మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది.. 40 కోట్ల ఆస్తి చేజారుతుందని.. | Man Assassinated Wife For Her Assets Karnataka | Sakshi
Sakshi News home page

మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది.. 40 కోట్ల ఆస్తి చేజారుతుందని..

Dec 31 2021 4:00 AM | Updated on Dec 31 2021 9:43 AM

Man Assassinated Wife For Her Assets Karnataka - Sakshi

బొమ్మనహళ్లి (కర్ణాటక): హత్యకు గురైన అర్చనారెడ్డి కేసులో పోలీసులు ఆమె రెండో భర్తతో పాటు కుమార్తె సహా ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు నగర ఆగ్నేయ డీసీపీ శ్రీనాథ్‌ వివరాలు వెల్లడించారు. ఈనెల 27న నగరానికి చెందిన అర్చనా రెడ్డి హోసూరు రోడ్డులో కారులో వస్తుండగా కొందరు అడ్డుకుని నరికి చంపారు. విచారణ చేసిన పోలీసులకు అర్చనారెడ్డిని హత్యకు ఆమె రెండో భర్త నవీన్‌తో పాటు ఆమె కుమార్తె యువికారెడ్డి (21) కుట్ర పన్నినట్లు తేలింది.

నవీన్‌ రూ. 40 కోట్ల ఆస్తులు చేయిజారి పోయే ప్రమాదం ఉందని యువికారెడ్డికి చెప్పాడు. దీంతో ఆమెను హత్య చేయడానికి సతీశ్‌తో పాటు మరికొంతమందిని ఏర్పాటు చేశారు. ఈనెల 27న జిగిని పురసభ ఎన్నికల్లో ఓటు వేసి కారులో వస్తుండగా అతి దారుణంగా నరికి చంపారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement