలో చిక్కుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత ఏకే ఆంటోనికి మాజీ కీలక సహచరుడిగా ఉన్న పిలిప్ అనంతరం కొన్ని విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వెళ్లి సీపీఎం పార్టీలో చేరారు. త్రిశూర్ లో వచ్చే నవంబర్ లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఉద్దేశించి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆయన అందులో.. 'ఇటీవల త్రిశూర్‌లో వచ్చే నవంబర్‌లో జరగనున్న స్థానిక ఎన్నికల కోసం సీట్లు ఇవ్వలేదని కొందరు యువ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్ధులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. గట్టిగా అరుస్తూ రహస్యంగా అర్ధనగ్న ఆందోళన నిర్వహించి చివరకు టికెట్లు సాధించారు' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపట్ల మహిళ సంఘం నేతలు, ఇతర పార్టీ పెద్దలు, మహిళా హక్కుల నేతలు భగ్గుమన్నారు. దీంతో ఆయన ఫేస్బుక్లో మరో పోస్ట్ చేశారు. అందులో తాను మహిళలకు వ్యతిరేకిని కాదని, అసలు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తానెప్పుడూ మహిళలను గౌరవిస్తానని, పురుషుల ఆధిపత్యం కొనసాగుతుందని, మహిళలను అణిచివేస్తున్నారనే చెప్పానన్నారు. మరోపక్క, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వీఎం సుధీరన్ కూడా పిలిప్ వ్యాఖ్యలపట్ల మండిపడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని కోరారు. సీపీఎం సీనియర్ నేత రాజా, ఐద్వా నేత టీఎన్ సీమా కూడా పిలిప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.