
Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన కామెడీ, టైమింగ్ పంచులతో తెగ నవ్విస్తుంటాడు. ఆయన చేసే కామెడీ స్కిట్లు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తాయి. తనదైన కామెడీ టైమింగుతో అలరించే హైపర్ ఆదికి బుల్లితెరపై మాంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుందని టాక్. ఈవెంట్‌ను బట్టి హైపర్ ఆది పారితోషికం డిమాండ్ చేస్తాడని తెలుస్తుంది.
ప్రస్తుతం ఆయన ఒక్క స్కిట్‌కి గానూ లక్షల్లో అందుకుంటాడని, దీన్ని బట్టి ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడని వార్తలు వస్తున్నాయి. అటు బుల్లితెరతో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న ఆది కామెడీ షోలతో బాగానే వెనకేసుకున్నట్లు తెలుస్తుంది. సొంత ఊర్లో ఇప్పటికే సుమారు 16ఎకరాలు కొన్న ఆది తాజాగా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం.
చదవండి: ‘వరుడు కావలెను' ముందు నాగచైతన్యకు చెప్పా: డైరెక్టర్
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రన్‌టైం ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment