laxmi devi
-
కేజ్రీవాల్ కరెన్సీ డిమాండ్‌కు బీజేపీ కౌంటర్
-
గుజరాత్ ఎన్నికల వేళ కేజ్రీవాల్ వింత డిమాండ్
-
ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెలా కొత్తగా ప్రింట్ చేసే నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఈ దేవుళ్ల ఫోటోలు కూడా ఉండేలా చూడాలని సూచించారు. అయితే ఇలా ఎందుకు చేయాలో కూడా కేజ్రీవాల్ వివరించారు. లక్ష్మీదేవి ఫోటో కరెన్సీ నోటుపై ఉంటే దేశప్రజలకు ఆమె ఆశీర్వాదాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇది ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందటానికి దోహదపడుతుందని చెప్పారు. కష్టాలను దూరం చేసే దేవుడిగా పేరున్న వినాయకుడి ఫోటోతో ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. ఇండోనేసియా లాంటి దేశంలోనూ కరెన్సీపై వినాయకుడి ఫోటోను ముద్రిస్తున్నట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. అక్కడ 20వేల నోటుపై గణేషుడి ఫోటో ఉంటుంది. ఢిల్లీలో వర్చువల్‌గా మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్.. రోజురోజుకు పతనమవుతున్న రూపాయి విలువ గురించి మొదట ప్రస్తావించారు. ఆర్థికవ్యవస్థ బలంగా ఉండాలంటే స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మించాలని, మౌలికవసతులు మెరుగుపరచాలని సూచించారు. ఒక్కోసారి ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా సత్ఫలితాలు రావని కేజ్రీవాల్ అన్నారు. దేశంలోని వ్యాపారస్తులంతా రోజూ తమ పని మొదలు పెట్టేముందు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారని పేర్కొన్నారు. అందుకే ఆ దేవుళ్ల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రిస్తే సత్ఫలితాలు వస్తాయని, ఆర్థికవ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్రానికి గురువారం లేదా శుక్రవారం లేఖ రాస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖర్గే.. -
అందుకే ఇంటి గుమ్మాల దగ్గర దీపాలు వెలిగిస్తారు
దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీమాతకు చాలా ప్రాశస్య్తం ఉంది. దీపావళి పండుగ మూడో రోజున లక్ష్మీదేవి తన భక్తుల ఇంటికి వెళుతుంది. అమ్మవారిని ఇంటిలోకి రమ్మనడానికి ప్రతీకగా భక్తులు తమ ఇంటి గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించి లోనికి ఆహ్వానిస్తారు. దేశంలో భిన్న రూపాలలో, అవతారాలలో కొలువుదీరిన లక్ష్మీమాతకు పూజ చేస్తారు. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లతో కూడా అమ్మవారిని పూజిస్తారు. సంపద, సుఖసంతోషాలు, సతానం కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి సందర్భంగా దేశంలోని ప్రసిద్ధమైన లక్ష్మీదేవి ఆలయాలు ఇవి.. 1) లక్ష్మీ నారాయణ మందిరం( బిర్లా మందిరం), న్యూఢిల్లీ ఈ ఆలయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహితంగా మనకు దర్శనమిస్తారు. ప్రసిద్ధ మందిరంగానే కాక, ఢిల్లీలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా పేరొందింది. ఈ మందిరంలో దీపావళితో పాటు శ్రీ కృష్ణుని జన్మష్టామి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాక గుడి చుట్టూ శివుడు, రామభక్త హనుమాన్, వినాయకుడు, దుర్గ మాత మందిరాలతో పాటు చిన్న బౌద్ధ మందిరం కూడా ఉంది. 2)శ్రీపురం గోల్డెన్ టెంపుల్, వెల్లూర్ ఈ మందిరం తమిళనాడులోని (వేలూరు) వెల్లూర్‌లో ఉంది. గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది. మలైకుడి ప్రాంతానికి దగ్గర్లోని చిన్న కొండపై లక్ష్మీదేవి కొలువై ఉంది. గర్భగుడి బంగారంతో కప్పబడి, సువర్ణ రంగులో మిళితమై ఉండటం చేత దీనికి బంగారు గుడి అనే మరో పేరుంది. దేశంలోని అతిపెద్ద మందిరాలలో శ్రీపురం ఆలయం ఒకటి. 3)మహలక్ష్మీ మందిరం, కొల్హాపూర్ హిందువుల పవిత్ర 108 శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ ప్రముఖ తీర్ధ స్థలంగా ప్రసిద్ధిగాచింది. నవరాత్రుల సందర్భంగా అంబాదేవిగా కొనియాడబడే ఈ దేవి దర్శనానికి.. భక్తులు కొల్హాపూర్‌కు తండోపతండాలుగా క్యూ కడతారు. స్వయంగా లక్ష్మీదేవి నడియాడిన నేల కావడంతో... విష్ణుదేవునికి ఈ ఆలయక్షేత్రం అంటే చాలా ఇష్టమని భక్తుల నమ్మిక. చాలుక్యులు నిర్మించిన ఈ మందిరం మహారాష్ట్రలో పూనేకు సమీపంలో ఉంది. 4)అష్టలక్ష్మీ మందిరం, చెన్నె ఈ ఆలయంలో లక్ష్మీమాత ఎనిమిది రూపాలకు పూజ చేస్తారు. అష్టలక్ష్మి - ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అవతారాలలో దర్శనమిస్తుంది. అష్టలక్ష్మీ ఆలయం చెన్నెలోని ఇలియట్స్ బీచ్\ బీసెంట్ బీచ్‌కు సమీపంలో ఉంది. సంపద, జ్ఞాన దేవతయిన అష్టలక్ష్మి, భక్తుల కోర్కెలు నెరవేర్చే దేవతగా పేరొందింది. 5)లక్ష్మీదేవి మందిరం, హసన్ తొలితరం హోయసలుల నిర్మాణ శైలి ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. కర్ణాటకలోని హసన్ దగ్గర ఉన్న ఈ ఆలయంలో ప్రాచీన వాస్తుకళ మనకు కనిపిస్తుంది. 6)మహలక్ష్మీ మందిరం, ముంబై మహారాష్ట్రలో ఉన్న ఈ ఆలయం ముంబైవాసులకు అత్యంత ప్రీతి పాత్రమైంది. ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు దర్శనమిస్తాయి. హార్న్బీ వెల్లార్డ్ నిర్మాణం చేపడుతున్నపుడు, పాథారే ప్రభు అనే ఇంజనీరుకు వర్లి సమీపంలో దేవి విగ్రహం ఉందనే కల వస్తుంది. దీంతో అక్కడి పరిసరాల్లో తవ్వకాలు చేపట్టిన అతనికి లక్ష్మీమాత విగ్రహం దొరుకుతుంది. వెంటనే ఆలయాన్ని నిర్మించి, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. -
బతికుండగానే చంపేశారు!
కుందుర్పి: వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారనే కక్షతో మండలంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన లక్ష్మీదేవికి చెందిన రేషన్‌కార్డును రద్దు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కుందుర్పికి చెందిన లక్ష్మీదేవి, కుమారుడు రమేష్‌కు తెల్లరేషన్ కార్డు ఉంది. వీరు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కావడంతో జన్మభూమి కమిటీ సభ్యులు కక్ష కట్టారు. మూడు నెలల క్రితం లక్ష్మీదేవి మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేసి రేషన్‌కార్డులో పేరు తొలగించేశారు. దీంతో ఆమె పేరిట సరుకులు అందకుండా పోయాయి. ఈ విషయంగా మూడు నెలలుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని రమేష్ వాపోతున్నారు. కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు తహసీల్దార్ కార్యాలయంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తన తల్లి పేరిట కార్డును పునరుద్ధురించడంతో పాటు నిత్యావసర సరుకులు అందేలా చేయాలని కోరుతున్నారు. -
ఆరోగ్యప్రదాతకు అద్భుత ఆలయం
దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. పరమేశ్వరుడు దానిని మింగి గరళకంఠుడయ్యాడు. ఆ తరువాత కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం, అప్సరసలు ఆవిర్భవించారు. తరువాత లక్ష్మీదేవి, ఆ తరువాత అరచేత అమృతకలశాన్ని పట్టుకుని విష్ణుమూర్తి అంశతో ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే ధన్వంతరి. మంచి హస్తవాసి గల వైద్యులను ధన్వంతరితో పోలుస్తారు. ఎందుకంటే మొట్టమొదటి వైద్యుడు ధన్వంతరే కాబట్టి. ఆయన దేవ వైద్యుడు. దీపావళికి రెండురోజుల ముందు మనం జరుపుకునే ధన్‌తెరాస్ పండుగలో ధన్ అనేది ధన్వంతరికి సంబంధించినదే. ధన్వంతరి సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశ. దేశవ్యాప్తంగా ధన్వంతరికి ఆలయాలున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లేముందు అసలు ధన్వంతరి ఎవరో, ఆయన ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం.. ఆయుర్వేదానికి ఆదిపురుషుడైన ధన్వంతరికి ఉత్తరాదిన వారణాసిలోనూ, దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లోని చింతలూరుతో పాటు తమిళనాడు, కేరళలలో ఆలయాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయతకు చెరగని చిరునామా, అటవీ సంపదకు పుట్టినిల్లు అయిన కేరళలో ఈ ఆరోగ్యదేవుడికి అత్యధికంగా ఆలయాలున్నాయి. మున్నువరువట్టం, గురువాయూర్, నెల్లువాయ్... ఇలా అనేక చోట్ల ఆలయాలున్నాయి. నెల్లువాయ్లోని ధన్వంతరిని సాక్షాత్తు అశ్వినీదేవతలు ప్రతిష్టించారని ప్రతీతి. దన్వంతరి ఆలయాల్లో అత్యంత పురాతనమైనది నెల్లువాయ్లోని ఆలయమే. ఈ ఆలయం వైద్యానికి మూలస్థానం. ధన్వంతరి ఆలయాల్లో పూజావిధానాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రధానంగా ఉంటాయి. ధన్వంతరికి రోజూ నైవేద్యంగా ‘ముక్కిడి’ అనే ద్రవాన్ని నివేదన చేసి దానిని ప్రసాదంగా భక్తులకు పంచుతారు. ముక్కిడి అనేది 35 ఔషధాల మిశ్రమం. ముక్కిడి తయారు చేసేవారిని ‘కుట్టంజరిమూస్’ అంటారు. ముక్కిడి ప్రసాదాన్ని ఆవుపెరుగు, మిరియాలు, ఉప్పుతోపాటు దివ్యౌషధాన్ని కలిపి చేస్తారు. ఈ దివ్యౌషధం ఔషధవృక్షాల నుంచి సేకరించిన వేర్లు, బెరడులతో చేస్తారు. దీనిని నంబూద్రి కుటుంబీకులు ఏడాదికోసారి మాత్రమే ఇస్తారు. కుట్టింజర్మూస్లు దానిని నిల్వ ఉంచి రోజూ కొంత ఔషధాన్ని ఆవుపెరుగు మిశ్రమంలో కలుపుతారు. దివ్యౌషధం సమ్మేళన రహస్యాన్ని అశ్వినీదేవతలు అష్టవైద్యులకు ప్రసాదించారని ఇక్కడి వారి నమ్మకం. ఈ ప్రసాదం కడుపును ప్రక్షాళన చేస్తుంది. సరైన ఔషధంతో జీర్ణవ్యవస్థను కాపాడుకుంటూ ఉంటే అనేక దీర్ఘకాలిక రోగాలను నివారించవచ్చని ఇక్కడి పూజారులు, ఆలయ ధర్మకర్తలు చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 75 ఏళ్ల కిందట అంటే 1942లో చింతలూరులో ధన్వంతరి ఆలయాన్ని కట్టించారు. పచ్చటి పంటపొలాల నడుమ సువిశాలమైన స్థలంలో అత్యంత శోభాయమానంగా నిర్మించిన ఈ ఆలయంలోకి అడుగుపెడుతూనే మాటలకు అందని అద్భుతమైన అనుభూతి సొంతమవుతుంది. నిర్మాణ నాణ్యత, రమ్యత పెద్ద ఆలయాలకు ఏమాత్రం తీసిపోకుండా ఆరోజుల్లోనే లక్షలాది రూపాయల వ్యయంతో ఎక్కడెక్కడినుంచో శిల్పులను రప్పించి ఆలయ ముఖమంటపం మీద క్షీరసాగర మథన దృశ్యాలను కళ్లకు కట్టేలా చెక్కించారు. అలాగే గోడల మీద ఏర్పాటు చేసిన బ్రహ్మ, దక్షప్రజాపతి, అశ్వనీ దేవతలు, ఇంద్రుడు, భరద్వాజుడు, వాగ్భటుడు, ఆత్రేయుడు, శుశ్రుతుడు, చరకుడు తదితర వైద్యాచార్యుల శిల్పాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రాకారాలపై చెక్కిన అద్భుత శిల్పసంపద చూపరులను కట్టిపడేస్తుంది. గర్భాలయంలో పట్టుపీతాంబరాలు ధరించి ఒక చేత అమృత భాండాన్ని, మరో చేత ఔషధ కలశాన్ని ధరించి, మరోచేత శంఖు చక్రాలను ధరించి, అభయ ముద్రలో ఉన్న ధన్వంతరి నిలువెత్తు విగ్రహాన్ని చూస్తే భక్తులకు, రోగులకు కొండంత ధైర్యం కలుగుతుంది. లోపల ధన్వంతరి విగ్రహంతోపాటు శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాశీ అన్నపూర్ణా విశ్వేశ్వరుల విగ్రహాలు కూడా కనువిందు చేస్తాయి. స్వామికి నివేదించే ప్రసాదం అన్నవరం సత్యనారాయణస్వామి పొడిప్రసాదంలా అద్భుతమైన రుచితో ఉంటుంది. దేశవిదేశాలనుంచి ఎందరో రోగులు ఇక్కడకు వచ్చి, ఈ ఆరోగ్యప్రదాత నుంచి అభయం పొందుతుంటారు. ధన్వంతరి జన్మదినమైన ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు, కార్తీక మాసంలోనూ ఇక్కడ స్వామివారికి పెద్ద ఎత్తున ఉత్సవాలు, విశేషపూజలు జరుగుతాయి. ఈ ఆలయ వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాల కోసం మాన్యాన్ని ఇచ్చారు. ఆయన తదనంతరం ఆయన కుమారుడు వెంకట సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయం తుది మెరుగులు దిద్దుకుంది. ప్రస్తుత ధర్మకర్త ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి ఆలయాన్ని అభివృద్ధిపరచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ద్విభాష్యం కుటుంబం నెలకొల్పిన చింతలూరు వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం ఆధ్వర్యంలోనే ఆలయ ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు కాకినాడ నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండపేట, కొత్తపేట, రామచంద్రపురం, తణుకు ఇక్కడికి సమీపంలోని పట్టణాలు. ఈ అన్ని ప్రాంతాలలోనూ చూడదగ్గ ఆలయాలు అనేకమున్నాయి. ఎలా చేరుకోవాలంటే...? కాకినాడ నుంచి... రావులపాలెం మీదుగా వెళ్లే బస్సు ఎక్కి ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్లో దిగితే, అక్కడ నుంచి కిలోమీటరు దూరంలోనే ఆలయం ఉంది. రాజమహేంద్రవరం నుంచి.. అమలాపురం, తణుకు, భీమవరం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సును ఎక్కి జొన్నాడ సెంటర్లో దిగాలి. అక్కడ నుంచి మండపేట వైపు వెళ్లే బస్సు ఎక్కి కొత్తూరు సెంటర్ (చింతలూరు)లో దిగాలి. రాజమహేంద్రవరం, జొన్నాడలో ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. రావులపాలెం నుంచి.. ఇతర జిల్లాల నుంచి కాని, ప్రాంతాల నుంచి కాని రావులపాలెం చేరుకుని మండపేట వైపు పల్లెవెలుగు బస్సు ఎక్కి కొత్తూరు సెంటర్ చింతలూరు దిగాలి. ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైలుమార్గం: సికిందరాబాద్ లేదా విజయవాడ నుంచి కాకినాడ లేదా రాజమండ్రి వస్తే అక్కణ్ణుంచి బస్సులున్నాయి. - డి.వి.ఆర్. భాస్కర్ ఫొటోలు: నామాల ఏసురాజు, సాక్షి, ఆలమూరు -
‘కోటి’ దండాలమ్మా
-
కూతుళ్లకు ఆస్తి రాసిస్తానంటే...
పుట్లూరు(అనంతపురం): తన ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని అన్న కన్నతల్లిపై కక్ష కట్టిన కొడుకు ఆమె నిద్రిస్తున్న సమయంలో తన కొడుకు సాయంతో కర్రలతో దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గోపరాజుపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(75) తన తదనంతరం ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని చెప్తుండటంతో ఆమె పై కక్ష పెంచుకున్న చెన్నారెడ్డి, మనవడితో కలిసి ఈ రోజు తెల్లవారుజామున వృద్ధురాలిపై కర్రలతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురంలో దారుణం
గోరెంట్ల(అనంతపురం): అనంతపురం జిల్లా గోరెంట్ల మండలం కలావులపల్లి తండాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. తండాకు చెందిన శివశంకర్ నాయక్ తన తమ్ముని భార్య లక్ష్మీదేవిని కిరాతకంగా నరికి చంపాడు. ఆమెతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలను హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన ఇద్దరు చిన్నారులు ఐదేళ్ల లోపు వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పూజగదిలో దక్షిణావర్త శంఖం ఎందుకుండాలి?
నివృత్తం: సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఎక్కడైతే ఉంటుందో... అక్కడ శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందట. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధిబాధలు కూడా నశిస్తాయి. అందువల్ల దక్షిణావర్త శంఖాన్ని పూజగదిలో పెట్టుకోవడం ఎంతైనా ఉత్తమం! మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు... ఓ అడవిలో ఒక నక్క ఉండేది. దానికోసారి ఎంత వెతుకులాడినా ఆహారం లభించలేదు. తిరిగి తిరిగి అలసిపోయింది. నడవలేక నడవలేక నడుస్తుంటే ఓ తాటిచెట్టు కనిపించింది. కాసేపు దాని నీడలో విశ్రమిద్దామని వెళ్లి చెట్టు కింద పడుకుంది. అంతలో గట్టిగా గాలి వీచేసరికి తాటిపండు ఒకటి రాలి నక్కమీద పడింది. అసలే తిండిలేక నీరసంతో అల్లాడుతోన్న నక్కకు తాటిపండు దెబ్బకు దిమ్మ తిరిగినట్టయ్యింది. ఈ కథ ఆధారంగా ఏర్పడినదే ఈ సామెత. అసలే కష్టాల్లో ఉన్న వ్యక్తి మరేదైనా కొత్త కష్టం వచ్చిపడితే ‘మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టుగా’ అయ్యింది పరిస్థితి అంటుంటారు! -
నివృత్తం: ముగ్గును ఎడమ చేతితో ఎందుకు వేయకూడదు?
ముగ్గును లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతున్నాయి శాస్త్రాలు. కాబట్టి ముగ్గును పవిత్రంగా చూడాలి. కాళ్లతో తొక్కకూడదు. అది మాత్రమే కాదు... ముగ్గును కుడిచేతితోనే వేయాలి. ఎడమ చేతితో పొరపాటున కూడా వేయకూడదని పండితులు చెబుతున్నారు. దీనికో కారణం ఉంది. క్షుద్ర పూజలకు కూడా ముగ్గును వేస్తుంటారు. అలాంటప్పుడు తాంత్రికులు ఎడమచేతిని ఉపయోగిస్తారు. అందువల్ల వాకిట్లో ముగ్గు వేసేటప్పుడు ఎడమ చేతితో అస్సలు వేయకూడదు. దానికి తోడు కుడిని మనం ఎప్పుడూ శుభ సూచకంగా భావిస్తాం. కాబట్టి కుడి చేతితో ముగ్గు వేస్తే, లక్ష్మీదేవి వచ్చి మన వాకిట్లో కొలువవుతుంది. కాబట్టి ఎడమచేతితో ముగ్గు వేసే అలవాటు ఉంటే మానుకోవాల్సిందే! ఇల్లు ఇరకాటం... ఆలి మర్కటం... పూర్వం ఒక ఊరిలో ఓ యువకుడు ఉండేవాడు. అతడు బాగా సంపాదించేవాడు. కానీ ఎప్పుడూ ఏమీ లేనట్టుగా కనిపించేవాడు. ఓ చిన్న ఇంటిలో నివాసముండేవాడు. కాస్త సదుపాయంగా ఉండే ఇంటిలో ఉండొచ్చు కదా అంటే... ఇల్లు పెద్దగా ఉంటే బంధువులొచ్చి తిష్ట వేస్తారు, ఇరుగ్గా ఉంటే ఎవరూ రారు అనేవాడు. ఓ రోజు అతడు పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ పీనాసివాడు ఎలాంటి పిల్లను చేసుకున్నాడో చూద్దామని అందరూ ఎగబడ్డారు. చూస్తే... ఆ పిల్ల అంద వికారంగా ఉంది. కాస్త అందమైన పిల్లను చేసుకోవచ్చు కదయ్యా అంటే... అందంగా ఉంటే అందరూ చూస్తారు, ఇలా ఉంటే ఏ టెన్షనూ ఉండదంటూ పళ్లికిలించాడు. ఊరి జనాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. -
కోరిక తీర్చనందుకే హతమార్చాడు
కొత్తకోట టౌన్, న్యూస్‌లైన్ : తన కోరిక తీర్చలేదనే కోపంతో డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి (19) ని వరుసకు సోదరుడైన చంద్రశేఖర్ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడని వనపర్తి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసు వివరాలను శుక్రవారం కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఆయన తెలిపారు. మండలంలోని రామనంతాపురానికి చెందిన చంద్రశేఖర్ వడ్డెర వృత్తిని కొనసాగిస్తూ వివిధ ప్రాంతాలు తిరిగేవాడు. అప్పుడప్పుడూ స్వగ్రామానికి వచ్చేవాడు. పలుసార్లు అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి సోదరులు, తల్లిదండ్రులు మందలించా రు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఆ యువతి సమీపంలోని తమ పొలానికి వెళుతుండగా వెంబడించి కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. నిరాకరించిన ఆమెపై గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. బాధిత కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు అతడిని పోలీ సులు అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం వనపర్తి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్ఐ మురళీగౌడ్ పాల్గొన్నారు. విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం కొత్తకోట రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని రామనంతాపురంలో దారుణ హత్య కు గురైన డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి (19) మృతదేహానికి శుక్రవారం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసుల బందోబస్తుతో స్వ గ్రామానికి తరలించారు. మృతదేహాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు ఆగ్రహా వేశాలకు లోనై నిందితుడి ఇంటిపై దాడికి యత్నించారు. ఒక దశలో అతని ఇంటి ఎదుటే పూడ్చాలని పట్టుపట్టారు. వారికి కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్ఐ మురళీగౌడ్ నచ్చజెప్పి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. -
నెమ్మిపాటి.. ఘనాపాటి
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: ఆ ఇంట్లో ముగ్గూరూ ఆడపిల్లలే. తండ్రి వారిని ఎన్నడూ ఆడ పిల్లలుగా పెంచలేదు. మగాళ్లే అనుకుంటూ పౌరుషాన్ని, ధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని బాల్యం నుంచే నూరిపోశాడు. చేరుకోవాల్సిన గమ్యాన్ని, సాధించాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించాడు. సాదాసీదా బతుకు కాదు.. సాధించి తీరుతా అనే భావన ఉండాలన్నాడు. మామూలు జీవితం కాదు. మట్టిలో మాణిక్యాల్లా రాణించాలన్నాడు. పుట్టిన మట్టి వాసనను మరువొద్దన్నాడు. కన్న ఊరికి, ఇంటికీ పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఆకాశమే హద్దుగా ఎదగాలన్నాడు. వెన్ను తట్టిన తండ్రి ప్రోత్సాహాన్ని అంది పుచ్చుకున్న ఆ తనయ తమస్సుతో పోరాడారు. తపస్సుతో సాధించారు. ఆ ఇంటికే నవోషస్సుగా నిలిచారు.కర్నూలు జిల్లా బొల్లవరంలో పుట్టి పెరిగి కర్నూలు నగరంలోని ఈసీఎం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని షాట్‌ఫుట్, డిస్కస్ త్రో, హ్యామర్‌త్రో.. వెయిట్ లిఫ్టింగ్‌లలో జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించారు. మే నెలలో జపాన్‌లో జరగనున్న అథ్లెటిక్స్ మీట్‌కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొననున్నారు. అంతేగాదు పెయింటింగ్‌లో టైలరింగ్ లో, ఫ్యాషన్ డిజైనింగ్‌లో, క్యాటరింగ్(రుచికరమైన వంటల్లో) తనదైన శైలిలో రాణించి అందరితో శెభాష్ అనిపించుకుని అన్ని రంగాల్లో ఘనాపాటిగా నిలిచిన నెమ్మిపాటి లక్ష్మీదేవి కథనం మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. బొల్లవరంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో నెమ్మిపాటి లక్ష్మీదేవి జన్మించారు. తల్లి వెంకమ్మ తండ్రి కృష్ణారెడ్డిలు ఈమెను బాల్యం నుంచి అన్ని రంగాల్లో రాణించాలని ప్రోత్సహించారు. ముగ్గురు ఆడపిల్లలే కావడంతో తండ్రి కృష్ణారెడ్డి వాళ్లను ప్రేమతో ధైర్యం కలిపి పెంచారు. కర్నూలు ఈసీఎం స్కూల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివిన ఈమె ఆ పాఠశాలలోనే కబడ్డీలో ఉత్తమ క్రీడాకారిణిగా రాణించారు. 1981 నుండి 1990 వరకు తొమ్మిదిసార్లు జాతీయ స్థాయి కబడ్డీలో విజేతగా నిలిచి మెడల్స్ అందుకున్నారు. కబడ్డీ, అథ్లెట్స్‌లో 150 మెడల్స్... రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో జరిగిన కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఈమె మొత్తంగా 150 మెడల్స్ సాధించడం విశేషం. 1986లో ఈమె వివాహానంతరం కబడ్డీ ఆటకు చుక్క పెట్టి అథ్లెటిక్స్ వైపు వెయిట్ లిఫ్టింగ్ వైపు దృష్టి సారించారు. 1991లో ఈమె పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పో లీసు మీట్లలో ఉత్తమ అథ్లెట్‌గా రాణించి పలువురు జాతీయ స్థాయి క్రీడాకారుల ప్రశంసలు పొందారు. అన్ని రాష్ట్రాల్లోని క్రీడా పోటీల్లో.. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగిన క్రీడా పోటీల్లో ఈమె పాల్గొన్నారు. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో జరిగిన ప్రధాన క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిసారి పతకం సాధించుకొచ్చారు. పాఠశాల స్థాయిలో తనకు ప్రోత్సాహమిచ్చిన కళా ప్రపూర్ణ టీచరంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికీ ఆమెను కలిసి ఆశీస్సులు పొందుతుంటానని లక్ష్మిదేవి న్యూస్‌లైన్‌తో చెప్పారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లపై ప్రత్యేక ఆసక్తి.. క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లక్ష్మీదేవి పోలీసు మీట్స్‌కు వెళ్లినప్పుడు పలు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా ఆమెకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, రుచికరమైన వంటకాలపై ఆసక్తి కలిగింది. ఈ రంగాల్లోను ప్రత్యేక దృష్టి సారించి ఈమె ప్రస్తుతం కొంతమంది మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్‌లలో ఉపాధి చూపిస్తున్నారు. పలు రకాల పచ్చళ్ల తయారీ, చికెన్ వెరైటీ వంటకాలలోను ఈమె శిక్షణనివ్వగలరు. సంకటి, సద్దన్నమే...బలాన్నిచ్చాయి: లక్ష్మీదేవి నేను చిన్నప్పు్పడు మా పల్లెలో తిన్న సంకటి, సద్దన్నమే నాకు ఇంత బలాన్నిచ్చాయి. ప్రమాదంలో నా కుడి చేయికి గాయమై రెండు వ్రేళ్ల ఎముకలు దెబ్బతిన్నాయి. అయినా నేను వెనుకడుగు వేయలేదు. షార్ట్‌ఫుట్‌లో, డిస్కస్ త్రోలో, హామర్ త్రోలో బంగారు పతకాలు, సిల్వర్ పతకాలు సాధించాను. మే 2014లో జపాన్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్నాను. ఉత్తమ అంతర్జాతీయ క్రీడాకారణిగా రాణించాలన్నదే నా జీవిత ధ్యేయం. ఎస్పీ అభినందన కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లా పోలీస్ శాఖ ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగంలో మహిళా హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎన్.లక్ష్మీదేవి జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. గత నెల ఫిబ్రవరి 20 నుంచి 24వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగిన 35వ మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో లక్ష్మిదేవి పాల్గొన్నారు. డిస్కస్ త్రోలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం, హ్యామర్ త్రోలోను మొదటి స్థానంతో బంగారు పతకం, జావెలిన్ త్రోలో రెండో స్థానంతో వెండి పతకం సాధించారు. కర్నూలు జిల్లా పోలీస్ శాఖ నుంచి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని స్వర్ణ, రజత పతకాలు సాధించడంతో పాటు జపాన్‌లో జరిగే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన లక్ష్మిదేవిని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి, అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ రాధాక్రిష్ణ, ఇతర పోలీసు అధికారులు అభినందించారు. కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని ఆమెను పోలీసు అధికారులు కొనియాడారు. వచ్చే నెలలో జపాన్‌లో జరిగే క్రీడల్లో కూడా ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఏఆర్ డీఎస్పీ రుషికేశవరెడ్డి, ఆర్ఐలు రెడ్డప్పరెడ్డి, ఆర్ఎస్ఐలు, సిబ్బంది ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.