
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రచ్చ రవి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించారు.
తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
రచ్చ రవి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నిన్ను పరిచయం చేసిన నీ... నా... తల్లిదండ్రుల రుణం తీరదు. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ... కాంప్రమైజ్ అవుతూ లైఫ్‌లో నన్ను సక్సెస్ చేయిస్తూ.... ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని... అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.... నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని...నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment